28.07.2017 శుక్రవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ
సాయి
సాయి బంధువులకు బాబావారి
శుభాశీస్సులు
మన సద్గురువయిన శ్రీ
సాయిబాబాకు అత్యంత ప్రియతమ భక్తుడయిన శ్రీ మాధవరావు దేశ్ పాండే (శ్యామా) గురించి పూర్తిగా
తెలుసుకుందాము. మనకు తెలియని ఎన్నో విషయాలు
ఈ వ్యాసం ద్వారా తెలుసుకోవచ్చు. బాబాకు శ్యామా
అంటే ఎందుకంత అభిమానమో ఈ వ్యాసమ్ చదివితె మనకర్ధమవుతుంది. ఈ వ్యాసం రెండవ భాగమ్ శ్రీసాయి లీల ద్వైమాస పత్రిక
మే - జూన్ 2006 సంచికలో ప్రచురింపబడింది.. మరాఠీ మూలం
శ్రీమతి ముగ్ధా దివాద్కర్. ఆంగ్లంలోకి అనువాదమ్ శ్రీ సుధీర్
తెలుగు అనువాదమ్: ఆత్రేయపురపు
త్యాగరాజు
మాధవరావు దేశ్ పాండే (శ్యామా) - 6 వ.భాగమ్
బాబా మహాసమాధి చెందిన
తరువాత, మాధవరావు 23 సంవత్సరాలపాటు వైద్య వృత్తిలోనే కొనసాగాడు. భక్తుల యొక్క అవసరాలను, యోగక్షేమాలను చూసుకుంటూ
వుండేవాడు. భక్తులందరూ ఎంతో ఆసక్తితో బాబా
గురించి అడుగుతూ ఉండేవారు. వారందరికీ బాబా
లీలలను వర్ణించి చెబుతూ ఉండేవాడు. మహల్సాపతి,
తాత్యాసాహెబ్ లే కాకుండా బాబా సాన్నిధ్యంలో ఎక్కువ సమయం గడిపిన మరొక వ్యక్తి మాధవరావు
ఒక్కడే అని చెప్పడం సమయోచితంగా ఉంటుంది.
బాబాకు అంకిత భక్తులు
ఉన్నారు. కాని వారిలో బాబాకు మాధవరావుకు ఇద్దరి మధ్య
ఉన్న ప్రేమానురాగాలు ఒక విధంగా అద్వితీయమైనవని చెప్పాలి. బాబాకు మాధవరావుకు మధ్య విడదీయరాని అంతటి గట్టి
అనుబంధం ఏవిధంగా ఏర్పడిందనే విషయం గురించి తెలుసుకోవాలని బాబాకు అంకిత భక్తుడయిన బాలాసాహెబ్
దేవ్ కి, చాలా ఆసక్తిగా ఉండేది.
దానికి గల కారణాలను తెలుసుకోవడానికి
శ్రీసాయి సత్ చరిత్రను బాగా అధ్యయనం చేసి పరిశోధించాడు. మాధవరావుకి బాబా దగ్గర అంత చనువుగా ఉండటానికి గల
కారణం, అటువంటి భక్తి వైభవం (భక్తి సంపద) కలిగి ఉండటానికి అతను ఏవిధంగా అదృష్టవంతుడు,
మాధవరావు చెప్పినవన్నిటికీ చాలా విషయాలలో బాబా ఎందుకని తమ అంగీకారాన్ని తెలిపేవారు?
ఇటువంటివాటినన్నిటినీ పరిశోధించాలనుకుని శ్రీసాయి సత్ చరిత్రను ఆమూలాగ్రం నిశితంగా
పరిశీలించాడు.
ఇవన్నీ తెలుసుకోవడం కోసం
బాలాసాహెబ్ మాధవరావు జీవితాన్ని కూడా బాగా అధ్యయనం చేశాడు. బాలా సాహెబ్ అడిగిన మీదట, బాలా సాహెబ్ దేవ్ కు తన జీవిత చరిత్రను వివరంగా చెప్పదలచి, ఏప్రిల్ 2వ.తేదీ 1934 వ.సంవత్సరంలో మాధవరావు, బాబా సమాధిముందు రెండు చీటిలు
వేసి బాబా అనుమతిని పొందాడు.
మొట్టమొదటి రోజులలోనే
బాబా మాధవరావుని ‘శ్యామా’ అనీ, మసీదును ‘ద్వారకామాయి’ అని పిలిచేవారు. ఆవిధంగా బాబా పిలవడానికి వెనుక ఏదో కారణం వుండి
ఉండవచ్చనిపించింది బాలా సాహెబ్ కి. అతను బాగా
అధ్యయనం చేసిన తరువాత శ్రీకృష్ణునికి, అర్జునునికి మధ్య ఉన్న సంబంధం, బాబాకు, మాధవరావుకు
మధ్య ఉన్న సంబంధం రెండిటికీ పోలికలు ఉన్నాయని గమనించాడు.
*భగవద్గీత 10వ.అధ్యాయంలోని
37 వ.శ్లోకాన్నే కనక గమనించినట్లయితే శ్రీకృష్ణుడు పాండవులలో తానే అర్జునుడినని (ధనంజయః)
చెప్పాడు.
(మూల వ్యాసంలో శ్లోకమ్, తాత్పర్యం యివ్వలేదు. సాయి భక్తులందరికి అవగాహన కోసం గీతామకరందం నుంచి సంగ్రహించి వివరంగా యిస్తున్నాను... త్యాగరాజు)
అ.10 శ్లో. 37
వృష్ణీనాం, వాసుదేవోస్మి
పాణ్డవానాం ధనంజయః
మునీనామప్యహం వ్యాసః
కలీనాముశనాకవిః
తా. నేను వృష్టివంశీయులలో వసుదేవుని పుత్రుడగు వాసుదేవుడను.
(శ్రీకృష్ణుడను). పాండవులలో అర్జునుడను, మునులలో
వేదవ్యాస మునీంద్రుడను, కవులలో శుక్రాచార్యుడను అయియున్నాను.
వ్యాఖ్య - పాండవులలో అర్జునుడును, మునులలో వ్యాసులును తానేయని భగవానుడు చెప్పుటచే గీతను వినినట్టి అర్జునుడున్ను, లిఖించినట్టి వ్యాసులున్ను, ఇరువురును సాక్షాత్ భగవత్స్వరూపులేయని స్పష్టమగుచున్నది. కనుకనే గీతా సన్నివేశమునకంతటి మహత్తు చేకూరినది.
కవీనాముశనాకవిః – కవియనగా
గొప్ప విజ్ఞానముగలవాడని అర్ధము. ఉశనాకవి యనగా
భృగుమహాముని కుమారుడగు శుక్రాచార్యుడు.
(శ్రీ విద్యాప్రకాశానందగిరిస్వాములవారి
గీతా మకరందము)
నానాసాహెబ్ చందోర్కర్
కుమారుని వివాహానికి, కాకా సాహెబ్ దీక్షిత్ కుమారుని ఉపనయనానికి, బాబా వారిద్దరితోనూ
“నాశ్యామాను మీతో తీసుకుని వెళ్ళండి” అని చెప్పారు.
ఒకసారి కాకా సాహెబ్ ఎంతో
ఉద్వేగభరితుడయి ఆనందోత్సాహాలతో బాబాతో “బాబా, నేనెప్పుడూ నీతోనే నీవెంటే ఉండాలి” అని
కోరుకున్నాడు. అపుడు బాబా “శ్యామాను నీదగ్గరే
ఉంచుకో అనగా నేను నీతోనే ఉన్నానని అర్ధం” అన్నారు.
అలాగే మాధవరావు బాబాని
“దేవా” అని సంబోధిస్తూ ఉండేవాడు.
** అదేవిధంగా అనేక సందర్భాలలో
భగవద్గీతలో అర్జునుడు శ్రీకృష్ణపరమాత్మని “దేవా” అనే సంబోధించాడు.
ఒకసారి మాధవరావుకి ఎందుకనో
చాలా కోపం వచ్చింది. ఆకోపంలో బాబాతో “నిన్ను
భగవంతుడిని చేసినది మేమే. నువ్వేమో అందరికీ
ధనం, సంపదలు యిస్తావు. కాని నా విషయానికొచ్చేసరికి
బాగా పిసినారిలా వుంటావు” అన్నాడు.
బాబా ఎంతో శాంతంగా నవ్వుతూ ప్రేమగా “అరే! శ్యామా, ధనము, సంపదా నీకోసం కావు. నేను నీకు యివ్వదలచుకున్నది దానికన్నా చాలా భిన్నంగా ఉంటుంది” అన్నారు. మాధవరావు బాబా అన్నమాటలలోని భావాన్ని అర్ధం చేసుకుని యిక ఆవిషయంలో మౌనం వహించాడు.
బాబా ఎంతో శాంతంగా నవ్వుతూ ప్రేమగా “అరే! శ్యామా, ధనము, సంపదా నీకోసం కావు. నేను నీకు యివ్వదలచుకున్నది దానికన్నా చాలా భిన్నంగా ఉంటుంది” అన్నారు. మాధవరావు బాబా అన్నమాటలలోని భావాన్ని అర్ధం చేసుకుని యిక ఆవిషయంలో మౌనం వహించాడు.
** ఒకసారి అర్జునునికి శ్రీకృష్ణుడు అసంబద్ధ విషయాలు
మాట్లాడుతున్నాడనిపించి కృష్ణునిమీద కోపగించాడు.
మాధవరావు జీవితంలో కూడా యిటువంటి సంఘటనే జరిగింది.
ఒకసారి మాధవరావుకి కళ్ళు
వాచిపోయి బాగా బాధపెట్టసాగాయి. ఎన్ని మందులు
వాడినా గుణం కనపడలేదు. ఇక చికాకు పడుతూ దూకుడుగా
బాబా దగ్గరకు వచ్చి బాబాతో కోపంగా “నువ్వు గుడ్డివాడివా? నేను కళ్ళు వాచి నొప్పితో బాధపడుతూ ఉంటే నీకు కనపడటంలేదా?”
అన్నాడు.
బాబా నవ్వుతూ “అంతలా
పిచ్చివాడిలా ప్రవర్తించకు. ఏడు మిరియపు గింజలను
తీసుకుని వాటిని నీటిలో నానబెట్టు. ఆ నీటితో
నీకళ్ళను బాగా శుభ్రం చేసుకో. కాస్త ఊదీని
కూడా సేవించు” అన్నారు.
మిరియాల నీటితో కండ్లను
కడిగితే మండుతాయని మాధవరావుకు తెలిసినా కూడా బాబా మీద పూర్తి నమ్మకం ఉన్నవాడు. వెంటనే ఇంటికివెళ్ళి బాబా చెప్పిన విధంగానే చేశాడు. వెంటనే అతని కళ్ళ బాధ తగ్గిపోయింది.
షోలాపూర్ నివాసి సఖారామ్
ఔరంగాబాద్ కర్ భార్య విషయంలో మరొక సంఘటన జరిగింది. మాధవరావు బాబాతో “ఆమెకు ఒక కొబ్బరికాయనిచ్చి సంతానాన్ని
అనుగ్రహించమని” బలవంత పెట్టాడు. ఆమెకు సంతానాన్ని
ఇవ్వని పక్షంలో నీశిరస్సుమీద కొబ్బరికాయను పగలగొడతానని అన్నాడు. ఒక సంవత్సరంలో ఆమెకు సంతానం కలిగింది.
మధ్యాహ్న ఆరతి సమయంలో
మాధవరావు బాబాతో “కూర్చుని ప్రసాదం పంచు” అని గదమాయించేవాడు. బాబా ఏమీ మాట్లాడకుండా మాధవరావు చెప్పినట్లు చేసేవారు.
ఒకసారి బాబా మాధవరావుతో
కబుర్లాడుతూ ఉన్నారు. ఆ సమయంలో తన కఫనీ జేబునుంచి
కొంత డబ్బు తీసి తను కూర్చున్న గోనెపట్టాకింద దాచేశారు. అప్పుడే ఒక వ్యక్తి ఆయన వద్దకు వచ్చి డబ్బు ఇమ్మని
అడిగాడు. బాబా తన దగ్గర డబ్బులేదని చెప్పడంతో
ఆవ్యక్తి వెళ్ళిపోయాడు. బాబా నువ్వు ఆవిధంగా ప్రవర్తించడానికి
కారణమేమిటని మాధవరావు బాబాని ప్రశ్నించాడు.
అపుడు బాబా “వాస్తవానికి నేను అసత్యం పలికినట్లు కాదు. పాత్రతనెరిగి మాత్రమే యివ్వాలి (అర్హులకు మాత్రమే
ఇవ్వాలి)” అన్నారు.
ఒకసారి బాబా వద్దకు రామదాసి
వచ్చాడు. ప్రతిరోజు అతను ఎన్నో ఆధ్యాత్మిక
గ్రంధాలను చదివినా తన అహంకారాన్ని జయించలేకపోయాడు. ఒకరోజున బాబా తనకు కడుపులో నొప్పిగా ఉందని రామదాసిని
పిలిచి బజారుకు వెళ్ళి సోనాముఖి మూలికను తెమ్మని చెప్పారు. అతను వెళ్ళగానే బాబా రామదాసి సంచిలోనుండి విష్ణుసహస్రనామం
పుస్తకాన్ని తీసి మాధవరావుకు యిచ్చారు. రామదాసి
తిరిగి వచ్చిన తరువాత మాధవరావు చేతిలో తన పుస్తకం కనపడేసరికి చాలా ఉగ్రుడయ్యాడు. అపుడు బాబా “కాషాయాలు ధరించిన నువ్వు ఈవిధంగా ప్రవర్తిస్తున్నావా?”
అన్నారు.
** అర్జునుడు శ్రీకృష్ణపరమాత్ముని
తనకు విశ్వరూప దర్శన భాగ్యం యిమ్మనమని కోరాడు.
అదేవిధంగా మాధవరావు విషయంలో బాబా అతనిని కళ్ళుమూసుకోమని చెప్పి సత్యలోకాన్ని,
వైకుంఠలోకాని, కైలాసాన్ని దర్శింపచేసారు.
(సత్య లోక)
(వైకుంఠ)
(ఓమ్ పర్వతమ్)
పైన వివరింపబడిన సంఘటనల ద్వారా బాలా సాహెబ్ దేవి అర్జునుడికి, శ్రీకృష్ణులవారికి మధ్య, మాధవరావుకి, బాబాకు మధ్యగల సంబందాన్ని పోలికలను సోదాహరణంగా ఏవిధంగా తెలియచేసారో మనకు అర్ధమవుతుంది.
(వైకుంఠ)
(ఓమ్ పర్వతమ్)
పైన వివరింపబడిన సంఘటనల ద్వారా బాలా సాహెబ్ దేవి అర్జునుడికి, శ్రీకృష్ణులవారికి మధ్య, మాధవరావుకి, బాబాకు మధ్యగల సంబందాన్ని పోలికలను సోదాహరణంగా ఏవిధంగా తెలియచేసారో మనకు అర్ధమవుతుంది.
(అయిపోయింది)
0 comments:
Post a Comment