20.05.2017 శనివారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈనాటి సమాజములో
మానవత్వము ఇంకా బ్రతికేఉంది
(శ్రీసాయిబానిస నిజ జీవితములోని అనుభవాలు)
సేకరణ : ఆత్రేయపురపు త్యాగరాజు
3. డిసెంబరు నెల రాత్రి చలిలో మాతృప్రేమ
అది 1994వ.సంవత్సరం డిసెంబర్ నెల, తారీకు గుర్తు లేదు.
నేను, మాసాయిదర్బార్ సభ్యులందరం కలిసి ఆ రాత్రి రోడ్ ప్రక్కన గట్టుమీద నిద్రించే బీదవారికి చలిబారినుండి కాపాడుకోవడానికి ఉన్ని దుప్పట్లు పంచాలని నిర్ణయించుకొన్నాము.
ఆరోజు రాత్రి 11 గంటలకు రెండు కార్లలో మేము 100 ఉన్నిదుప్పట్లు తీసుకొని బయలుదేరాము. ముందుగా సికింద్రాబాద్ స్టేషన్ ప్రాంతంలో ఫుట్ పాత్ ల మీద నిద్రిస్తున్నవారిని లేపి వారికి ఉన్నిదుప్పట్లు ఇచ్చాము.
.
ఆ తర్వాత మెట్టుగడ్డ ప్రాంతానికి వచ్చాము. అక్కడ ఉన్న చర్చి ప్రాంతంలో ఫుట్ పాత్ ల మీద నిద్రిస్తున్నవారిలో కొందరిని లేపి దుప్పట్లు ఇచ్చాము. కొందరు గాఢ నిద్రలో ఉంటే వారిని లేపకుండా వారిపై ఉన్నిదుప్పట్లను కప్పాము. ఆ సమయంలో అక్కడ చెత్త కుండీ ప్రక్కన ఒక స్త్రీ ఫుట్ పాత్ పై నిద్రించుట గమనించి ఆస్త్రీని నిద్రలేపి ఆమెకు ఒక ఉన్ని దుప్పటీని ఇచ్చాను. ఆస్త్రీ సంతోషంగా నాకు నమస్కరించి ఆ ఉన్నిదుప్పటిని స్వీకరించింది. నేను అక్కడినుండి తిరిగి కారు ఎక్కడానికి నడవటం ప్రారంభించాను. మనసులో భగవంతునికి కృతజ్ఞతలు తెలుపుకొన్నాను. శ్రీసాయి నాచేత ఇటువంటి మానవతా కార్యక్రమము చేయించటము నా అదృష్టముగా భావించాను. ఆ సంతోషములో కారు ఎక్కుతూ నేను దుప్పటిని ఇచ్చిన స్త్రీవైపు చూసాను. నాకళ్లను నేను నమ్మలేకపోయాను. ఆ స్త్రీ నేను ఇచ్చిన కొత్త ఉన్నిదుప్పటిని నేలమీద పరచి, తన ప్రక్కనే ఉన్న మునిసిపాలిటీవారి చెత్త కుండీనుండి ఎండిన ఆకులు పైకి తీయనారంభించింది. ఇంత రాత్రివేళ ఆమె ఎందుకు ఆచెత్త కుండీలోని చెత్తను పైకి తీస్తున్నది అని ఆతృతగా ఆమెవైపే చూడసాగాను. ఆమె ఆ చెత్త మధ్యనుండి తన రెండుసంవత్సరాల కుమారుడిని పైకి తీసి ఆబాలుడిని నేను ఇచ్చిన ఉన్నిదుప్పటిలో పరుండబెట్టి సగము దుప్పటి ఆ బాలునికి కప్పింది. ఆమె తిరిగి ఆబాలుని ప్రక్కనే నేలమీద నిద్రించసాగింది. ఈసంఘటన నాహృదయాన్ని కదలించివేసింది. తల్లి తన పిల్లలకోసం చాలా త్యాగము చేస్తుంది అని పుస్తకాలలో చదివాను. ఈ రోజున ఆతల్లి చలిబాధకు తన కుమారుడు తట్టుకోలేకపోవటం చేత తన కుమారుడిని చెత్త కుండీలో ఆకులమధ్య నిద్రింపచేసింది. తనకు ఒక ఉన్నిదుప్పటి లభించగానే ఆదుప్పటిని చెత్తలో నిద్రించుతున్న తన కుమారునికి చుట్టింది.
ఇది నిజమైన మానవత్వానికి ఉదాహరణగా భావించాను. మానవతా దేవతకు నమస్కరించి కారు డిక్కీలోనుండి ఇంకొక ఉన్నిదుప్పటిని తీసుకొనివెళ్ళి ఆ స్త్రీకి ఇచ్చాను. ఆ సమయములో ఆమె కండ్లలోని తృప్తిని చూసాను. మానవతాదేవత నన్ను ఆశీర్వదించుతున్న భావన పొందాను. ఆ స్త్రీలోని మాతృప్రేమకు నమస్కరించి తిరిగి రాత్రి 2 గంటలకు ఇంటికి చేరుకొన్నాను.

దయచేసి శ్రీసాయి సత్ చరిత్ర మూడవ అధ్యాయము ఒక్కసారి చదవండి.
అందులో సాయిబాబాయొక్క మాతృప్రేమ గురించి ఈవిధముగా వివరింపబడింది.
“ఆవు తన దూడనెట్లు ప్రేమించునో మనందరికి తెలిసిన విషయమే.
దాని పొదుగెల్లపుడు పాలతో నిండియేయుండును.
దూడకు కావలసినప్పుడెల్ల కుడిచినచో పాలు ధారగాకారును. అలాగునే బిడ్డకు ఎప్పుడు పాలు కావలెనో తల్లి గ్రహించి సకాలమందు పాలిచ్ఛును. బిడ్డకు గుడ్డలు తొడుగుటయందును, అలంకరించుటయందు తల్లి తగిన శ్రధ్ధ తీసుకొని సరిగా చేయును.
బిడ్దకు ఈవిషయమేమి తెలియదుకాని తల్లి తన బిడ్డలు చక్కగా దుస్తులు ధరించి అలంకరింపబడుట చూచి అమితానందమును పొందును. తల్లి ప్రేమకు సరిపోల్చదగినదేదియు లేదు.
అది అసామాన్యము, నిర్వ్యాజము. సద్గురువులు కూడా ఈ మాతృప్రేమను వారి శిష్యులపై చూపుదురు. శ్రీసాయిబాబా అట్టి సద్గురువు. ఈపేజీని నేను శ్రీసాయి సత్ చరిత్రలో చదివినపుడెల్లా డిసెంబర్ నెల చలిరాత్రిలో చెత్తకుండీ ప్రక్కన నిద్రించుతున్న ఆ మాతృమూర్తిని గుర్తు చేసుకొంటాను. నేను ఆ మాతృమూర్తిలో శ్రీసాయిని చూడగలిగాను అనే సంతృప్తితో రాత్రి రెండుగంటల ముప్పయి నిమిషాలకు నిద్రలోకి వెళ్ళిపోయాను. ఆనిద్రలో కలగన్నాను. ఆ కలలో ఆ మాతృమూర్తిని ఆమె చిన్న కుమారుడిని చూసాను. మానవతాదేవత ఆశీర్వచనాలు పొందగలిగాను.

జై సాయిరామ్
(రేపు మరొక మానవత్వమ్)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
(రేపు మరొక మానవత్వమ్)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment