19.01.2019 శనివారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
నామ స్మరణ -
ప్రాణ
రక్షణ
ఈ రోజు మీకొక అధ్భుతమయిన బాబా వారు చేసిన సహాయం గురించి ప్రచురిస్తున్నాను.
ఇంతకు
ముందు నేను భారతీయ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నరసాపురం శాఖలో పనిచేస్తున్న సమయంలో శ్రీ ఎస్.వి.ఎస్. రామప్రసాద్ గారు 2000 వ. సంవత్సరంలో మాకు ఛీఫ్ మానేజరు.
ఆయన పదవీవిరమణ చేసిన
తరువాత ప్రస్తుతం విశాఖపట్నంలో నివాసముంటున్నారు.
క్రిందటివారం నేను విశాఖపట్నం వెళ్ళినపుడు ఆయనను కలుసుకోవడం జరిగింది.
ఆయన
కూడా గొప్ప సాయి భక్తులు.
ఆయన
తన అనుభవాలను చెబుతూ ఉండగా నేను స్వయంగా వ్రాసుకోవడం జరిగింది.
బాబావారి
అనుభూతులను నాతో పంచుకుంటున్న సమయంలో బాబా వారు తనపైన చూపిన అనుగ్రహానికి ఆయన ఎంతగానో ఉద్విగ్నత చెందారు.
ఎంతో
కాలమయినా అప్పటి అనుభూతులను ఆయన నాకు చెబుతున్న సమయంలో ఆయన కంఠం గాద్గదికమయి ఆయన ఒడలు పులకరించింది.
ఇప్పుడు
ఆయన చెప్పిన విషయాలన్నీ యధాతధంగా మీముందు ఉంచుతున్నాను. ఆయన చెప్పిన సంఘటనలకు అనుగుణంగా శ్రీ సాయి సత్ చరిత్రలో బాబా చెప్పిన మాటలను కూడా అధ్యాయాల సంఖ్యలతో (మణెమ్మగారు వ్రాసిన శ్రీసాయి సత్ చరిత్ర) సహా మీకు అందిస్తున్నాను. జరిగిన సంఘటనలకు బాబా సత్ చరిత్రలో బాబా చెప్పిన మాటలను మనం గుర్తు చేసుకుంటూ ఉండాలి.
సాయిబాబా వారు సత్ ఛరిత్రలో ఎల్లప్పుడూ తన నామాన్ని జపించుకుంటూ ఉండమని చెప్పారు.
ఆ విధంగా
చేసినట్లయిటే
బాబావారు తన భక్తులని ఆపద సమయాలలో ఏవిధంగా రక్షిస్తారో ఇది చదివిన తరువాత మనకి పూర్తిగా అర్ధమవుతుంది.
ఇక
ఆయన చెప్పిన విషయాలు ఆయన మాటలలోనే…..
అది 1965వ.సంవత్సరం.
అప్పుడు
నేను 11వ.తరగతి చదువుతున్నాను.
నేను
మొట్టమొదటిసారిగా
నా స్నేహితుల ఇంటిలో బాబా
ఫొటోని చూశాను.
రోజూ
స్కూల్ కి వెళ్ళేటప్పుడు నా స్నేహితులు బాబా ఊదీ పెట్టుకుని
నాకు కూడా పెట్టేవారు.
ఆయన
ఎవరు అని నేను అడిగినప్పుడు ఆయన మా తాతగారు అని చెప్పేవారు.
వారు
ప్రతి గురువారం మల్కాజిగిరి గుడికి కుటుంబ సభ్యులతో
వెళ్ళి మరునాడు ప్రొద్దున్న నాకు ప్రసాదం పెడుతూ ఉండేవారు.
అది 1991 వ.సంవత్సరం. అప్పుడు మా పాపకు ఏడు నెలలు. మా ఆవిడ మొక్కు తీర్చుకోవడానికి మొట్టమొదటిసారిగా షిరిడి కి వెళ్ళాము. అప్పటినుండి ప్రతి సంవత్సరం కనీసం ఒక సారయినా వెళ్ళాలని నియమం పెట్టుకుని ఆ విధంగా 2011వ సంవత్సరం వరకు షిరిడీకి వెళ్ళి వచ్చేవాళ్లం. తరువాత నాకు హార్ట్ ఆపరేషన్ అయిన తరువాత ప్రతి సంవత్సరం వెళ్లలేకపోతున్నాము. నాలుగు సంవత్సరములకు ఒక మాటు వెళ్ళడం జరుగుతోంది. బాబా సత్ చరిత్ర శ్రీ అమ్ముల సాంబశివరావుగారు వ్రాసినది, హేమాద్ పంత్ వ్రాసినది, మణెమ్మగారు వ్రాసినది కొన్ని సార్లు చదివాను.
రోజుకొక అధ్యాయం చదవడం అలవాటు చేసుకొన్నాను. ఇది కాకుండా ప్రతిరోజు సాయి జీవిత చరిత్ర చిన్న పుస్తకం చదువుతూ ఉండేవాడిని.
ఈమధ్య కాలంలో రెండు సార్లు సాయివ్రతం కూడా చేసుకున్నాము. ఊపిరి తీసుకుని ఊపిరి వదిలే మధ్యకాలంలో బాబావారు కూర్చుని మన జీవితాన్ని నడిపిస్తున్నారు. అది నా ధృఢ సంల్పం.
ఏరోజు ఏదేవతామూర్తికి ఇష్టమయినదో ఆ దేవతామూర్తికి సంబంధించిన స్తోత్రాలు, శ్లోకాలు ఆయా రోజులని బట్టి చదువుకోవడం నాకు చిన్నప్పటినుంచి అలవాటు. ఏడాదిన్నర క్రితం వచ్చిన నా ఆలోచనా పద్ధతి ఏమిటంటే సర్వగురుదేవ స్వరూప, సకల దేవీ దేవతా స్వరూప, సకల జీవ చైతన్య మూర్తి ఈ బాబాయే అని.
ఇది నా ప్రగాఢ నమ్మకం. గత 50 ఏండ్లుగా ఈ నా నమ్మకం అభివృధ్ధి చెందుతూ రావడం కారణంగా బాబావారి సంకల్ప సిధ్ధితో సాయిదశనామావళి ఒక్కటే ప్రతి క్షణం జపించుకుంటూ ఉండటం అలవాటు చేసుకొన్నాను. (ప్రతిఘడియ సాయినామం జపించేవారిని సాయి తరింపచేస్తారు అ. 22) ఆయన దయతోటే నిద్రలో కూడా దశనామావళి పారాయణ జరుగుతోందనే నమ్మకంతో బాబావారికి ఎంతో కృతజ్ణుడిగా ఉంటున్నాను. ఆయన దయ మూలంగానే, తలపెట్టిన కార్యాలన్నీ సులువుగాను, సులభంగాను. నిర్విఘ్నంగాను, జయప్రదంగాను, సానుకూలంగాను, దిగ్విజయంగాను జరుగుతున్నాయని అనడానికి నా స్వానుభవమే నిదర్శనం.
నీకు నాకు ఏడు జన్మల సంబంధం అని బాబావారు ఉద్ఘాటించే సాయిమాట ఈ జన్మలో గత 53 సంవత్సరాలుగా నిజరూపం దాల్చడం ఎంతో ఆనందదాయకమయిన విషయం.
బాబాకు అర్పించకుండా పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోని అలవాటు ఆయన నాకు 1993 నుంచి అలవాటు చేసారు. ఈ విషయమై నన్ను కొంతమంది ప్రశ్నించారు. “బ్రాందీ గాని, విస్కీ గాని త్రాగవలసి వస్తే అది కూడా బాబాకి సమర్పించే
తాగుతావా?” దానికి నా జవాబు, “బాబా అనుగ్రహంతో అటువంటి అలవాటులు కాలేదు, కాబోవు. ఒకవేళ అలాంటి పరిస్థితే ఏర్పడితే
అది కూడా ఆయనకు అర్పించే తాగుతాను” అని జవాబిచ్చాను. (విషయాలను సేవించేటప్పుడు బాబా తమ సన్నిధానంలో ఉన్నట్లుగా భావిస్తే ఇవి సేవించతగినవా లేక సేవించతగనివా అన్న ఆలోచన మనసుకు తోచి, సహజంగా సేవించతగనివానిని వదలిపెడతారు. ఈ విధంగా భక్తులకు సేవించతగని వానిపై విరక్తి కలిగి వ్యసనాలు తొలగిపోతాయి. అ.24) మనం
తింటున్న ఆహారం గాని, తాగుతున్న పానీయాలు గాని,
వేసుకుంటున్న మందులు గాని కట్టుకునే బట్టగాని, బాబాకి అర్పించే తీసుకోవడం వలన ఎంతో వృష్టి, పుష్టి,
కలుగుతున్నాయి. (మనసు, బుధ్ధి, ఇంద్రియాలు, విషయాలను అనుభవించే ముందు, నన్ను స్మరిస్తే నాకు వానిని సమర్పించినట్లే. అ. 24)
నాకు హార్ట్ ఆపరేషన్ జరుగుతున్నంత సేపు
సాయినామస్మరణే చేయడం మూలంగా బ్రతికి బట్టకట్టగలిగాను.
(ఎవరు ఎల్లప్పుడూ జిహ్వతో నా నామాన్ని జపం చేస్తూ, నా చరిత్రను గానం చేస్తూ, నా స్మరణ చేస్తూ, నా సేవ చేస్తూ నన్నే ధ్యానం చేస్తుంటారో వారు కర్మాకర్మలు మరచిపోయి నాలో ఐక్యమైపోతారు. నాకు అనన్య శరణు జొచ్చినవారికి నేను ఋణగ్రస్తుడనై, వారిని ఉధ్ధరించి నా ఋణం తీర్చుకుంటాను. ఎవరు ఆకలిదప్పుల స్పృహలు లేకుండా, నాకర్పించనిదే అన్నపానాలు సేవించక, సదా నా నిధి ధ్యాసనలలో ఉంటారో అట్టివారి అధీనంలో నేనుంటాను. అ. 44)
(ఎవరి దృష్టికి సాయి ఒక్కరే తప్ప ఇతర వస్తువేదీ కన్పించదో అట్టివారికి సాయి తప్ప ఖాళీ స్థలమే కన్పించదు. హృదయంలో శ్రీసాయి ప్రేమను నిలుపుకొని నోటితో శ్రీసాయి నామాన్ని జపించేవారి నిత్య యోగక్షేమాలు సాయి స్వయంగా వహించి వారిని రక్షిస్తారు. అ. 37)
(ప్రతిఘడియ సాయినామం జపించేవారిని సాయి తరింపచేస్తారు. అ.22)
ఉద్యోగ పరంగా ఎదురయిన కోర్టుకేసులలో ప్రతిక్షణం, అనుక్షణం సాయిదశనామావళే ప్రతిసారి నన్ను గట్టెక్కించింది. గండాలు గడిచాయి. నేను నిర్దోషినని తేలింది. బాబావారికి ఎన్ని జన్మలు ఎత్తి నా
చర్మం చెప్పులు కుట్టిస్తే ఆయన ఋణం తీరుతుంది అన్న భావన నారోమరోమాల్లోను నిలిచిపోయింది.
దేవుని నమ్మినవాడు ఎన్నటికీ చెడిపోడు. “ఆకలికి అన్నము, వేదనకు ఔషధము పరమాత్ముని సన్నిధికి రావే ఓ మనసా” అన్న చిన్నప్పటి పాటలో ఎంతయినా అర్ధం
ఉందని ప్రతిక్షణం నెమరు వేసుకుంటూ ఉంటాను.
(ఈ పాట రాము చిత్రంలో ఘంటసాల పాడారు రారా కృష్ణయ్యా రారా కృష్ణయ్యా)
ఎంతోమంది ఆధ్యాత్మికవేత్తలు, ఎంతోమంది గురువులు, వారి వారి పధ్ధతులను ఆచరించమని ఎన్ని
ప్రోద్బలాలు చేసినా జీవితంలో నాగురువు బాబా ఒక్కరే. నేను గురువును మార్చను, వేరే పద్ధతులు ఏమీ ఆచరించను అని నిష్కర్షగా చెప్పి బాబా పధంలోనే నడుస్తూ ఉండటం
ఆయన అభయహస్తంలో నాకు కలిగిన పెద్ద ఉపదేశం, పెద్ద నమ్మకం,
విశ్వాసం.
షిరిడీ వెళ్ళిన ప్రతిసారి ఊరినుండి బయలుదేరిన
దగ్గరనుండి మళ్ళీ ఇంటికి చేరేవరకు, గురుస్థానము
చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ సాయిదశనామావళిని చదువుతూ ఉండటం ఒక అలవాటుగా మారింది. 2006 వ.సంవత్సరంలో
అహ్మదాబాద్ నుండి షిరిడీ చేరుకునేటప్పటికి రాత్రి పది గంటలు అయింది. హారతి జరుగుతూ ఉంది. బాబావారిని కిటికీలోనుండే దర్శించుకున్నాను. తరువాత రెండు రోజులు సెలవు దినాలు
కావడం వల్ల ఇసుకవేస్తే రాలనంత జనం.
ప్రదక్షిణాలు చేయడానికి కూడా వీలు కుదరదేమో అనే బెంగతో రాత్రి 2.30 కే స్నానపానాదులు ముగించుకుని
3.30 దగ్గరనుంచి గురుస్థానం చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ దశనామావళి చదువుతూ ఉన్నాను.
ఆ సమయంలో ఒక స్త్రీ మూర్తి నన్ను
పిలిచి, “నా దగ్గర స్వామివారి మంగళస్నానం,
కాకడ ఆరతికి రెండు పాసులున్నాయి. నా స్నేహితురాలు రాలేదు మీరు రాగలరా”
అని ఆ పాసులు నా చేతిలో పెట్టి నన్ను బాబావారి వెనకద్వారం గుండా లోపలికి
తీసుకునివెళ్ళింది. బాబావారి
మంగళస్నానాలు, కాకడ ఆరతి జరుగుతున్నంతసేపు బాబా ఆశీర్వచనంతో నాకు
కలిగిన ఆ ఆకస్మిక అవకాశానికి నేను ఉద్వేగానికి గురయ్యి దశనామావళి చదువుకుంటు బాబావేపే
తదేకంగా చూస్తూ కళ్ళంబట ధారగా కన్నీరు కార్చుకుంటు బాబా దివ్యమంగళ విగ్రహాన్ని తనివి తీరా చూస్తూ ఉండిపోయాను.
(ఒక్కసారి ప్రేమతో వారిని చూస్తే జన్మాంతం వారికి అంకిరమైపోతారు. వారు కేవలం అనన్యమైన ప్రేమను కాంక్షిస్తారు సర్వకాల సర్వవేళలలో ప్రక్కనే నిలబడేఉంటారు. అ. 33) ఆరతి జరుగుతున్నంత సేపు మధ్యమధ్యలో
కుడివేపు గల ఆడవారి క్యూలో ఆ స్త్రీమూర్తిని చూస్తూ కృతజ్ణతా పూర్వకంగా నమస్కారం చేసుకున్నాను. మధ్యలో ఒకమాటు చూస్తే ఆస్త్రీల మధ్యలో
ఆవిడ కనిపించలేదు.
తాను బెంగళురుకు సంబంధించిన ఒక వైద్యురాలినని మాత్రం చెప్పారు. కాని నాకనిపించేది ఎప్పుడూ ఒక్కటె. బాబాయే ఆతల్లి రూపంలో వచ్చి నన్ను
ఆరతికి లోపలికి తీసుకుని వెళ్ళి ఆశీర్వచనం ఇచ్చారని. ఈ ప్రదక్షిణ అయిన తరువాత నేను క్యూ కాంప్లెక్స్ లో నుంచుని ఉన్నట్లయితే దర్శనానికి
కనీసం అయిదారు గంటలు పట్టేది. నాతో వచ్చినవారు అలాగే అయిదారు గంటల తరువాత నన్ను కలుసుకొన్నారు. బాబా దయ ఉంటే అన్నీ ఇలాగే అమరుతాయి.
నన్ను నమ్మిన భక్తులని సప్తసముధ్రాల
తరువాత ఉన్నా వారు మంటల్లో ఉన్నా
వారికి కూడా నేను రక్షణ ఇస్తాను. అన్నది అక్షరాలా నాజీవితంలో జరిగింది.
(సాయి సమర్ధునికి భక్తులకు రాబోవు సంకటావస్థలు ముందే తెలుస్తాయి అ.21)
(మీరెక్కడున్నా సరే, ఏం చేస్తున్నా సరే, మీ విషయాలన్నీ నాకు సంపూర్ణంగా తెలుస్తాయన్న విషయాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోండి. అ.3)
2004వ.సంవత్సరంలో అహ్మదాబాద్
నుంచి షిరిడీకి నేను, నా తెలుగు సహోద్యోగులు ముగ్గురితో కలిసి షిరిడీ బయలుదేరాను. అది స్లీపర్
బస్సు. అంతకు ముందు ఒకమాటు
నేను స్లీపర్ బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు సహ్యాద్రి పర్వతాల ఘాట్
రోడ్డులో డ్రైవరు బ్రేక్ వేసినపుడెల్లా నా తల ముందున్న ఇంకొక బెర్తు కమ్మీకి కొట్టుకొని చాలా
బాధనిపించేది. ఆకారణం
చేత 2004వ.సంవత్సరంలో వెడుతున్నపుడు నేను
బెర్తు బుక్ చేసుకోకుండా సీటు మాత్రమే బుక్ చేసుకొన్నాను. ఒక స్నేహితుడు నాసీటుకు పైనున్న సింగిల్
బెర్త్ లో పడుకొని ఒక సాంఘిక నవల చదువుతున్నాడు. నాసీటు గ్లాసు డోర్ కి వెనుక ఉన్న
మొదటి సీటు. మిగితా ఇద్దరు
స్నేహితులు నాకు కుడివైపు పైన ఉన్న పెద్ద బెర్త్ మీద పడుకొని సాయి భజనలు చేసుకొంటున్నారు. సాయి
స్తోత్రాలు చేస్తున్నారు. ఒక గంట ప్రయాణం తరువాత నడియాద్ లో ఇద్దరు దంపతులు బస్సెక్కి డ్రైవరు వెనుక గల
డబుల్ సీటులో కూర్చొన్నారు. నడియాడ్ నుండి బస్సు బయలుదేరి ఒక అరగంట ప్రయాణం
చేసింది. డ్రైవరు చాలా చాకచక్యంతో ఎన్నో లారీలు, బస్సులను ఓవర్
టేక్ చేస్తూ చాలా స్పీడుగా నడుపుతున్నాడు. నేను అలవాటుగా ఎప్పటిలాగానే ఇంటిదగ్గర
బయలుదేరిన దగ్గరనుంచి, సాయి దశనామావళి చదువుకుంటూ ప్రయాణం చేస్తున్నాను. సీటులో చిన్న ఇసుకరేణువు ఉన్నా నాకు వెంటనే ఒళ్లంతా నొప్పులు పుట్టేస్తుంది. అందుకని సీటు దులుపుకుందామని సీటు
ఎడ్జ్ మీద కూర్చొని దుమ్ము దులుపుతూ ఉండగా చాలా ఇసుకరేణువులు ఉన్న మూలంగా ఎక్కువ సమయం
శుభ్రం చేసుకోవలసి వచ్చింది. అలా దులుపుకుంటూ సీటు ఎడ్జ్ మీద కూర్చునే బాబా దశనామావళి చదువుకుంటూనే అద్దాలలోనుండి
డ్రైవర్ ని చూస్తున్నాను. ఇంతలో మా బస్సుకు ఎదురుగా ఒక లారీ అతి వేగంగా వచ్చి హెడ్ ఆన్ కొలిజన్ జరిగింది. లారీ ముందు భాగమంతా నుగ్గునుగ్గయిపోయి
డ్రైవర్ అక్కడిక్కడె మరణించాడు. మా బస్సు డ్రైవరు రెండు కాళ్ళు నుగ్గునుగ్గయి ఇంజనులో ఇరుక్కుపోయాయి. అకస్మాత్తుగా జరిగిన ఆ ఘోర ప్రమాదానికి
డ్రైవర్ వెనుక సీటులో కూర్చొన్న దంపతులకి ముక్కులు, మొహాలు బాబా
చితికిపోయి రక్తం కారడం మొదలయింది.
నాపై బెర్తులో పడుకున్న నా స్నేహితునికి నడుం పట్టేసి మనిషంతా
‘S’ ఆకారంలో పది పదిహేను రోజులు వంకరగా నడవడం జరిగింది. ఇది సాంఘిక నవల చదువుతూ కాలక్షేపం
చేయడం మూలంగానే జరిగి ఉంటుందని ఆ తరువాత అనుకున్నాము. (నాయందు లక్ష్యమున్నవారికి ఏ కష్టాలుండవు. నన్ను మరచిపోయిన వారిని మాయ బాధిస్తుంది. అ.3) మా సీటుకి కుడివైపు ఉన్న పై బెర్త్
లోని ఇద్దరు స్నేహితులు డ్రైవర్ వెనక ఉన్న మెష్ వరకు వెళ్ళి ఆగిపోయారు. వారికి చీమంత గాయాలు కూడా కలుగలేదు. సీటుకి ఎడ్జ్ మీద కూర్చుని దుమ్ము
దులుపుకుంటున్న నాకు ఎవరో రెండు చేతులు నాఛాతీకి అదిమిపట్టి
నేను క్రింద పడిపోకుండా ఎదురుగా ఉన్న గాజు తలుపుకి కొట్టుకోకుండా వెంట్రుకవాసి
అంత ప్రమాదం కూడా జరుగకుండా నన్ను కాపాడిన ఆ అదృశ్యశక్తి బాబావారు తప్ప ఇంకెవరూ కాదు.(ఎవరు నన్నెల్లప్పుడూ స్మరిస్తుంటారో, వారిని నేను నిరంతరం గుర్తుంచుకుంటాను, నాకు గుర్రపుబండిగాని, రైలుబండిగాని, లేక విమానంగాని అవసరం లేదు. ప్రీతిగా పిలిస్తే చాలు, ఏం ఆలస్యం చేయకుండా తక్షణం ప్రకటమౌతాను. అ. 40) (నాయొక్క ఈ అవతారం సార్ధకం. సదా నాయందు ధ్యానముంచువారి యోగక్షేమాలు నేను వహిస్తాను. అ.3) మరలా నాకు జీవితం ప్రసాదించినందుకు జన్మ జన్మలకీ బాబాకు ఎంత కృతజ్ణత చెప్పుకుంటె ఆయన ఋణం తీరుతుంది? ఆయనను నమ్మినవారికి ఎటువంటి హానీ
కలుగదు. అంతా హామీ మరియు
అభయ హస్తం. (బాబా పైకి కన్పించేలా ఏమీ చేసేవారు కారు. తమ స్థానాన్ని వదిలి ఎక్కడికీ వెళ్ళకపోయినా, తాము కూర్చున్న స్థలంలోనే అన్నీ గ్రహించి జనులకు సకల అనుభవాలను కల్గించేవారు. అ.14)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment