09.07.2017 ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ
సాయి
సాయి బంధువులకు బాబావారి
శుభాశీస్సులు
కళ్ళ జబ్బుకు అమోఘమైన మందు
కళ్ళకు వచ్చిన జబ్బు
ఏ మందువల్ల పూర్తిగా నయమవుతుంది. విదేశాలనుంచి
వచ్చిన కంటి వైద్యులు సూచించిన అమోఘమయిన మందు ఏది, అల్లోపతి, ఆయుర్వేదమ్, హోమియోపతి,
లేక చిట్కా వైద్యమా? తెలుసుకోవాలంటే చదవండి.
ఈ రోజు మరొక అధ్భుతమైన
బాబావారి మహిమ గురించి తెలుసుకుందాము. ఇది
సాయిలీల ద్వైమాసపత్రిక జనవరి – ఫిబ్రవరి 2005 వ.సం. సంచికలో ప్రచురింపబడింది. దానికి తెలుగు అనువాదమ్.
ఒకసారి ఒకతనికి కళ్ళువాచి, కనుగ్రుడ్లు ఎఱ్ఱగా మారాయి. షిర్దీలో వేరే వైద్యులు ఎవరూ కన్పించక అతనిని బాబా వద్దకు తీసుకుని వచ్చారు. వైద్యులు కళ్ళకు సురమా గాని, ఆవుపాలతో పట్టీగాని, చల్లటి కర్పూరపు బిళ్ళగాని, లేక అంజనం గాని వేస్తారు. కాని, బాబా జీడిగింజల రసాన్ని మాత్రల్లా చేసి ఒక్కోదాన్ని ఒక్కో కంటిలో పెట్టి కళ్లకు గుడ్డ కట్టారు. మరుసటి రోజు కట్టువిప్పి కళ్ళపై నీటిధార విడిచారు. విచిత్రం, వాపంతా తగ్గిపోయి కళ్ళు తెల్లగా నిర్మలంగా అయ్యాయి. అత్యంత కోమలమయిన కళ్ళలో జీడిగింజల రసం వేస్తే మండలేదు. కళ్ళు పోలేదు సరికదా, కళ్ళజబ్బు పోయింది. ఈ విధంగా అనేక అనుభవాలు.
శ్రీసాయి సత్ చరిత్ర అ.7 ఓ వి 47 - 52
1987 వ.సంవత్సరం జనవరి
27వ.తేదీని తలుచుకున్నపుడెల్లా నాకు భయంతో చాలా బాధపడిపోతూ వుంటాను. నాకు బాబాయే కనక సహాయం చేయకపోయినట్లయితే నాజీవితం
అంధకారమయమయి వుండేది.
ఆ రోజు ఎప్పటిలాగానే
నేను నా టైపింగ్ వర్క్ లో నిమగ్నమయి ఉన్నాను.
చాలా ఏకాగ్రతగా టైపు చేస్తూ ఉన్నాను.
నా కళ్ళు స్క్రిప్ట్ నుంచి టైప్ రైటర్ లో వున్న కాగితం మీదకు కదులుతూ వున్నాయి. కొద్ది నిమిషాలలోనే నా కుడికన్ను నెప్పిగా అనిపించింది. బహుశ కంటిలో ఏదయినా నలకలాంటిది పడివుండచ్చనిపించి
పెద్దగా పట్టించుకోలేదు. కాని సమయం గడిచే కొద్దీ
నెప్పి యింకా ఎక్కువయింది. నెప్పివల్ల టైపింగ్
వర్క్ మీద దృష్టి పెట్టలేకపోయాను. రెండు రోజులు
గడిచాయి. రోజు రోజుకీ నెప్పి ఎక్కువకాసాగింది. ఇక పరిస్థితి చాలా ప్రమాదకరంగా తయారయేటట్లుందని
డాక్టర్ దగ్గరకి వెళ్ళక తప్పదనుకున్నాను.
జనవరి 25వ.తారీకున డాక్టర్ దగ్గరకు వెళ్ళాను. డాక్టర్ పరీక్షించి కొన్ని టాబ్లెట్స్ యిచ్చారు. కాని అవేమీ పనిచేయలేదు. ఆ రోజునుంచి బాధ యింకా ఎక్కువయింది. తగ్గని తలనెప్పి తరచు వాంతులతో బాధపడసాగాను.
వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్ళాను.
“ఈ నెప్పి 8 రోజలపాటు వుంటుంది. తరువాత
నీకు నయమవుతుంది” అని డాక్టర్ భరోసా యిచ్చాడు.
డాక్టర్ చెప్పినట్లే అంతా సవ్యంగా జరుగుతుందని యింటికి వచ్చేశాను. ఇక జనవరి 26 వ.తారీకునుంచి నా దురదృష్టం మొదలయింది. ఆరోజున నాకుడి కంటికి చూపు పోయింది. మరుసటి రోజు ఎడమకంటికి చూపు మందగించింది. ఇక వెంటనే డాక్టర్ దగ్గరకి పరిగెత్తాను. డాక్టర్ కి నాపరిస్థితి చాలా ప్రమాదకరంగా తయారవుతున్నట్లుందనిపించింది. నన్ను వెంటనే
పూనా వెళ్ళి రూబీ హాల్ క్లినిక్ లో వున్న డాక్టర్ ని గాని,
ససూన్ లో వున్న ఆస్పత్రికి
వెళ్ళి అక్కడి డాక్టర్స్ ని గాని కలవమని చెప్పాడు డాక్టర్. నేను ససూన్ లో వున్న ఆస్పత్రికి వెళ్ళి అక్కడి డాక్టర్స్
ని కలిసాను.
వారడిగిన మీదట నా కేసు వివరాలన్నీ
చెప్పాను. చాలా రకాల పరీక్షలు చేసి యింజక్షన్
లు, టాబ్లెట్స్ యిచ్చారు. ఐ స్పెషలిస్ట్ పూర్తిగా
పరీక్షించాడు. నా స్నేహితుడు డా.అవినాష్, నాగపూరతను
(అతను M.B.B.S. ఆఖరి సంవత్సరం చదువుతున్నాడు) బాధని ఓర్చుకోమని చెప్పాడు. ఆ సమయంలో నాకు కాస్త ధైర్యం చెప్పే మనిషి అతనొక్కడె.
“ఇటువంటి కేసుల్లో మళ్ళీ చూపు రావడం అసంభవం” అని మెల్లిగా గొణిగాడు. నాకాయన మాటలు వినపడ్డాయి. ఆ మాటలు వినగానే నాలో ధైర్యం సన్నగిల్లింది. చూపు లేకుండా గ్రుడ్డివానిగా బ్రతికే జీవితాన్ని
తలచుకుని చాలా భయపడిపోయాను. అదే సమయంలో డాక్టర్
అన్న మాటలు “భగవంతుని అనుగ్రహం ఉంటే చూపు మళ్ళీ రావచ్చు”. ఆయన అన్న మాటలు నాకు చిన్న ఆశాకిరణంలా అనిపించాయి. నాకు బాబామీద నమ్మకం వుంది. బాబా ఎపుడూ శ్రధ్ధ, సబూరీ తో ఉండమని బోధించారు. ఈ ఆలోచన రాగానే నాకు తిరిగి ధైర్యం వచ్చింది.
ఇక్కడ ప్రత్యేకంగా చెప్పవలసిన
విషయం ఏమిటంటే నేను 28వ.తేదీ ఉదయం పూనాకు బయలుదేరేముందు, బాబా సమాధి మందిరానికి వెళ్ళి
బాబాని యిలా ప్రార్ధించాను, “బాబా నేను రెండు కళ్లతో వెళ్ళవలసినవాడిని ఒక్క కంటితో
పూనా వెడుతున్నాను.”
ఈ విధంగా ప్రార్ధించి
ప్రతిరోజు కళ్లకి బాబా ఊదీ రాసుకోవడం మొదలుపెట్టాను ఆ సమయంలో నాకు మానాన్నగారు, అమ్మ, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు,
డా.నాగ్ పురె, మిస్టర్. రతిలా జీ లోధా, మిస్టర్.సదాశివ్ గోరాడె, మిస్టర్.కైలాస్ గైక్వాడ్,
వీరందరూ నాకు ధైర్యాన్నిచ్చారు. నేను వారికెంతో
కృతజ్ఞుడిని.
ఫిబ్రవరి నెల మొట్టమొదటి
గురువారం నుండి నేను నా ఎడమ కంటితో కాస్త చూడగలిగాను. నామనసు, కళ్ళు పుష్పాల్లా వికసించాయి. చూపు మెరుగయింది. నాసంతోషానికి అవధులు లేవు. ఆ తరువాతి గురువారంనాటికి నాకు పూర్తిగా చూపు వచ్చి
అన్నీ స్పష్టంగా చూడగలిగాను. నావాళ్లందరినీ
చూడగలిగాను. చుట్టూ జరిగేవన్నీ కూడా నాకు స్పష్టంగా
కనిపిస్తున్నాయి. పోయిన నా చూపు నాకు తిరిగి వచ్చింది.
ఈ లోగా షిరిడిలో శ్రీసాయినాధ్
ఆస్పత్రిలో ఛారిటబుల్ ఐ క్యాంప్ పెట్టారు.
అక్కడికి కంటి సమస్యలతో వచ్చిన పేషెంట్స్ ని చూసి వైద్యం చేయడానికి విదేశాలనుండి
ఐ స్పెషలిస్టులు వచ్చారు. నేను వాళ్లకి నా
కళ్ళు చూపించుకున్నాను. వారికి నాకేసు వివరాలన్నీ
చెప్పాను. అపుడా డాక్టర్స్, “మేము నీకు యింకా
మంచి అమోఘమయిన మందు యిస్తాము. ఈ మందుని నువ్వు
ప్రతిరోజు వాడు. ఇంక నీకు కంటి సమస్య అనేదే
రాదు” అన్నారు. నాకు చాలా సంతోషం కలిగింది. ఆమందు పేరు ఏమిటి చెప్పండి అని అడిగాను.
వారు చెప్పిన మందు “ప్రతిరోజూ
నీకళ్ళకి బాబా ఊదీ రాసుకో. సద్గురు శ్రీసాయిబాబా
అనుగ్రహం వల్లనే నీకళ్ళకి వచ్చిన జబ్బు పూర్తిగా నయమయింది.”
బాగ్ దేవ్ సంతు సబాలే
సీనియర్ అక్కౌన్ టెంట్,
అక్కౌట్స్ బ్రాంచ్,
శ్రీ సాయి బాబా సంస్థాన్
ట్రస్ట్ (షిరిడీ)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment