04.03.2019 సోమవారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ షిరిడీ సాయిబాబా తో స్నేహబంధమ్ –
10 వ.భాగమ్
YOU BRING US JOY MERE KHWAJA
FRIENDSHIP WITH GOD
LORRAINE WALSHE RYAN & FRIENDS
బాబాతో సాన్నిహిత్యమ్ -
2007 వ.సంవత్సరమ్ డైరీ
తెలుగు అనువాదమ్ : ఆత్రేయపురపు త్యాగరాజు
నిజాంపేట, హైదరాబాద్
ఫోన్ : 9440375411
8143626744
ఇందులో నాకు నచ్చినవి మాత్రమే
ప్రచురిస్తున్నాను. నిజం చెప్పాలంటే
ఏదీ వదలడానికి లేకుండా ఉన్నాయి. కాని పరిమితుల
వల్ల కొన్నిటిని మాత్రమే ప్రచురిస్తున్నాను.
దీనికి సంబంధించిన అన్ని హక్కులు సాయిదర్బార్, హైదరాబాద్ వారివి. దీనిలోని ఏ భాగము కూడా
మరే ఇతర బ్లాగులలోను ప్రచురించరాదని సవినయంగా మనవి చేస్తున్నాను. సాయిబానిస శ్రీరావాడ గోపాలరావుగారు ప్రత్యేకంగా నాకు అనుమతినిచ్చినందువల్ల
నేను మరెవరికీ అనుమతిని ప్రసాదించలేను.
ఓమ్ సాయిరామ్
నాడీ జాతక వివరాలు చదివిన తరువాత బాబా ఆమె
తలచుకున్న వెంటనే ఏ విధంగా దర్శనమిస్తున్నారో, ఆవిడ
అడిగిన విధంగా ఏది కోరితే అది ఎందుకని తీరుస్తున్నారో ఈ పాటికి పాఠకులు గ్రహించే
ఉంటారు. కాని ఆయన మనకు కూడా పలుకుతారు. కావలసినది శ్రధ్ధ, సబూరి....
01.01.2007
బాబాని అడగండి. ఆయన మీరడిగినవి ఇస్తారు. ఈ రోజు నూతన సంవత్సరం మొదటిరోజు. ఉదయం ప్రార్ధన చేసుకుంటూ బాబా!
ఈ రోజు నేను డైరీలో వ్రాసుకోవడానికి నాకేదయినా విశేషాన్ని అనుగ్రహించు
అని వేడుకొన్నాను. నేను
అడిగిన వెంటనే బాబా అనుగ్రహించారు.
గోడమీద నాకు బాబా సాక్షాత్కరించారు. ఆయన ధరించిన కఫనీ తెలుపు రంగులోకి
మారింది. బాబా కదులుతూ
ఉన్నారు. ఆయన తన రెండు
చేతులను పైకెత్తుతూ ఆశీర్వదిస్తున్నారు.
ఈ విధంగా అయిదు నిమిషాలపాటు ఆయన దర్శన భాగ్యం కలిగింది. ప్రత్యేకంగా నూతన సంవత్సరం మొట్టమొదటిరోజున
బాబా నాకు ఆవిధంగా దర్శనమిచ్చినందుకు ఎంతగానో ఉప్పొంగిపోయి ధన్యవాదాలు తెలుపుకొన్నాను.
నేను నూతన సంవత్సరం నాడు సిడ్నీలో ఎప్పుడు ఉన్నా ఆరోజున మాఇంటి చుట్టూ తిరుగుతూ మాఇంటిని ఊదీతో దీవిస్తూ ఉంటాను. చాలా వారాలపాటు నేను ఇక్కడ లేని కారణంతా
ఈ సంవత్సరం మాయింటిని దీవించుకునే అవకాశం నాకీరోజున కలిగింది. ఇంటి చుట్టూరా తిరుగుతూ గాయత్రి మంత్రాన్ని
108 సార్లు జపించుదామని నిర్ణయించుకున్నాను. ఆవిధంగా జపిస్తూ పూజాగదిలోనికి ప్రవేశించాను. పూజాగదిలో ఒక మూల చీకటిగా ఉన్నచోట
బాబా పాదాలు ఉన్నాయి. నేను గదిలోకి ప్రవేశించగానే బాబా పాదాలు మెరుస్తూ కన్పించసాగాయి. కళ్ళు విప్పార్చి ఆ దృశ్యాన్ని తిలకిస్తున్నాను. అక్కడ అలాగే నిలుచుని గాయత్రి మంత్రాన్ని జపించుకుంటూనే ఉన్నాను. గాయత్రి మంత్రం ఆఖరి పునశ్చరణ పూర్తి కాగానే బాబా పాదాలు యధావిధిగా మునుపటి రంగులోకి
మారిపోయాయి.
14.01.2007 మకర సంక్రాంతి
స్నానం చేసి రాగానే, గాఢమయిన చందన పరిమళం నాముక్కు పుటాలకు సోకింది. ఇంటిలో అసలు చందనమే లేదు. ఒక్కసారిగా ఆశ్చర్యం కలిగింది. పూజా గదిలోకి వెళ్ళాను మరలా గదిలోనుండి చందన పరిమళం
మునుపటిలాగా ఎక్కువగా రాసాగింది. బాబాను ప్రార్ధన చేసేముందు, బాబాని అడిగాను.
“బాబా, అది చందనపు పరిమళమేనా?”. పింక్ కలర్ లో ఉన్న బాబా ఫొటోలో ఆయన
కళ్ళు అవునన్నట్లుగా కదిలాయి.
నిజమే బాబా నాతో చెబుతున్నారు.
నాకు నమ్మకం ఉంది.
కొంత ఊదీ తీసుకుని కొంత బాబా నుదుటి మీద రాసి, మిగిలినది నానుదుటి మీద రాసుకొన్నాను.
IAAWY (I AM ALWAYS WITH YOU) పుస్తకం కాపీ ఒకటి
Mr. G అనే ఆయనకు ఇద్దామని రైలులో బయలుదేరాను. ఆయనది పెద్ద వయసు. ఆయన ఇంగిల్ బర్న్ లో ఉంటున్నారు. ఆయన ఇంటిముందు నుంచి ప్రవేశద్వారం వరకు
చక్కని పూలతోటను పెంచుతున్నారు. ఆతోట సన్నజాజులు, మల్లెపూలు, గులాబీ మొక్కలతో కనువిందు చేస్తూ ఉంది. షిరిడీలో బాబా పూలతోటను పెంచినట్లే ఈయన కూడా చక్కని పూలతోటను పెంచుతున్నారనే నానమ్మకం. Mr.G గారి ఇంటిలో మాయింటిలో ఉన్న
బాబా ఫోటోలకన్నా ఎక్కువగానే ఉన్నాయి.
ఆయన నన్ను తన ఇంటి చుట్టూ తిప్పి అంతా చూపించారు. తరువాత నన్ను ఒక గదిలోకి తీసుకొని
వెళ్ళారు. ఆ గదిని ప్రత్యేకంగా
బాబా కోసమే ఉంచేశారు. ఆ గదిలో బాబా శయనించడానికి మంచం కూడా ఏర్పాటు చేసారు.. నేనా గదిలోకి ప్రవేశించగానే నాపాదలముందు
ఒక పువ్వు రాలి పడింది. బాబా తన గదిలోకి నన్ను ఆహ్వానిస్తున్నట్లుగా ఒక పుష్పాన్ని జారవిఢిచారని బాబా
ఆవిధంగా చేస్తారని Mr.G అనగానే నాకెంతో సంతోషం కలిగింది. ఆయన అన్నదానికి అవునన్నట్లుగా తలూపి,
నాకు ఆహ్వానం పలుకుతూ బాబా నన్నాశీర్వదిస్తున్నట్లుగా జారవిఢిచిన పుష్పాన్ని
నేను తీసుకోనా అని అడిగాను. ఆ తరువాత బాబా గదిలో మేము సత్సంగం చేసుకున్నాము. త్వరలోనే తన ఇంటిలో భజన ఏర్పాటు చేస్తున్నానని,
దానికి రావలసిందిగా నన్ను అహ్వానించారు. ఆయనకి నేను రాసిన IAAWY పుస్తకం ప్రతిని ఇచ్చాను. ఆయన తన తోటలోని పూలు గుప్పెడు కోసి నాకు ఇచ్చారు.
రాత్రి పడుకునేముందు బాబా అనుగ్రహంతో
ఆరోజంతా సంతోషంగా గడిపిన క్షణాలన్నిటినీ గుర్తు చేసుకుంటూ ఉన్నాను. నా చెవికి చాలా దగ్గరగా మృదువుగా
గణగణమని గంట మోగుతున్న శబ్దం చాలా స్పష్టంగా వినిపించింది. ఎప్పుడయినా ఎక్కడయినా అకస్మాత్తుగా
అటువంటి గంట మోగుతున్న శబ్దం వినిపించినట్లయితే అది ఏంజెల్ (దేవకన్య)
యొక్క రెక్కల సవ్వడి అని అంటారు. ఒక ఏంజెల్ రెక్కలనాడిస్తూ ఇంటిలో
తిరుగుతూ ఉందని గ్రహించుకోగానే ఎంతో ఆనందం కలిగింది. ఆనందం ఎందుకు కలగదు. తరచూ అవి ఇక్కడ ఎగురుతూనే ఉంటాయి.
16/17.02.2007 మహాశివరాత్రి
మహాశివరాత్రి పర్వదినానికి నా మనస్సులో ఒక ప్రత్యేకమయిన స్థానం ఉంది. ఈ సంవత్సరం మహాశివరాత్రి పర్వదినం కోసం నేనొక కఠినమయిన కార్యక్రమం చేయడానికి సంకల్పించాను. శివరాత్రి ఇక రెండు వారాలలో వస్తుందనగా శివరాత్రి రోజుకి నేను "ఓమ్ నమశ్శివాయ" పంచాక్షరీ మంత్రాన్ని తొమ్మిది లక్షల సార్లు జపిద్దామనుకొన్నాను. ఆవిధంగా సంకల్పించుకుని నేను శివ-బాబాని ఈ విధంగా కోరుకొన్నాను. మంత్రజపం తొమ్మిది లక్షలు పూర్తికాగానే అది పూర్తయినట్లుగా నాకేదన్న సంకేతం చూపించు అని అడిగాను.
తరువాత శివరాత్రి రోజున నేను మాస్నేహితురాలి ఇంటికి కారులో బయలుదేరాను. నామంత్ర జపం తొమ్మిది లక్షలు పూర్తయినట్లయితే బాబా ఇచ్చే సూచనల కోసం జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నాను. నాస్నేహితురాలి ఇంటికి చేరుకుని కారుదిగి పార్క్ చేసాను. పైన నీలి ఆకాశంలో త్రిశూలం ఆకారంలో మబ్బు తేలుకుంటూ వెడుతూ ఫుంది. నేను నా స్నేహితురాలి ఇంటిలోకి ప్రవేశించాను. ఇంటిలో అప్పటికే ఉన్న అతిదులు నన్ను సాదరపూర్వకంగా ఆహ్వానించిన తరువాత కిటికీ వద్ద నుంచుని బయటకు చూశాను. బాబా శివ మరలా ఏదయినా సూచన చేసారేమోననే ఆశతో గమనిస్తూ ఉన్నాను. మొట్టమొదటిసారి నా కళ్ళు నన్ను మోసం చేయలేదు. మరలా ఆకాశంలో త్రిశూలం ఆకారంలో మబ్బు, ప్రక్కనే "ఓమ్" ఆకారంలో మరొక మబ్బు కనిపించాయి.
నేను జపించిన ఓమ్ నమశ్శివాయ మంత్రజపానికి మహాశివుడు నిజంగానే ఆనందించాడు. అయితే నేను మంత్రాన్ని తొమ్మిది లక్షల సార్లు జపించాననే నమ్మకం ఏర్పడింది. ఎంత ఆనందకరమయిన విషయం. 9 లక్షల సార్లు ఓమ్ నమశ్శివాయ జపం పూర్తి చేయగలిగినందుకు అంతా ఆనందమే.
ఇంటిలో అందరం కలిసి మాట్లాడుకుంటు ఉన్నాము. మా సంభాషణ ఆధ్యాత్మిక విషయాలు మరియు గురువుల మీదకి మళ్ళింది. అక్కడ ఉన్నవారిలో ఒకామె నాదగ్గరకు వచ్చి, తనకు హెల్త్ ఫుడ్ షాపులో ఒక కాగితం దొరికిందని చెప్పి నాకు ఇచ్చింది. ఆ కాగితం నోవా, ఆ కాగితంలో భగవంతుని గురించి, తెలియచేసే వ్యాసం "Your Heart's Garden" గురించి ఉంది. ఆ వ్యాస రచయిత JB. ఆయన ఇంతకుముందే షిరిడీనుంచి వచ్చారట. ఆయన వ్రాసిన వ్యాసం యొక్క వివరాలు ఆగాగితంలో ఉన్నాయి. ఈ శివరాత్రి రోజున నాకింతటి మహద్భాగ్యం కలిగినందుకు నా ఆనందానికి అవధులు లేవు.
ఆ తరువాత మాసంభాషణ దుర్గాదేవి మీదకు మళ్ళింది. ఒకామె నిశ్శబ్దంగా నావద్దకు వచ్చి తన పర్సులోనుంచి ఒక ఫొటో తీసి నాకిచ్చింది. అద్భుతం.. ఆఫొటోలో అంతకు ముందు నేను ఆకాశంలో చూసినట్లుగానే ఉన్న త్రిశూలం, ఓమ్ చిత్రాలు ఉన్నాయి. ఓమ్ నమశ్శివాయ.
ఓమ్ నమశ్శివాయ పంచాక్షరీ మంత్రం రెండువారాలపాటు 9 లక్షల జపం పూర్తయిన తరువాత బాబా శివ నాకు చూపించిన నిదర్శనాలు వీటన్నిటి ఆలోచనలతో నామనస్సు ఎంతో సంతోషంతో నిండిపోయింది. ఆవిధంగా ఆనందడోలికలలో తేలియాడుతున్న సమయంలో మా యింటికి నాస్నేహితురాలు వచ్చింది. ఆమె నాకు తెల్లని పావురాన్ని పట్టుకుని ఉన్న ఏంజిల్ ప్రతిమని బహుమానంగా ఇచ్చింది. ఆ ప్రతిమ పింగాణీతో తయారు చేయబడినది.
ఆ బొమ్మని నాకు ఇస్తూ " లోరైన్! ఇది నీదే... ఈ బొమ్మ నాకారులో ఉంది. ఎవరిని అడిగినా ఇది తమది కాదని చెప్పారు. అందుచేత ఇది ఖచ్చితంగా నీదే అయి ఉంటుంది" అని చెప్పింది. ఆ బొమ్మ గురించి తన బంధుమిత్రులని కుటుంబ సభ్యులని అందరిని అడిగింది. ఎవరూ కూడ అది తమది కాదనే చెప్పారని అంది.
అది నాది కూడా కాదు. కాని ఎంతో సంతోషంగా నేనా బొమ్మని తీసుకున్నాను. అది నాకు నా షిరిడీ శివ ఇచ్చిన బహుమతి. దీనిని బట్టి నేను ఖచ్చితంగా ఓమ్ నమశ్శివాయ 9 లక్షల సార్లు పూర్తిగా జపంచానని ప్రగాఢంగా నమ్ముతున్నాను.
ఓమ్ నమశ్శివాయ
(ముందుగా మహాశివరాత్రి గురించి ప్రచురిద్దామనుకోలేదు. అనుకోకుండా పుస్తకంలో మహాశివరాత్రి గురించి చదివాను. కాని ఇంకా అనువాదం చేయలేదు. ఇక రాత్రి 8.30 కి అనువాదం మొదలుపెట్టి టైపింగ్ పూర్తి చేసి ప్రచురించాను. ఈ రోజు మహాశివరాత్రి కూడా కలిసి వచ్చింది. తరువాత రోజు ప్రచురించడానికి మనసొప్పక ఈ రోజునే ప్రచురిస్తున్నాను. మహాశివరాత్రి పర్వదినంనాడు దానికి సంబంధించిన బాబా చూపించిన లీలను ప్రచురించకపోతే ఎలా? బాబా నాచేత చేయించారు. నేను కేవలం నిమిత్త మాత్రుణ్ణి. అంతా సాయికే అర్పితమ్. ... ఓమ్ నమశ్శివాయ... త్యాగరాజు)
(ఇంకా ఉన్నాయి)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment