03.03.2016 శుక్రవారమ్
ఓమ్
సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ
రోజు మనమ్ అద్భుతమైన రెండు సంఘటనలను తెలుసుకుందాము. మనం ప్రతిరోజు దైవ ప్రార్ధన చేస్తూ ఉంటాము. మనం ప్రార్ధన మనకోసమ్ గాని, లేక మన కుటుంబ సభ్యులకోసం,
గాని మన బంధువుల కోసం గాని చేస్తూ ఉంటాము.
మన కోరికల కోసం, లేక బంధు మిత్రుల ఆరోగ్యం కోసం కూడా చేస్తూ ఉంటాము. కొన్ని కొన్ని పరిస్థితులలో లోక కళ్యాణం కోసం కూడా
చేసే అవసరం రావచ్చు. ఇప్పుడు మేరు చదవబోయేది
అటువంటి దాని గురించే. మన ప్రార్ధనలోని ఆర్తిని
భగవంతుడు గుర్తించి దానికనుగుణంగానే స్పందిస్తాడు. మనమ్ చేసే ప్రార్ధన నిస్వార్ధంగా ఉండాలి. ఇక చదవండి.
సాయిలీలా
వాట్ స్ ఆప్ గ్రూప్ నుండి సేకరణ…నాగరాజు గారు 2004 వ.సంవత్సరంలో చెప్పిన వివరణ.
ప్రార్ధన యొక్క శక్తి - 1
దైవాన్ని ప్రార్ధనలో అంతర్లీనంగా ఒక విధమయిన శక్తి ఉందని అందరూ
ఒప్పుకుంటారు.
మనం భగవంతునికి చేసే ప్రార్ధనలోని శక్తి భగవంతునియొక్క శక్తికి సమంగా ఉండి, మనం చేసే ప్రార్ధనలను ఆలకించి స్పందిస్తాడు.
భక్తులంతా తమతమ కోర్కెలు తీరడానికి మొక్కులు మొక్కుకొంటారు.
కొంతమంది తమకిష్టమయిన ఆహారపదార్ధాలను తమకోరిక నెరవేరే వరకు త్యజిస్తే మరికొంతమంది తమకిష్టమయిన పానీయాలను త్యజిస్తారు.
వరదలు, తుపానులలాంటి అనుకోని ప్రకృతి వైపరీత్యాలు సంభవించినపుడు వాటిబారిన పడిన గ్రామాలను, పట్టణాలను , అందులో నివసించే ప్రజలను రక్షించమని కూడా ప్రార్ధనలు చేయవచ్చు. మొక్కులు మొక్కుకోవచ్చు. అటువంటి పరిస్థితులలో కూడా బాబా తప్పకుండా స్పందించి మొక్కుకున్న మొక్కులను తీరుస్తారు. ఇటువంటి మొక్కులన్నీ కూడా నిస్వార్ధంతో చేసేవి. పైగా బాధలలో ఉన్నవారిని ఆదుకొమ్మని ఆర్తితో చేసే ప్రార్ధనలు. ఇప్పుడు వివరింపబోయే ఈ రెండు సంఘటనలు పైన చెప్పిన వాటికి ఉదాహరణ.

నా స్నేహితురాలయిన మంజులకి యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలో ఇంటర్నల్ ఆడిట్ డిపార్ట్ మెంటుకు మార్చారు. అందుచేత ఉద్యోగంలో విధుల ప్రకారం అనేక నగరాలను, పట్టణాలకు వెళ్ళి ఆడిట్ చేయాల్సి ఉంటుంది. ఆవిధంగా 2014 సంవత్సరం సెప్టెంబరు 7వ.తారీకున ఆమె తన బృందంతో కలిసి జమ్ముకి వెళ్ళాల్సి వచ్చింది. ఆ సమయంలో జమ్ములో విరీతమయిన ఎడతెరపిలేని వర్షాలు కురుస్తూ ఉన్నాయి. శ్రీనగర్, జమ్ము పట్టణాలను వరదలు ముంచెత్తాయి. వర్షాలు ఆగకుండా కురుస్తూనే ఉన్నాయి. సెప్టెంబరు 6 వ.తారీకున నేను టి.వి. లో వార్తలు చూస్తూ ఉన్నాను. వార్తలలో వరదల వల్ల జరుగుతున్న విధ్వంసాన్ని చూసి చాలా భయం వేసింది. ఆసాయంత్రమే నేను మంజులకు మెసేజ్ పంపించాను. జమ్ముపట్టణమంతా వరదలలో మునిగిపోయి ఉందని. జమ్ముకి బయలుదేరేముందు వార్తలు కూడా చూడమని చెప్పాను. నేను మెసేజ్ పంపినపుడు మంజుల మల్లేశ్వరం బాబా మందిరంలో ఉంది. రాత్రి నేను ఆమెతో మాట్లాడి జమ్ముకి వెళ్ళవద్దని చెప్పాను.
మరుసటిరోజు
ప్రొద్దున్నే లెండీబాగ్ లో ఉన్న బాబా మందిరంలో ప్రదక్షిణలు చేస్తున్నాను. ఆవిధంగా చేస్తుండగా మంజుల ప్రయాణం గురించి తలుచుకోగానే
చాలా భయం వేసింది. ఆమె క్షేమంగా ఉండాలని బాబాను
ప్రార్ధించి ఈ విధంగా మొక్కుకున్నాను. “బాబా,
మంజుల తన బృందంతో కలిసి జమ్ముకి వెడుతోంది.
వారందరినీ జాగ్రత్తగా కాపాడుతూ తిరిగి క్షేమంగా బెంగళురుకు చేర్చు. వారందరూ క్షేమంగా తిరిగి వస్తే వారంరోజులపాటు ఈ
లెండీబాగ్ లో నీకు కొవ్వొత్తుల దీపాలు వెలిగిస్తాను.” ఈ పరిస్థితిలో నేను ఈవిధంగా అతి చిన్న మొక్కు మొక్కుకోవడం
తప్ప ఇంకేమీ చేయలేని పరిస్థితి.
వాళ్ళ
టీమ్ నాయకుడు నిర్ణయించిన ప్రకారం అందరూ కలిసి 7వ.తారీకున జమ్ముకి బయలుదేరారు. ఆరోజు ఉదయం మంజుల చాలా అసహనంగా ఉంది. జమ్ముకి తప్పక వెళ్ళాల్సిన పరిస్థితి. ఏమి చేయాలో పాలుపోవడంలేదు. ఏమి చేయాలో బాబానే అడుగుదామని బాబా ముందర చీటీలు
వేసింది.
శ్రీపాద
శ్రీవల్లభ చరిత్ర 51వ.అధ్యాయం చదవమని వచ్చింది.
ఆ అధ్యాయం జలగండము మొదలైన గండములనుండి రక్షణనిస్తుంది. ఇంకా ఆ అధ్యాయాన్ని ఒక కాగితం మీద వ్రాయమని వచ్చింది. మంజుల ఆ అధ్యాయాన్ని ఒక కాగితం మీద వ్రాసి తనతోపాటుగా
ఒక రక్షణ కవచంలా తీసుకొని వెళ్ళింది.
వారంతా
మధ్యాహ్నం 2 గంటలకు జమ్ము చేరుకున్నారు. అక్కడికి
చేరుకునేటప్పటికి మొత్తం వంతెనలన్నీ ఉదయం 10 గంటలనుండి నీటిలో మునిగి ఉన్నాయని తెలిసింది. ఇండియన్ ఆర్మీ ట్రాఫిక్ ని మళ్ళిస్తూ ప్రజలకి సహాయం
చేస్తున్నారు. అక్కడ నీటిప్రవాహం ఎలా ఉందంటే
భవనాలకి మూడవ అంతస్తు వరకూ నీటి మట్టం పెరిగి ప్రవహిస్తూ ఉంది.
తావీ నది ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తూ ఉంది. వీరి బృందమంతా ఆఫీసుకు బయలుదేరేటప్పటికి నీటి మట్టం తగ్గిపోవడం ఆర్మీవాళ్ళు ట్రాఫిక్ ను వంతెనలమీదుగా అనుమతించడం జరిగింది. ఇంతలోనే అంత మార్పు రావడం ఆశ్చర్యాన్ని కలిగించింది. మంజుల, వారి బృందమంతా తమకిచ్చిన పనిని నిర్విఘ్నంగా పూర్తి చేసుకుని క్షేమంగా బెంగళురుకు చేరుకున్నారు. నేను నాస్నేహితురాలికి వారి బృందం క్షేమంకోసం మొక్కుకున్న మొక్కును బాబా నెరవేర్చారు. ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే మంజుల, ఆమె బృందం క్షేమంగా తిరిగి రావడమే కాదు, తావీనది వరద కూడా తగ్గుముఖం పట్టి జమ్ము ప్రజలు కూడా క్షేమంగా తమతమ ఇండ్లకు క్షేమంగా చేరుకొన్నారు. నాలాగే ఎందరో ఈవిధంగా మొక్కులు మొక్కుకొని సామూహికంగా ప్రార్ధనలు చేసి ఉండటం వల్లనే అంతా సవ్యంగా జరిగింది.

(రేపటి
సంచికలో ప్రార్ధన యొక్క శక్తి –2 (రక్త దానం
చేసిన బాబా) చదవండి.
(సర్వం
శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment