31.07.2017 సోమవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ
సాయి
సాయి బంధువులకు బాబావారి
శుభాశీస్సులు
మన సద్గురువయిన శ్రీ
సాయిబాబాకు అత్యంత ప్రియతమ భక్తుడయిన శ్రీ మాధవరావు దేశ్ పాండే (శ్యామా) గురించి పూర్తిగా
తెలుసుకుందాము. మనకు తెలియని ఎన్నో విషయాలు
ఈ వ్యాసం ద్వారా తెలుసుకోవచ్చు. బాబాకు శ్యామా
అంటే ఎందుకంత అభిమానమో ఈ వ్యాసమ్ చదివితె మనకర్ధమవుతుంది. ఈ వ్యాసం రెండవ భాగమ్ శ్రీసాయి లీల ద్వైమాస పత్రిక
జూలై - ఆగస్టు 2006 సంచికలో ప్రచురింపబడింది.. మరాఠీ మూలం
శ్రీమతి ముగ్ధా దివాద్కర్. ఆంగ్లంలోకి అనువాదమ్ శ్రీ సుధీర్
తెలుగు అనువాదమ్: ఆత్రేయపురపు
త్యాగరాజు
మాధవరావు దేశ్ పాండే
గురించి 6 వ.భాగంతో అయిపోయిందనుకున్నాను. దానికి
కారణం మే – జూన్ 2006 వ.సంచికలో ఇంకా ఉంది అని ప్రచురించకపోవడమ్ వల్ల. ఈ రోజు జూలై – ఆగస్టు 2006 వ.సంచిక చూసిన తరువాత
క్రితం సంచికలో ప్రచురించినదానికి కంటిన్యూడ్ అని ఉంది. దానిని ఈ రోజు ప్రచురిస్తున్నాను.
మాధవరావు దేశ్ పాండే (శ్యామా) - 7 వ.భాగమ్
సంత్ జ్ఞానేశ్వర్ ఏమని
చెప్పారంటే “ఎవరయినా రెండవ దీపాన్ని వెలిగించాలంటే మొదటి దీపంతోనే వెలిగించగలరు. దీపాలు వేటికవే వేరువేరు కావచ్చు. కాని రెండింటియొక్క జ్వాలలూ కలిసి ఒకే వెలుగునిస్తాయి.
సముద్రాన్ని గమనించినట్లయితే అలలు వేరు సముద్రం
వేరు అన్నట్లుగా కనిపిస్తుంది. కాని ఆ సముద్రపు
నీటిలోనే అలలు కలిసి వుంటాయి.
అంతా ఒకటే. అందుచేత అలలు వేరు సముద్రపు నీరు వేరు అని అనుకోలేము. సాఖ్య భక్తిలో భగవంతుడు ఆయన భక్తుడు యిద్దరూ ఏకమవుతారు.
ఇపుడు మనకి సంత్ జ్ఞానేశ్వర్
చెప్పిన వివరణ అనుభవంలోకి వచ్చింది. ఒకవైపు
శ్రీకృష్ణుడు, అర్జునుడు ఉంటే, మరొకవైపు సాయిబాబా, ఆయన భక్తుడయిన మాధవరావు ఉన్నారు.
శ్రీకృష్ణపరమాత్మ సాహచర్యంలో
అర్జునుడికి ఆయనతో విడరాని బంధమేర్పడి ఎంతగానో సన్నిహితుడయ్యాడు. ఆ ఫలితంగా అర్జునుడే శ్రీకృష్ణపరమాత్మగా రూపాంతరం
చెంది యిద్దరూ ఒకటేనన్న అద్వైత స్థితి కలిగింది.
అదేవిధంగా బాబా మాధవరావుకి “శ్యామా” అని బిరుదునిచ్చి తామిద్దరూ ఒక్కటే అని
ఋజువు చేశారు.
ప్రతి భక్తుడు బాబా తమతోనే
ఉండాలని కోరుకునేవారు. కాని వారందరికీ బాబా
ఎప్పుడూ చెప్పినదేమిటంటె, “నా శ్యామాని మీతో తీసుకుని వెళ్ళండి” నాశ్యామా మీదగ్గర ఉంటే
నేను మీతో ఉన్నట్లే”. అంతే కాదు, “మీతోకుడా
శ్యామా ఉంటే మీరు ఎటువంటి చింత పెట్టుకోనవసరం లేదు” అనేవారు. తమతో కూడా యాత్రలకు రమ్మనమని, తమ యింటికి భోజనానికి
రమ్మని ఆహ్వానించే భక్తులకి, కష్టాలలో ఉన్నపుడు తమకూడా రమ్మని యిలా ఎన్నో కోరికలతో
వచ్చే భక్తులందరికి బాబా పై విధంగా చెబుతూ ఉండేవారు. దీనినిబట్టి మనం గ్రహించుకోవలసినది బాబా, శ్యామా
యిద్దరూ వేరు కాదు, ఒక్కరే అని.
(అందువల్లనే బాబా చిత్రానికి పెడుతున్నట్లే శ్యామాకు కూడా ఆయన చిత్రం కింద గులాబీ పువ్వును సమర్పిస్తున్నాను)
బాపూసాహెబ్ బుట్టీ కూడా
శ్యామా గురించి ఈ విషయాలనే బాబా చెప్పడం విన్నాడు. అంతేకాదు ఎన్నో సందర్భాలలో అతనికి అనుభవం కూడా కలిగింది. బాపూసాహెబ్ బుట్టి అంత్యకాల సమయంలో మాధవరావు అతని
దగ్గరే ఉన్నాడు. బుట్టీకి మాధవరావులో బాబా
కనిపించారు. బుట్టీ తన శిరస్సును మాధవరావు
పాదాలపై పెట్టి అతని ఆశీర్వాదాలు కోరుకొన్నాడు.
మాధవరావు, ఇంకా యితర
భక్తులు బాబాని ఒకే ప్రశ్న అడిగినపుడు బాబా సమాధానాలు వేరువేరుగా యిచ్చిన సందర్భాలున్నాయి. ఆ సమాధానాలు విన్న భక్తులు తికమకపడి బాబాని సరైన
వివరణ యిమ్మని అడిగేవారు. అపుడు బాబా, “నేను
శ్యామాకు యిచ్చిన సమాధానమే సరైనది” అనేవారు.
ఎంతోమంది సాధుసత్పురుషులను
కలుసుకునేలా బాబా మాధవరావుకి కలుగచేసి వాటి ఫలితాలను లభింపచేశారు. అంతేకాకుండా ఎన్నో పుణ్యక్షేత్రాలను దర్శింపచేశారు. ఆయన శ్యామాకు విశ్వరూపదర్శనం కూడా కలిగించి ప్రతీదీ
కూడా శ్యామాకు ప్రత్యేకమైనదని చెప్పారు.
భగవంతుడు తన భక్తులకి
అద్వైతస్థితి యొక్క అనుభవాన్నిస్తాడు. కాని
ద్వైతరూపంలోనే దర్శనమిస్తాడు. కారణమేమిటంటే
ద్వైతరూపంలోనే భగవంతునియొక్క ప్రేమను అనుభవించి ఆస్వాదించడం సాధ్యమవుతుంది. కాకపోతే ఇక రెండవది భగవంతుడు తన అంతర్గత భావాలను
ఎవరికి అందించగలడు?
పగలు రాత్రి పడుకుని
ఉన్నా మేలుకొని ఉన్నా మాధవరావు బాబా భక్తిలో బందీ అయిపోయాడు. అతని పంచేంద్రియాలన్నీ కూడా బాబా భక్తికే అంకితమయాయి. దీనికి సాక్ష్యం మనకి కపర్దే డైరీలో కనిపిస్తాయి.
(సమాప్తం)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment