19.03.2017 ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయి భక్తులు – శ్రీ బొండాడ జనార్ధనరావు – 2 వ. భాగమ్
తెలుగు అనువాదం : ఆత్రేయపురపు త్యాగరాజు,
ఆల్ ఖైల్ గేట్, దుబాయి
శ్రీమతి
నీరజకు కూడా కొన్ని అనుభవాలు కలిగాయి. వాటిలో
ఒకటి A R D S. యాక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్
సిండ్రోమ్. ఆవిడ 2011 నుంచి ఈ సమస్యతో బాధపడుతూ
ఉంది. (ఊపిరితిత్తులలోకి ఫ్లూయిడ్ చేరి రక్తంలోకి
ఆక్సిజన్ సరిగా అందకపోవుట). అటువంటి సమస్య
ఉన్నపుడు ఊపిరి సరిగా అందక శ్వాస ఆడదు.
ఇది
ఎంత ప్రమాదకరమయినదంటే దీని బారిన పడ్డ పదిమందిలో అయిదుగురు మాత్రమే బ్రతికే అవకాశం
ఉంది. ఆమెని మంచి పేరున్న పెద్ద ఆస్పత్రిలోనే
చేర్పించారు. డాక్టర్స్ కూడా ఆమె పరిస్థితి
చూసి బ్రతికే అవకాశం లేదనుకున్నారు. అందుచేతనే
ఆవిడకి వైద్యం చేసి బ్రతికిద్దామని కూడా అనుకోలేదు. వైద్యం మీదకూడా పెద్దగా దృష్టి పెట్టకుండా ఆలశ్యం
చేసారు. ఆమె మామూలుగా శ్వాస తీసుకోలేకపోతోంది. ఊపిరి తిత్తులు సరిగా పనిచేయటంలేదు. వాటి పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంది. ఆరోగ్య పరిస్థితి చాలా క్షీణదశలో ఉంది. తరువాతి దశ వెంటిలేటర్. కాని ఆమె ఇంకా ఆదశకు చేరుకోలేదు. ఆమెను ఐ.సి.యు. లో ఉంచారు. వైద్యుల నిర్లక్ష్యానికి, వారి వైద్యానికి అతీతంగా
ఒక్క రాత్రిలోనే ఆమె చాలా విచిత్రాతి విచిత్రంగా కోలుకొంది. బాబా అనుగ్రహం వల్ల ఆమె ఐ.సి.యూ లో ఉండగానే కోలుకోవడం
డాక్టర్స్ నే ఆశ్చర్యచకితులను చేసింది. రచయితయిన
శ్రీ బొండాడ జనార్ధనరావుగారికి కూడా కొన్ని అనుభవాలు కలిగాయి.
సంక్షిప్తంగా
చెప్పాలంటే అధ్బుతాలు, లీలలు చేయడమన్నది శ్రీసాయిబాబాకు నిత్యకృత్యం అని బొంబాయిలోని
సొలిసిటర్ అయిన ఠక్కర్ ధరంసి జెఠాభాయి అభిప్రాయం. ఠక్కర్ కాకా మహాజనితో కలిసి షిరిడీకి
వచ్చాడు. బాబాకు అతీంద్రియశక్తులు ఉన్నాయా
లేవా అని, అధ్భుతాలు చేయగలరా అని పరీక్షిద్దామనుకున్నాడు. బాబా అధ్భుతాలు చేయగలరని, అది ఆయన నిత్య కృత్యమని
ఠక్కర్ కి బాబాను దర్శించుకున్న రోజునే అర్ధమయింది. బాబా సర్వజీవులలోను నివస్తిస్తూ ఉన్నారనీ, ఆయనె
సమర్ధ సద్గురువని ఆయనే సర్వదేవతా స్వరూపుడని రచయిత ప్రగాఢవిశ్వాసం. ఆకారణంచేతనే భక్తులు షిరిడీ దర్శించినపుడు వేరువేరు
భక్తులకు వివిధ రూపాలలో వారు నమ్మేదైవాలుగా దర్శనమిచ్చారు. ఆకారణం చేతనే మనం బాబాను స్థుతించే సమయంలో ‘శ్రీరామ
కృష్ణ మారుత్యాది రూపాయనమః’ అని చదువుతూ ఉంటాము.
దాని అర్ధం బాబాయే శ్రీరామచంద్రుడు, శ్రీకృష్ణుడు, హనుమంతుడు అనే భావమ్.
రచయిత
ఈవ్యాస సంపుటినంతా ప్రపంచవ్యాప్తంగా ప్రజల ఉపయోగార్ధం ఇంటర్ నెట్ లో పెట్టడం జరిగింది. జనార్ధనరావుగారికి అవసరంలో ఉన్నవారిని ఉదారంగా ఆదుకునే
సహజగుణం ఉంది.
ఆయన
తన కుటుంబంతోను, కుమార్తెలు, అల్లుళ్ళతో సహా చాలా సార్లు షిరిడీ వెళ్ళారు. ఆవిధంగా వెళ్ళినపుడు సాయితత్వాన్ని మంచి ప్రాచుర్యంలోకి
తీసుకుని వచ్చి , గొప్ప సేవ చేసిన శ్రీ శివనేశన్ గారిని కలుసుకోవటం తటస్థించింది. అంతకుముందు ఆయన తన కుటుంబంతోను బంధువులతోను జరిపిన
షిరిడీ యాత్రలలో సాయి అంకితభక్తుల గృహాలను కూడా దర్శించారు.
(భాగోజీ షిండే గృహం)
(లక్ష్మీబాయి షిండే టెంపుల్)
ఒకసారి ఆయన 1989 ప్రాంతాల్లో తన కుటుంబసభ్యులతో
కలిసి శ్యామా కుమారుడయిన ఉద్దవరావు దేశ్ పాండేను కలుసుకున్నారు.
ఉధ్ధవరావు బాబా గురించి సంపూర్ణ సమాచారం ఇచ్చారు. తాను తన చిన్న తనంలో బాబా దగ్గరకు వెడుతూ ఉండేవాడినని,
మసీదులో బాబాతో ఆడుకునేవాడినని చెప్పారు.
(ఇంకా
ఉంది)
(సర్వం
శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment