08.07.2017 శనివారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ
సాయి
సాయి బంధువులకు బాబావారి
శుభాశీస్సులు
సాయి బంధువులందరికీ గురుపూర్ణిమ శుభాకాంక్షలు
ఈ రోజు మరొక అధ్బుతమైన సాయి మహిమను తెలుసుకుందాము. బాబా సమాధి చెందిన తరువాత బాబా భక్తులకు కలిగిన అనుభవాలు “Ambrosia of ShiriDi” అనే పుస్తకాన్ని శ్రీ రామలింగస్వామిగారు శ్రీ శివనేశన్ స్వామీజీ గారి ప్రేరణతో రచించారు. ఇది సాయిలీలా ద్వైమాసపత్రిక జూలై – ఆగస్టు 2004 వ.సంవత్సరంలో ప్రచురింపబడింది.
ఈ రోజు మరొక అధ్బుతమైన సాయి మహిమను తెలుసుకుందాము. బాబా సమాధి చెందిన తరువాత బాబా భక్తులకు కలిగిన అనుభవాలు “Ambrosia of ShiriDi” అనే పుస్తకాన్ని శ్రీ రామలింగస్వామిగారు శ్రీ శివనేశన్ స్వామీజీ గారి ప్రేరణతో రచించారు. ఇది సాయిలీలా ద్వైమాసపత్రిక జూలై – ఆగస్టు 2004 వ.సంవత్సరంలో ప్రచురింపబడింది.
తన కుటుంబ సమస్యకు పరిష్కారం రాత పూర్వకంగా కోరిన
భక్తుని విన్నపాన్ని బాబా ఏవిధంగా నెరవేర్చారో చదవండి.
నాస్తికుడిని ఆస్తికునిగా
మార్చిన సంఘటన
మహారాష్ట్రలో కళ్యాణ్
దగ్గరలో వైతర్ణ అనే చిన్న పట్టణం. ఆ పట్టణంలో
శ్రీ వీరేంద్ర పి.పాండ్య నివాసం.
అతను పట్టభద్రుడు. అతనికి దేవుడంటే నమ్మకం లేదు. అతని కుటుంబంలోనివారందరూ చదువుకున్నవారే. అతని తల్లిదండ్రులు తప్ప కుటుబంలోనివారెవరూ దేవుడిని నమ్మరు.
అతను పట్టభద్రుడు. అతనికి దేవుడంటే నమ్మకం లేదు. అతని కుటుంబంలోనివారందరూ చదువుకున్నవారే. అతని తల్లిదండ్రులు తప్ప కుటుబంలోనివారెవరూ దేవుడిని నమ్మరు.
ఒకసారి 1952 సంవత్సరం
మే నెలలో అతని కజిన్ సోదరుడు షిరిడీ వెడుతుంటే అతని కూడా సరదాగా వెళ్ళాడు. అతను షిరిడీనుంచి తిరిగివచ్చిన కొంతకాలం తరువాత
అతని కుటుంబం పెద్ద చిక్కుల్లో పడింది. ఆ సమయంలో
అతను తన కజిన్ తో కలిసి వైతర్నలోనే వుంటున్నాడు.
అతని తల్లిదండ్రులు, మిగిలిన కుటుంబసభ్యులు బీహార్ లో నివసిస్తున్నారు. వారు వెళ్ళి అక్కడ వారికి వచ్చిన సమస్యని పరిష్కరించడానికి
అవకాశం లేదు.
శ్రీపాండ్య షిరిడీనుంచి
వచ్చేటపుడు శ్రీసాయిబాబావారి ఫోటోని తెచుకున్నాడు. అది అతని ట్రంక్ పెట్టెలోనే వుంది. ఆవిషయం గుర్తుకువచ్చింది అతనికి. వెంటనే పెట్టెలోనుంచి ఫొటోని తీసి శుభ్రంగా తుడిచి
బల్లమీద పెట్టాడు.
అగరవత్తు వెలిగించి బాబా ఫొటోముందు పెట్టాడు. తన కుటుంబానికి ఏర్పడ్డ సమస్యను పరిష్కరించమని సాయిబాబాను మనసారా వేడుకొన్నాడు.
అగరవత్తు వెలిగించి బాబా ఫొటోముందు పెట్టాడు. తన కుటుంబానికి ఏర్పడ్డ సమస్యను పరిష్కరించమని సాయిబాబాను మనసారా వేడుకొన్నాడు.
రెండు మూడు రోజులు గడిచాయి. సమస్యకు పరిష్కారం ఏదీ కనిపించలేదు. దానివల్ల తనికి మనశ్శాంతి లేకపోయింది. చాలా ఆందోళనతో గడపసాగాడు. బాబా ఫొటోముందు నిలబడి “బాబా ! నీమీద నాకు ధృఢమయిన
నమ్మకం లేదనే విషయం నీకు తెలుసు. నీ భక్తులు నిన్ను భగవంతుడని అంటారు. అదే కనక నిజమయితే నా కుటుంబ సమస్య గురించి నీకు తెలుసు.
ఆవిషయం గురించే నేనెంతో బాధపడుతూ వున్నాననే విషయం కూడా నీకు తెలుసు. సాయంత్రానికల్లా ఏదోవిధంగా సమస్యకి సరైన పరిష్కారం చూపించవలసిందిగా
నిన్ను వేడుకొంటున్నాను. పరిష్కారం దొరికితే ఎల్లప్పుడూ నీఫొటోను
నాపెట్టెలోనే భద్రంగా దాచుకుంటాను.”
సాయంత్రానికి, సమస్యకి
పరిష్కారం స్ఫురించడంతో అతనికి ప్రశాంతత లభించింది. వెంటనే అతను బీహార్ లోని ధరైయాజోబాలో నివసిస్తున్న
తన తల్లికి వుత్తరం రాశాడు. కుటుంబంలో ఏర్పడ్డ
సమస్యకి పరిష్కారం గురించి రాస్తూ, అది తనకు ఏవిధంగా స్ఫురించినది అంతా వివరంగా రాసాడు. ఆ వుత్తరం పోస్టుచేసిన మూడవరోజున అతనికి తన తల్లి
వద్దనుంచి ఉత్తరం వచ్చింది. ఆ వుత్తరంలో తల్లి
రాసినదాని ప్రకారం పాండ్యాకి ఏరోజున ఏ సమయంలో సమస్యకి పరిష్కారం స్ఫురించిందో అదే రోజు
అదే సమయానికి ఆవిడకి అదే పరిష్కారం స్ఫురించింది.
ఈ సంఘటనతో అతనికి బాబామీద
నమ్మకం కలిగి ఆయనకు దగ్గర చేసింది.
తన జీవితమంతా బాబానే
ప్రార్ధిస్తూ ఏమీ చేయకుండా కేవలం ఆయనపై భక్తితోనే జీవితం గడుపుదామనే నిర్ణయానికి వచ్చాడు. కాని, అతని తల్లి తన కొడుకు ఆవిధంగా ఉండటానికి ఒప్పుకోలేదు. కర్మయోగాన్ని అనుసరించమంది. అపుడు మరొకసారి అతను బాబా ఫొటో ముందు నిలబడి ఒక కాగితం
మీద యీవిధంగా రాసాడు. “బాబా! నా సందిగ్ధావస్థ నీకు తెలుసు. నేను జీవితంలో ఏదారిలో వెళ్ళాలో నీజవాబు రాతపూర్వకంగా
నాకు మంగళవారం 05.08.1952 కల్లా యివ్వాలి.”
ఆ కాగితాన్ని బాబాఫొటొ క్రింద పెట్టి ప్రార్ధించాడు.
05.08.1952 సాయంత్రమయింది. బాబాగారినుంచి వ్రాతపూర్వకంగా జవాబు కోసం ఎదురు
చూస్తూ అస్థిమితంగా వున్నాడు.
అకస్మాత్తుగా అతనికి
శ్రీభావనగర్ సాయిబాబా భక్తమండలి వారు గుజరాతీ భాషలో ప్రచురించిన ‘శ్రీసాయిబాబా ఉపాసన’
అనే పుస్తకం కనిపించింది. ఆపుస్తకాన్ని అతని
తల్లి రెండునెలల క్రితమమే పంపించింది. ఇంతవరకు
ఆపుస్తకాన్ని చదవలేదు. ఇపుడు ఆపుస్తకం కనిపించగానే
యాదృఛ్ఛికంగా ఒక పేజీ తెరిచాడు. ఆపేజీ ‘భావసుధ’ అనే అధ్యాయం. ఆ అధ్యాయంలో కొన్ని వాక్యాలు చదవగానే
ఆసక్తి కలిగి మొత్తం పుస్తకం చదివాడు.
ఆఖరులో అతని ప్రశ్నలకి సమాధానం, అదీ రాతపూర్వకంగా లభించింది. ఆపుస్తకంలో బాబా ఒక భక్తునికి కర్మయోగాన్ని అనుసరించి జీవితాన్ని గడపమని సలహాయిచ్చారు. ఈ సంఘటనతో అతనికి బాబాపై మరింత భక్తి పెరిగింది.
ఆఖరులో అతని ప్రశ్నలకి సమాధానం, అదీ రాతపూర్వకంగా లభించింది. ఆపుస్తకంలో బాబా ఒక భక్తునికి కర్మయోగాన్ని అనుసరించి జీవితాన్ని గడపమని సలహాయిచ్చారు. ఈ సంఘటనతో అతనికి బాబాపై మరింత భక్తి పెరిగింది.
శ్రీ పి.వి.పాండ్య, అతని
కజిన్ యిద్దరూ ముంబాయి వాటర్ సప్లై స్కీమువారికి కాంట్రాక్టర్స్ గా పనిచేస్తూ, వైతర్నాలో
వుంటున్నారు. వారు నివసిస్తున్న ప్రాంతం నిజానికి
ఒక అరణ్యం.
ఒకరోజు బుధవారంనాడు
(06.08.1952) అతను బాబా ఫొటొముందు నిలబడి ఈ విధంగా ప్రార్ధించాడు, “రేపు గురువారం, బాబా, నీకు ప్రియమైన రోజు. రేపు నేను మధ్యాహ్నం
భోజనం చేసే సమయంలో 12.30 – 1.30 మధ్యలో ఎవరయినా ఒక సాధువుగాని, సన్యాసి గాని, ఫకీరు
గాని, భిక్షకు రావాలి. ఆయన తన కుడిచేతితో నన్ను
తలనుండి పాదాల వరకు నాశరీరాన్నంతా ఆశీర్వదించాలి".
గురువారం మధ్యాహ్నం 12.15 అయిన తరువాత భోజనానికి కూర్చున్నాడు. అప్పటికీ తన యింటి ముంగిటకి ఎవారూ రాలేదు.
అపుడే మొట్టమొదటి ముద్దను నోటిలో పెట్టుకోబోతుండగా బయట ఒక ఫకీరు భిక్ష వేయమని
అడగడం వినిపించింది. అతని వంటవాడు ఎప్పుడూ
ఎవరు భిక్షకు వచ్చినా ఏమీ యిచ్చేవాడు కాదు.
ఇంతవరకూ ఎవ్వరికి ధర్మం చేయలేదు. అటువంటిది
ఆ వంటవాడు తనకు తానే ఒక అణా ఆఫకీరుకు యిచ్చాడు.
ఆ ఫకీరు తిరిగి వెళ్ళబోతుండగా వెనక్కి పిలిచి, బాబాఫొటోముందు పెట్టిన ప్రసాదాన్ని
యిచ్చాడు. ఆ ఫకీరు అక్కడినుంచి వెళ్ళిపోయాడు. అప్పటికి పాండ్యా తన భోజనాన్ని ముగించాడు. అతను ఫకీరుకు భోజనం పెడదామనుకున్నాడు. కాని, అతను అప్పటికే వెళ్ళిపోయాడు. ఆ ఫకీరు మరలా ఎలాగయినా వస్తే బాగుండును అతనికి భోజనం
పెట్టి పంపించవచ్చనుకున్నాడు. ఒక మనిషికి అన్నం
ఏమయినా మిగులుతుందా అని వంటవాడిని అడిగాడు.
వంటవాడు మిగలదన్నట్లుగా సమాధానమిచ్చి, తనకొక్కడికే సరిపడా వుందని చెప్పాడు.
కాని ఆశ్చర్యకరమయిన సంఘటన జరిగింది. ఆ ఫకీరు మరలా తన యింటిగుమ్మం వద్దకు రావడం కనిపించింది. అతను వెంటనే ఆ ఫకీరుకు ప్రసాదం యిచ్చి, రెండు రూపాయలు యిస్తూ, తన యింటిలో భోజనం పెట్టలేకపోతున్నాననీ, యిచ్చిన డబ్బుతో భోజనం చేయమని చెప్పాడు. ఆ ఫకీరు మారు మాట్లాడకుండా అతనిచ్చిన డబ్బు తీసుకుని అర్ధవంతంగా ఒక చిన్న నవ్వు నవ్వాడు. అపుడా ఫకీరు పాండ్యా కోరుకున్న విధంగానే కుడిచేతితో నెమలిపింఛాల కట్టతో తలనుంచి పాదాల వరకు రాస్తూ ఆశీర్వదించాడు.
పాండ్యాకు ఎంతో సంతోషం కలిగింది. పట్టరాని సంతోషంతో ఆ ఫకీరు పాదాల మీద పడి నమస్కారం చేసుకున్నాడు. ఫకీరు అతనిని పైకి లేవనెత్తి వచ్చే గురువారం 14.08.1952 న మరలా కలుస్తానని చెప్పాడు.
అపుడు పాండ్యా అది సాధ్యం
కాదు, ఎందుకనగా రెండురోజులలో నేను షిరిడీ వెడుతున్నాను అని చెప్పాడు. “అయినా గాని నేను నిన్ను కలుసుకుంటాను” అని ఆఫకీరు
వెళ్ళిపోయాడు.
పాండ్యా 13.08.1952 న షిరిడీ చేరుకున్నాడు. 14.08.1952 గురువారంనాడు మధ్యాహ్న ఆరతికి సమాధి మందిరంలోకి వెళ్ళాడు. అక్కడ సాయిబాబా ఫొటోని తదేకంగా చూస్తూ వున్నాడు.
అపుడు ఫకీరు చెప్పిన మాటలు హటాత్తుగా గుర్తుకు వచ్చాయి. "నేను నిన్ను వచ్చే గురువారం మరలా కలుస్తాను” అన్న మాటలు నిజమయ్యాయి. ఆరతి సమయంలో తను బాబా ముందు వున్నాడు. బాబా తన ముందు వున్నారు. ఆవిధంగా ఫకీరు తనను 14.08.1952 గురువారమునాడు కలుసుకున్నారు.
బాబా తాను మహాసమాధి చెందిన తరువాత కూడా నాస్తికులను ఆస్తికులుగా మార్చి తనకు అంకిత భక్తులుగా చేసుకుంటూ వున్నారు.
జ్యోతిరాజన్
సాయిలీలా మాస పత్రిక
జూలై – ఆగస్టు 2004
కర్మయోగమ్ ః భగవద్గీత మూడవ అధ్యాయం చదవండి.
బాబాకు గురువారమ్ ఎందుకని ప్రియమైన రోజని నేను ఒకనాడు సాయిబానిస గారిని ప్రశ్నించాను. అప్పుడు సాయిబానిస గారు ఈ విధంగా చెప్పారు.
సాయిబానిసగారు ఒక రోజు ధ్యానంలో బాబాను ఇదే విషయాన్ని అడిగారట. దానికి బాబా చెప్పిన సమాధానం సాయిబానిస గారు నాకు చెప్పారు. ఆ రహస్యాన్ని మీకు కూడా వెల్లడిస్తున్నాను.
"మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్న రోజులలో బ్రిటిష్ ఆర్మీలో ఇండియన్ సోల్జర్ ఒకతను ఉండేవాడు. అతను ఒక చిన్న బెటాలియన్ కి నాయకుడు. అతను శత్రువులతో పోరాడుతూ శత్రువుల సంఖ్య ఎక్కువగా ఉందని తెలుసుకొని తన జవానులు చనిపోకుండా ఉండటానికి యుధ్ధం చేయదలచాడు. అతను నిలబడి తనవాళ్ళందరినీ నేలమీద పడుకోమని చెప్పి తను ఒక్కడూ ఆ శత్రువులని ధైర్యంగా ఎదుర్కొని సంహరించి సాయి నామము ఉఛ్ఛరిస్తూ తన ప్రాణాలను వదలి తనవారిని కాపాడుకున్నాడు. ఆ రోజు గురువారమయింది. అప్పటినుంచి సాయి తనకు గురువారం ప్రీతికరమని తనను పూజించడానికి అంగీకరించారు.
(ఈ సందర్భంగా సాయిబానిస గారు చెప్పిన ఈ రహస్యాన్ని మీకు తెలియచేసే అవకాశం కలిగినందుకు సంతోషిస్తున్నాను.)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment