21.03.2017 మంగళవారమ్
ఓమ్
సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయి
భక్తులు – శ్రీ బొండాడ జనార్ధనరావు – 3 వ.భాగమ్
తెలుగు అనువాదమ్ ః ఆత్రేయపురపు త్యాగరాజు,
ఆల్ ఖైల్ గేట్, దుబాయి
శ్రీ
సాయిబాబా చావడి ఉత్సవానికి వెడుతున్నపుడు ఆయన కుడిప్రక్కన ఒక చిన్న పిల్లవాడిని చూడండి. (పైన ఇచ్చిన చిత్రంలో). ఆ బాలుడు టోపీ ధరించి, చేతిలో రాజదండంతో కనపడుతున్నాడు.
ఆ బాలుడు శ్యామ్ రావు జయకర్ కుమారుడు (అయిదు సంవత్సరాల
వయస్సు. పేరు సురేంద్ర కావచ్చు). బాబాగారికి
ఎడమవైపున ఇంకొక బాలుడు నుంచుని ఉన్నాడు. అతను
కూడా తలపై టోపీ పెట్టుకుని చేతిలో పళ్ళెంలో పూజాద్రవ్యాలు పట్టుకుని ఉన్నాడు. ఆ బాలుడు మోరేశ్వర్ ప్రధాన్ కుమారుడు ఛోటా సాయినాధ్’
. ఇతనే బాపూ.
చావడి
ఉత్సవంలో బాబాతో నడుస్తున్న ఆ బాలుర గురించి నిశ్చయంగా తెలీదు. కుడివైపున నుంచున్న బాలుడు ఉద్ధవరావు లేక గణేష్
(వంద సంవత్సరాలకు పైగా జీవించి ఉన్నవాడు) అని, ఎడవవైపున నుంచున్న బాలుడు బాబాకు అంకిత
భక్తుడయిన లక్ష్మణ్ మామా జోషీ ఏకైక పుత్రుడయిన బప్పిజీ అని కొంతమంది అభిప్రాయం. ఏమయినప్పటికి
పైన మొట్టమొదటగా చెప్పిన విషయమే సరియైనదనిపిస్తుంది.
బప్పిజీ, బాబా మహాసమాధి చెందేంతవరకు 12 సంవత్సరాలపాటు
బాబాతో చాలా సన్నిహితంగా మెలిగిన అదృష్టవంతుడు.
ఇతడు మంచి కీర్తనకారుడు, గాయకుడు. ఆధ్యాత్మిక
గ్రంధాలను బాగా అధ్యయనం చేశాడు. శ్యామా కుమారుడు
ఉద్దవరావు తన చిన్నతనంనుంచి బాబా చావడి ఉత్సవానికి వెళ్ళేటప్పుడు ఆయన కూడా వెడుతూ ఉండేవాడు.
అతను చాలా సంవత్సరాలు సాయి సంస్థానంలో పూజారిగా
పని చేసి 1998 లో బాబాలో ఐక్యమయాడు.
చావడి
ఉత్సవం ఫోటో మనకందరికి చాలా సులభంగానే లభ్యమవుతుంది. అందులో ఉన్న ఇద్దరు బాలురను మనం సులభంగా గుర్తుపట్టగలం.
(కొన్ని సంవత్సరాల క్రితం నేను షిరిడి వెళ్ళినపుడు శ్యామా కుమారుడయిన ఉద్దవరావు దేశ్ పాండే గారిని కలుసుకునే భాగ్యం కలిగింది. .... త్యాగరాజు)
శ్రీజనార్ధనరావు
గారికి తన అత్తమామలు, భార్య సహవాసం వల్లనే, పదవీవిరమణ తరువాత బాబా అనుగ్రహంతో సాయిభక్తులందరి
గురించి ప్రపంచానికి తెలియచేద్దామనే ప్రేరణ కలిగింది. బాబా జీవితంలో జరిగిన సంఘటనలు, ఆయన చేసిన అధ్భుతాలను
గురించి చారిత్రక ఆధారాల గురించి పరిశోధన చేశారు.
మొట్టమొదటగా ఆయనకు బాబా గురించి ఈ వ్యాసాలు రాద్దామని గాని, పుస్తకాలు రాద్దామని
గాని ఎటువంటు ఉద్దేశ్యం లేదు. ఆయనకు ఎటువంటి
నిశ్చయమైన అభిప్రాయం లేకుండానే బాబా గురించి, అప్పటి సాయిభక్తుల గురించి రాయాలనే సంకల్పం
బాబా కలిగించారు. చారిత్రక ఆధారాలను ప్రామాణికంగా
తీసుకుని సంకలనం చేసి వ్రాయమని బాబా ఆజ్ఞగా ఆయన భావించి ఉండవచ్చు. బాబా అనుగ్రహం వల్ల రచయిత ఎన్నో పుస్తకాలను, మాసపత్రికలను,
వారపత్రికలను అన్నిటిని పరిశీలించడం జరిగింది.
జరిగిన సంఘటనలు ఏసంవత్సరంలో ఎప్పుడు జరిగాయో తేదీలతో సహా నిర్ధారించుకోవటానికి
అన్నిటిని జాగ్రత్తగా పరిశీలించారు. ఇది కష్టసాధ్యమయినప్పటికీ
బాబా అనుగ్రహం వల్ల రచయితకి పెద్ద భారమనిపించలేదు. ఎంతో పట్టుదలతో ప్రయత్నించినప్పటికి, కొన్నికొన్ని
సంఘటనలకు మాత్రం అవి ఏసమయంలో ఎప్పుడు జరిగాయన్నదానికి చారిత్రక సమాచారం లభించలేదు. అందుచేత ఆయన తన శ్రమకి పూర్తిన్యాయం చేయలేకపోయారు. అయినప్పటికి బాబా దయవల్ల ఆయన చేపట్టిన ఈ సాహస కార్యక్రమం
పూర్తిచేయగలిగినందుకు ఆయన బాబాకు శతకోటి నమస్కారాలు అర్పించుకుంటున్నారు.
2014
వ.సంవత్సరం జూన్, 25వ. తారీకున ఆయన కుటుంబంలో ఒక అధ్భుతమయిన సంఘటన జరిగింది. శ్రీజనార్ధనరావుగారు 10 కేజీల బియ్యం కొని బెంగళూరు
జె.పి.నగర్ లో ఉన్న సాయిబాబా మందిరానికి వెళ్ళారు.
అక్కడ మందిరంలో పూజారిగారికి ఆ బియ్యాన్ని అన్నదానంకోసం
సమర్పించారు. ఆలయ అధికారులు జూన్ 28వ. జరగబోయే
ధుని పూజకు రమ్మని టిక్కెట్ ఇచ్చారు. ఆయన పెద్దకుమారుడు
మురళీకృష్ణ బెంగళూరు, కనకపురా రోడ్డులో ఒక స్కూలును నిర్వహిస్తున్నాడు. జనార్ధనరావుగారు స్కూలుకు వెళ్ళి తన కుమారుడికి
ఆ టిక్కెట్ ఇచ్చారు. 28వ. తారీకున అతని పుట్టినరోజు
సందర్భంగా ఆరోజున అతనిని ధునిపూజకు వెళ్లమని చెప్పారు. మురళీకృష్ణ కూడా గతంలో సాయిభక్తుడే. అయినప్పటికి 28వ.తారీకున
జరిగే ధుని పూజకు వెళ్లడం తనకిష్టంలేదని చెప్పాడు.
జనార్ధనరావుగారు
ఇంటికి వచ్చి భార్యకు జరిగినదంతా చెప్పారు.
ఇక చేసేదేమీ లేక ఆయన ఆటిక్కెట్ ను తన భార్యకు ఇచ్చి ధునిపూజకు వెళ్ళి ఆమెను
పూజచేయించమని చెప్పారు. ఆమె సరేనని చెప్పింది. ఇంటిలో పూజా కార్యక్రామాలన్నీ పూర్తయిన తరువాత ఆవిడ
తన కొడుకుకు ఫోన్ చేసి “28 తారీకున ధుని పూజకు వెళ్ళు. బాబాని ప్రార్ధించుకో. నీ సమస్యలన్నిటినీ బాబా పరిష్కరిస్తారు” అని చెప్పింది. తల్లి బలవంత పెట్టిన కూడా తను ధుని పూజకు వెళ్ళేది
లేదని నిష్కర్షగా చెప్పాడు. ఆ సమయంలో అతను
జయనగర్ లో ఉన్నాడు. ఇక చేసేదేమీ లేక ఫోన్ పెట్టేసింది. మురళీకృష్ణ ఒక బాబా ఫోటోకు ఫ్రేమ్ కట్టించి ఇంటిలో
గోడకి తగిలించాడు. ఆమె ఆఫోటో ముందు నిలబడి
బాబాని ప్రార్ధించింది. ఆసమయంలో మురళీకృష్ణ
జయనగర్ లో తన కారులో ఉన్నాడు. తల్లి అక్కడ ఇంటిలో ప్రార్ధించుకున్న వెంటనే ఇక్కడ ఇతని
కారు దగ్గరకి ఒక వృధ్ధుడు నిలబడి కారు అద్దంమీద టకటకమని కొట్టాడు. అతను ఒక ఫకీరులాగ ఉన్నాడు. అతను అచ్చం బాబా వేషధారణలో ఉన్నాడు. అతను ధర్మం అడుగుతున్నాడేమోనని మురళీకృష్ణ అతనికి
పదిరూపాయలు ధర్మం చేశాడు. కాని ఆ ఫకీరు అతనిచ్చిన
పదిరూపాయలను తిరిగి అతనికి ఇచ్చివేయడమే కాక దానితోపాటుగా ఒక వందరూపాయల నోటుకూడా ఇచ్చాడు. (పది రూపాయలకు పదిరెట్లు). ఆతరువాత ఆఫకీరు ఒకవైపు లక్ష్మీనారయణులవారు, మరొకవైపు
వినాయకుని చిత్రాలు ఉన్న వెండినాణాన్ని ఇచ్చాడు.
దానితోపాటు అరుదయిన చిన్న బాబా ఫొటోకూడా ఇచ్చాడు. అది ఇస్తూ, “నువ్వు నీతల్లిదండ్రులు చెప్పిన సలహా
ప్రకారం నడుచుకో. నీవ్యాపారం బాగా అభివృధ్ధి చెందుతుంది. నీకు, నీకుటుంబానికి అంతా మంచే జరుగుతుంది” అన్నాడు. అదే క్షణంలో పరిస్థితులన్నీ చాలా వేగంగా మారిపోవడం
అతనిలో ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆ ఫకీరుకు
తన విషయాలన్నీ ఎలా తెలుసు, ఆరోజు జరిగిన సంఘటనలన్నీ గుర్తుకు తెచ్చుకున్నాడు. ఫకీరు రూపంలో వచ్చినది బాబా తప్ప మరెవరూ కాదని అర్ధం
చేసుకున్నాడు. ఆఫకీరు ఎక్కడయినా కనిపిస్తాడేమోనని
చూశాడు. కాని అతను ఎక్కడా కనిపించలేదు. మురళీకృష్ణ తనకు బాబా ఇచ్చిన 100/- రూపలయలనోటుని
లామినేషన్ చేయించాడు. బాబా ప్రసాదించిన అరుదయిన
ఫోటోను, వెండి నాణాలతో సహా వందరూపాయల నోటును కూడా తన పూజా మందిరంలో పెట్టుకున్నాడు. జూన్ 28 న అతను భార్యతోను, కుటుంబ సభ్యులతోను బాబా
మందిరంలో ధునిపూజకు వెళ్ళాడు. బాబా తన భక్తుల
మొఱను ఆలకించి వెంటనే స్పందిస్తారనడానికి ఈ సంఘటనే ప్రత్యక్ష నిదర్శనం.
మొత్తం
62 మంది సాయిభక్తులను గురించి సమగ్ర సమాచారమంతా ఆయన సేకరించారు. వాటినన్నిటినీ ప్రపంచవ్యాప్తంగా అందరికీ చేరాలనే
ఉద్దేశ్యంతో ఇంటర్ నెట్ లో పెట్టారు. ఇంత వరకు
ప్రపంచంలోని దేశదేశాలలోని వారు దాదాపు 2,41,000 మందికి పైగా ఈ వ్యాసాల ద్వారా ఆనాటి
సాయిభక్తుల గురించి తెలుసుకున్నారు. రోజురోజుకు
చదివేవారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. పాఠకుల
సంఖ్య 300 కుపైగా ఉన్నదంటే అతిశయోక్తికాదు.
ఇంకా ఆశ్చర్యకరమయిన విషయం ప్రపంచంలోని నలుదిక్కులా ఉన్న, ఆఖరికి చిన్నచిన్న దేశాలలోని ప్రజలకు కూడా ఈ సాయితత్వం
చేరువలోకి వచ్చింది. అటువంటి దేశాలలో క్యూబా
(హవానా) తైవాన్, లిథుయానియ, బెనిన్ , రువాండాలు
ఉన్నాయి. సెంట్.మార్టిన్ అతి చిన్న దీవి. సౌత్ ఈస్టర్న్ కరేబియన్ సీ లో ప్రపంచంలోనె అతి చిన్న
దీవి ఆఖరికి అక్కడి ప్రజలలో కూడా సాయితత్వం
గురించి చదివేవారున్నారు. ఆదీవిలో మొత్తం జనాభా
38,000. కురేసౌ (curacao) దక్షిణ కరేబియన్
సీ లో మరొక చిన్న దీవి. అందులో జనాభా కూడా
చాలా తక్కువ. అక్కడివారు కూడా సాయిభక్తులను
గురించిన వ్యాసాలు చదువుతూ ఉంటారు. పైన ఉదహరించినవాటి
వల్ల బాబా ప్రత్యక్షదైవమని అన్ని దేశాలలోని ప్రజలు భావిస్తారనే విషయాన్ని మనం సులభంగా
అర్ధం చేసుకోవచ్చు. మరొక అతి చిన్న పగడపుదీవిలో
కూడా బాబా ఉనికిని మనం అక్కడ జరిగిన సంఘటన ద్వారా గ్రహించవచ్చు. దక్షిణ పసిఫిక్ సముద్రంలో ’న్యూయే’ అతి చిన్న దీవి. (ఆస్ట్రేలియా – న్యూజిలాండ్ మధ్య ఉన్న దీవి). ఆదీవిలో అక్కడి ప్రభుత్వం ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా
2015 జూలై 31 శుక్రవారము గురుపూర్ణిమ రోజున ఒక వెండి కరెన్సీ నాణాన్ని విడుదల చేసింది. సాయిబాబా చిత్రంతో ఒక వెండి కరెన్సీ నాణాన్ని అధికారికంగా
విడుదల చేయడం అదే మొదటిసారి. 31.1 గ్రాముల
బరువుతో స్వచ్చమైన వెండితో తయారు చేయబడ్డ నాణెం.
దానిని స్విడ్జర్ లాండ్ లోని హెల్వెటిక్ మింట్ లో స్విస్ హాల్ మార్క్ తో ముద్రించారు. ఈ విషయాన్ని కలకత్తాలోని సేవక్ హాబీ సంస్థ తెలిపింది. నాణానికి ఒకవైపున రంగులతో బాబా కూర్చున్న చిత్రం, రెండవవైపున రెండవ ఎలిజబెత్
రాణి చిత్రాలను ముద్రించారు.
‘న్యూయే” ఒక పగడాల దీవి. ఈ నాణాన్ని
విక్రయించే హక్కుల్ని అలోక్ గోయల్ అనే వ్యక్తి సంపాదించాడు. Coins-n-coins.com ద్వారా ఆర్డర్ తీసుకునే ఏర్పాటు చేశారు. సేవక్ హాబీ సంస్థకు ఈ నాణానికి చెందిన హక్కులు కల్పించారు. కాని ప్రపంచ వ్యాప్తంగా విక్రయించడానికి 501 నాణాలను
మాత్రమే ముద్రించారు.
(దీనికి సంబంధించిన యూ ట్యూబ్ లింక్ ఇస్తున్నాను చూడండి)
న్యూజిలాండ్
కి ఈశాన్య దిశలో 1500 మైళ్ళ దూరంలో ఉంది. దీని
జనాభా నవంబరు 2016 నాటికి 1612.
(సమాప్తం)
(సర్వం
శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment