03.06.2017 శనివారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
బాబావారు ప్రసాదించిన మరికొన్ని
సందేశాలు
శ్రీ సాయితత్త్వ సందేశములు
(voice of Sai Baba)
శ్రీసాయి తత్త్వసందేశములు
– 8 వ.భాగమ్
25. 21.08.1992 శ్రీ కృష్ణాష్టమి రోజు రాత్రి 10 గంటలకు
శ్రీసాయినాధుడు యిచ్చిన సందేశము.
నీ సమస్యలు తీరలేదని
బాధపడుచున్నావు. ఒకటి సవ్యముగా జరుగు అవకాశము
కలదు. రెండవదానికి మీ స్వయం కృషితో శ్రధ్ధతో
ప్రయత్నించిన కొంత వరకు సఫలమగును.
ఒక భక్తురాలు తాను వ్యాపారము
తనవారితో కలసి పెట్టవచ్చునా అని నీ సలహా కొరకు వచ్చినారు. కాని తనవారనుకొనే వారే తనను మోసము చేసే అవకాశము
కలదు. తన పర్యవేక్షణ సర్వదా వున్న, తాను రంగములోనికి
దిగవచ్చు.
ఇంకొక నా భక్తురాలు కుమారుడు
కనిపించుటలేదని వేదన పడుచున్నది. అతను జీవించెయే
యున్నాడు. కాని అతని క్షేమము కొరకు నీవు లక్ష
పర్యాయములు నా నామమును, 25 వేల పర్యాయములు గాయత్రీ మంత్రము, 15 వేల పర్యాయములు సుబ్రహ్మణ్యేశ్వరస్వామి
మూల మంత్రము జపించు.
నా భక్తుడు పక్షవాతముతో
బాధపడుచున్నాడు. అతని సంరక్షణార్ధమై నీకు పాశుపతాస్త్ర
మంత్రమును చెప్పుచున్నాను. ఈ మంత్రము చాలా
రహస్యమైనది గోప్యమైనది. ఇతరులకు ఎవరికిని చెప్పరాదు. దీనిని ప్రతి నిత్యము జపించిన అతనికే గాక, మీ అందరికి
కూడా సంరక్షణ పాశుపతాస్త్ర మంత్రము యొక్క విలువ. దాని మహత్యము ఎవరికిని తెలియదు.
ఇతని అనారోగ్యమునకు కారణము,
అతనికి కావలసినవారు, అతనిని క్షీణదశకు తీసుకొని వచ్చుటకు, అతని ఆశ్రమములోనివారే దుష్టప్రయోగము
చేసినారు. దాని విరుగుడుకు వారి గురువుగారి
సలహా పొందమని చెప్పు. ఈ పాశుపతాస్త్ర మంత్రము
అతనికి సహకరించును.
నీ రచన ప్రతులను యిచ్చినవారి
దగ్గరనుంచి సేకరించిన తరువాత ఈ కార్యమును మొదలుపెట్టు. నేను వ్రాయించిన గ్రంధమును సవరించుటకు ఎవరికిని
హక్కు లేదు. అందులోని ప్రతి పదము వేదాంతసారము. దానిని గ్రహించుటలో మీ బుద్ధి ఉపయోగించండి.
పాశుపతాస్త్ర మంత్రము
పొరపాటునైనా ఎవరితోను నోరు జారవద్దు. దానిలోని
విశేషము నీకు తెలియదు. ఆ మంత్రమును మరియొకసారి
చెప్పుచున్నాను. జాగ్రత్తగా గ్రహించు. తెలుసుకొని మనస్సులో హత్తుకో. ఈ మంత్రము మీకు జగద్రక్ష. అర్హతగలవారికి ఈ మంత్రముయొక్క ఫలితము కనపడును. మనస్ఫూర్తిగా పఠించినప్పుడే దాని ప్రభావము కనపడును. ఈ మంత్రము కృష్ణభగవానుడు అర్జునునకు ఉపదేశించిన
మంత్రము.
పక్షవాతము వచ్చిన భక్తుడు
భయపడనవసరము లేదని చెప్పు. ఎవరి కర్మ వారు అనుభవించక
తప్పదు. అది బ్రహ్మనుదుటపై వ్రాసిన వ్రాత ఎవరు
తప్పించలేరు.
పాశుపతాస్త్ర మంత్రము
యితరులకు తెలియరాదు. అందువలన నీకు ఒక్కనికే
ఉపదేశించినాను. దానిని కడుజాగరూకతతో నిత్యము
జపించు.
26. 25.08.1992 రాత్రి 11 గంటలకు బందరులో డా.శ్రీ జి.వి.రత్నంగారి
పూజా గృహములో శ్రీసాయి యిచ్చిన సందేశము.
మీరు సకలము ఎరుగుదుమని,
జ్ఞానులమని, యితరులకంటే అధికులమని, అసాధారణ ప్రజ్ఞావంతులమని భావన రానివ్వకండి. మీరు ఎంత తెలివిగలవారైనా దైవ భీతి లేకపోయినచో ఏమియును
సాధించలేరు. అసాధారణ ప్రజ్ఞ లభ్దికై ప్రాకులాడవద్దు. ఆత్మోధ్ధారణకు పనికిరాని విద్యలు వ్యర్ధము. బృహత్తర, మహిత్ర, పవిత్ర గ్రంధములను చదివినంత మాత్రమున
ప్రయోజనము లేదు. గోప్యములగు వాటిని గురించి
వాదోపవాదములు చేయరాదు. అవసరమైనవాటిని విడచి
హానికరములైన విషయములందు కల్పించుకొనుట తెలివితక్కువ తనము. స్వానుభవదూరులైన తార్కికులతో వాదము ప్రయోజన శూన్యము. మతాచారాడంబరములు లేక, నిస్వార్ధముగా సేవ చేయుచు,
కీర్తి ప్రతిష్టలకై ప్రాకులాడక, త్యాగబుధ్ధి కలిగి ఆధిక్యతను ప్రకటించుకొనక ప్రపంచ
కోరికలను తృణప్రాయముగా చూచుచు, ఆధ్యాత్మిక అభ్యున్నతి కొరకై అన్వేషిస్తూ, దైవచింతన
తత్పరులై, బాహ్యవ్యాపారములను త్రోసిపుచ్చి, ఆత్మబలము వృధ్ధి చేసుకొని, పరతత్వము, సత్య
వస్తువంటే ఏమిటో తెలుసుకొని, సకలమును ఏకముగా చూచుచు, అంతర్ముఖులై నిరాడంబరులై, ఋజుమార్గవర్తనులగుదురో, అట్టివారు దైవ పరమ రహస్యమును గ్రహించుటయే గాక, జ్ఞాన జ్యోతిని కూడా
చూడగలరు.
నన్ను నమ్మి నా పాదారవిందములను
ఆశ్రయించినవారికి, సకలము నానుండియే యుత్పన్నమై, ప్రశాంతతకల్గి, నా దర్శన భాగ్యము లభించును. ప్రేమ, సేవ, విధేయత, యివి మీ జీవితాశమయమని భావించి,
వాటిని పాటించండి. ఇవియే నాప్రేమామృతమైన సిధ్ధాంతములు. ఇవే సకల మతములలోని సారాంశము. ఏకార్యము సాధించవలయునన్న పట్టుదల ముఖ్యము.
27. విశాఖపట్నంలో డాక్టరు
వెంకట్రావుగారి పూజా మందిరములో విజయదశమి రోజు సాయంత్రము 4.20 గంటలకు వచ్చిన సందేశము.
నీకు ఎన్ని సందేశములు
యిచ్చినను, అనుభూతులు చూపినను. అవివేకమును పోగొట్టుకొని, వివేకమును పొందలేకపోవుచున్నావు. నా నిజస్వరూపముతో నీకు అనేక పర్యాయములు దర్శనము
యిచ్చినను, నేను యీరోజు సమాధి చెందినానని దుఖించుచున్నావు. నేను ఎవరో, నాశక్తి ఏమిటో యిదివరలో ఎన్నో పర్యాయములు
చెప్పియున్నాను. దాని గురించి నేను నీతో వ్రాయించుచున్న
గ్రంధములో విపులముగా వివరించియున్నాను. కాని,
అది నీమనస్సునందు హత్తుకొనుటకు ప్రయత్నం చేయుటలేదు.
నాకు జననమరణములు లేవని
గ్రహించు. నేనే పరాశక్తిని, జగన్మాతను, ఈ జగత్తు
సృష్టికి కారకుడను. జగత్తుకు ఆధారభూతమైన నిత్యతత్త్వమైన
చైతన్యము పొందవలయునంటే, మీ చిత్తము మీద యున్న మాయను తొలగించుకొనండి. సంసారవాసనలు వికారములను తొలగించుకొన్నప్పుడే, మాయను
తొలగించుకొనగలరు. నిత్యశుధ్ధ, బుద్ధ ఆత్మతత్త్వము
ఎన్నటికి జగత్తుగా పరిణమించదు. అన్నింటికి
ఆశ్రయ భూతమగు చైతన్యమైన ఆత్మను ఆశ్రయించండి.
చైతన్యమైన ఆత్మయే పూర్ణరూపమున వ్యాపించియున్నది.
ఈ పూజా గృహ స్వంతదారునికి
తన శక్తిని బట్టి బీదలకు అన్నదానము, వస్త్రదానము చేసి, గాణుగాపూర్ లో స్నానమాచరించి,
ఔదుంబర వృక్షము చుట్టూ ప్రదక్షిణలు చేసి, అచ్చట బిక్ష స్వీకరించమని చెప్పు.
ఈ దృశ్యమాన ప్రపంచమంతయు
నిత్యమైనది, స్థిరమైనది కాదని గ్రహించండి.
(ఇంకా ఉన్నాయి)
(సర్వం శ్రీసాయినాధాప్రణమస్తు)
0 comments:
Post a Comment