08.03.2017 బుధవారమ్
ఓమ్
సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఊదీ
సర్వరోగ నివారిణి
తెలుగు అనువాదమ్ : ఆత్రేయపురపు త్యాగరాజు, ఆల్ ఖైల్ గెట్, దుబాయి
1960వ.
సంవత్సరంలో నీల తన కుటుంబంతో షిరిడీ వెళ్ళింది.
అక్కడ రెండు రోజులున్నారు. ఆమె షిరిడీకి
బయలుదేరేముందు విపరీతమయిన మోకాళ్ళ నొప్పులతో బాధపడుతూ ఉంది. షిరిడీలో ద్వారకామాయిలోని ధునిలోని ఊదీని తీసుకుని బసకి
వచ్చింది. కొంత ఊదీని నీళ్ళలో కలుపుకుని త్రాగి,
కొంత ఊదీని మోకాళ్ళకు మందులా రాసుకుంది.
షిరిడీనుంచి
బయలుదేరేటప్పుడు బాబా అనుమతి తీసుకుని ఇంటికి తిరిగివచ్చింది. ఇంటికి తిరిగిరాగానే ఇంటి పనులతోను, తన చంటిబిడ్డ ఆలనా పాలనా చూసుకోవడంలోను
మునిగిపోయింది. షిరిడీ నుంచి తిరిగి వచ్చిన
వారం రోజులకు ఆమెకు తను షిరిడీ వెళ్ళేముందు విపరీతమయిన మోకాళ్ళ నొప్పులతో
బాధపడ్డ విషయం గుర్తుకు వచ్చింది. ఇపుడు
తనకి ఎటువంటి మోకాళ్ళ నొప్పులు లేవు. ఊదీయే
దివ్యమైన ఔషధంగా పనిచేసింది.
షిరిడీనుంచి
వచ్చిన తరువాత ఊదీనంతటినీ ఒక సీసాలో పోసి అలమారులో భద్రంగా దాచింది. ఆవిధంగా దాచేటప్పుడు తనలో ఈ విధంగా అనుకుంది. “ఇది బాబావారి అతి పవిత్రమయిన ఊదీ. దీనిని చాలా జాగ్రత్తగా దాచుకోవాలి. ఈ పవిత్రమయిన ఊదీ బాబాకు ప్రతిరూపం. అంతే కాదు ఇది సర్వరోగనివారిణి. దీనిని ఇక్కడే అలమారులో వేటితోనూ కలిసిపోకుండా భద్రంగా
ఉంచాలి.”
ఒకరోజున
నీల దేనికోసమో వెతకడానికి అలమారు తెరిచింది.
అందులో తను ఊదీని ఒక సీసాలో పోసి భద్రంగా దాచిన విషయం పూర్తిగా మర్చిపోయింది. ఆ అలమారులో అటువంటి సీసాలు చాలా ఉన్నాయి. అన్నీ ఒకే రకంగా ఉన్నాయి. నీల ఒక సీసా తెరచి చూసింది. సీసా మూత తెరవగానే కళ్ళు విప్పార్ఛి అలా చూస్తూ
ఉండిపోయింది. సీసామూత తెరవగానే ఏమి జరిగిందో
ఆమె ఈవిధంగా వివరించింది.
“నేను
సీసా మూత తెరవగానే గుండ్రంగా చక్రాలు చక్రాలుగా పొగ వస్తోంది. ఆ పొగ కూడా పూర్తిగా చక్రం ఆకారంలో స్పష్టంగా కనపడుతోది. చక్రం ఆకారంలో ఉన్న పొగ సీసాలో ఉన్న ఊదీ పైభాగంనుండి సీసా పైకి వస్తూ ఉంది. ఒక్క క్షణం అది నా భ్రమేమో అనుకున్నాను. బహుశా నేను సీసాను కదిపి ఉంటానేమో, అపుడు ఊదీ ఆవిధంగా
పైకి లేచిందేమోనని భావించాను. అందుచేత ఊదీ
ఆవిధంగా చక్రాలమాదిరిగా ఏర్పడి పొగలాగ బయటకి వచ్చిందేమో అనుకున్నాను. ఆవిధంగా వస్తున్న చక్రం లోపలికి నావేలును పెట్టి
ఊదీని ముట్టుకున్నాను. ఆ ఊదీ వేడిగా తగిలింది
వేలికి. “బాబా ! నీధునినుంచి వేడిగా ఉన్న ఊదీని
ప్రసాదించి నన్ననుగ్రహించావా” అని మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకొన్నాను. ఆ తరువాత ఊదీనుంచి వెలువడుస్తున్న చక్రాలు మాయమయి
ఊదీ యధాస్థానానికి వచ్చింది. వెంటనే ఆ ఊదీ
సీసాని తీసి తన పూజా మందిరంలో భద్రపరిచింది.
సాయిలీల
మాసపత్రిక - వాల్యూమ్ 62, నం. 5 ఆగస్టు – 1986.
(సర్వం
శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment