15.07.2017 శనివారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు సాయిబాబా అవతారమ్ గురించి కొంత తెలుసుకుందాము. ఈ వ్యాసం శ్రీసాయి లీల ద్వైమాసపత్రిక జనవరి - ఫిబ్రవరి 2006 సంచికలో ప్రచురింపబడింది. మరాఠీలోశ్రీమతి ముగ్ధా దివాద్కర్ రచించిన ఈ వ్యాసాన్ని శ్రీసుధీర్ గారు ఆంగంలోనికి అనువదించారు. దానికి తెలుగు అనువాదమ్.
నా అవతారమ్ మీ శ్రేయస్సు
కోసమే - 1 వ.భాగమ్
శ్రీసాయిబాబా అవతారానికి
సంబంధించి దాని వెనుకనున్న వాస్తవాన్ని మనం అర్ధం చేసుకోవాలంటే ముందుగా మనం అవతార పురుషులు
వారియొక్క మతం ఏమిటి, యింకా వారు ఏవిధంగా సూచనలు
సంజ్ఞల రూపంలో బోధిస్తారన్నది మనం అర్ధంచేసుకోవాలి.
అవతారమ్
శ్రీమద్భగవద్గీత నాలుగవ
అధ్యాయమ్ 8వ.శ్లోకంలో శ్రీకృష్ణపరమాత్మ యీవిధంగా చెప్పారు.
పరిత్రాణాయ సాధూనామ్
వినాశాయచ దుష్కృతామ్
ధర్మ సంస్థాపనార్ధాయ
సంభవామి యుగేయుగే
సాధుసజ్జనులను సంరంక్షించుట
కొఱకును, దుర్మార్గులను వినాశమొనర్చుట కొఱకును, ధర్మమును లెస్సగ స్థాపించుట కొఱకును
నేను ప్రతి యుగమునందును అవతరించుచుందును.
వాస్తవానికి భగవంతునికి
పుట్టుక లేదు (అజన్మ). భగవంతుడు మానవ అవతారంలో
ఎప్పుడయితే ప్రకటితమవుతాడో అదే ఆయన జన్మగా భావించుకోవాలి. భగవంతుడు మానవ శరీరం ధరించాలంటే తల్లిదండ్రులు వుండాలి. అవతారామ్ అనే మాట ‘అవ + తృ’ అనే శబ్దాల కలయిక. అవతారమనగా ‘ధారణ’ అనగా దేహమును ధరించాలి (మానవ శరీరాన్ని
ధరించాలి). అందుచేతనే మానవజాతిని ఉధ్ధరించడానికి
భగవంతుడు తాత్కాలికంగా మానవ శరీరాన్ని ధరిస్తాడు.
భగవంతుడు అవతారపురుషునిగా మానవ శరీరాన్ని ధరిస్తే అందరికీ ఉన్న విధంగానే ఆయనకు
కూడా జనన – మరణాల పరిమితులు వుంటాయి. కాని
స్వయంగా భగవంతునికి ఎటువంటి పరిమితులు వుండవు.
మన కళ్ళకు కనిపించే ఆకారాన్ని
(వేషధారణని) బట్టి సత్పురుషులను మనం గుర్తించలేము.
భగవంతుడు మానవ అవతారాన్ని
ధరించడంలోని ముఖ్య ఉద్దేశ్యం మానవజాతి సంక్షేమం దాని ద్వారా యావత్తు మానవజాతికి శ్రేయస్సును
కలిగించి వారిలో మంచితనాన్ని పెంపొందించడం.
స్వధర్మమ్ – అనగా తన
మతం నిర్దేశించిన ఆచార వ్యవహారాలను తూచా తప్పక ఆచరించడం. తన మతంలో చెప్పబడిన ప్రకారం చేసే కర్మలనన్నిటినీ
ఏకోరికా లేకుండా నిస్వార్ధంగా అన్నిటినీ బ్రహ్మార్పణం చేస్తున్నాననే ఉద్దేశ్యంతోనే
ఆచరించాలి. ఇది సాధించాలంటే భక్తి మార్గాన్ని
సత్పురుషులు మనకి నిర్దేశించారు. ఎవరయినా సరే
ఈ భక్తి మార్గాన్ని అనుసరించడానికి సులభమయిన పధ్ధతి ఏదంటే ‘నామస్మరణ’. ఏభక్తునికయినా సరే అతనిలోని అహంకారాన్ని తొగించుకోవడానికి
భక్తిమార్గం దోహదపడుతుంది.
సర్వానుభూతి పరమేశ్వర్
ఎప్పుడయితే భక్తుని మనసులో
‘సర్వానుభూతి పరమేశ్వర్’ (అందరిలోను సర్వజీవులలోను భగవంతుడు ఉన్నాడు) అనే భావం ఏర్పడుతుందో
అప్పుడే భక్తిమార్గానికి తలుపులు చాలా సులభంగా తెరచుకుంటాయి.
శ్రీసాయిబాబా కూడా తన
బోధనలలో ఈ సూత్రాలనే ఆచరించి మనందరికీ బోధించారు.
‘సర్వభూతాన్ పరమేశ్వర్’ అందరిలోను భగవంతుడిని చూడు అని బాబా బోధించారు. దానికి ఉదాహరణ ఈక్రింద వివరించిన సంఘటన ద్వారా మనం
గ్రహించవచ్చు.
ఒకసారి తర్ఖడ్ గారి భార్య
షిరిడీలో వుండగా, భోజనం వేళకు ఒక శునకం వచ్చి ఆమె ముందు నిల్చుంది. ఆమె ఒక రొట్టె ముక్కను ఆ శునకానికి పెట్టింది. ఆ శునకం వెళ్ళిపోయిన తరువాత వళ్లంతా బురదతో నిండి
వున్న ఒక వరాహం వచ్చింది. దానికి కూడా ఆమె
ఒక రొట్టెముక్కను పెట్టింది.
ఆతరువాత ఆమె బాబా దర్శనం
కోసం మసీదుకు వెళ్ళినపుడు బాబా ఆమెతో “అమ్మా!
మధ్యాహ్నం నేను ఆకలితో తాళలేకుండా వున్న సమయంలో నువ్వు నాకు కడుపునిండా భోజనం
పెట్టావు. శునకమయినా సరే వరాహమయినా సరే ఎప్పుడూ
యిదేవిధంగా జీవుల ఆకలిని తీరుస్తూవుండు” అన్నారు.
అన్ని కులాలు, మతాల ప్రజలందరూ
ఎటువంటి భేదం లేకుండా ద్వారకామాయికి వస్తూ వుండేవారు. ఆయన వద్ద అన్ని రకాలయిన జంతువులు ఆశ్రయం పొందుతూ
వుండేవి. సాయిబాబా చర్యలన్నీ, మానవుడయినా సరే,
జంతువయినా సరే ప్రతిప్రాణిలోను భగవంతుడు వున్నాడానే విషయాన్ని బోధిస్తాయి.
భిక్ష ద్వారా వచ్చిన
భిక్షాన్నాన్ని బాబా మసీదులో వున్న మట్టి పాత్రలో (కొలంబ) లో వేసేవారు. అందులోనుండి కాకులు, కుక్కలు, పిల్లులు స్వేచ్చగా
తింటూ ఉండేవి.
బాబా వాటినెప్పుడూ తరిమేవారు
కాదు. మసీదు శుభ్రపరిచే స్త్రీ కూడా పది పన్నెండు
రొట్టెలను తనింటికి పట్టుకుని వెళ్ళేది. ప్రపంచంలోని
సమస్త చరచరాలలోను భగవంతుని దర్శించడం సాయిబాబా దృష్టిలో అదొక విధానం.
సర్వధర్మ సంభవ
అన్ని మతాలలోను అవతారాలన్నీ
సమానమే అన్నది ఒక నమ్మకం. సత్పురుషులు కులమతాలకతీతులు. సత్పురుషులని మనం భగవంతుని అవతారంగా భావించినపుడు
వారు ఏమతానికి చెందినవారన్న ప్రశ్న తలెత్తదు.అందుచేత వారు ఏమతానికి ఏకులానికి చెందినవారు
అనే చర్చలు అనవసరం.
అన్ని మతాలు కులాలకు
చెందిన ప్రజలు ద్వారకామాయికి వచ్చి బాబాను దర్శించుకుంటూ ఉండేవారు. బాబా అందరినీ సమానంగానే ఆదరిస్తూ వుండేవారు.
ఆరోజుల్లోనే బాబా హిందువా లేక ముస్లిమా అనే చర్చ
ప్రజలమధ్య జరుగుతూ వుండేది. కాని బాబా ఎవ్వరికీ
కూడా తన మతమేదో తెలియచేయలేదు. ఎవ్వరి ఊహకి
కూడా తన మతమేదో తెలిసేలా ప్రవర్తించలేదు.
ఎవరయినా బాబా హిందువు
అని అందామంటే ఆయన వేషధారణ ముస్లిమ్ లా వుండేది.
ఆయన మసీదులో నివసించేవారు. మసీదులో
పరదాలు కట్టి అలంకరించేవారు. ఫకీరులతో కలిసి
భోజనం చేసేవారు. ఈద్ పండుగలందు నమాజు చేయించేవారు. మొహర్రం పండుగలలో తాబూత్ ను నెలబెట్టేవారు. కొన్ని సందర్బాలలో తాను పూర్వజన్మలో కబీరునని చెప్పారు.
ఒకవేళ ఎవరయినా బాబా ముస్లిమ్
అని భావిస్తే ఆయన హిందువుల పధ్ధతిలో రామనవమి ఉత్సవాలను జరిపించేవారు. శంఖనాదం చేసేవారు. మసీదులో నూనె దీపాలను వెలిగించేవారు. గోధుమల బస్తాను ఉంచేవారు. సభామండపంలో తులసి కోట వుండేది. హిందువులలాగే బాబా తన భక్తులను తన పాదాలను పూజించుకోనిచ్చేవారు.
ఆయన మసీదును ద్వారకామాయి
అని పిలిచేవారు (శ్రీకృష్ణపరమాత్మ యొక్క రాజధాని ద్వారక). బాబా తన అంకిత భక్తులెందరికో వివిధ హిందూ దేవుళ్ల
రూపాలలో దర్శనమిచ్చారు. ఆయన చెవులు హిందూ సాంప్రదాయం
ప్రకారం కుట్టబడి ఉన్నాయి. ముస్లిమ్ ల ఆచారం
ప్రకారం ఆయనకు సున్తీ కూడా అవలేదు.
హిందువులు, పార్శిల ఆచారం
ప్రకారం అగ్నిహోత్రాన్ని (ధుని) వెలిగించారు.
హిందువుల క్రైస్తవుల మతాచార ప్రకారం ఆయన ఘంటానాదాన్ని యిష్టపడేవారు.
బాబా ముఖ్యంగా రెండు
భాషలలో సంభాషిస్తూ ఉండేవారు. మరాఠీ (హిందువుల
భాష) మరియు యవని (ముస్లిమ్ ల భాష).
సాయిబాబా బోధనల ప్రభావం
వల్ల షిరిడీ గ్రామస్థులు (హిందువులు, ముస్లి లు) ఎటువంటి భేదభావాలు లేకుండా తమతమ మతాచారాలకు
అతీతంగా సంతోషంగా జీవించారు. రెండు మతాలవారు
తమలో తాము ఒకరికొకరు ఆహార పదార్ధాలను పంచుకొంటూ రెండువైపుల పండుగలను సమానంగా జరుపుకొనేవారు.
శ్రీమతి ముగ్ధా దివాద్కర్
మరాఠీ నుండి ఆంగ్లంలోనికి
అనువాదం శ్రీ సుధీర్
(రేపు రెండవభాగమ్)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment