13.03.2019 బుధవారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ షిరిడీ సాయిబాబా తో స్నేహబంధమ్ –13 వ.భాగమ్
YOU BRING US JOY MERE KHWAJA
FRIENDSHIP WITH GOD
LORRAINE WALSHE RYAN & FRIENDS
బాబాతో సాన్నిహిత్యమ్ - డైరీ లో ప్రచురించిన
సాయి భక్తుల అనుభవాలు - 2
తెలుగు అనువాదమ్ : ఆత్రేయపురపు త్యాగరాజు
నిజాంపేట, హైదరాబాద్ ఫోన్ : 9440375411
8143626744
ఇందులో నాకు నచ్చినవి మాత్రమే
ప్రచురిస్తున్నాను. నిజం చెప్పాలంటే ఏదీ
వదలడానికి లేకుండా ఉన్నాయి. కాని పరిమితుల వల్ల కొన్నిటిని మాత్రమే ప్రచురిస్తున్నాను.
దీనికి సంబంధించిన అన్ని హక్కులు సాయిదర్బార్, హైదరాబాద్ వారివి. దీనిలోని ఏ భాగము కూడా
మరే ఇతర బ్లాగులలోను ప్రచురించరాదని సవినయంగా మనవి చేస్తున్నాను. సాయిబానిస శ్రీరావాడ
గోపాలరావుగారు ప్రత్యేకంగా నాకు అనుమతినిచ్చినందువల్ల నేను మరెవరికీ అనుమతిని
ప్రసాదించలేను.
ఓమ్ సాయిరామ్
ఈ రోజునుండి లోరైన్ వాల్ష్ గారి డైరీలో
ప్రచురింపబడ్డ భక్తుల అనుభవాలను కొన్నింటిని ప్రచురిస్తాను. మధ్యమధ్యలో డైరీలోని
విషయాలను కూడా కొన్నింటిని ప్రచురిస్తాను.
ఈ
రోజు ప్రచురింపబోయే సంఘటనను అనువాదం చేస్తున్నప్పుడు నా శరీరం కూడా రోమాంచితమయింది. ఇక చదవండి.
బెంగళూరు బి.టి.ఎమ్ లే ఔట్ లో ఉన్న శ్రీ సాయినాధ్ మందిరం పూజారి గారు వివరించిన
అధ్బుత సంఘటన.
ఈ సంఘటన అయిదు సంవత్సరాల క్రితం జరిగింది. ఒకరోజున నాదగ్గరకు
ఒకామె వచ్చి ,
“నేను
ఈ రోజు బాబాకి భోజనం పెడదామనుకుంటున్నాను” అంది. నేనామెతో “పదార్ధాలన్నిటినీ విడి విడిగా ఒక పళ్ళెంలో చక్కగా సద్ది, ఒక గ్లాసుతో
మంచినీళ్ళు కూడా తీసుకుని రా” అని చెప్పాను. మధ్యాహ్న ఆరతి సరిగ్గ 12 గంటలకు ప్రారంభమవుతుంది, కాబట్టి 11-45 కల్లా అన్నీ తీసుకుని వస్తే ఆరతి ప్రారంభమవాడినికి ముందే బాబాకు
నైవేద్యం పెడతాను” అని చెప్పాను.
కొద్ది నిమిషాలలోనే ఆమె నేను చెప్పిన విధంగానే
ఇంటినుంచి పదార్ధాలన్నిటినీ ఒక పళ్ళెంలో చక్కగా సద్దుకుని తీసుకునివచ్చింది. ఆరతికి ముందు ధుని
దగ్గర ఎప్పుడూ పూజ చేస్తూ ఉంటాను. ఆ రోజు కూడా ధుని దగ్గర పూజ ముగించి, బాబాకు ఆరతికి, అగరువత్తులు, సాంబ్రాణి అన్నిటినీ సిధ్ధం చేసాను. ఆమె తెచ్చిన
ఆహారపదార్ధాలు ఉన్న పళ్ళెం తీసుకుని బాబాకు నైవేద్యం పెట్టడానికి సిధ్ధం చేసాను. నేనామెకు అన్ని
పదార్ధాలను విడివిడిగా ప్రత్యేకంగా ఉంచమని చెప్పినా, నేను అన్నిటినీ కలిపేసి బాబా ముందు నిలబడి
ఆయనకు
నైవేద్యంపెట్టాను.
నైవేద్యం పూర్తయిన తరువాత బాబాకు మంచినీళ్ళు
త్రాగించడానికి ఆమె తెచ్చిన నీళ్ళ గ్లాసు కోసం చూసాను. (ఇపుడు మేము బాబాకు
వెండిగ్లాసుతో మంచినీళ్ళు పెడుతున్నాము. అంతకు ముందుఆ విధంగా చేయలేదు.)
ఆమె తీసుకువచ్చినవన్నీ గమనించాను గాని, మంచినీళ్ళ గ్లాసు
మాత్రం కనిపించలేదు. ఆమె భక్తులందరితో కలిసి నేలమీద కూర్చుని ఉంది. నేను మంచినీళ్ళ గ్లాసు
కోసం వెతకడం చూసాక ఆమెకి తను చేసిన పొరబాటు గ్రహించింది. ఆమె నీళ్ళ గ్లాసు
తేవడం మర్చిపోయింది. ఆరతి పూర్తయి అన్ని కార్యక్రమాలు ముగిసిన తరువాత నేను ఇంటికి
బయలుదేరాను.
దారిప్రక్కన
మందిరానికి ఎదురుగా ఉన్న సిమెంటు బెంచీమీద బాబాకు భోజనం తీసుకునివచ్చినామె
కూర్చుని ఉంది.
ఆమె
ఏడుస్తూ ఉంది.
ఆమెను
చూసి నేను కూడా బాధపడ్డాను. ఆమె బాబాకు మంచినీళ్ళు తేవడం మర్చిపోయినందుకు చాలా దుఃఖిస్తూ ఉందని
నాకర్ధమయింది.
కాని
అది ఆమె కావాలని చేసిన తప్పుకాదు. ఇంటికి వెళ్ళాక కూడా దుఃఖిస్తూ ఉన్న ఆమె రూపమే నామదిలో నిలిచిపోయి
ఆరోజంతా నేను కూడా దిగులుగా ఉన్నాను. ఆ దిగులుతోటే నేను నాభార్యతో గాని, మా అబ్బాయితో గాని సరిగా మాట్లాడలేకపోయాను. బాధ పడుతూ నిద్రపోయాను.
( శ్రీ షిరిడీసాయిబాబా మందిరం బి టి ఎమ్ లే ఔట్ బెంగళూరు వీడియో చూడండి)
మరునాడు ఉదయం నేను కాషాయరంగు ధోవతీ
కట్టుకున్నాను.
మేము
గురువారాలలో మాత్రమే కాషాయరంగు ధోవతీ కట్టుకుంటూ ఉంటాము. మిగతా రోజులలో
తెల్లరంగు ధోవతీ మాత్రమే ధరిస్తాము. కాని ఆరోజు ఆదివారమయినా కాషాయ రంగుదే ఎందుకు కట్టుకున్నానో నాకే
తెలీదు.
కాని
ఆవిషయం గురించి అంతగా పట్టించుకోకుండా యధావిధిగా నాపనులు నిర్వర్తించడానికి
మందిరానికి వెళ్ళిపోయాను.
సోమవారం ఉదయం బాబా మందిరంలో ధునివద్ద పూజ
చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాను. ఆ సమయంలో బాబాకు భోజనం తెచ్చినామె నావైపు పరుగెత్తుకుంటూ రావడం
కనిపించింది.
ఆమెను
చూడగానే ఆమె ఎంతో ఉద్వేగంతో ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంది. ఆమె నాతో ఏదో ఒక
ముఖ్యమయిన విషయం చెప్పాలనే ఆరాటంలో ఉన్న్ట్లుగా ఉంది.
ఇక బాబాకు ఆరతి ఇచ్చే సమయం దగ్గరపడుతూ ఉందని, ఆరతి అయ్యేంత వరకు
ఆగమని ఆమెతో అన్నాను. కాని, తను అంతసేపు ఆగలేనని ఇపుడె తను చెప్పదలచుకున్నది చెప్పితీరతానని
చెప్పింది.
ఆమె చెప్పిన అధ్భుతమయిన సంఘటన.
“ స్వామీ, ఒక ధ్భుతం జరిగింది. బాబాకు మంచినీళ్ళు ఇవ్వడానికి మొన్న నేను ఒక చిన్న వెండి గ్లాసు కొన్నాను. బాబాకు నైవేద్యంగా
సమర్పించడానికి పదార్ధాలన్నిటిని సద్ది అన్ని ఒక పళ్ళెంలో పెట్టాను. కాని మంచినీళ్ళ
సీసాతోపాటు గ్లాసును పెట్టడం మర్చిపోయాను. నేను మందిరానికి వచ్చిన తరువాతనే నేను చేసిన తప్పు తెలుసుకున్నాను.” ఒక భక్తురాలిగా ఆమె
మంచినీళ్ళు తేవడం మర్చిపోయి తను చేసిన సేవలో లోపం జరిగినా, బాబా దయతో ఆమె తెచ్చిన
వాటిని స్వీకరించారు. ఆమె తను చేసిన తప్పు వివరించగానే నాకు ఏడుపు వచ్చింది.
కాని ఎంతో అధ్భుతమయిన సంఘటన ఆమె బాబా
మందిరంలో ఉన్న సమయంలో జరిగింది. ఇది ఆమె ఇంటివద్ద ఆమె తల్లిగారి సమక్షంలో జరిగింది. జరిగిన సంఘటనని ఆమె
ఇలా వివరించింది.
“నేను బాబాకు నైవేద్యం కోసం అన్నీ సిధ్ధం చేసి మీకు ఇచ్చిన తరువాత
మందిరంలోనే కూర్చున్నాను. మీరు బాబాకు నైవేద్యం పెడుతున్న సమయంలో మా ఇంటికి ఎవరో వచ్చి గేటు
మీద తట్టారు.
మా
అమ్మగారు ఎవరు వచ్చారో చూద్దామని తలుపు తెరిచారు. ఆమెకు కాస్త కనిపించదు. తలుపు తెరవగానే
ఎదురుగా మీలాగే కాషాయరంగు పంచె ధరించిన ఒక వ్యక్తి కనిపించారు. మా అమ్మగారు గుమ్మం
బయటకు వచ్చి చూసింది. వచ్చిన వ్యక్తి మీరే అనుకుంది. భిక్ష తీసుకురావడానికి ఇంటిలోపలికి వెళ్ళబోతుండగా ఆవ్యక్తి లోపలికి
వెళ్ళబోతున్న మా అమ్మగార్ని ఆగమని చెప్పాడు. తనకి ఒక గ్లాసు మంచినీళ్ళిమ్మని అడిగాడు. మా అమ్మగారు
ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. వెంటనే మంచినీళ్ళు తెస్తాను ఉండమని చెప్పి నేను ఇంటిదగ్గరే
మర్చిపోయిన మంచినీళ్ళ సీసాలోని నీళ్ళు వెండిగ్లాసులో నింపి ఆవ్యక్తికి ఇచ్చారు. మంచినీళ్ళు అన్నీ
తాగిన తరువాత గ్లాసు మా అమ్మగారికి ఇచ్చి, “ఇపుడు మీ అమ్మాయి తిరిగి వస్తుంది. ఆమెతో నేను వచ్చి
మంచినీళ్ళు
త్రానని
చెప్పు” అని అన్నాడు.
ఆవ్యక్తి అన్న మాటలు మా
అమ్మగారికి ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించాయి. ఆయన మాటలకి సమాధానంగా అలాగే చెబుతానన్నట్లుగా తల ఊపి ఆవ్యక్తి బయట
గేటు వైపు నడుచుకుంటు వెళ్లడం చూసారు. ఒక్క క్షణంలో ఆవ్యక్తి అన్న మాటలలోని అంతరార్ధం బోధపడి అతనిని
వెతకడానికి గేటు దగ్గరకు పరుగెత్తారు. కాని అతను ఎక్కడా కనపడలేదు. క్షణంలోనే అదృశ్యమయినట్టుగా అనిపించింది. రోడ్డు రెండువైపులా
ఇళ్ళు ఉన్నాయి. రోడ్డు మీదకు చూస్తే
ఎక్కడా ఆవ్యక్తి కనపడలేదు. అతను ఎక్కడికీ వెళ్లడానికి ఇంకేదారి లేదు. ఎటువంటి సందులు లేవు”.
ఆరోజు నేను చేసిన పొరబాటుకు బాధపడుతూ ఇంటికి
వెళ్ళగానే మా అమ్మగారు జరిగినదంతా చెప్పారు. అంతే కాదు బాబా అన్నమాటలు చెప్పగానే నాకెంతో సంతోషం కలిగింది. అది చాలా అధ్భుతమయిన
మరచిపోలేని సంఘటన. అది చెప్పడానికే ఇప్పుడు మీదగ్గరకు వచ్చాను”.
బాబా తన పిల్లలమీద మాతృప్రేమను కురిపిస్తారు. ఆయన ప్రేమను
దేనితోనయినా పోల్చగలమా? మనఃస్ఫూర్తిగా ఆయన కోసం పరితపిస్తే ఆయన వెంటనే పరుగెత్తుకుని వచ్చి
తనయందు ప్రేమను, నమ్మకాన్ని బలపరుస్తారు. అదే మన సాయినాధులవారి అమోఘమయిన శక్తి.
శ్ఈ సచ్చిదానంద సద్గురు సాయినాధ్ మహరాజ్ కి జై
0 comments:
Post a Comment