19.05.2017 శుక్రవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈనాటి సమాజములో
మానవత్వము ఇంకా బ్రతికేఉంది
(శ్రీసాయిబానిస నిజ జీవితములోని అనుభవాలు)
సేకరణ : ఆత్రేయపురపు త్యాగరాజు
2. మద్రాసులోని పెళ్ళిమండపము – ఎంగిలి బ్రతుకులు
అది 1990వ.సంవత్సరం మే నెలలో నా ఆఫీసు పని మీద మద్రాసులోని ఒక చిన్న కంపెనీని తనిఖీ చేయడానికి వెళ్ళాను.
ఆ కంపెనీ చిరునామా సరిగా లేదు.
నేను మద్రాసు నగరములోని LIC భవనం సమీపంలోని ఒక వీధిలో ఎండవేడికి తట్టుకోలేక ఒక చెట్టు క్రింద విశ్రాంతి తీసుకొంటున్నాను.
దాహం వేస్తూ ఉంది. కాని చేతిలో మంచినీరు సీసా లేదు. బాగా అలసిపోయాను. ఆ చెట్టుకు కొంచము దూరములో ఒక కల్యాణమండపం ఉంది.
అక్కడ పెళ్ళివారు మధ్యాహ్న భోజనాలు పూర్తి చేసారు. పనివాళ్ళు పెళ్ళివారి భోజనాలు అనంతరం ఎంగిలి విస్తర్లను కట్టగా తెచ్చి కళ్యాణమండపం బయట ఉన్న మునిసిపాలిటీవారు ఏర్పరిచిన చెత్త కుండీలో వేశారు. ఆ విస్తర్లలో ఉన్న ఎంగిలి మిఠాయి, మరియు అన్నము తినడానికి ఇద్దరు పిల్లలు ఆ చెత్త కుండీలోకి దిగారు. కుక్కలు రాకుండా కాపలా కాయడానికి మూడవ పిల్లవాడు ఆ చెత్త కుండీ బయట నిలబడ్డాడు. ఒక పదినిమిషాల తర్వాత చెత్త కుండీనుండి ఇద్దరు పిల్లలు ఆ ఎంగిలి విస్తర్లనుండి మిఠాయి ఉండలు, అన్నమును ఒక ఆకులో పెట్టుకొని బయటకు వచ్చారు. మూడవపిల్లవాడు దగ్గరకు వచ్చిన రెండు కుక్కలను తరిమివేశాడు. ఆ ముగ్గురు పిల్లలు ఆ ఎంగిలి ఆహార పదార్ధాలను సంతోషముగా తినసాగారు.
ఈ దృశ్యాన్ని నేను చూడలేక నాకళ్ళు మూసుకొని ఆలోచించసాగాను. నాకు ఆకలిగా ఉంది. నీరసంతో చెట్టు మానుకు ఆనుకొని నిద్రపోయాను. ఆ నిద్రలో నేను కలగన్నాను. ఆ కలలో నేను ఆ ముగ్గురు పిల్లల వద్దకు వెళ్ళి నాకు ఆకలిగా ఉంది, అన్నము పెట్టమని వేడుకొన్నాను. ఆ పిల్లలు సంతోషముతో వారు తింటున్న ఎంగిలి పదార్ధాలనుండి మిఠాయిని, పులిహారను నాకు పెట్టారు. వారు పెట్టిన భోజనముతో నాకడుపు నిండింది. నాలో శక్తి వచ్చింది. ఆ పిల్లలకు ధన్యవాదాలు తెలియచేశాను.

ఇంతలో నాకు మెలుకువ వచ్చింది.
నిద్రనుండి మేల్కొన్నాను.
నా ఎదురుగా ముగ్గురు పిల్లలు సంతోషముగా ఎంగిలి మిఠాయి ఉండలు తింటూఉన్నారు.
మరి నేను తిన్న ఎంగిలి మిఠాయి సంగతి ఏమిటి అని ఆలోచించాను.
నేను కలలో వారితో కలిసి ఎంగిలి మిఠాయిలను తిన్నాను.
ఆ పిల్లలు నన్ను చూసి చిరునవ్వు చిందించారు.
నేను ఆ పిల్లలను ఆశీర్వదించి నూతనశక్తితో తిరిగి నా ఆఫీసుపని పూర్తి చేయడానికి అక్కడివారిని నాకు కావలసిన చిరునామా తెల్పమని కోరాను.
వారు నాకు కావలసిన చిరునామా భవనము చూపించారు.
నేను అక్కడినుండి బయలుదేరి నాకు కావలసిన కంపెనీకి వెళ్ళి నా ఆఫీసు పని పూర్తి చేసుకొన్నాను.
ఇప్పటికీ ఈ సంఘటనను మర్చిపోలేదు.
ఇటువంటి సంఘటనను మనము శ్రీసాయి సత్ చరిత్రలోని 32వ.అధ్యాయములో చూడగలము.
“బాబా తన మిత్రులతో కలిసి అడవిలో భగవంతుని అన్వేషణ ప్రారంభించినపుడు వారికి ఒక బంజారావాడు తారసిల్లి ఆకలితో అన్వేషణ చేయవద్దు, తాను ఇచ్చే రొట్టెలని తినమని కోరాడు.
బాబా స్నేహితులు అహంకారముతో ఆ బంజారావాని మాట వినకుండా వెళ్ళిపోయారు.
బాబా మాత్రము ఆ బంజారావాడు పెట్టిన రొట్టెలు తిని భగవంతుని అన్వేషణ ప్రారంభించి తన గురువును కలుసుకొన్న సంఘటన తలపించింది.”
ఈ మద్రాసులోని కళ్యాణమండపములోని ఎంగిలి పదార్ధాలను తిన్న ఆపిల్లలను మర్చిపోలేకపోతున్నాను.
ఆ పెళ్ళివారు బయటకు వచ్చి ఆ ముగ్గురు పిల్లలకు భోజనము పెట్టి ఉన్నట్లయితే భగవంతుడు వారిని ఆశీర్వదించి ఉండును కదా అని తలచి నేను మద్రాసునుండి తిరిగి హైదరాబాద్ కు చేరుకొన్నాను.
ఆనాటినుండి నేటివరకు నాజీవితంలో పెళ్ళిళ్ళకు వెళ్ళటము
వధూవరులను ఆశీర్వదించి, అక్కడ పెళ్ళి భోజనము చేయకుండా ఇంటికి వచ్చి ఇంటిభోజనము చేయటము కొనసాగిస్తున్నాను.
నాకు కలలో ఎంగిలి భోజనము పెట్టిన ఆ ముగ్గురు పిల్లలలోని మానవత్వానికి మానవతాదేవతకు నమస్కరించాను.
జై సాయిరామ్
(ఈ ఆధునిక యుగంలో పెళ్ళిళ్ళల్లో విందు భోజనాలు తమ తమ హోదాకు
తగినట్లుగా ఎన్ని రకాలు తయారు చేసి వడ్డిస్తున్నారో మనమందరం
గమనించే ఉంటాము. అన్ని రకాలు ఒకేసారి ఎవరూ తినలేరని తెలుసుండీ
విందు ఏర్పాట్లు చేస్తున్నారంటే అందులో సగం పదార్ధాలు తినలేక పారేసేవే
అయిఉంటాయి. ఇంక మిగిలిన విషయాలను చెప్పడం అనవసరం. ---
త్యాగరాజు)
(రేపటి సంచికలో మరొక మానవత్వమ్ రాత్రి చలిలో మాతృప్రేమ)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)

0 comments:
Post a Comment