10.03.2017 శుక్రవారమ్
ఓమ్
సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
తెలుగు అనువాదం :
ఆత్రేయపురపు త్యాగరాజు,
ఆల్ ఖైల్ గేట్,
దుబాయి
శ్రీ బొండాడ జనార్ధనరావు గారి బ్లాగునుండి గ్రహింపబడినది.
సాయి భక్తులు –
శ్రీ భారం ఉమా మహేశ్వర రావు & శ్రీమతి భారం మణి – 2 వ.భాగమ్
1968
వ.సంవత్సరమునుండి ఆయనకు హృద్రోగ సమస్య ఉన్నా గాని, తన కుటుంబ బాధ్యతలను మాత్రం నిర్లక్ష్యం చేయలేదు. భక్తి పూర్వకమయిన, ఆధ్యాత్మికమయిన జీవితాన్ని గడిపారు. తనకు సంబంధించిన ప్రతి ఒక్కరి శ్రేయస్సుకోసం ఆయన
ఎంతగానో పాటుపడ్డారు.
ఆయనకున్న
హృద్రోగసమస్య ‘ఆర్టరిక్ స్టెనోసిస్ రిగర్జిటేషన్’ గా గుర్తించి బైపాస్ సర్జరీ చేయాలని
డాక్టర్స్ చెప్పారు.
(Aortic valve stenosis — or aortic stenosis — occurs when the heart's aortic valve narrows. This narrowing prevents the valve from opening fully, which obstructs blood flow from your heart into your aorta and onward to the rest of your body.
When the aortic valve is obstructed, your heart needs to work harder to pump blood to your body. Eventually, this extra work limits the amount of blood it can pump and may weaken your heart muscle.
If you have severe aortic valve stenosis, you'll usually need surgery to replace the valve. Left untreated, aortic valve stenosis can lead to serious heart problems.
నాడి బలహీనంగా ఉండటం,
సక్రమంగా కొట్టుకోకపోవడంవంటి సమస్యల వల్ల చాలా సార్లు ఊపిరి అందక ఆయన సొమ్మసిల్లి పడిపోతూ
ఉండేవారు. 1983 లో ఆయనకు తీవ్రమయిన గుండె నొప్పి వచ్చినపుడు, బాబా ఆయనకు కలలో కనిపించి ఆయన
నుదిటి మీద ఊదీని రాసారు. ఆ తరువాత ఆయనకు మెలుకువ వచ్చి చూడగా ఆయన నుదిటి మీద ఊదీ కనిపించింది. ఆ ఊదీ వల్ల ఆయనకు ఉపశమనం కలిగింది.
ఆ
తరువాత నవంబరు, 1983 వ.సంవత్సరంలో ఆయన ధ్యానంలో ఉన్నప్పుడు బాబా ఫోటోనుండి తెల్లని
దివ్యమైన కాంతి వచ్చి ఆయన గుండె వద్ద చర్మాన్ని చీల్చుకుని వెళ్ళినట్లుగా ఆయనకు అనుభవమయింది.
వెంటనే ఆ ప్రదేశంలో ఆయనకు మంట పుట్టి ఆ కాంతి చర్మాన్ని
తాకిన చోట వృత్తాకారంలో కాలిన మచ్చ కూడా పడింది.
కాలిన చోటనుండి రక్తం స్రవించడం మొదలయింది. ఆయన స్పృహతప్పి పడిపోయారు. ఆయనను మంచం మీద పడుకోబెట్టారు. కాలినట్లుగాఉన్న గుర్తులు ఆపరేషన్ అయిన తరువాత కుట్లు
వేసినట్లుగా కుట్లు కనిపించాయి. ఆ తరువాత ఆయనకు ఛాతీలో బరువుగా ఉండటం, తెలివితప్పి పడిపోవడంలాంటి సమస్యలన్నీ వెంటనే తగ్గిపోయాయి. ఆతరువాత
పూర్తిగా నివారణయాయి..
డాక్టర్స్
ఆయనకు అన్ని పరీక్షలు చేసారు. రావుగారి పరిస్థితి
సంపూర్ణంగా సాధారణ స్థాయికి వచ్చిందని, గుండె పనితీరు కూడా మెరుగ్గ ఉందని గమనించారు. ఇది ఎలా జరిగిందో వారికి అర్ధం కాలేదు. వారంతా అయోమయానికి గురయ్యారు. ఈ సంఘటన జరగడానికి నాలుగురోజుల ముందు ఆయన భార్యకి
కలలో బి.వి.రావుగారు చనిపోయినట్లు, ఆయనను నలుగురు మనుషులు మోసుకుని వెడుతూ ఉండటం కనిపించింది. ఆమెకు ఇది ఒక పీడకల, దుశ్శకునం. ఈ విపత్తు సంభవించకుండా బాబా నివారించారు. బాబా వైద్యులలోనే ఘనమయిన వైద్యునిగా శ్రీ బి.వి.రావుగారికి
శస్త్ర చికిత్స చేసారు.
భగవాన్
శ్రీ షిరిడీ సాయిబాబా భగవంతుడులందరి తరఫున భువినుండి దివికి దిగివచ్చిన ప్రత్యక్ష దైవం. ఆయన సర్వవ్యాపకుడు, సర్వజ్ఞుడు, సర్వ శక్తిమంతుడు. ఆయన మన కళ్ళముందు సంచరించే ఒక ఆధ్యాత్మిక శక్తి. ప్రపంచంలోని అన్ని ప్రాంతాలనుంచి కులమత భేదాలు లేకుండా
ప్రజలందరినీ తనవైపుకు ఆకర్షించుకుంటున్న కారుణ్యమూర్తి. ప్రజలను ఈతిబాధలనుండి, భయాలనుండి, బయటకు లాగి మానవ
జాతిని ఉద్దరించడానికి వచ్చిన దయాసాగరుడు.
ఆయన ఈ భూమిపై నడిచేదైవం అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.
శ్రీ షిరిడీ సాయిబాబా దయాసముద్రుడు. ఆయన ప్రేమని మనం చాలా సులభంగా పొందగలం. ఈ విషయం మన సాయి భక్తులందరికీ అనుభవమే. ఉమామహేశ్వరరావుగారు తమకు కలిగిన అనుభూతులు, అనుభవాల
ద్వారా మన సాయిభక్తులందరికీ బాబాను మరింత దగ్గరకు చేర్చారు. సాయి తత్వప్రచారానికి ఆయన తన జీవితాన్ని అంకితం
చేసారు. ఆయనకు బాబాతో పాటుగా ఇతర సత్పురుషులు,
దేవీ దేవతల దర్శనానుభూతులు కలిగాయి. అయినా
ఆయన చాలా సామాన్యుడిలాగే, ఎటువంటి గర్వం, అహంకారం లేకుండా జీవితాన్ని గడిపారు. అందరికీ ఆధ్యాత్మికంగా ఎటువంటి సహాయం చేయడానికైనా
తయారుగా ఉండేవారు. ఆవిధంగా ఆయన ఎంతో వినయ సంపన్నుడిగా
ప్రసిధ్ధి గాంచారు.
పదవీ
విరమణ చేసిన తరువాత ఆయన గడిపిన జీవితం అతి ముఖ్యమయినదనే చెప్పాలి. ఆకాలంలోనే ఆయన ఆధ్యాత్మికంగా ఎంతగానో ఉన్నత స్థితిని
పొందారు. 1978 లో ఆయన ఆధ్యాత్మిక ప్రయాణం ప్రారంభమయి
దశలవారీగా క్రమక్రమంగా ఒక్కొక్క మెట్టు ఎక్కసాగారు. ఆధ్యాత్మిక ప్రగతిలో సర్వోన్నత స్థాయికి చేరుకున్నారు. పోలీసు శాఖలో అత్యున్నత పదవిలో ఉన్నా గాని, ఆతరువాత
బాబా సేవలో తానెక్కువ ఆనందాన్ని పొందినట్లు చెప్పారు.
(ఇంకా ఉంది)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment