Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Thursday, March 7, 2019

శ్రీ షిరిడీ సాయిబాబా తో స్నేహబంధమ్ – 11 వ.భాగమ్

Posted by tyagaraju on 7:56 AM

       Image result for images of shirdi baba
            Image result for images of beautiful flowers hd

07.03.2019  గురువారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

శ్రీ షిరిడీ సాయిబాబా తో స్నేహబంధమ్ – 11 .భాగమ్ 

YOU BRING US JOY MERE KHWAJA
FRIENDSHIP WITH GOD
LORRAINE WALSHE RYAN & FRIENDS

బాబాతో సాన్నిహిత్యమ్ -  2007 .సంవత్సరమ్
డైరీ

తెలుగు అనువాదమ్ : ఆత్రేయపురపు త్యాగరాజు 
నిజాంపేటహైదరాబాద్ ఫోన్ :  9440375411
8143626744

ఇందులో నాకు నచ్చినవి మాత్రమే ప్రచురిస్తున్నాను.  నిజం చెప్పాలంటే ఏదీ వదలడానికి లేకుండా ఉన్నాయి.  కాని పరిమితుల వల్ల కొన్నిటిని మాత్రమే ప్రచురిస్తున్నాను. 

దీనికి సంబంధించిన అన్ని హక్కులు సాయిదర్బార్హైదరాబాద్ వారివి.  దీనిలోని ఏ భాగము కూడా మరే ఇతర బ్లాగులలోను ప్రచురించరాదని సవినయంగా మనవి చేస్తున్నానుసాయిబానిస శ్రీరావాడ గోపాలరావుగారు ప్రత్యేకంగా నాకు అనుమతినిచ్చినందువల్ల నేను మరెవరికీ అనుమతిని ప్రసాదించలేను.
ఓమ్ సాయిరామ్  

నాడీ జాతక వివరాలు చదివిన తరువాత బాబా ఆమె తలచుకున్న వెంటనే ఏ విధంగా దర్శనమిస్తున్నారోఆవిడ అడిగిన విధంగా ఏది కోరితే అది ఎందుకని తీరుస్తున్నారో ఈ పాటికి పాఠకులు గ్రహించే ఉంటారు.  కాని ఆయన మనకు కూడా పలుకుతారు.  కావలసినది శ్రధ్ధసబూరి....

23.11.2007

               Image result for images of candle before baba photo

సాయంత్రం 6 గంటలకు ఆన్ లైన్ లో బాబా ఆరతి చూసేముందు బాబాని ఒక కోరిక కోరుకొన్నాను. --- “బాబా! నీముందు వెలిగించబడిన ఈ కొవ్వొత్తి 4 గంటలపాటు మాత్రమే వెలుగుతుంది. ఈ కొవ్వొత్తి దీపాన్ని రాత్రంతా వెలిగేలా చెయ్యి.  లేకపోతే నువ్వు రాత్రంతా చీకటిలో ఉంటావు.  నాలుగు గంటల తరువాత నేను నిద్రనుంచి లేచి మళ్ళి మరొక కొవ్వొత్తిని వెలిగించలేను.  ఈ కొవ్వొత్తి రాత్రంతా వెలిగేలా చేసినట్లయితే అది చాలా అద్భుతమయిన లీల”.  నేను ఈ విధంగా బాబాని కోరుకోవడానికి ఒక కారణం ఉంది.  అబ్దుల్ బాబా, బాబా కోసం ఎప్పుడూ దీపాలు వెలిగించి ఉంచుతూ ఉండేవాడు.  అతనిలాగె నేను కూడా చేద్దామనే ఆలోచనతో ఆవిధంగా కొరుకొన్నాను.  ఆతరువాత నేను నిద్ర పోయాను.

పొద్దున్న 6.45 కు లేచాను.  లేచిన వెంటనే పూజాగదిలోకి వెళ్ళాను.  అద్భుతమ్, ఆశ్చర్యం --- రాత్రి వెలిగించిన కొవ్వొత్తి ఇంకా మంచి వెలుగును ప్రసరిస్తూ వెలుగుతూనే ఉంది.  దానిని వెలిగించి 12 గంటలయింది.  12 గంటలపాటు అలా వెలుగుతూనే ఉంది.  బాబా సర్వజ్ఞుడు.  బాబా చూపించిన ఈ లీలకి నాకు నవ్వు వచ్చింది.  ఆయన నా ప్రార్ధనను మన్నించి 4 గంటలపాటె వెలిగే కొవ్వొత్తిని 12 గంటలపాటు వెలిగేలా తన లీలని చూపించారు.

ఈ రోజు శుక్రవారం ఉదయం ఆరతి ఇచ్చేసమయంలో “అల్లా అల్లా” అని నామస్మరణ చేద్దామనుకున్నాను.  అకస్మాత్తుగా బాబా పింక్ కలర్ ఫొటో ముందు వెలిగించిన కొవ్వొత్తి దీపం ఒక్కసారిగా తళుక్కుమని గాలిలోకి వెలుగును విరజిమ్మింది. 
                       Image result for images of candle before baba photo
ఆ మెరుపును చూసి ఒక్కసారిగా అదిరిపడ్డాను.  నా శరీరం వణకడం మొదలుపెట్టింది.  నా రోమాలు నిక్కపొడుచుకొన్నాయి.  పింక్ కలర్ లో ఉన్న బాబా ఫొటోని వింతగా చూసాను.  అవునన్నట్లుగా బాబా మృదువుగా తన కనురెప్పలను మూసి తెరిచారు.  ఈ లీలను నాకు అనుగ్రహించినందుకు ధన్యవాదాలు బాబా…

(ఇంకా ఉన్నాయి)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)







Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List