04.03.2017 శనివారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు ప్రార్ధన యొక్క శక్తి ఎటువంటిదో రెండవభాగంలో తెలుసుకుందాము.
ప్రార్ధనా
శక్తి -2
(రక్తదానం
చేసిన బాబా)
ఇక
రెండవ లీల విషయానికి వస్తే, సామూహికంగా చేసే ప్రార్ధనలు మొక్కుకున్న మొక్కులు భజన బృందంలోని
ఒక సభ్యుని ప్రాణాలు ఏవిధంగా కాపాడాయో తెలుస్తుంది. నా స్నేహితుడయిన నాగరాజు నాకీ అధ్బుతమయిన లీల గురించి
వివరించాడు.
కొన్ని
సంవత్సరాల క్రితం, కామత్, అతని భార్య వందన బెంగుళూరులో ఒక భజన బృందాన్ని ప్రారంభించారు. ప్రతి ఆదివారం వారు భజనలు చేస్తూ ఉండేవారు. ఆవిధంగా తొందరలోనే ఆభజన బృందంలో చాలా మంది సభ్యులుగా
చేరడం ఒక పెద్ద బృందంగా ఏర్పడటం జరిగింది.
నాగరాజు అతని స్నేహితుడు తేజ్ కుమార్ ఇద్దరూ కలిసి
క్రమం తప్పకుండా భజనలో పాల్గొంటూ ఉండేవారు.
ఒకసారి తేజ్ కుమార్ కి పెద్ద యాక్సిడెంట్ అయింది. ప్రమాదకర పరిస్థితుల్లో ఆస్పత్రిలో చేర్పించారు. తలకి బాగా పెద్ద దెబ్బ తగిలింది. న్యూరో సర్జన్ పరీక్షించి దెబ్బ బాగా బలంగా తగిలిందని,
బ్రతకడం కష్టమని చెప్పాడు. భజన బృందమంతా బయట
చాలా ఆందోళనతో ఉన్నారు. తాము చేయగలిగిన సహాయం
ఏమయినా ఉందాని ఆలోచిస్తూ ఉన్నారు. ఆఖరికి బాబానే
శరణు వేడదామని నిశ్చయించుకొన్నారు. వెంటనే వందన ఇంటికి
వెళ్ళి తేజ్ కుమార్ త్వరగా కోలుకోవాలని అందరూ కలిసి బాబాను ప్రార్ధించారు.
వారంతా
ఏవిధంగా ప్రార్ధించినదీ నాగరాజు ఈ విధంగా వివరించాడు.
“మేము
వందన ఇంటికి వెళ్ళేటప్పటికి చాలా రాత్రయింది.
అప్పటికే వందన శేజ్ ఆరతి కూడా ముగించేసింది. మేమంతా బాబా చూట్టూరా కట్టిన దోమతెరను తీసేశాము. బాబాని నిద్రలేపాము. అందరం కలిసి తేజ్ కుమార్ కోలుకోవాలని ప్రార్ధన చేశాము. ఆ తరువాత అందరూ తేజ్ ప్రమాదంనుండి బయటపడాలని ప్రతివారూ
వివిధ రకాలుగ మొక్కులు మొక్కుకున్నారు. చెప్పులు
లేకుండా కోపర్ గావ్ నుండి షిరిడీకి నడచివస్తామని, సమాధి మందిరం చుట్టు 108 ప్రదక్షిణలు
చేస్తామని, సాయి సత్ చరిత్ర ప్రారాయణ చేస్తామని ఈ విధంగామొక్కుకొన్నారు”
తేజ్
ని ఆపరేషన్ ధియేటర్ కి తీసుకొనివెళ్ళి సర్జరీ ప్రారంభించాడు డాక్టర్. లోపల బాగా రక్తస్రావం జరగడం వల్ల 4,5 బాటిల్ రక్తం
అవసరమని సర్జన్ చెప్పాడు. తేజ్ బ్లడ్ గ్రూప్
బి నెగటివ్ అవడం వల్ల ఆగ్రూప్ రక్తం తెప్పించడం
చాలా కష్టం. ఇక్కడే బాబా మహత్యం ఏమిటో ఏవిధంగా
ఆయన తన లీల ప్రదర్శిస్తారో విశదంగా మనకు తెలుస్తుంది.
ఆస్పత్రి
బయట నుంచున్న ఒక ముస్లిమ్ వ్యక్తి తనంతతానుగా వచ్చి రక్తదానం చేశాడు. అతనిది బి నెగటివ్ గ్రూప్.
సర్జరీ
విజయవంతంగా జరిగి తేజ్ ప్రమాదంనుంచి బయట పడ్డాడు.
మెదడులో ఎటువంటి హాని జరగకుండా కోలుకొంటాడనే ఆశతో ఉన్నాము. తేజ్ ఇంకా చాలా కాలం ఆస్పత్రిలోనే ఉండాల్సివస్తుందని
చెప్పారు.
ఒకరోజు
తేజ్ కు స్వప్నంలో బాబా కనిపించారు. ఆ స్వప్నంలో
తేజ్ సమాధి మందిరం వద్దకు వెళ్ళినట్లు అది ఇప్పుడు ఉన్నటువంటి సమాధిమందిరానికి చాలా
భేదం ఉన్నట్లుగాను కన్పించింది. ఆసమాధి మ్యూజియంలో
కనిపించే సమాధిలాగే ఉందట. అంటే సమాధిమీద బాబా
విగ్రహంలేకుండా ఒక్క సమాధి మాత్రమే ఉండి సమాధిలోపల బాబా కూర్చుని ఉన్నట్లుగా కనిపించిందట. తేజ్ సమాధి వద్దకు వెళ్ళినపుడు బాబా భుజానికి జోలె
ఉంది. తేజ్ బాబాని “బాబా మీజోలెలో ఏముంది?”
అని ప్రశ్నించాడు. బాబా చిరునవ్వుతో, “మీ భక్తులందరూ
నా చరిత్రను పారాయణ చేస్తున్నట్లుగానే, నేబు నా ప్రతిభక్తుని చరిత్రను ఈ జోలెలో పెట్టుకుంటాను. నేను దానిని మరలా సమయం వచ్చినపుడెల్లా బయటకు తీసి
గమనిస్తూ ఉంటాను” అని సమాదానమిచ్చారు.
నరాలకు
సంబంధించి ఎటువంటి సమస్య లేకుండా తేజ్ పూర్తిగా కోలుకున్నాడు. జీవితం చాలా హాయిగా గడుపుతున్నాడు. మొక్కులు కొక్కుకోవడం వల్ల, సామూహిక ప్రార్ధనలవల్ల
తేజ్ చావునుంచి బ్రతికి బయటపడ్డాడని ఈలీల ద్వారా మనకి స్పష్టంగా అర్ధమవుతోంది.
ఈ
సమాజం మనకి ఎంతో ఇచ్చింది. దానికి తగినట్లుగానే
మనం సమాజానికి తిరిగి ఇవ్వగలగాల్లి. కనీసం
మనం ఈసమాజ క్షేమం కోసమయినా ప్రార్ధిస్తూ ఉండాలి.
(శ్రీ వామనరావ్ పాయ్)
ప్రపంచమానవాళి
క్షేమం కోసం వామనరావు పాయ్ భగవంతుని ప్రార్ధించాడు. వారందరికీ సత్ప్రవర్తననిమ్మని భగవంతుని అర్ధించాడు. వారందరికీ మంచి ఆరోగ్యాన్నిమ్మని, వారికెప్పుడూ
రక్షణగా ఉంటూ కాపాడుతూ ఉండమని వారికి దీవెనలు అందిస్తూ ఉండమని భగవంతుడిని వేడుకున్నాడు.
అవసరంలో
ఉన్నవారికి, దీనులకు మనం సేవ చేయగలము.
మనం
చేసే సేవకు బాబా తన సమ్మతిని తెలపడమే కాదు, అందుకు కావలసిన ధైర్యాన్ని శారీరకంగాన్లు,
మానసికంగాను మనకు ప్రసాదించి మనం చేసే సేవ సంపూర్ణంగా జరిగేలా అనుగ్రహిస్తారు.
(సర్వం
శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment