18.03.2017
శనివారమ్
ఓమ్
సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయి
భక్తులు – శ్రీ బొండాడ జనార్ధనరావు
తెలుగు అనువాదం : ఆత్రేయపురపు త్యాగరాజు,
ఆల్ ఖైల్ గేట్, దుబాయి
ఇంతకు
ముందు సాయి భక్తులయిన శ్రీభారం ఉమామహేశ్వర రావుగారి గురించి చదివారు. అటువంటి సాయి భక్తులను గురించి వ్రాసిన శ్రీ బొండాడ
జనార్ధన రావుగారు కూడా సాయి భక్తులే. ఈ రోజునుండి
ఆయన గురించి కూడా తెలుసుకుందాము.
రచయిత
శ్రీ బొండాడ జనార్ధన రావు గారు సాయిబాబా గురించి ఇంకా సాయి భక్తుల గురించి ఎన్నో వ్యాసాలను
వ్రాసారు. ఆయన తన బ్లాగులో 61 మంది సాయి భక్తులను
గురించిన సమాచారం ఇచ్చారు.
ఆయన తల్లిదండ్రులు శ్రీ కోటయ్య , శ్రీమతి సత్యవతమ్మ గార్లు. ఆయన తాడేపల్లి గూడెంలో జన్మించారు. ఆయన విద్యాభ్యాసమంతా ఆంధ్రప్రదేశ్ లోనే జరిగింది. ఆయన స్టేట్ బ్యాంక్ గ్రూప్ లో ప్రొబేషనరీ ఆఫీసరుగా ఉద్యోగంలో ప్రవేశించారు. ఆ తరువాత జోనల్ మానేజర్ గా ను, ప్రాంతీయ గ్రామీణ
బ్యాంకులకి సి.ఇ.ఓ. గాను పని చేసారు. ఆయన ఆహోదాలో బ్యాంక్ ప్రతినిధిగా బ్యాంక్ లకు సంబంధించి కొన్ని అధ్యయనాలను చేయడానికి విదేశాలను కూడా సందర్శించారు.
ఆయన
శ్రీ భారం ఉమామహేశ్వరరావు, మణిల పెద్ద కుమార్తె నీరజను వివాహమాడారు. ఆయనకు ముగ్గురు అబ్బాయిలు, ఒక కుమార్తె. అందరూ కూడా ఉన్నత విద్యనభ్యసించి మంచి ఉద్యోగాలలో
మంచి హోదాలో స్థిరపడ్డారు. శ్రీ భారమ్ ఉమామహేశ్వర
రావు గారు పోలీసు శాఖలో ఉన్నత హోదాలో పనిచేసి, పదవీవిరమణ తరువాత షిరిడీ సాయిబాబాకు
అంకిత భక్తులయారు. ఆయన సాయిబాబా మీద ఎన్నో
పుస్తకాలను రచించారు. తన జీవితాన్నంతా బాబా
(బాబాచే పొడిగింపబడ్డ జీవిత కాలంతో సహా) సేవలోనే గడిపి తరించారు. బాబా గురించి ఆయన తత్వాన్ని గురించి విశ్వవ్యాప్తంగా
ప్రచారంలోకి తీసుకుని వచ్చారు. ఆయన తరచూ షిరిడి
వెళ్ళి వస్తూ ఉండేవారు. ఆయన భార్య శ్రీమతి
మణి ఉమామహేశ్వర రావు కూడా సాయిబాబా గురించి కొన్ని పుస్తకాలను రచించడమే కాక ఆవిడ తన
భర్త చేసే రచనలలో కూడా సహాయ పడ్డారు. అంతే
కాదు భర్త చేసే సాయిసేవలో కూడా సంపూర్ణ సహాయాన్ని అందించారు. శ్రీ ఉమామహేశ్వర రావుగారికి ఎన్నో దివ్యదర్శనాలను ప్రసాదించారు సాయిబాబా. ఆయనకు బాబా వల్ల అధ్బుతమైన స్వీయానుభూతులు కూడా కలిగాయి. (బాబా ఆయన జీవితాన్ని ప్రతి సంవత్సరం పొడిగించిన
అధ్భుత సంఘటనలు, ఆయన ధ్యానంలో ఉన్నపుడు ఆయనకు
బాబా చేసిన గుండె ఆపరేషన్) ఇవన్నీ కూడా ప్రచురింపబడ్డాయి. బి.జె. రావు గారు ఆయన భార్య ఇద్దరు కూడా బాబా భక్తులే. ముఖ్యంగా శ్రీమతి నీరజ ప్రతిరోజు బాబాకు పూజలు చేస్తూ,
బాబాపై ఎంతో నమ్మకాన్ని పెంపొందించుకొంది.
ఒకసారి 37 సంవత్సరాల క్రితం, 1980 వ. సంవత్సరంలో జనార్ధనరావు గారు షిరిడీ వెళ్ళినపుడు
సమాధి మందిరంలో ఆయన తన కెమెరాతో బాబా ఫోటో
తీసారు. (క్రింద ఇచ్చిన చిత్రం ) చూడండి).
విచిత్రమేమంటే కెమెరాలో ఫ్లాష్ ఉపయోగించకపోయినా ఫొటోలో బాబా శిరస్సు పైన ఒక
తెల్లని కాంతి పడింది. ఆయన ఆ ఫోటోని అతి భద్రంగా దాచుకొన్నారు. బాబా ఆయనని ఆయన కుటుంబానికి నిరంతరం తన సహాయాన్ని
అందిస్తున్నారనడానికి కొన్ని సంఘటనలను ఈ క్రింద వివరిస్తున్నాను.
2008
వ.సంవత్సరంలో జనార్ధనరావు గారు రాగిగుడ్డదలో ఉన్న హనుమాన్ దేవాలయంలో ఒక శనివారంనాడు
పూజ చేయించుకుని తన మారుతి కారులో తనే స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నారు. బెంగళూరులోని
బిటిఎమ్ ప్రాంతానికి దగ్గరగా వస్తున్నారు.
ఇంతలో వెనకనుండి ఒక సిటీ బస్సు ఆయన కారుని వెనకాలనుంచి గుద్దింది. దాని వల్ల ఆయన కారు ఒక్కసారిగా పైకెగిరి రోడ్డుకు
అవతల వైపున ఉన్న ఒక భవనం ప్రహరీ గోడకు గుద్దుకుని గోతిలో పడింది. కారులో ఆయన తప్ప ఇంకెవరూ లేరు. ఆ ప్రమాద కారణంగా మొత్తం ట్రాఫిక్ అంతా ఆగిపోయింది. ఆ సమయంలో ఏమి జరిగిందో ఆయనకు అర్ధం కాలేదు. ఆయన డోరు తెరచుకొని బయటకు వచ్చారు. కారుని అంతా పరిశీలనగా చూశారు. కారు ఇంజను పూర్తిగా పాడయిపోయింది. కారు తలుపులు
అన్నీ కూడా బాగా నొక్కుకు పోయాయి (జామ్ అయిపోయాయి). డ్రైవరు కూర్చునే సీటు దగ్గర ఉన్న కారు తలుపు మాత్రం
దెబ్బ తినకుండా సులభంగా వచ్చింది. ఆ ప్రమాదం
జరిగినపుడు ఎవరో విశాలమైన, బలిష్టమయిన చేతితో సురక్షితంగా
తనను ఆగోతిలో పెట్టినట్లుగా అనుభవమయింది. ప్రమాదం జరిగిన చోట రోడ్డుమీద వెళ్ళేవాళ్ళందరూ ఆయన
ఆవిధంగా బయటకు రావడం చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. కారు పూర్తిగా నొక్కుకు పోయిఉంది. అటువంటి పరిస్థితిలో ఆయన ఏవిధంగా బయటకు వచ్చాడో ఎవరికీ అర్ధం కాలేదు. జనార్ధనరావుగారు తన శరీరం మీద ఏమయినా దెబ్బలు తగిలాయేమోనని
పరిశీలనగా చూశారు. కారుకు అంత ప్రమాదం జరిగి
నుజ్జునుజ్జుయయినా తను మాత్రం ఎటువంటి గాయాలు కాకుండా ఎలా బయటపడ్డాడొ ఆయనకే అర్ధం కాలేదు. చాలా ఆశ్చర్యపోయారు.
ఆ
ప్రమాదం ఆరోజు ఉదయం 11.30 కు జరిగింది. రోడ్డంతా
విపరీతమయిన ట్రాఫిక్ తో ఉంది. అటువంటి సమయంలో
ఆయన కారుని ఒక సిటీబస్సు ధడేల్ మని వెనుకనుంచి గుద్దింది. సిటీ బస్సు ఆగిపోయింది. దాని వల్ల ట్రాఫిక్ అంతా గంటన్నరకు పైగా ఆగిపోయింది. ఆయన తన ఇద్దరు కొడుకులకీ ఫోన్ చేశారు. ఇద్దరూవచ్చి ఒక ట్రక్ ను ఏర్పాటు చేసి దెబ్బతిన్న
కారుని బయటకు తీయించారు. పోలీసులు వచ్చి ఆయన
వద్దనుంచి ఫిర్యాదు రాయించుకున్నారు. ఆయన మంచి
సాయిభక్తుడవటం చేత తనకు ఏదో ప్రమాదం జరగచ్చని
ఆయన మనసుకు ముందుగానే అనిపించింది. ఆవిధంగా
ఆయనకు బాబా తన అభయహస్తం అందించడం వల్ల ఆ ప్రమాదంనుంచి ఎటువంటి గాయాలు కాకుండా బయట
పడ్డారు.
ఆయన కుమారుడు బి.వి.వంశీకృష్ణ అమెరికాలోని వర్జీనియా దగ్గర వాషింగ్టన్ లో ఉంటున్నాడు. 2010 వ.సంవత్సరంలో అతను తన స్వంత కామ్రీ కారులో
తనే స్వయంగా కారు నడుపుకుంటూ వెడుతున్నాడు
ఇంతలో అతని కారును వెనుకనుంచి ఒక భారీ ట్రక్కు బలంగా గుద్దింది. ఆట్రక్ లో కొన్ని కార్లు ఎక్కించబడి ఉన్నాయి. ఆట్రక్ ఆ కారులను ఇతరప్రాంతానికి తీసుకుని వెడుతూ
ఉంది. ఆభారీ ట్రక్ ఎంత బలంగా గుద్దిందంటే ఆ దెబ్బకి
అతను నడుపుతున్న కామ్రికారు గాలిలోకి ఎగిరి డివైడర్ ని దాటి వెంటనే వెనుకకు తిరిగి
(ఆపోజిట్ డైరెక్షన్) ప్రక్క రోడ్డులోకి పడింది.
కామ్రీ కారు బాగా ధృఢంగా ఉంటుంది. అటువంటి
బాగా బరువైన కారు బాగా దెబ్బతిని ఇంజను కూడా చిన్నాభిన్నమయింది. కాని కారును నడుపుతున్న వంశీకృష్ణకి ఎటువంటి దెబ్బలు
తగలకుండా సురక్షితంగా బయటకు వచ్చాడు. ప్రమాదం
జరిగిన తరువాత జరగవలసిన కార్యక్రమాలన్నీ పూర్తయిన తరువాత కారును బాగుచేయించడానికి గ్యారేజీకి తీసుకుని వెళ్ళారు. కారుకు అంత పెద్ద ప్రమాదం జరిగి బాగా దెబ్బతిన్నా,
వంశీకృష్ణ శరీరానికి ఎటువంటి చిన్న దెబ్బ తగులకుండా ఎలా బయట పడ్డాడో ఎవరి ఊహకీ అందలేదు. అది ఎలా
సంభవమో ఎవరికీ అంతుపట్టలేదు. వంశీకృష్ణ కూడా
బాబా భక్తుడు. అతను కూడా తనకు సంభవించిన ఈ
అధ్భుతాన్ని బి.జి.రావుగారు రచించిన ‘షిరిడీసాయిబాబా’ అనే పుస్తకంలోను ‘ ‘మెడివల్
మహారాష్ట్ర సెయింట్స్” అనే పుస్తకంలోను ప్రచురింపబడింది. బాబా తన భక్తుల రక్షణబాధ్యత వహిస్తూ వారిని ఎల్లవేళలా
కాపాడుతూ ఉంటారో ఈ అద్భుత సంఘటనే తార్కాణం.
(ఇంకా
ఉంది)
(సర్వం
శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment