03.05.2017 బుధవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ
సాయి
సాయి బంధువులకు బాబావారి
శుభాశీస్సులు
శ్రీసాయి లీలా తరంగిణి
–35 వ.భాగమ్
రచనః శ్రీమతి భారం మణి ఉమా మహేశ్వర రావు
(మూల రచన : తెలుగు. ఆంగ్లంలోకి అనువదింపబడినది)
సాయి లీలాస్. ఆర్గ్ నుండి
గ్రహింపబడినది
(మరల తెలుగులోకి అనువాదమ్
చేయించినవారు బాబా)
అనువాదానికి నిమిత్త
మాత్రుడుః ఆత్రేయపురపు త్యాగరాజు
కె.పి. ఆర్. దివ్య ప్రభాస్ ఎన్ క్లేవ్, ఫ్లాట్
102, లోటస్ బ్లాక్,
నిజాంపేట, హైదరాబాద్
Mail id :
tyagaraju.a@gmail.ocm
ఫోన్ : & వాట్స్
ఆప్ : 9440375411
8143626744
మా కోడలికి బాబా చూపించిన
అధ్బుతమైన లీలలు
1987వ.సంవత్సరంలో మేము
హైదరాబాద్ శ్రీరామ్ నగర్ కాలనీలో ఉండేవాళ్ళం.
మా కోడలు చి.సౌ. నివేదిత శ్రీసాయి సత్ చరిత్ర పారాయణ చేసింది. పారాయణ పూర్తయిన రోజున ఆమె పడక గదిలో ఉన్న బాబా
ఫొటోనుంచి మంచి పరిమళపు సువాసన వచ్చింది.
మేము
వంటయింటిలో కూడా బాబా ఫొటోను పెట్టుకొన్నాము.
వంట చేసిన తరువాత బాబాకు నైవేద్యం పెడుతూ ఉంటాము. వంట ఇంటిలో ఉన్న బాబా ఫొటోనుంచి తప్ప మిగిలిన అన్ని
ఫొటోలనుండి మంచి సువాసన వెలువడుతూ ఉండటం మాకోడలికి తెలుస్తూ
ఉండేది. తనకి ఆ అనుభూతి కలుగుతూ ఉండేది. ఒకరోజు పొద్దున్న పొంగలి వండి బాబాకు నైవేద్యం పెట్టింది. కొంతసేపటి తరువాత మేము వెళ్ళి చూసినప్పుడు ఫొటోనుంచి
పరిమళం బొట్లుబొట్లుగా వస్తూ ఉంది.
మా మనుమడు చి. కళ్యాణ్
కౌశిక్ కాలు నెప్పితో బాధపడుతూ ఉండేవాడు. అది
పోలియోకి సంబంధించినదేమోనని భయపడ్డాము. మాకోడలు
బాబాను ప్రార్ధించుకుని ఆయన దయకోసం ఎదురు చూడసాగింది. శ్రీసాయి సత్ చరిత్ర పారాయణ కూడా ప్రారంభించింది. రెండురోజులలోనే మామనవడి పరిస్థితి మెరుగయింది. శ్రీసాయి సత్ చరిత్ర పారాయణ పూర్తయిన రోజున మాకోడలు
ఆరేసిన బట్టలు లోపలికి తెచ్చి మడతలు పెడుతూ ఉంది.
అప్పుడు ఆ బట్టలలోనుండి పెద్ద వెండి ఉంగరం క్రింద పడింది. ఆ ఉంగరం చాలా పెద్దదిగా ఉంది.
ఉంగరం మీద బాబా బొమ్మ, దానికి ఇరువైపులా హిందీలో
‘ఓమ్ సాయిబాబా’ అనే అక్షరాలు చెక్కబడి ఉన్నాయి.
అటువంటి ఉంగరాన్ని మేము ఎప్పుడూ చూడలేదు.
ఆ ఉంగరం దాదాపు పది గ్రాముల బరువు ఉంటుంది. బాబా ఇచ్చిన బహుమానంగా ఆ ఉంగరాన్ని మేము చాలా భద్రంగా
దాచుకొన్నాము.
1991వ.సంవత్సరం ఫిబ్రవరిలో
మాకోడలు మరొకసారి శ్రీసాయి సత్ చరిత్ర పారాయణ ప్రారంభించింది. పారాయణ పూర్తవగానే ఆ పవిత్రమయిన గ్రంధంనుండి మంచి
సువాసన వెలువడింది.
హైదరాబాద్ జూబ్లీహిల్స్
లో ఉన్న మాయింటిలో సోఫాలో బాబావారి ద్వారకామాయి ఫొటో పెట్టాము. ఒకరోజున మాకోడలు ఇంట్లో ఉన్న ఫర్నీచర్ ని పాతగుడ్డతో
దులుపుదామనుకుంది. ఫర్నిచర్ ను దులపడానికి ఉపయోగించే దుమ్ముపట్టిన గుడ్దతో బాబా ఫొటోని దులపడం ఇష్టంలేక, మొదటగా బాబా
ఫొటోని తన చీరతో తుడిచింది.
ఆతరువాత మేము బాబా ఫొటో
చూసినపుడు బాబా నుదిటిమీద, చేతులమీద, కాళ్ళమీద, కొబ్బరికాయ మీద కుంకుమ బొట్లు కనిపించాయి. మాకు చాలా ఆశ్చర్యం వేసింది.
బాబా ఫొటోని ఎన్ని సార్లు తుడిచినా ఆ కుంకుమ బొట్లు
చెరిగిపోలేదు. జిగురుతో అంటించినట్లుగా ఉండిపోయాయి. అంతకుముందు మేము బాబా ఫొటోకి బొట్టుబిళ్ళలను అంటించేవాళ్ళం. బాబాకి అవి ఇష్టం లేదని ఈ సంఘటనవల్ల తెలుసుకున్నాము. బాబా తన అయిష్టాన్ని ఈ లీలద్వారా మాకు తెలియచేశారు.
మా అబ్బాయి చి.కృష్ణకిషోర్
నియమం తప్పకుండా బాబా పూజ చేస్తూ ఉంటాడు. పూజయిన
తరువాత బాబాకు పాలు నైవేద్యం పెట్టాడు. కొంతసేపటి
తరువాత నైవేద్యం పెట్టిన పాలు తేవడానికి వెళ్ళి చూస్తే పాలగ్లాసు ఖాళీగా ఉంది. మేము బాగా పరీక్షించి చూస్తె బాబా ఫొటోమీద బాబా
పాలు త్రాగినట్లుగా పాలచుక్కలు కనిపించాయి.
తరువాత రోజు కూడా ఇదే విధంగా జరిగింది.
ఇవన్నీ బాబా చూపించిన లీలలు.
1990వ. సంవత్సరంలో మేము
షిరిడీ యాత్రకు సన్నాహాలు చేసుకుంటున్నాము.
మాకోడలు లడ్డూలు చేసింది. లడ్డూలను
తయారుచేసేటప్పుడు మాకోడలు ‘బాబాగారు జీవించి ఉన్నపుడు భక్తులందరూ మిఠాయిలను కొని బాబాకు
సమర్పించుకునేవారు, కాని ఇపుడు మేము మాత్రం ప్రయాణంలోనే ఈ లడ్డూలను ఆరగించేస్తాము కదా’
అని ఆలోచిస్తూ ఉంది. షిరిడీలో బాబాకు ఈ లడ్డూలను
సమర్పించలేకపోతున్నామే అని మనసులో కాస్త బాధపడింది. ఆవిధంగా ఆలోచించి జూబ్లీహిల్స్ లో ఉన్న మాయింటిలో
ఆ లడ్డూలను బాబాకు నైవేద్యం పెట్టింది.
ఆతరవాత
చూస్తే ఒక లడ్డూని ఎవరో కొరికినట్లుగాను, గ్లాసులో నీళ్ళు త్రాగినట్లుగాను కనిపించింది. బాబా తన కోర్కెను తీర్చినందుకు అమితంగా సంతోషించింది. దీనిని బట్టి బాబా ఒక్క షిరిడీలోనే లేరని, తన భక్తుల
హృదయాలలోను, వారున్న ప్రదేశాలలోను ఉంటారని మనకి స్పష్టంగా తెలుస్తోంది.
1977వ. సంవత్సరంలో మా
అబ్బాయి చి.కృష్ణకిషోర్ గుంటూరులో సాయిటవర్స్ లో ఒక ఫ్లాట్ కొన్నాడు క్రొత్త ఇంటిలో మేము నామజపాన్ని ఏర్పాటు చేసాము. మాకోడలు ప్రతిరోజు వంటచేసి బాబాకు నైవేద్యంగా సమర్పిస్తూ
ఉంటుంది. 1998వ.సంవత్సరంలో జనవరి పదకొండవ తారీకున
బాబా భిక్ష అడుగుతున్నట్లుగా ఉన్న ఫొటోనుండి ఊదీ వచ్చింది.
ఆఊదీలో ఒక వెండి లాకెట్, ఎండిపోయిన పుష్పం కనిపించాయి. ఆ లాకెట్ కి ఒకవైపున బాబా రాతిమీద కూర్చున్న ఫొటో,
రెండవవైపున బాబా అభయహస్తంతో ఉన్న ఫొటో ‘ఓం’ అని అక్షరం చెక్కబడి ఉన్నాయి. బాబా అనుగ్రహం తన మీద నిరంతరం ప్రసరిస్తూ ఉందనే
ప్రగాఢ విశ్వాసంతో మాకోడలు ఆలాకెట్ ని తన మెడలో ధరించుకుంది.
(రేపటి సంచికలో రావుగారి మనుమడికి బాబా దర్శనం)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment