09.03.2019 శనివారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ షిరిడీ సాయిబాబా తో స్నేహబంధమ్ –12 వ.భాగమ్
YOU BRING US JOY MERE KHWAJA
FRIENDSHIP WITH GOD
LORRAINE WALSHE RYAN & FRIENDS
బాబాతో సాన్నిహిత్యమ్ - డైరీ లో ప్రచురించిన
సాయి భక్తుల అనుభవాలు - 1
తెలుగు అనువాదమ్ : ఆత్రేయపురపు త్యాగరాజు
నిజాంపేట, హైదరాబాద్
ఫోన్ : 9440375411
8143626744
ఇందులో నాకు నచ్చినవి మాత్రమే
ప్రచురిస్తున్నాను. నిజం చెప్పాలంటే
ఏదీ వదలడానికి లేకుండా ఉన్నాయి. కాని పరిమితుల
వల్ల కొన్నిటిని మాత్రమే ప్రచురిస్తున్నాను.
దీనికి సంబంధించిన అన్ని హక్కులు సాయిదర్బార్, హైదరాబాద్ వారివి. దీనిలోని ఏ భాగము కూడా
మరే ఇతర బ్లాగులలోను ప్రచురించరాదని సవినయంగా మనవి చేస్తున్నాను. సాయిబానిస శ్రీరావాడ గోపాలరావుగారు ప్రత్యేకంగా నాకు అనుమతినిచ్చినందువల్ల
నేను మరెవరికీ అనుమతిని ప్రసాదించలేను.
ఓమ్ సాయిరామ్
ఈ రోజునుండి లోరై వాల్ష్ గారి డైరీలో
ప్రచురింపబడ్డ భక్తుల అనుభవాలను కొన్నింటిని ప్రచురిస్తాను. మధ్యమధ్యలో డైరీలోని విషయాలను కూడా కొన్నింటిని
ప్రచురిస్తాను.
సాయిపూనమ్ – చెన్నై గారి అనుభవమ్
నేను మా అమ్మమ్మ, తాతగారి ఇంటిలో ఉన్నపుడు
కొద్ది నెలలక్రితం జరిగింది ఈ సంఘటన. ఆ
రోజు గురువారం. ఉదయం 6 గంటలసమయం. నేను మంచి గాఢనిద్రలో ఉండగా మా తాతగారు “మంటలు
మంటలు” అని పెద్దగా అరుస్తూ ఉండటం వినిపించింది.
నేను వెంటనే లేచి మాతాతగారి దగ్గరకు వెళ్ళి ఎక్కడ మంటలు అని ఆదుర్దాగా
అడిగాను. మేమున్న భవనం రెండవ అంతస్తులో
మంటలు మొదలయ్యాయి. మేము మొదటి అంతస్తులో
నివాసం ఉంటున్నాము. గ్రౌండ్ ఫ్లోర్, రెండవ
అంతస్తులలో ఫ్యాక్టరీ ఉంది. ఈ సంఘటన
జరిగినపుడు మొత్తం భవనంలో నేను, మాతాతగారు, మా అమ్మమ్మగారు ముగ్గురమే
ఉన్నాము. నేను వెంటనే సాయిబాబా సహాయం కోసం
అర్ధించాను. అదే సమయంలో ఒక కార్మికుడు
ఫ్యాక్టరీవైపు వెడుతూ ఉండటం కనిపించింది.
మామూలుగా అయితే ఎప్పుడూ ఉదయం 8.30 కి వచ్చె వ్యక్తి ఈ రోజు అంత తొందరగా
రావడం చాలా ఆశ్చర్యకరంగా అనిపించింది.
బాబా దయవల్ల ఆకార్మికుడి సాయంతో మాతాతగారు మంటలను ఆర్పివేసారు. జరిగిన నష్టాన్ని తలచుకుంటూ నేను చాలా
బాఢపడ్డాను. గురువారం అంటే బాబాకు
ప్రీతికరమయిన రోజు. మరి అటువంటిది ఈ రోజున
ఈవిధమయిన సంఘటన జరగడం నాకెందుకో మనసుకు వెలితిగా అనిపించింది. (సాధారణంగా
గురువారాలలో మంచే జరుగుతుందని నా అభిప్రాయం.)
మా తాతగారు, అమ్మమ్మగారికి కూడా ఈసంఘటన చాలా
విషాదాన్ని కలిగించింది. మాతాతగారే కనక
ఉదయం పైన డాబామీద పచార్లు చేయడానికి వెళ్ళి ఉండకపోయినట్లయితే మొత్తం భవనమంతా మంటలలో
కాలిపోయి ఉండేది. వారి బాధ చూసి
మంగళప్రదమయిన గురువారంనాడు ఇటువంటి సంఘటన ఎందుకు జరిగిందని సాయిబాబాను
అడిగాను. నాపర్సులోనుండి సాయిచాలీసా
పుస్తకం తీయగానే నాప్రశ్నకు సమాధానం లభించింది.
పుస్తకం అట్టమీద బాబా ఫొటో ఉంది.
ఆ ఫొటోలో బాబా ముఖం మీద కాలిన గుర్తులు ఉన్నాయి. ఒక్కసారిగా అదిరిపోయాను. బాబా ముఖం మీద మాత్రమే కాలిన గుర్తులు
ఉన్నాయి. మిగతా పుస్తకంతా ఎక్కడా అటువంటి
గుర్తులు లేవు. నేను ఆపుస్తకం మీద
శుభ్రంగా తుడిచి ఇది ఎలా జరిగిందా అని ఆశ్చర్యపోతూ ఉన్నాను. అదే సాయిబాబా చూపిన అధ్భుతం. శుభప్రదమయిన రోజున ఆయన మూడు ప్రాణాలను ఏవిధంగా
కాపాడరో దీని ద్వారా తెలియచేసారు.
మమ్మల్ని కాల్చవలసిన మంటలను తాను స్వీకరించి మమ్మల్ని కాపాడారు. తన భక్తులకు కలగబోయే అరిష్టాలను ముందుగానే
గ్రహించి తాను స్వీకరించి వారిని కాపాడుతారనే మాట అక్షర సత్యం.
(ఇంకా ఉన్నాయి)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment