26.05.2017 శుక్రవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈనాటి సమాజములో మానవత్వము ఇంకా బ్రతికే ఉంది – 8 & 9
శ్రీ సాయిబానిస నిజ జీవితములోని అనుభవాలు)
సంకలనం : ఆత్రేయపురపు త్యాగరాజు
8. అనాధ ప్రేత సంస్కారము
శ్రీసాయి సత్ చరిత్ర 31వ.అధ్యాయములో మేఘశ్యాముడి గురించి వివరాలు చదవండి. మేఘశ్యాముడు బాబాకు అంకిత భక్తుడు. అతను బాబా సమక్షములో తన 35వ.సంవత్సరములో మరణించాడు. షిరిడీలో
అతనికి బంధువులు ఎవరూ లేరు. బాబా సేవలోనే తన జీవితాన్ని సార్ధకం చేసుకొన్నాడు. ఒంటి కాలుపై నిలబడి బాబాకు హారతి ఇచ్చిన మహానుభావుడు. అటువంటి మేఘశ్యాముడు మరణించినపుడు బాబా చిన్న పిల్లవానివలే దుఃఖించి అతని శవమువెంబడి స్మశానమువరకు వెళ్ళి అక్కడ అతని పార్ధివ శరీరానికి అంతిమసంస్కారాలు చేయించి, సాయిభక్తులు కూడా అనాధప్రేత సంస్కారం చేయవలసినది అని ఒక మంచి సందేశాన్నిచ్చారు.
ఈమధ్య కాలములో మాబంధువులలో ఒక స్త్రీ కేన్సరు వ్యాధితో బాధపడి మరణించింది. ఆమె దహన సంస్కారాలు చేయడానికి ఆమె సవతిపిల్లలవద్ద కావలసినంత ధనం లేదు. అక్కడి పరిస్థితిని నేను అర్ధము చేసుకొని ఆమె పార్ధివశరీరం దహనానికి కావలసిన ధనమును సమకూర్చి ఆమె దహన సంస్కారాలు పూర్తిచేయించాము. ఈసంఘటన తర్వాత నేను అనేకమంది అంత్యక్రియలకు వెళ్ళాను. మనము వివాహ వేడుకలకు వెళ్ళి అక్కడి పెండ్లివారికి బహుమానాలు ఇస్తాము. మరి మనిషి చనిపోతే అతని అంతిమ సంస్కారాలకు వెడతాము. పూలమాలలువేసి ఆ చనిపోయిన వ్యక్తికి శ్రధ్ధాంజలి ఘటిస్తాము. ఈ పూలమాలలను స్మశానములో తీసి బయట పారవేస్తారు. అదే మనము ఆ పూలమాలల బదులు ఒక మంచి చీరగాని, పంచెలచాపు గాని ఆ శరీరము మీద కప్పిన స్మశానములో వాటిని కాటికాపరి తీసుకొని తన ఇంటిలో వాడుకొంటాడు. ఈవిధముగ మనము ఆచనిపోయినవారి పేరిట వస్త్రదానము చేసినవారం అవుతాము. నేను ఈపద్ధతిని గత నాలుగు సంవత్సరాలనుండి పాటిస్తున్నాను.
శ్రీసాయిభక్తులందరము మేఘశ్యాముని జీవితాన్ని గుర్తు చేసుకొంటూ ఈపధ్ధతిని పాటించి శ్రీసాయి చూపిన మార్గములో మనము ప్రయాణము చేద్దాము. సమాజంలో ఇంకా మానవత్వము బ్రతికే ఉంది అని నిరూపించుదాము.
జై సాయిరామ్
9. 24.04.2017 నాడు శ్రీసాయి ప్రసాదించిన అనుభవం
శ్రీసాయి సత్ చరిత్ర 40వ.అధ్యాయమును ఒక్కసారి గుర్తు చేసుకొందాము. శ్రీసాయి
1917 వ.సంవత్సరం హోలీ పండగ తెల్లవారుజామున హేమాద్రిపంతుకు కలలో చక్కని దుస్తులు ధరించిన సన్యాసి రూపములో దర్శనము ఇచ్చి, హేమాద్రిపంత్ ఇంటికి మధ్యాహ్నము భోజనానికి వస్తానని తెలియచేసారు. భోజన సమయానికి ముందుగా ఒక పటం రూపంలో శ్రీసాయి వచ్చి తన మాటను నెలబెట్టుకొన్నారు.
ఇటువంటి అనుభవం నాకు 24.04.2017 న కలిగింది. శ్రీసాయి తాను జీవించి ఉండగా తన భక్తులను ఏవిధంగా అనుగ్రహించారో ఇప్పటికీ అదే రీతిలో అనుగ్రహిస్తున్నారు అని తెలుస్తోంది.
ఇటువంటి అనుభవం నాకు 24.04.2017 న కలిగింది. శ్రీసాయి తాను జీవించి ఉండగా తన భక్తులను ఏవిధంగా అనుగ్రహించారో ఇప్పటికీ అదే రీతిలో అనుగ్రహిస్తున్నారు అని తెలుస్తోంది.
అది 24.04.2017 (నాపుట్టిన రోజు) తెల్లవారుజామున బాబా మాఆఫీసులోని సీనియర్ మేనేజరు సర్దార్ అలువాలియా రూపంలో దర్శనం ఇచ్చి, తాను సాయంత్రం నాయింటికి ఇడ్లి దోశ తినడానికి వస్తానని మాట ఇచ్చారు.
శ్రీ అలువాలియా నాకు మంచి స్నేహితుడు ఆయన రెండు సంవత్సరాల క్రితం కాలము చేసారు. అటువంటి అలువాలియాగారు నాయింటికి నాపుట్టిన రోజు సందర్భముగా ఇడ్లి, దోశ తినడానికి ఎలాగ వస్తారు అని ఆలోచించసాగాను. బాబా హేమాద్రిపంతుకు సన్యాసి రూపంలో దర్శనము ఇచ్చి, తాను పటం రూపంలో హోళీ పండగనాడు భోజనానికి వచ్చారే, మరి నావిషయములో చనిపోయిన నాస్నేహితుడు సర్దార్జీ అలువాలియా రూపంలో రాకపోయినా వేరే యింక ఎవరి రూపంలోనైన వస్తారు అనే నమ్మకంతో ఎదురు చూడసాగాను. నేను నాపుట్టినరోజుకు ఎవరినీ ఆహ్వానించలేదు. ఎవరైన వస్తే తినడానికి వీలుగా సమోసాలు, రస్ మలయ్, పుల్లారెడ్డి నేతిమిఠాయి, మరియు కూల్ డ్రింక్ తెప్పించి ఉంచాను.
శ్రీ అలువాలియా నాకు మంచి స్నేహితుడు ఆయన రెండు సంవత్సరాల క్రితం కాలము చేసారు. అటువంటి అలువాలియాగారు నాయింటికి నాపుట్టిన రోజు సందర్భముగా ఇడ్లి, దోశ తినడానికి ఎలాగ వస్తారు అని ఆలోచించసాగాను. బాబా హేమాద్రిపంతుకు సన్యాసి రూపంలో దర్శనము ఇచ్చి, తాను పటం రూపంలో హోళీ పండగనాడు భోజనానికి వచ్చారే, మరి నావిషయములో చనిపోయిన నాస్నేహితుడు సర్దార్జీ అలువాలియా రూపంలో రాకపోయినా వేరే యింక ఎవరి రూపంలోనైన వస్తారు అనే నమ్మకంతో ఎదురు చూడసాగాను. నేను నాపుట్టినరోజుకు ఎవరినీ ఆహ్వానించలేదు. ఎవరైన వస్తే తినడానికి వీలుగా సమోసాలు, రస్ మలయ్, పుల్లారెడ్డి నేతిమిఠాయి, మరియు కూల్ డ్రింక్ తెప్పించి ఉంచాను.
సాయంత్రం ఆరు గంటలు కావచ్చింది. నాకుమార్తె టాక్సీలో బంజారహిల్స్ లోనున్న తన ఇంటినుండి బయలుదేరి దారిలో ఒక పూలగుత్తిని కొంది. ఆసమయంలో ఆటాక్సీ డ్రైవరు ఈపూలగుత్తి ఎవరికోసం మేడమ్ అని అడిగినాడట. నాకుమార్తె యిది నాతండ్రిగారి కోసం ఈరోజు ఆయన పుట్టినరోజు అని చెప్పిందిట. నాకుమార్తె 7 గంటలకు నాయింటికి చేరింది. ఆ పూలగుత్తిని నాకు ఇచ్చి నా ఆశీర్వచనాలు తీసుకొంది.
ఆమె వెనకాలే ఆటాక్సీ డ్రైవరు వచ్చి నాకు జన్మదినశుభాకాంక్షలు తెలియచేసాడు. నేను ఎవరిని నాపుట్టినరోజుకు పిలవలేదు. ఈ టాక్సీడ్రైవరు వచ్చి నాకు జన్మదినశుభాకాంక్షలు తెలియపర్చసాగాడు. నేను సంతోషముతో అతనిని కౌగలించుకొని అతని పేరు అడిగాను. తన పేరు ముక్తార్ అని తను హైదరాబాద్ పాతబస్తీలోని ముస్లిమ్ సాంప్రదాయానికి చెందిన వ్యక్తినని, ఈరోజు మీఅమ్మాయి మీగురించి పూల బుకే (పూలగుత్తి) కొంటున్న సమయంలో మీదర్శనం చేసుకోవాలనే కోరిక కలిగింది, అందుచేతనే మీయింటిలోకి వచ్చి మిమ్మలని అభినందించాను అన్నాడు. ఒక్కసారిగా, బాబా తెల్లవారుజామున నాయింటికి సర్దార్ అలువాలియా రూపంలో వస్తానని మాట ఇచ్చి, తన మాటను నిలబెట్టుకోవడానికి శ్రీముక్తార్ (టాక్సీడ్రైవర్) రూపంలో వచ్చారా అని భావించి, అతనితో కలసి నాపుట్టినరోజు పండుగను గడిపాను. అతను నాతోపాటు, సమోసాలు, రస్ మలాయ్ తింటూ ఉంటే, బాబా తానే స్వయంగా ఇడ్లి దోశ తింటున్న అనుభూతిని నాకు ప్రసాదించారు. బాబా ఒక హిందువుగా కలలో దర్శనము ఇచ్చి ఒక ముస్లిమ్ గా నాయింటికి వచ్చి నన్ను ఆశీర్వదించి వెళ్ళారు అనే భావనతో రాత్రి అంతా ఆలోచించాను. రాత్రి కలలో శ్రీసాయి ముక్తార్ రూపంలో దర్శనము యిచ్చి తను తన మాటను నిలబెట్టుకొన్నానని చెప్పారు.
జై సాయిరామ్
(రేపటినుంచి బాబా శ్రీ భారం ఉమామహేశ్వరరావు గారికి
ప్రసాదించిన శ్రీసాయి తత్త్వ సందేశములు)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment