30.05.2018 మంగళవారమ్
ఓమ్
సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
తెలుగు
అనువాదమ్ : ఆత్రేయపురపు త్యాగరాజు
అట్లాంటా
(యూ ఎస్ ఎ) - ఫోన్ : 1 571 5947354
శ్రీ
స్వామీజీ భక్తులతో జరిపిన అనుగ్రహ భాషణమ్ – 19 వ.భాగమ్
15.12.1071
: స్వామీజీ ఈ రోజు భక్తిమార్గంలోని
వివిధ స్థాయిలను గురించి వివరించారు. అవే నవవిధ
భక్తులు. అవి శ్రవణం, కీర్తనం, స్మరణం, ఆత్మసఖ్యం,
దాస్యము, ఆత్మనివేదనం. మొట్టమొదటగా శ్రవణం. అనగా భగవంతుని యొక్క నామాన్ని వినుట, తరువాత భగవంతుని
నామాన్ని, ఆయన గుణగణాలను కీర్తించడం. అదే కీర్తనం.
ఈ కీర్తన తరువాత పూజ, అర్చనలు జరపాలి. దాని తరువాత ఆత్మ సఖ్యత. అనగా భగవంతునితో మనము అనుబందాన్ని పెంచుకోవాలి. ఈ అనుబంధమనేది ఏవిధంగా ఉండాలంటే యిద్దరి స్నేహితులమధ్య,
తండ్రి, కొడుకుల మధ్య, తల్లి, కొడుకుల మధ్య, భార్యాభర్తల మధ్య ఉండే అనుబంధంలాగ ఉండాలి. చివరగా మన హృదయాన్ని ఆభగవంతునికి అర్పించాలి.
అపుడు భక్తుని మనసులో నేనే నువ్వు, నీవే నేను అనే
భావం ఉదయిస్తుంది. ఈ ప్రపంచమంతా నువ్వే, (అనగా
భగవంతుడు) నువ్వు (భగవంతుడు) ప్రతివారి హృదయంలోను
నివసిస్తున్నావనే భావం మనకి అవగతమవుతుంది.
17.12.1971 : ఈ రోజు
స్వామీజీ నాశనము లేని ఆత్మ లేక పరబ్రహ్మ గురించి
వివరించారు. “నశించిపోయే వస్తువులన్నీ మన కంటికి
ఒక ప్రదర్శన లాగ కనిపిస్తాయి. కాని ఆ పరబ్రహ్మ
ఒక్కడే శాశ్వతం. ఆయన మన కంటికి కనిపించడు. బ్రహ్మ ఒక్కటే శాశ్వతమయినది. ఈ ప్రపంచంతో బంధాన్ని పెంచుకోవడానికయినా, త్రెంచుకోవడానికయినా
మన మనస్సే కారణం. బ్రహ్మజ్ఞాని మాత్రమే ఈ ప్రపంచంతో
బంధాన్ని త్రెంచుకుని ఆ పరబ్రహ్మతో అనుబంధాన్ని పెంచుకోగలడు. భగవంతునితో బంధాన్ని పెంచుకొని ఈ ప్రపంచంలో నీవు
సంచరించగలిగితే నీకు తప్పక మోక్షం కలుగుతుంది.
ప్రజలయొక్క మంచి, చెడు అనే భావాలు మన మనసులోనే కలుగుతూ ఉంటాయి. కాని యుద్ధాలు, దెబ్బలాటలు మొదలయినవన్నీ ఒక భ్రమ
మాత్రమే. “నువ్వు జీవించు ఇతరులను కూడా జీవించేలా
చేయి” అనే సూత్రాన్ని మనం అవలంబించాలి. ప్రపంచంలోని
శక్తివంతులయినవారందరూ ఈ సూత్రాన్నే పాటిస్తే, దేశాలమధ్య యుధ్ధాలనేవి ఎందుకు సంభవిస్తాయి? భగవంతుడు మనకి నివసించడానికి ఆశ్రయం, తినడానికి
ఆహారం మొదలయినవన్నీ సమకూర్చాడు. అటువంటప్పుడు
మానవుడు తన కుటుంబంతోను, యిరుగుపొరుగువారితోను సంతోషంగా జీవించలేడా? భగవంతుడే సూత్రధారి. కాని మన భావాలను బట్టి ఆయనను మనం విస్మరిస్తున్నాము.
భగవానుడు గీతలో ఈ విధంగా చెప్పాడు.
తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం
దదామ బుధ్ధియోగం తం యేన మాముపయాంతి తే అ.10 శ్లో. 10
అట్లు నిరంతరము ధ్యానాదుల ద్వారా నాయందే లగ్నమనస్కులై భక్తి శ్రధ్ధలతో నన్నే భజించువారికి
నేను బుధ్ధియోగమును, అనగా తత్త్వజ్ఞాన రూప యోగమును అనుగ్రహించుచున్నాను.
ఆవిధంగా భగవంతుడు మనకు అనుగ్రహించిన బుధ్ధి ద్వారా
ఈప్రపంచంలో శాశ్వతమయినవేవి? అశాశ్వతమయినవేవి?
రెండిటిమధ్య గల భేదాన్ని మనం అర్ధం చేసుకోగలం.
ఈ ప్రపంచంలో మనము మాత్రమే మనకి మనమే నిలద్రొక్కుకొని భగవంతుని మార్గంలో ప్రయాణించగలం. గీతలో భగవానుడు ఏమని చెప్పాడో ఒక్కసారి గుర్తుకు
తెచ్చుకొనండి.
దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా
మామేవ యే ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే అ.7 శ్లో.14
నామాయ త్రిగుణాత్మకమైనది. దీనిని అధిగమించుటకు సాధ్యము కానిది. కాని కేవలము నన్నే భజించువారు ఈ మాయను దాటుచున్నారు.
చివరికి ప్రతి భక్తుడు భగవంతుని వద్దకే చేరుకొంటాడు. గీతలో భగవానుడు ఈ విధంగా చెప్పాడు.
ఆ పూర్య మాణమచల ప్రతిష్టం
సముద్రమాపః ప్రవిశంతి యద్వత్
తత్వద్ కామా యం ప్రవిశంతి సర్వే
స శాంతిమాప్నో తి న కామ కామా అ.1 శ్లో. 70
సమస్త దిశలనుండి పొంగి ప్రవహించుచు వచ్చి చేరిన నదులన్నియును
సముద్రమును ఏవిధముగా చలింపచేయకనే ప్రవేశించుచున్నవో అలాగే సమస్త భోగములును స్థితప్రజ్ఞునియందు
ఎట్టి వికారములను కల్గింపకయే వానిలో లీనమగును.
అట్టి పురుషుడే పరమ శాంతిని పొందును
భోగాసక్తుడు శాంతిని పొందలేడు.
అందువల్ల భగవంతుని చేరుకోవడానికి అనుసరించవలసిన ఉత్తమోత్తమమయిన
పధ్ధతి ఏదంటే నిరంతరం మన మనస్సుని స్థిరంగా ఆయనయందే నిలుపుకోవాలి. ఆ భగవంతుడే మన మనస్సును దిశానిర్దేశం చేసే రధసారధి. వాస్తవానికి అర్జునుడు సరియైన రధసారధిని ఎంచుకొన్నాడు.
ఈ ప్రపంచంలో మనకు కష్టాలను కలిగించేవి, మనలో ఉన్న
గుణాలే. నీవు కనక సత్వ గుణాన్ని ఎంచుకుంటే
భగవంతుని దారిలో ముందుకు వెళ్ళగలవు. అలా కాకుండా
రజో గుణాన్ని ఎంచుకుంటే కామ, క్రోధాలు మొదలయినవి ఎల్లకాలం నీలోనే ఉండి నిన్ను ఈప్రపంచంలోనే
క్రిందకి లాగి కష్టాలను కలిగిస్తాయి. తమో
గుణం కలిగినవాడు ఎల్లపుడూ జూదరిగా లేక త్రాగుబోతుగా బ్రతకవలసినదె.
ఈప్రపంచంలో మానవుడు ఏవిధంగా జీవించాలో స్వామీజీ వివరించారు. “మన మనస్సుని స్థిరంగా ఉంచుకోలేకపోయినట్లయితే ఈ
ప్రపంచంలో నిర్లిప్తతతో జీవించడం సాధ్యం కాని విషయం. మనం మోక్షాన్ని పొందాలంటే మన శరీరం, మన మనస్సు స్వాధీనంలో
ఉండరాదు. (అనగా మన మనస్సు మనలని నియంత్రించరాదు) మనం మన మనస్సుని మన స్వాధీనంలోకి తెచ్చుకోవాలి. ఇది భగవదనుగ్రహం వల్లనే సాధ్యపడుతుంది. మన మనస్సు మన స్వాధీనంలో ఉండాలంటే మనలోనున్న విషయవాసనలన్నిటినీ
తొలగించేయాలి.
మన నిజ స్వబావమేమిటో మనం తెలుసుకునేందుకు ప్రయత్నించాలి. మనకు కావలసినది ‘ఆనందం’. “ఆనందం బ్రహ్మేతి…….” అనగా అది దేనిని సూచిస్తుంది? మనం చూసేవన్నీ అనుభవించేవి అన్నీకూడా ఆనదంనుంచే
పుట్టి ఆనందంలోనే చేరతాయి.
మనలో ప్రతి ఒక్కరం ‘నేనే పరబ్రహ్మను” అనే భావంతో ఉండాలి. మనమందరం ఆ భగవంతునిలోనే ఉన్నాము. “నేను భగవంతునిలో ఉన్నాను” అని మనం భావించుకోవాలి. వాస్తవంగా చెప్పాలంటె నువ్వు ఒక పులిలాంటివాడివి. అటువంటపుడు నీ వాస్తవ పరిస్థితిని గ్రహించుకోకుండా
గొఱ్ఱె పిల్లలాగ అరిస్తే లాభమేమిటీ? ఈ విశ్వమంతా
మనదే అనే భావంతో ఉండాలి.
“ఏకం ఏవద్వితీయం బ్రహ్మ” ఇది మీరు వినే ఉంటారు. అనగా బ్రహ్మ ఒక్కడే. అందుచేత ‘నేనే బ్రహ్మ’ అని మీరు ఎందుకనుకోరాదు? ఆవిధంగా మనకు మనమే స్వయంప్రేరితంగా సూచనలు యిచ్చుకోవడం
ద్వారా క్రమక్రమంగా మనకు మనమే ‘పరబ్రహ్మ’ అనే యదార్ధమయిన సత్యం మనకు బోధపడుతుంది. ‘ఓ భగవాన్ నువ్వు నాలో ఉన్నావు నేను నీలో ఉన్నాను’
అనే భావాన్ని అలవరచుకోండి. ఆవిధంగా భావించుకుంటే
చాలు. ఇక ఏవిధమయిన వాదోపవాదాలకు తావు లేదు.
భగవంతుని చరణాలవద్ద మనం సర్వశ్య శరణాగతి చేయాలి. భక్తిమార్గంలో ఇది ముఖ్యమయిన పునాది.
భగవానుడు ఈ విధంగా చెప్పాడు.
యత్కరోషి యదశ్నాసి యజ్జుహోశి దదాసియత్
యత్త సస్యసి కౌంతేయ తత్ కురుష్య మదర్పణమ్ అ.9
శ్లో.27
ఓ కౌంతేయా! నీవు ఆచరించు కర్మను, భుజించే ఆహారమును,
హోమము చేయు హవ్యమును అర్పించు దానమును, ఆచరించు తపస్సును నాకే సమర్పింపుము.
అనగా నీవు ఏకర్మను చేసినా దానిని ఆ భగవంతునికే అర్పించుము. భగవంతుని గురించి తెలుసుకోవాలంటే మనం జ్ఞానమార్గాన్ని
కాని భక్తి మార్గాన్ని కాని అనుసరించవచ్చు.
సులభమయినది భక్తి మార్గం. భజన జరిగే
సమయంలో మన ప్రవర్తన ఏవిధంగా ఉండాలి? ఆ సమయంలో
ఏయితర విషయాలయందు ఆసక్తి లేకుండా అనుబంధాలు ఉండకుండా ఆభగవంతునియందే మనసును స్థిరంగా
నిలుపుకోవాలి. మనం ఆఫీసులో విధులను నిర్వర్తించే
సమయంలో కూడా భగవంతుని గురించే ఆలోచిస్తు ఉండాలి.
సాధనలో ముఖ్యమయినది బాబా ప్రముఖంగా చెప్పిన విషయం ‘శ్రధ్ధ’. సహనం,ఓర్పు లేకుండా నీవేమీ నేర్చుకోలేవు, ఏదీ సాధించలేవు.
(స్వామీజీ గారి భాషణాలు ఇంకా ఉన్నాయి)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment