02.03.2017 గురువారమ్
ఓమ్
సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఆధ్యాత్మిక
మార్గములో ప్రయాణముపై సాయిబానిస ఆలోచనలు – 8
సంకలనం
: ఆత్రేయపురపు త్యాగరాజు, ఆల్ ఖైల్ గేట్, దుబాయి
బ్లాగులో మీరు జీ మెయిల్ లో సబ్ స్క్రైబ్ అన్న చోట మీ ఈ మెయిల్ ఐడి ఇవ్వండి.
బ్లాగులో ప్రచురించిన వెంటనే మీ మైల్ కి మెస్సేజ్ వస్తుంది. వెంటనే బ్లాగు ఓపెన్ చేసి చదువుకోవచ్చు. లేకపోతే telugublogofshirdisai.blogspot.in కి నేరుగా వెళ్ళి చదవవచ్చు.
87. ఈప్రపంచములో భగవంతుడిని చూసినవాడు లేడు. కాని భగవంతుని ఉనికిని, అనుభూతిని పొందినవారు మాత్రమే
ఉన్నారు. వారే భగవంతుని దూతలు.
88. ఈ సృష్ఠిలో అందమైనది ప్రకృతిలోని అందాలు. ఆ అందములో భగవంతుని చూడు. ప్రకృతిని ప్రేమించు.
89. చిత్రకారుడు తను గీసే చిత్రములో మనస్సు లగ్నముచేసి
చిత్రము గీసినపుడు ఆ చిత్రములో జీవకళ మన కనులకు కనపడుతుంది. భగవంతుడు గొప్ప చిత్రకారుడు. ఆయన కుంచెలో నుండి ఈసృష్టి వెలువడింది. ఆయన ఈ సృష్టి
అనే చిత్రాన్ని గీసినపుడు తన్మయత్నములో చిత్రాన్ని గీసినాడు. అందుచేతనే ఈ సృష్టిలో జీవము ఉద్భవించినది.
90. మన పిల్లలు నడక నేర్చుకొనే సమయములో కొన్ని వందలసార్లు
పడుతు లేస్తు ఉంటారు. ఆఖరికి నడవడము నేర్చుకొంటారు. అలాగే మనం అందరము భగవంతుని పిల్లలము. మన జీవన యాత్రలో మనము పడుతూ లేస్తు ఉంటాము. ఆ సమయములో భగవంతుడు మనకు మానసిక శక్తిని ప్రసాదించుతాడు
అనేది మనము గ్రహించాలి.
91. ముందుగా నిన్ను నీవు తెలుసుకో. ఆతరువాత నీవు స్వర్గము గురించి నరకము గురించి ఆలోచించవచ్చును.
92. ప్రతి మనిషిలోను మంచి, చెడు ఉంటాయి. నీవు నీతోటివానిలోని మంచిని చూడగలిగిననాడు నీవు
భగవంతుని ఉనికిని కనుగొన్నట్లే.
93. ప్రేమ అనేది భగవంతుని పూలతోటలో నీటిని వెదజల్లే
ఒకసాధనము. ఆ సాధనము నుండి జారిపడే నీటి బిందువులు
భగవంతుని ప్రేమయొక్క అనుభూతిని నీకు ప్రసాదించుతాయి.
94. మానవుల మధ్య ఉన్న ప్రేమకు కొన్ని సరిహద్దులు ఉంటాయి. అదే భగవంతునికి భక్తునికి మధ్య ఉన్న ప్రేమకు హద్దులు
ఉండవు.
95. నీ సద్గురువు పట్ల నీకు ఉన్న ప్రేమ, గౌరవములు ఆ
సద్గురువు ఒక్కరికే పరిమితము కాదు. సద్గురువు
భగవంతుని విధేయ సేవకుడు. అందుచేత సద్గురువును
ప్రేమించితే భగవంతుని ప్రేమించినట్లే.
96. ధనాన్ని ఖర్చు పెడితే అది తరిగిపోతుంది. అదే ధనాన్ని నీవు దాచిపెడితే దొంగిలించబడుతుంది. మరి ధనాన్ని దానధర్మాలకు వినియోగించితే అది నీపేరిట
భగవంతుని ఖజానాలో జమచేయబడుతుంది.
97. నీవు నీరెండు చేతులతో భగవంతునికి నమస్కరించు. భగవంతుడు తన రెండు చేతులతో నిన్ను సదా రక్షించుతాడు.
98. ఈ సృష్ఠిని ముందుకు నడిపించడానికి భగవంతుడు మానవ
అవతారము ఎత్తవలసినదే. అటువంటి అవతార పురుషులే
మన పాలిట సద్గురువులు.
99. కోటిమంది భగవంతుని గురించి ఆలోచించితే అందులో ఒక్కడు
మాత్రమే భగవంతుని చేరగలుగుతున్నాడు.
(సమాప్తం)
(సర్వం
శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment