09.03.2017 గురువారమ్
ఓమ్
సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి
బంధువులకు బాబావారి శుబాశీస్సులు
ఈ
రోజునుండి సాయిభక్తులలో అగ్రగణ్యుడయిన శ్రీ భారం ఉమామహేశ్వర రావు గారి గురించి తెలుసుకుందాము.
శ్రీ బొండాడ జనార్ధనరావు గారి బ్లాగునుండి గ్రహింపబడినది.
తెలుగు అనువాదం : ఆత్రేయపురపు త్యాగరాజు,
ఆల్ ఖైల్ గేట్, దుబాయి
సాయి
భక్తులు –
శ్రీ
భారం ఉమా మహేశ్వర రావు & శ్రీమతి భారం మణి – 1 వ.భాగమ్
(శ్రీ
భారం ఉమా మహేశ్వరరావు గారి జీవిత చరిత్రలో, బాబా మహాసమాధి చెందిన తరువాత ఆయనకు ప్రసాదించిన
ఎన్నో అధ్బుతాలని, మహిమలను మనం గ్రహించవచ్చు.
వైద్యులకే మహా వైద్యునిగా బాబా శ్రీ బి.యు. రావుగారికి గుండె ఆపరేషన్ చేసారు. బాబా శ్రీ బి.యు.రావుగారి ద్వారా మనందరి సంక్షేమం
కోసం, ఆధ్యాత్మికోన్నతి కోసం ఎన్నో సందేశాలను మనకందించారు.)
శ్రీ
భారం ఉమా మహేశ్వరరావు గారు 25.05.1922 న గుంటూరులో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు రావ్ సాహెబ్ భారం నారాయణరావు
(రిటైర్డ్ డిప్యూటీ సూపరింటెన్ డెంట్ ఆఫ్ పోలీస్.
బహుశ ఆంధ్రప్రదేశ్ కి మొట్టమొదటి ఆర్.టి.ఒ. మచిలిపట్నం హెడ్ క్వార్టర్స్) శ్రీమతి అంజమ్మ. నారాయణరావుగారు క్రమశిక్షణతో చేసిన ఉద్యోగ విధులకు
గుర్తింపుగా ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వంవారు ఆయన వాడుకోవటానికి లైసెన్స్ లేకుండా రివాల్వర్
ను కూడా ఇచ్చారు. ఆయనలో దైవభక్తి కూడా మెండుగా
ఉండేది. ఆయన శ్రీరామచంద్రునికి గొప్ప భక్తుడు. ప్రతి సంవత్సరం శ్రీరామ కళ్యాణం ఎంతో ఘనంగా నిర్వహిస్తూ
ఉండేవారు. ఆయన తను ఉద్యోగం చేస్తున్న రోజులలోనే
కాదు, పదవీవిరమణ తరువాత కూడా ప్రతిసంవత్సరం క్రమం తప్పకుండా శ్రీరామ కళ్యాణం నిర్వహించేవారు. ఆయన తన జీవితమంతా శ్రీరాముని పూజించిన ధన్యజీవి. ఆవిధంగా ఆయన శ్రీరాముని ఎడల భక్తిప్రపత్తులతో జీవించారు. ఇప్పటికీ ఆయన వారసులు ఆయన సాంప్రదాయాన్నే అనుసరిస్తూ
ప్రతి సంవత్సరం శ్రీరామ కళ్యాణాన్ని నిర్వహిస్తూ ఉన్నారు.
ఉమా
మహేశ్వరరావు గారు 1939 సంవత్సరం వరకు బాపట్లలో బోర్డ్ హైస్కూలులో విద్యనభ్యసించారు. ఆ తరువాత మచిలిపట్నం హిందూ కాలేజీలో 1943 వరకు తమ
విద్యాభ్యాసాన్ని కొనసాగించారు. చదువు పూర్తయిన
తరువాత 1945 లో ఆయన సబ్ ఇన్స్ పెక్టర్ ఆఫ్ పోలీస్ గా ఉద్యోగంలో ప్రవేశించారు. ఉద్యోగంలో క్రమశిక్షణ, దైవభక్తి, ఈ విషయాలలో ఆయన
తమ తండ్రి అడుగుజాడలలోనే నడిచారు. 1945 సంవత్సరంలో
ఆయనకు రావు సాహెబ్ డా.మనం నరసింగరావు, శ్రీమతి లక్ష్మీనరసమ్మల కుమార్తెయైన మణి తో వివాహం
జరిగింది. శ్రీమతి మణిగారు ఏలూరులో
07.09.1931 లో జన్మించారు. శ్రీ ఉమా మహేశ్వరరావు
దంపతులకి మొదట ఇద్దరు అమ్మాయిలు ఆతరువాత ఒక కుమారుడు కలిగారు. వారు, నీరజ, గిరిజ, కృష్ణకిషోర్.
ఆయన
ఉద్యోగం చేసినంత కాలము తన ఉద్యోగ ధర్మాన్ని అంకిత భావంతోను నిజాయితీగాను నిర్వర్తించారు. 1962 లో ఆయనకు పోలీస్ అవార్డు సత్కారం లభించింది. ఆ తరువాత డిప్యూటీ సూపరిన్ టెండెంట్ గా పదోన్నతి
లభించింది. ఆయన 1964 నుండి 1967 వరకు డిప్యూటీ
సూపరిన్ టెండెంట్ ఆఫ్ పోలీస్ గా విజయనగరంలోను, ఏలూరులోని పని చేశారు. ఆతరువాత విశాఖపట్నంలోను, హైదరాబాదులోను పని చేశారు. ఆయన పోలీస్ డిపార్ట్ మెంటులో అంకిత భావంతో పని చేస్తుండటం
వల్ల ఆధ్యాత్మిక విషయాలపై గాని, దైవ సంబంధమయిన విషయాలపై గాని అంతగా దృష్టి పెట్టలేకపోయారు. 1977 వ.సంవత్సరంలో ఆయన ఎడిషనల్ సూపరిన్ టెండెంట్
ఆఫ్ పోలీస్ గా పదవీ విరమణ చేసారు.
1968
నుంచి ఆయనకు గుండె జబ్బు ఉంది. ఒకసారి 1968 సంవత్సరంలో విజయవాడలో పుష్కరాల సమయంలో ఆయనకు గుండె నొప్పి వచ్చింది.
ఆయన చనిపోయారని నిర్ధారించుకుని సంబంధిత
పోలీస్ హెడ్ క్వార్టర్స్ కి కూడా వైర్ లెస్ మెసేజ్ పంపించారు. కాని అదృష్టవశాత్తు భగవదనుగ్రహం వల్ల ఆయన హార్ట్
ఎటాక్ నుండి బ్రతికి బట్టకట్టారు. అప్పటినుండి
ఆయన తన గుండె సంబంధిత వ్యాధికి కార్డియాలజిస్టు వద్ద వైద్యం చేయించుకుంటూనే ఉన్నారు.
ఇక
ఆయన గురించి పూర్తిగా వివరించే ముందు మొట్టమొదట్లో ఆయన శ్రీరాఘవేంద్ర స్వామివైపు ఆకర్షితులయ్యారు. శ్రీరాఘవేంద్రస్వామి ఆయనకు ఎన్నో అనుభవాలను ప్రసాదించారు. అనంతరం శ్రీరాఘవేంద్రస్వామి వారి సూచనల ప్రకారం ఆయన శ్రీసాయిబాబాపై
భక్తి భావాన్ని, నమ్మకాన్ని ఏర్పరచుకున్నారు. 1981 నుంచి ఆయనకు శ్రీసాయిబాబాపై ఆకర్షణ ఏర్పడింది. శ్రీసాయిబాబా తన చమత్కారంతో ఆయనని తన వశం చేసుకున్నారు.
ఆ తరువాత బి.యు.రావుగారు పూర్తిగా బాబా భక్తిలో
లీనమయి ఆతరవాత తన జీవితకాలమంతా బాబాయే తన సర్వస్వంగా భావించారు. పెద్దవయసు ,హృద్రోగ సమస్యల వల్ల శారీరకంగా బలహీనంగా
ఉన్నా గాని, ఆయన ఎక్కడికి వెళ్ళినా చాలా చురుకుగానే ఉండేవారు. ఆ చురుకుదనం బహుశ ఆయనకు బాబా ప్రసాదించిన కొత్తశక్తి
వల్ల కావచ్చు. మేఘాలనుండి కురిసే వర్షపు జల్లులలాగా బాబా ఆయనకి
ఎన్నో దైవాంశ దివ్యానుభూతులను, సందేశాలను, బోధనలను, లీలలను ప్రసాదించారు. ఆయనకు ప్రసాదించిన సందేశాలను, అనుభవాలను, చమత్కారాలను
ప్రపంచవ్యాప్తంగా అందరికీ పంచమని బాబా ఆయనని ఆదేశించారు.
ఆవిధంగా
అనుభవాలు, అనుభూతులను పొందిన బి.వి.రావుగారు బాబాకు అంకిత భక్తులయారు. ప్రతిరోజు బాబాను పూజిస్తూ ఆయన గురించి ఆయన బోధనల
గురించి ప్రచారం చేస్తు బాబాసేవ చేశారు.
తన కుటుంబంతోను, దగ్గరి బంధువులు, స్నేహితులను అందరినీ వెంటబెట్టుకొని తరచూ
షిరిడి వెడుతూ ఉండేవారు.
(రేపటి సంచికలో బాబా చేసిన గుండె ఆపరేషన్)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment