Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Wednesday, May 17, 2017

శ్రీసాయి లీలా తరంగిణి –48వ.భాగమ్

Posted by tyagaraju on 8:11 AM
         Image result for images of shirdi sai baba
           Image result for images of yellow rose
17.05.2017 బుధవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీసాయి లీలా తరంగిణి –48వ.భాగమ్
రచనః  శ్రీమతి భారం మణి ఉమా మహేశ్వర రావు
        Image result for images of bharam mani

(మూల రచన :  తెలుగు.   ఆంగ్లంలోకి అనువదింపబడినది)
సాయి లీలాస్. ఆర్గ్ నుండి గ్రహింపబడినది
(మరల తెలుగులోకి అనువాదమ్ చేయించినవారు బాబా)
అనువాదానికి నిమిత్త మాత్రుడుః  ఆత్రేయపురపు త్యాగరాజు
 కె.పి. ఆర్. దివ్య ప్రభాస్ ఎన్ క్లేవ్, ఫ్లాట్ 102, లోటస్ బ్లాక్,
నిజాంపేట, హైదరాబాద్
Mail id  :  tyagaraju.a@gmail.ocm
ఫోన్ : & వాట్స్ ఆప్  : 9440375411
                            8143626744
సద్గురువు శ్రీసాయిబాబా

సాక్షాత్తు పరబ్రహ్మ అవతారమయిన శ్రీసాయిబాబా సద్గురువు.  జ్ఞానాన్ని పొందిన నిజమయిన భక్తుడిని ఆధాత్మిక దారిలో నడిపించి సన్మార్గంలో జీవితం గడిపేందుకు ఆయన తోడు నీడగా ఉంటారు.  అందువల్లనే సమస్త మానవాళికి ‘సాయి రామ్’ అన్నదే మూల మంత్రం.  ఎవరయినా సరే శ్రీసాయినాధులవారు బోధించిన ఉపదేశాలను ఆచరిస్తూ సాధారణమయిన, ప్రశాంతమయిన నీతివంతమయిన జీవితాన్ని గడిపినట్లయితే, వారు భగవంతునికి చేరువగా ఉండే స్థితికి చేరుకుంటారు.  కాలక్రమేణా శ్రీసాయిలొ ఐక్యమవుతారు.


మనం నిస్సహాయ స్థితిలో ఉన్నపుడు బాబా నువ్వే దిక్కు, నాకు నువ్వు తప్ప సహాయం చేసేవారెవరూ లేరు అని త్రికరణ శుధ్ధిగా మనస్ఫూర్తిగా ప్రార్ధించినట్లయితే బాబా తక్షణ సహాయం చేస్తారు.  మనకి ప్రతి విషయంలోను మార్గదర్శకునిగా ఉండి సహాయం చేస్తారు.  నిజమయిన ప్రార్ధన చేసేవానిని అనంతమయిన విశ్వశక్తికి దగ్గరగా చేరుస్తుంది.  
                    Image result for images of cosmic power
                       Image result for images of  meditation

ధ్యానంలో నిమగ్నమయిన సాధకునిలోకి విశ్వంలోని శక్తి ప్రవేశిస్తుంది.  ఇది మనం అర్ధం చేసుకుంటే మన జీవితాలు ఫలవంతమవుతాయి.  జీవితానికి ఒక సార్ధకత ఏర్పడి నిజమయిన జీవితం అంటే ఏమిటో అర్ధమవుతుంది. మనలో చాలా మందిమి సమస్యలు వచ్చినపుడు భగవంతుని సహాయం కోసం అర్ధిస్తాము.  మన సమస్యలు తీరిపోగానే భగవంతునితో మనకు కలిగిన అనుబంధాన్ని సహాయాన్ని మర్చిపోతాము.  అంతటితో ఆయనని వదలివేస్తాము.  ఇక మన జీవితం మనది మన ఇష్టం అన్నట్లుగా లౌకిక విషయాలలో పడిపోతాము.  అనైతికంగాను, క్షణికసుఖాలకోసం, క్రమశిక్షణారాహిత్యంగా జీవితాన్ని గడిపేస్తూ ఉంటాము.  భగవంతునితో మన అవసరం తీరిపోయింది, ఇక బెంగ లేదు అన్నట్లుగా ఉంటాము.  మళ్ళీ మనకు సమస్యలు ఎదురయినప్పుడు భగవంతుడు గుర్తుకు వస్తాడు.  ఈ రకంగా ఉంటే అంతకన్నా అజ్ఞానం మరొకటి ఉండదు.  భగవంతుడు మనలని ఆదుకున్నా, ఆదుకోకపోయినా నిరంతరం ఆయనను స్మరించుకుంటూనే ఉండాలి.  ప్రపంచంలోని సుఖాలన్నిటినీ అనుభవించడం కోసమే జీవించాలి అనే భావంతో జీవితాన్ని గడిపేయకూడదు.  (ఒకసారి నేను రైల్లో ప్రయాణం చేసేటపుడు గమనించిన విషయాలు..కొంతమంది కేవలం తిండికోసమే బ్రతుకుతున్నట్లుగా వాటి గురించే మాట్లాడుకొంటూ ఉంటారు.  ఫలానా హొటల్ లో బిర్యానీ చాలా బాగుంటుంది,  కారంగా ఉన్నా కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా రకరకాల తిళ్ళ గురించే మాట్లాడుకుంటూ ఉండటం గమనించాను. ఇంటిలోను, బంధువులతోను మాట్లాడుకోవలసిన విషయాలను ఇంటిలోనే మాట్లాడుకోవాలి. అందరి ముందు అది ఏదో ఒక గొప్ప అన్నట్లుగా మాట్లాడుకుంటూ ఉంటే భగవంతుని గూర్చి తెలుసుకునే సమయం వచ్చేటప్పటికి వయసుమీరి పోతుంది. వయసులో ఉండగా ఆస్వాదించిన రుచులేమీ ముదిమి వయసులో ఏమీ అక్కరకు రావు.  రుచులను ఆస్వాదించవచ్చు.  అందులో తప్పేమీ లేదు.  కాని అదే ప్రపంచం అన్నట్లుగా ఉండకూడదని నా ఉద్దేశ్యం. కాని నలుగురిలోను, రుచుల గురించి మాట్లాడుకోకుండా కాస్త ఉపయోగకరమయిన విషయాలను మాట్లాడుకుంటే బాగుంటుందని నా ఉద్దేశ్యం.    ఏదో దేవుడి గుడికి వెళ్ళడం, దేవుడికి నమస్కారం చేసుకోవడం చేసుకుంటూ ఉండి ఉండవచ్చు.  కాని గుడిలోకి  వెళ్ళినపుడు ఎంత భక్తితో వెళ్ళాము, ఎంత భక్తిగా అక్కడ ఉన్న కాసేపు గడిపాము అన్నది ముఖ్యం.  భగవంతుడిని పూర్తిగా తెలుసుకునే సమయం వచ్చేటప్పటికి వయసు మీరిపోతుంది.  ఈ రోజుల్లో అన్ని వయసుల వారు దేవాలయాలకి వెళ్ళడం భక్తితో నమస్కరించుకోవడం అన్నీ ఉన్నాయి.  కాని నేను చెప్పేదేమిటంటే ఆ భక్తిని మనసులో నిరంతరం నిలుపుకోవాలి.  ఎవరిని కించపరచడానికి నేను చెప్పటల్లేదు. --  త్యాగరాజు)  ఈ కాలంలో ప్రపంచం చాలా వేగంగా ముందుకు పోతూ ఉంది.  ఇటువంటి సమయంలో తనను మనసావాచా కర్మణా సర్వశ్య శరణాగతి చేసినవారికి శ్రీసాయిబాబా తన చేయూతనందిస్తారు.

శ్రీసాయిబాబా దత్తాత్రేయుని అవతారమని మనకందరకూ తెలుసు.  దత్తాత్రేయులవారు తత్వ బోధకులు.  ఆధ్యాత్మికతను తెలియచేసే గొప్ప గొప్ప అధ్బుతాలను చేసి చూపారు.  
                   Image result for images of lord dattatreya
అదే విధంగా ఈ ఆధునిక యుగంలో శ్రీసాయిబాబా కూడా దత్తాత్రేయులవారిలాగానే జీవించారు.  ఈ పుస్తకం రచించడానికి గల ఏకైక లక్ష్యం ఒక్కటే.  అదేమిటంటే శ్రీసాయిబాబాకు సర్వశ్య శరణాగతి చేసినవారు ఎల్లప్పుడూ సత్యసంధతతోను, ప్రేమతోను, వివేకంతోను ఏకమయి  ఉంటారనే విషయం అర్ధం చేసుకోగలరు. మనలో చాలా మందిమి శాస్త్ర జ్ఞానానికి ఆకర్షితులమవుతూ ఉంటాము.  కాని నిజమయిన సాధకులు నిరంతరం సాయినామాన్ని జపిస్తూ తమ పాపాలని ప్రక్షాళన చేసుకుంటారు.  ఆవిధంగా తమ లక్ష్యాన్ని సాధిస్తారు.

మనమంతా కష్టాలు, కడగండ్లు, గందరగోళాలతో నిండి ఉన్న ఈ లౌకిక ప్రపంచంలో జీవిస్తున్నాము.  జంతువుల్లాగ బ్రతికే జీవితంనుండి మనలని తప్పించి, మన నిజస్థితినుండి మేల్కొలిపి శాశ్వతానందానికి దారిచూపే మన మతాన్ని చాలా సులభంగా మర్చిపోతున్నాము.  అసలు మనం ఎవరము, మనం ఏమిచేయాలి అని తెలుపగలిగే అధ్బుతమయిన శక్తి ఏదయినా ఉండాలి.  అందువల్లనే శ్రీసాయిబాబా ఏభక్తుడయితే తనని పూజిస్తూ చేసే ప్రతిపనిని తనకే అర్పిస్తారో, ఎవరియందు ద్వేషము పెంచుకోకుండా ఉంటాడో వారే నాకు ప్రియమైనవారు అని చెప్పారు.  అందరి హృదయాలను పాలించువాడను నేనే అని చెప్పారు.  రాజయినా బికారయినా జంతువులయినా, సమస్త చరాచరములలోనూ బాబా నిండి ఉన్నారనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి.

"ఆధ్యాత్మికంగా మేల్కొనవలసిన సమయం ఆసన్నమయింది.  నేను మీకు బోధించడానికి రాలేదు.  మీలో ఉన్న దైవాన్ని మేల్కొలిపి మీఆధ్యాత్మిక వారసత్వాన్ని తెలియచెప్పేటందుకే వచ్చాను.  మన జీవిత ముఖ్యోద్దేశం, భగవంతుని ప్రేమించడం, ఆయన ప్రేమను పొందడం.  మన జీవిత లక్ష్యం భగవంతునితో ఏకమవడం” అన్నారు బాబా.

ఆవిధంగా మనం సాధించుకోవాలంటే మన కోరికలను, మోసంచేసే గుణాలని, కపటత్వాని త్యజించాలి.  ఆయన తన విశిష్టమయిన రీతిలో హిందూ, మహమ్మదీయ క్రైస్తవుల మధ్య భేదభావాలని తొలగించి వారిని ఏకం చేశారు.  ఎవ్వరినీ కూడా వారివారి మతాచారాలకు అడ్డు చెప్పలేదు.  సమాధినుండే బాబా మనం చేసే ప్రార్ధనలను, విజ్ఞాపనలను ఆలకించి దయతో మనలను అనుగ్రహిస్తారు.  ఆయన జీవించి ఉన్నపుడు ఏవిధంగానయితే ఉన్నారో అదేవిధంగా ఇప్పటికీ ఆయన సమాధి చెందినా కూడా సజీవంగానే ఉండి మన  ప్రార్ధనలను జాగ్రత్తగా వింటారు.  ఈపుస్తకంలో ప్రచురించిన మాఅనుభవాలే దానికి బలమయిన తిరుగులేని సాక్ష్యం.

మనమందరం మానసిక భ్రమలనుండి, ద్వంద్వప్రవృత్తినుండి బయట పడాలి.  వివేకంతో అత్యున్నత స్థానానికి చేరుకుని యదార్ధమయిన పరమానందాన్ని సాధించాలి.

అందుచేత మనకి మోక్షాన్ని ప్రసాదించమని మనమందరం పరిపూర్ణమయిన విశ్వాసంతో శ్రీసాయిబాబాను ప్రార్ధించాలి.

శ్రీసాయిబాబాకు నాసాష్టాంగ ప్రణామాలు.
(శ్రీసాయిలీలా తరంగిణి సమాప్తమ్)

( సాయిబానిస శ్రీరావాడ గోపాలరావుగారిని ఆయన పుట్టిన రోజున మానవత్వముపై ఒక పుస్తకము రచించమని శ్రీసాయిబాబా ఆదేశించారు.  రేపటినుండి దానిని ప్రచురిస్తున్నాను.)

(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)

Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List