12.08.2018 ఆదివారమ్
ఓమ్
సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
నా భక్తులకు నేను ఋణపడి ఉంటాను
ఈ
రోజు బాబా చేసిన అద్బ్భుతమైన లీల ఒకటి ప్రచురిస్తున్నాను. ఈ లీల చదివిన తరువాత బాబా తన భక్తులనే కాక వారికి
సంబంధించిన వ్యక్తులను కూడా ఎంత జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉంటారో మనకి అర్ధమవుతుంది. ఈ లీల సాయిలీల.ఆర్గ్ నుండి సేకరింపబడింది.
తెలుగు
అనువాదమ్ : ఆత్రేయపురపు త్యాగరాజు
అట్లాంటా
(అమెరికా) ఫోన్. 1571 594 7354
ఒక్కొక్కప్పుడు
సాయిభక్తునియొక్క జీవితగాధ పూర్తిగా రాయవలసిన అవసరం రావడానికి గల కారణం బాబా అతనికి
అడుగడుగునా చేయూతనందించి సహాయం చేయడమే. అటువంటి
అద్భుతమయిన లీల ఈ రోజు మీరు చదవబోయేది. కాని
ఈ లీలను వివరించిన భక్తుడు తన పేరును వెల్లడించలేదు. తన నివాసం కూడా తెలియచేయలేదు. ఈ అజ్ఞానభక్తుడు ఉద్యోగరీత్యా పూనాలో ఉటాడు. ఒకరోజున అతను రోడ్డుమీద నడచుకుంటూ వెడుతున్నపుడు
దారిలో ఒక దుకాణంలో ఉన్న బాబా చిత్రపటం అతడిని ఆకర్షించింది.
ఆఫొటో గురించిన వివరాలను షాపతనిని అడిగాడు. అతను బాబా గురించి ఆయన గొప్పతనాన్నీ వివరించి చెప్పాడు ఆషాపతను అతనికి బాబా ఫోటోను బహుమానంగా ఇచ్చాడు. ప్రతిసారి బాబాగురించిన ఉపన్యాసాలు వినడానికి హాజరయే
భక్త బృందంలో అతని పేరు కూడా చేర్చాడు.
ఆ
సమయంలో ఆ అజ్ఞాతభక్తుని భార్య మొదటిసారిగా గర్భం దాల్చి ఉంది. నెలలు నిండుతున్న కొద్దీ ఆమెను ఇక పుట్టింటికి పంపిద్దామనుకున్నాడు. ఆమెను తీసుకుని రైలెక్కించడానికి స్టేషన్ కి వెళ్ళాడు. ఆమె రైలు ఎక్కుతుండగా ఆమె వెనకాలే తెల్లని కఫనీ
ధరించి ఉన్న ఒక వ్యక్తిని గమనించాడు. అతను
ఆఫకీర్ ని గుర్తు పట్టలేదు. కాని ఆఫకీర్ అనుక్షణం
అతని భార్య వెనకాలే విడవకుండా నుంచుని ఉన్నాడు.
రైలు కదులుతున్నా కూడా ఆ ఫకీర్ ఆమె వెనకాలే ఉన్నాడు. అది చూసి ఆ అజ్ఞాత భక్తునికి ఏమన్న జరగరానిది జరుగుతుందేమోననే
భయం మనసులో కలిగింది. నాలుగురోజుల తరువాత అతని
మామగారు కోపంగా ఉత్తరం వ్రాశారు. ఆ ఉత్తరంలో
ఆయన “అమ్మాయికి ప్రసవం ఎప్పుడు వచ్చేదీ తేదీ సరిగా చూసుకోకుండానే నువ్వెలా పంపించావు?
ఆమెకు రైలులో ఉండగానే మధ్యాహ్నం ప్రసవం అయింది” అని అని రైలులో జరిగిన మొత్తం సమాచారమంతా
తెలియపర్చారు.
నమ్మశక్యం
కాని విషయం ఏమిటంటే ఆమె ఎక్కిన కంపార్ట్ మెంట్ చాలా ఖాళీగా ఉంది. అందులో ఆమె తప్ప మరెవరూ లేరు. ఇదే ఆమెకు మొట్టమొదటి ప్రసవం. మరి అటువంటప్పుడు ప్రసవ సమయంలో బిడ్డకు పురుడు ఎవరు
పోసారు? ఎవరు సహాయం చేసారు? కాని ప్రసవం జరిగే సమయంలో అతని భార్యకు ఎటువంటి
కష్టం కలగలేదు. ఏమి జరిగిందో కూడా ఆమెకు గుర్తులేదు. దానికి కారణం ఆమెను జాగ్రత్తగా చూసుకోవడానికి బాబా
ఆమె వెనకనే అనుక్షణం కనిపెట్టుకుని ఉన్నారు.
మామగారు
వ్రాసిన ఉత్తరం చదివి ఆభక్తుడు ఆనందంలో మునిగిపోయాడు. బాబా చూపిన కరుణకి బాబా ఫొటో ముందు నిలబడి ఆనందభాష్పాలు
కార్చాడు, ఆరోజు రాత్రి బాబా అతనికి స్వప్నంలో
దర్శనమిచ్చి
“అరే? నీవంటివాళ్ళకి నేను ఎన్నోజన్మలనుండి ఋణపడి ఉన్నాను. అందువల్లనే నేను అమ్మాయిని, ఆమె శిశువుని జాగ్రత్తగా
చూసుకోవాల్సిన బాధ్యత తీసుకున్నాను” అని అన్నారు.
ఖాళీగా
ఉన్న ఆ రైలు కంపార్ట్ మెంటులో ఏమి జరిగి ఉంటుందో పాఠకులే ఊహించుకోవచ్చు.
శ్రీసాయి
లీల మాసపత్రిక 1940 సంవత్సరంలోప్రచురింపబడింది.
(సర్వం
శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment