14.05.2017 ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ
సాయి
సాయి బంధువులకు బాబావారి
శుభాశీస్సులు
శ్రీసాయి లీలా తరంగిణి
–45వ.భాగమ్
రచనః శ్రీమతి భారం మణి ఉమా మహేశ్వర రావు
(మూల రచన : తెలుగు. ఆంగ్లంలోకి అనువదింపబడినది)
సాయి లీలాస్. ఆర్గ్ నుండి
గ్రహింపబడినది
(మరల తెలుగులోకి అనువాదమ్
చేయించినవారు బాబా)
అనువాదానికి నిమిత్త
మాత్రుడుః ఆత్రేయపురపు త్యాగరాజు
కె.పి. ఆర్. దివ్య ప్రభాస్ ఎన్ క్లేవ్, ఫ్లాట్
102, లోటస్ బ్లాక్,
నిజాంపేట, హైదరాబాద్
Mail id :
tyagaraju.a@gmail.ocm
ఫోన్ : & వాట్స్
ఆప్ : 9440375411
8143626744
బాబా అనుగ్రహంతో దేవి
దర్శనమ్
నా సోదరుడు శ్రీ ఎమ్.హరగోపాల్
భీమవరంలో ఎక్జిక్యూటివ్ ఇంజనీరుగా పని చేస్తున్నాడు. మేము ఒకసారి భీమవరం వెళ్ళినపుడు అక్కడ శ్రీసాయిబాబా
మందిరానికి, మారుతి గుడికి, మావుళ్ళమ్మ గుడికి వెళ్ళాము. భీమవరంలోని గ్రామదేవత ‘మావుళ్ళమ్మగా’ చాలా ప్రసిధ్ధి.
ఆవిడ భారీ ఎత్తున అందరిచేత పూజలు అందుకుంటూ ఉంటుంది. మావుళ్ళమ్మను దర్శించుకోగానే ఆవిడ వదనంలోని దివ్యమైన తేజస్సు నన్ను కట్టిపడేసింది. వెంటనే నేను ఆమెకు భక్తితో నమస్కరించుకొన్నాను. ఎంతోమంది భక్తులు ఆమె వదనంలోని ప్రసన్నతకు, దివ్యమయిన తేజస్సుకి ఆకర్షితులవుతూ ఉంటారు.
ఆవిడ భారీ ఎత్తున అందరిచేత పూజలు అందుకుంటూ ఉంటుంది. మావుళ్ళమ్మను దర్శించుకోగానే ఆవిడ వదనంలోని దివ్యమైన తేజస్సు నన్ను కట్టిపడేసింది. వెంటనే నేను ఆమెకు భక్తితో నమస్కరించుకొన్నాను. ఎంతోమంది భక్తులు ఆమె వదనంలోని ప్రసన్నతకు, దివ్యమయిన తేజస్సుకి ఆకర్షితులవుతూ ఉంటారు.
రెండు నెలల తరువాత ఒకరోజు
రాత్రి తెలతెలవారుతుండగా నాకొక కల వచ్చింది.
ఆ కలలో నేను ఒక దేవాలయంలో నిలబడి ఉన్నాను.
సరిగ్గా గుడి ప్రవేశ ద్వారం వద్ద నాకు దేవి దర్శనమిచ్చింది. ఆమె ఎఱ్ఱటి సిల్కు చీర ధరించి ఉంది. శిరసునుంచి కాలి పాదాల వరకు బంగారు ఆభరణాలతో మెరిసిపోతూ
ఉంది. ఆమె వదనం దివ్యమయిన తేజస్సుతో ప్రకాశవంతంగా
ఉంది. ఆమెను చూడగానే బహుశ ఆవిడ ‘మావుళ్ళమ్మదేవి’
అయి ఉండవచ్చనిపించింది. భక్తితో ఆమె పాదాలకు
సాష్టాంగనమస్కారం చేసుకొన్నాను. అపుడా దేవి
నన్నిలా ప్రశ్నించింది. “నువ్వు నన్ను నాదయ కోసం ప్రార్ధిస్తున్నావు. కాని నువ్వు నాకేమి సేవ చేశావు? నేను నిన్నెందుకు
దీవించాలి?” దేవి ప్రశ్నలకు నేను శిలలా అయిపోయాను. ఒక్కక్షణం నాకు ఏమి మాట్లాడాలో తెలీలేదు. ఆ తరువాత దేవి అన్నమాటలు నిజమే అనిపించింది. నేనామెకు ఎటువంటి సేవా చేయలేదు. ఆవిధంగా ఆలోచిస్తూ నేను గుడిని, గుడిపరిసరాలని శుభ్రం
చేయడం మొదలుపెట్టాను. దానితో కల పూర్తయిపోయింది.
కొద్ది రోజుల తరువాత
భీమవరం వెళ్ళే అవకాశం వచ్చింది. మేము మావుళ్ళమ్మ
గుడికి వెళ్ళి ఆమె దర్శనం చేసుకొన్నాము. గుడంతా
భక్తులతో నిండిపోయి ఉంది. నేను గుడిని శుభ్రం
చేయలేదు. ఆయినా గాని నేను సాష్టాంగ నమస్కారం
చేసుకునే ముందు, నా చీరపమిటతో నా ముందు ఉన్న నేలని శుభ్రంగా తుడిచాను. నిజం చెప్పాలంటే ఇటువంటి దయకల తల్లికి నేను చేసినదేమీ
లేదు. ఇది నాతృప్తికోసం చేసిన చిన్న సేవ. బాబా
అనుగ్రహం వల్లనే నాకు ఈ అమ్మ దర్శనం లభించిందని నమ్ముతున్నాను.
ఇంకొకసారి నేను
ఒక గుడిలో కూర్చుని ఉన్నట్లుగా నాకు కల వచ్చింది. ఆ గుడిని సాయంత్రం నాలుగు గంటలకు మాత్రమే తెరుస్తారు. గర్భగుడి ఎప్పుడు తెరుస్తారా అని ఆశతో వేచి చూస్తూ
కూర్చున్నాను. ఇంతలో పూజనీయురాలయిన ఒక స్త్రీ
గర్భగుడిలోనుంచి నావైపుకి వస్తూ ఉంది. ఆ స్త్రీ
జరీ బోర్డరుతో ఉన్న ముదురు ఆకుపచ్చ రంగు చీరను ధరించి ఉంది. ఆమె ముఖంలోని చిరునవ్వు మనసును రంజింపచేసేలా ఉంది. ఆమె ఎవరో నాకు వెంటనే స్ఫురించింది. ఆమె సీతాదేవి.
ఎంతో ఉత్సాహంతో ‘అమ్మా సీతా’ అంటూ ఆమెవైపుకు వెళ్ళాను. ఆమె ఒక సిమెంటు బెంచీమీద కూర్చుంది. నేనామె పాదాల వద్ద క్రింద కూర్చున్నాను. ఆవిడ చాలా నిరాడంబరంగా ఉంది. ఆమె ఎంతో సౌమ్యురాలిగాను, ఉల్లాసంగాను ఉంది. ఆవిడ ఎటువంటి సిల్కు దుస్తులు విలువయిన ఆభరణాలు
ధరించలేదు. నిరాడంబరంగా ఉంది. నేనావిడ పాదాల వద్ద కూర్చుని ఉండటం వల్ల ఆమె పాదాలకు
పట్టీలు ధరించి ఉండటం చూశాను. అది నాకు బాగా గుర్తు. నేనావిడ పాదాలను నాచేతులలోకి తీసుకుని నా వేళ్లతో
వాటిని మృదువుగా స్పృశించాను. ఆవిడ నన్ను నీకేమి
వరం కావాలో కోరుకోమని అడగటానికి ముందే నేను ఆవిడని నన్ను “సుమంగళిగా” దీవించమని కోరాను. అమ్మ నవ్వింది. వారి చిరునవ్వులే నా శిరసుమీద పువ్వులను చల్లినట్లుగా
ప్రగాఢమయిన విశ్వాసంతో చాలా సంతోషించాను.
నాకు సీతామాత దర్శనం
కూడా కలిగించినందుకు సాయికి నమస్కరించుకొన్నాను.
1990వ.సంవత్సరంలో ఒక
రోజు రాత్రి నాకు కలవచ్చింది. ఆ కలలో నేను
నాభర్తతోపాటుగా గుడికి వెళ్ళాను. గుడిలో హాలులోకి
ప్రవేశించి మెల్లగా నడుస్తూ ఉన్నాను. అక్కడ
గోడల మీద చెక్కబడ్డ శిల్పాలను, వాటి అధ్భుత సౌదర్యానికి ముగ్ధురాలినై వాటినే చూస్తూ
ఉన్నాను. వాటిని ఎంతో అధ్బుతంగా చెక్కారు.
ఆ శిల్పకళా చాతుర్యాన్ని కనులారా వీక్షించడానికి తల పైకెత్తి చూస్తూ ఉన్నాను. అపుడు నాకు కొద్ది దూరంలో ఒక స్త్రీ నిలబడి ఉన్నట్లుగా
అనిపించింది. కాని నేనామెను గమనిద్దామనే భావమే
రాలేదు. నేను ఆ శిల్పకళా చాతుర్యాన్నే చూడటంలో
నిమగ్నమయిపోయాను. ఈలోగా ఆమె నాకు మరింత దగ్గరగా
వచ్చింది. నేను తలతిప్పి ఆమెవైపు చూశాను. ఆమెకు 25 సంవత్సరాల వయసుండవచ్చు. ఆమె ఎంతో అందంగాను, మంచి కళగాను ఉంది. నుదుట ఎఱ్ఱని కుంకుమ బొట్టు. కాటుక పెట్టుకున్న విశాలమయిన నేత్రాలు ఎంతో ఆకర్షనీయంగా
ఉన్నాయి. పొడవయిన నాసిక. అందమయిన చిన్న పెదవులు. చూడగానే ఆకర్షించే రూపం ఆమెది. ఆమె జరీ బోర్డరు ఉన్న తెల్లని బెనారస్ చీర ధరించి
ఉంది. జరీ మీద జరీపువ్వులు ఉన్నాయి. ఆభరణాలు ధరించి ఉండటం వల్ల చూడగానే చూచేవారి మనసులని
కట్టిపడవేసే అందం ఆమె స్వంతం. ఎవరయినా సరే
ఆమెను చూడగానే కళ్ళు తిప్పుకోలేరు.
నేనామెను తదేకంగా చూడసాగాను. నేనామెను ఆవిధంగా చూస్తూ ఉండగానే ఆమె జగన్మాతగా
మారిపోయింది. ఆమె నాలుక బయటకి వచ్చి పొడవుగా
కనపడుతూ ఉంది. ఆమె శిరసుకు ఉన్న బంగారు కిరీటం
ధగధగ మెరిసిపోతూ ఉంది. ఆమె నన్ను దీవిస్తూ
ఉన్నట్లుగా అభయహస్తంతో దర్శనమిచ్చింది. ఈ విశ్వానికంతటికి
సంరక్షకురాలయిన ఆ జగన్మాతకు సాగిలపడి నమస్కారం చేసుకొన్నాను. నేనామెను అలా చూస్తూ ఉండగానే నాకు మెలకువ వచ్చి
కల అయిపోయింది. ఏభగవంతుడయినా గాని, ఏదేవతయినా
గాని దర్శనమిచ్చి నాకు తమతమ ఆశీస్సులను అందచేశారంటే అదంతా శ్రీసాయినాధులవారి అనుగ్రహ
బలం వల్లనేనని నా నమ్మకం. నేనాయనకు ఎంతగానో
ఋణపడిఉంటాను.
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment