02.02.2019 శనివారమ్
ఓమ్
సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ముత్యాల
సరాలు
సాయిబాబా
వారి సత్సంగ సభ్యురాలు ఒకరు నాలుగయిదు సంవత్సరాల క్రితం “ముత్యాల సరాలు” పేరుతో కొన్ని
మంచి మంచి సందేశాలను వ్రాసి ఇచ్చారు. వాటిని
ఇప్పుడు మనందరికోసం ప్రచురిస్తున్నాను. ఈ సందేశాలను
మననం చేసుకుంటూ ఆకళింపు చేసుకున్నట్లయితే ఆధ్యాత్మిక జీవనానికి దారిని ఏర్పరుస్తుంది.
ఓమ్
సాయిరామ్
01. ఆడిగితే చేసేది సహాయం – అడగకుండానే చేసేది సాయం. ఆపదలో, కష్టాలలో, దుఃఖాలలో ఉన్నవారికి చేసేది దైవసాయం. మానవుడు ఈ స్థాయికి ఎదగాలి.
02. అపకారికి
కూడా ఉపకారం చెయ్యటం మానవత్వం.
03. అనన్యమైన
భక్తి కలవారు తమకు ఎన్ని కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా దైవ చింతన మానరు. మనకి సంపద ఉన్నంత వరకు అందరూ ఆత్మీయులమని మన చుట్టూ
చేరుతారు. కష్టాలు, నష్టాలు వచ్చినప్పుడు ఎవరూ
దరి చేరరు. అలాంటి సమయంలోనే భగవంతుని పరీక్షలాగ
అనారోగ్యం కలుగవచ్చును. ఎంతటి క్లిష్ట పరిస్థితులు
ఎదురైనా, నమ్మకం కోల్పోకుండా బాబాను స్మరిస్తే బాబా కటాక్షంతో కష్టాలు తొలగిపోతాయి.
04. భగవంతుడు
ఎప్ప్పుడూ ధర్మమార్గములలో నడిచేవారికే సహాయ పడతాడు.
05. భాబాగారి
మీద భారం వేస్తే దుఃఖాలను, కష్టాలను తప్పించుకొనవచ్చును. లేకుంటే తట్టుకొనే మనోధైర్యము ఇవ్వవచ్చు. మన నమ్మకమే మనకు శ్రీరామ రక్ష.
06. సాయిని
ఆశ్రయిస్తే ఏదో ఒక రూపంలో వచ్చి మనకి సహాయం అందజేస్తాడు.
07. కొందరు సుఖదుఃఖాలను సమానంగా భావించి సంతృప్తిగా
ఉంటారు.
09.
దానం చెయ్యకుండా దాచిన ధనం, ఎవరికీ ఉపయోగపడక వృధా
అవుతుంది. సమయానికి అవసరం ఉన్నవారికి దానం
చేస్తే అవసరం తీర్చిన తృప్తి ఉంటుంది.
10. అనునిత్యం
భగవత్ నామ స్మరణ అలవరచుకొంటే మన అంతిమ ఘడియలు చిత్త శాంతితో, ఆనందంగా నిశ్చింతగా మరణాన్ని
భరించే శక్తి భగవంతుడే ఇస్తాడు.
11.
పూలలతో, నోములతో ప్రదక్షిణలతో, అభిషేకాలతో, ఉపవాసాలతో,
భజనలతో మనం దేవుని అర్చిచుకొంటున్నాము. ఆయన
సేవలో ఉన్నాము అని తలుస్తూ ఉంటాము. చాలా సార్లు
ఆశించిన ఫలితాలు రాకపోవడంతో శ్రధ్ధ, సహనాన్ని కోల్పోతుంటాము. ఇలా ఎందుకు జరిగింది అని విశ్లేషిస్తే మనకు ఒక విషయం
అర్ధం అవుతుంది. దేవుని దగ్గర ఉన్న మన ఖాతాలో
మనం చేసిన పూజ, తదితర కార్యక్రమాల ద్వారా ఏమాత్రం నిలవలు పెరగలేదని. మరి మనం ఏమి చేస్తే భగవంతుడు ప్రీతిపాత్రుడై ఆయన
వద్దనున్న మన ఖాతా నిల్వలు పెంచుతాడన్నది మన ముందున్న ప్రశ్న.
భగవంతుడు
మెచ్చే మొదటి శ్రేణి భక్తుడు ఎవరయ్యా అంటే నిత్యం గుడికి వచ్చి పుష్పాలతో పూజించి తన
దర్శనం చేసుకొనేవాడు కాదుట. మరి? కష్టాలతో
కృంగి, విపత్తులతో నలిగిపోయే అభాగ్య జీవులకి అండగా ఉండి చేయూతనిచ్చి ఆదుకొనే ఉదార హృదయులేనట. అందుకే కష్టాలలో ఉన్నవారికి వీలున్నంతవరకు సహకరించాలి. ఇదే సద్గురు సాయి మనకి చూపిన నిజమైన మార్గం.
గ్రంధాలు
పఠించడం ముఖ్యం కాదు. వాటిలోని విషయాలను ఆచరించినపుడే
పుస్తక పఠనం వలన ప్రయోజనం కలుగుతుంది. మనం
వాటిలోని ధర్మ సూత్రాలను, ఆచరించినపుడే మనకు గ్రంధపఠనం విలువ తెలుస్తుంది.
12. నిరంతర
నామం దీర్ఘవ్యాధులని నయం చేస్తుంది.
13. ఋణ
సంబంధం - భార్యకి భర్త, భర్తకి భార్య, పిల్లలు. ఇవి అన్నీ గత జన్మల ఋణానుబంధాలు. ఋణబంధం తీరిపోయాక ఒకరితో ఒకరికి సంబంధం ఉండదు.
14. నాది
కాని దేహాన్ని, నాది అని అనుకొంటున్నాను కాబట్టి ఇలా ఎంతకాలం అనుకొంటానో, అంతకాలం ఇలా
శరీరాలను మోస్తూ ఉండవలసినదే. మీరు యాత్రలు
చేయండి, నదులలో మునగండి, సత్సంగాలకి వెళ్ళండి, జపాలు చేయండి, ధ్యానాలు చేయండి, మంచి
గ్రంధాలు చదవండి, వీటి అన్నిటి ప్రయోజనం ఏమిటి అంటే దేహాత్మ భావన పోయి బ్రహ్మాత్మ భావన
రావాలి. అప్పుడు దేహమే నేను అనే బుధ్ధి ఎంతకాలం
నీకు ఉంటుందో అంతకాలం నిన్ను అశాంతి విఢిచి పెట్టదు. దుఃఖం విఢిచి పెట్టదు. నీవు కాని దానిని నీవు అనుకొన్నంత సేపూ ఈ చండాలం
అంతా భరించవలసినదే.
15. యోగం అంటే లేనిది ఇవ్వడం. క్షేమం అంటే ఉన్నది పోకుండా చూడటం.
(ఇంకా ఉన్నాయి)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment