23.05.2017 మంగళవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈనాటి సమాజములో
మానవత్వము ఇంకా బ్రతికేఉంది
(శ్రీసాయిబానిస నిజ జీవితములోని అనుభవాలు)
సేకరణ : ఆత్రేయపురపు త్యాగరాజు
6. రాత్రి 10 గంటలకు ఆకలితో ఉన్న ఓవ్యక్తికి అన్నము
పెట్టుట
అది
1996వ.సంవత్సరం అక్టోబర్ నెల తారీకు గుర్తు లేదు.
రాత్రి 10 గంటల సమయం వీధి గుమ్మంలో నేను నా భార్య కూర్చుని కబుర్లు చెప్పుకొంటున్నాము. ఆ సమయంలో ఒక పల్లెటూరి వ్యక్తి వచ్చాడు. అతని వయస్సు సుమారు 60 సంవత్సరములు ఉంటుంది.
అతను పంచె, తెల్ల చొక్కా తలమీద పాగ చుట్టుకుని ఉన్నాడు. చేతిలో ఒక సంచి ఉంది. అతను మాముందుకు వచ్చి తనది దగ్గరలో ఉన్న ఒక పల్లెటూరు అని, తను ఎక్కి వెళ్లవలసిన బస్సు వెళ్ళిపోయిందని చెప్పాడు. రేపు ఉదయం 6 గంటలవరకు బస్సు లేదని, దయ చేసి ఇంత అన్నం పెట్టండి, ఆకలితో ఉన్నానని చెప్పాడు. నేను నాభార్య చాలా ఆశ్చర్యపోయాము. బాబా మనలను పరీక్షించటానికి ఈ రాత్రి సమయంలో భిక్షకు వచ్చారా అనే భావన కలిగింది. నాకంటే ముందుగా నాభార్య ఆ వ్యక్తిని ఉండమని చెప్పండి మనం భోజనాలు చేసిన తర్వాత ఇంకా అన్నం మిగిలి ఉంది, దానితోపాటు కూర మరియు పెరుగు ఉంది ఈ వ్యక్తికి భోజనం పెట్టి పంపిద్దాము అంది. నాభార్య మాటలకు నేను ఆశ్చర్యపడ్దాను. సంతోషించాను. కూడా. ఆ వ్యక్తిని కాళ్ళు చేతులు కడుక్కోమని ఒక చిన్న బకెట్ తో నీళ్ళు ఇచ్చాను. అతను సంతోషముతో కాళ్ళు చేతులు కడుగుకొని వీధి వసారాలో కూర్చొన్నాడు. నాభార్య వానికి కడుపునిండా కూర, అన్నము, ఆవకాయ పచ్చడి, పెరుగుతో భోజనం పెట్టింది. ఆ వ్యక్తి భోజనం పూర్తి చేసి విస్తరాకును తీసివేసి చేతులు కడుగుకొని మాముందు వినయంగా నిలబడి, “నా ఆకలి తీరింది. మీయింటిలో ఎప్పుడూ తిండికి బట్టకు లోటుండదు. పది కాలాపాటు సుఖంగా వర్ధిల్లమని” చెప్పి వెళ్ళిపోయాడు.

ఆ పల్లెటూరివాని
ఆశీర్వచనాలు ఈనాటికీ నా చెవులలో వినిపిస్తూనే ఉంటాయి. ఆనాటినుండి నేటివరకు నాయింట అన్నవస్త్రాలకు లోటు
లేకుండా జీవితం సాగిపోతున్నది. ఈ సంఘటనకు గుర్తుగా
నేను మాసాయిదర్బారు సభ్యులము సాయిమందిరాలలో అనేక సార్లు అన్నదానాలు చేసాము. సాయి మందిరాలకే పరిమితము కాకుండా సికింద్రాబాద్
లో ఉన్న కుష్టురోగుల కాలనీలకు వెళ్ళి అక్కడ అన్నదానాలు చేసాము. ఒకసారి సనత్ నగర్ దగ్గర ఉన్న బల్కమ్ పేట కుష్టురోగుల
కాలనీలో జరిగిన సంఘటన మీకు నేను రాయబోయే సంఘటనలలో తెలియచేస్తాను. బాబా అన్నదానప్రియుడు అని చెప్పడానికి నేను ఆ సంఘటనను
ముందు పేజీలలో తెలియ చేస్తాను.
ఇంక సాయి సత్ చరిత్ర 38వ.అధ్యాయము చదువుదాము. అన్నదానం గురించి చెప్పిన విషయాలు. “కలియుగములో దానము చేయవలెనని శాస్త్రములు ఘోషించుచున్నవి. దానములలోకెల్ల అన్నదానమే శ్రేష్టమైనది”.
బాబా ద్వారకామాయిలో రెండు గుండిగలతో వంటపదార్ధములు తయారుచేసి బీదలకు, మరియు తన భక్తులకు అన్నదానము చేసి చూపించారు. మరి సాయి భక్తులు సాయి చూపిన బాటలో ప్రయాణము చేయాలి.
జై
సాయిరామ్
శ్రీసాయి
సత్ చరిత్ర 38వ.అధ్యాయమ్ ఓ వి. 17 - "సమయా సమయాలలో
ఎప్పుడైనా సరే వచ్చిన అతిధులను గృహస్థులు అన్నదానంతో సంతుష్టి పరచాలి. అన్నం పెట్టకుండా అతిధులను తిప్పి పంపివేస్తే దుర్గతిని
ఆహ్వానించుకున్నట్లే. "
ఓ.వి. "18 వస్త్రాది వస్తువుల దానంలో యోగ్యతను చూడవచ్చు.
అన్నదానంలో పాత్రతను చూడనవసరం లేదు.
ఎవరు ఎప్పుడు గుమ్మం వద్దకు వచ్చినా సరే వారికి అన్నం పెట్టకుండా అనాదరం చేయటం
మంచిది కాదు."
ఈ సందర్భంగా 18.03.2016 న ప్రచురించిన శ్రీమతి కృష్ణవేణి చెన్నై గారి బాబా లీల "భక్త శబరి???భక్తి పరీక్షా??? ఒక్కసారి గుర్తుకు తెచ్చుకొనండి. చదవనివారుంటే క్రింద లింకు ఇస్తున్నాను. చదవండి.
http://telugublogofshirdisai.blogspot.in/2016/03/blog-post_18.html
(రేపటి సంచికలో మానవసేవే మాధవ సేవ)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)

0 comments:
Post a Comment