23.03.2019 మంగళవారమ్
ఓమ్
సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ
షిరిడీ సాయిబాబా తో స్నేహబంధమ్ –16 వ.భాగమ్
YOU BRING US
JOY MERE KHWAJA
FRIENDSHIP
WITH GOD
LORRAINE
WALSHE RYAN & FRIENDS
బాబాతో
సాన్నిహిత్యమ్ - డైరీ లో
ప్రచురించిన
సాయి భక్తుల అనుభవాలు - 5
తెలుగు
అనువాదమ్ : ఆత్రేయపురపు త్యాగరాజు
నిజాంపేట, హైదరాబాద్
ఫోన్ : 9440375411
8143626744
ఇందులో
నాకు నచ్చినవి మాత్రమే ప్రచురిస్తున్నాను. నిజం
చెప్పాలంటే ఏదీ వదలడానికి లేకుండా ఉన్నాయి. కాని
పరిమితుల వల్ల కొన్నిటిని మాత్రమే ప్రచురిస్తున్నాను.
దీనికి
సంబంధించిన అన్ని హక్కులు సాయిదర్బార్, హైదరాబాద్
వారివి. దీనిలోని ఏ భాగము కూడా
మరే ఇతర బ్లాగులలోను ప్రచురించరాదని సవినయంగా మనవి చేస్తున్నాను. సాయిబానిస
శ్రీరావాడ గోపాలరావుగారు ప్రత్యేకంగా నాకు అనుమతినిచ్చినందువల్ల నేను మరెవరికీ
అనుమతిని ప్రసాదించలేను.
ఓమ్
సాయిరామ్
రాధ . జి. సిడ్నీ, ఆస్ట్రేలియా గారి అనుభవమ్
ఉన్నత
చదువుల కోసం నేను ఆస్ట్రేలియాకి వచ్చిన సందర్భంలో ఇక్కడ విదేశంలో నాకు బాబాను
దర్శించుకునే భాగ్యం కలుగుతుందా అని అనిపించింది. భారతదేశంలో ఉన్నప్పుడు నాకు
బాబాని ఎప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు ఆయన ఫోటోను గాని, మందిరంలో ఆయన విగ్రహాన్ని గాని దర్శించుకునే అవకాశం ఉండేది. మరి ఇక్కడ ఆస్ట్రేలియాలో నాకు
బాబా దర్శనం కలిగినట్లయితే అది చాలా ఆశ్చర్యకరమయిన విషయమే.
ఒకరోజు
రాత్రి నేను బాబాని మనస్ఫూర్తిగా ప్రార్ధించుకున్నాను. బాబా, ఇక్కడ
నాకు నీ మామూలు దర్శనం కాకుండా, ఒక ఆస్ట్రేలియన్ వ్యక్తి
ద్వారా నాకు దర్శనమివ్వాలి. కాని ఒక భారతీయుని ద్వారా మాత్రం నీ దర్శనం నాకు వద్దు. ఈ విధంగా నేను బాబాని
ప్రార్ధించుకున్నాను. కాని మనసులో ఏదో ఒక మూల ఇది సాద్యం కాదు అని అనిపించింది.
బాబాని
ఆ విధంగా ప్రార్ధించుకున్న కొన్ని రోజుల తరువాత నేను ఒక వయసు మళ్ళిన వ్యక్తి
అపార్ట్ మెంట్ కి వెళ్ళాను నా పార్ట్ టైమ్
జాబ్ గా నేను ఆయనకి ట్యూషన్ చెబుతున్నాను. నేను వెళ్ళేటప్పటికి ఆయన
విశ్రాంతి తీసుకుంటున్నారు. అక్కడినుంచి వచ్చేస్తుండగా ఆయన ఇంటి ప్రక్కనె ఉంటూన్న ఒక వ్యక్తి నావద్దకు
వచ్చి నన్ను పలకరించాడు. అతను నాపేరడిగాడు. నా పేరు ‘రాధ’ అని
సమాధానమిచ్చి వెళ్ళబోతుండగా నా పేరుకి అర్ధమేమిటో వివరంగా చెప్పాడు. నేను చాలా ఆశ్చర్యపోయాను.
అతనికి
హిందీ కూడా వచ్చు. అతను నన్ను
టీ త్రాగి వెడుదురుగాని అని తన ఇంటికి ఆహ్వానించాడు. నాకు టీ వద్దు అని చెప్పేలోపులోనే,
ఓరగా వేసి ఉన్న తలుపు సందులోనుంచి లక్ష్మీదేవి ఫొటో కనిపించింది.
ఇంకా తెలుసుకోవాలనే ఆసక్తి నాలో కలిగింది. అతనితో కూడా వాళ్ళింటిలోకి
వెళ్ళాను. లక్ష్మీదేవి
ఫొటోతోపాటుగా సరస్వతీదేవి ముఖచిత్రంతో ఉన్న పుస్తకం కూడా కనిపించింది.
అతనికి
కూడా మన హిందూ దేవతల యందు నమ్మకం ఉందని గ్రహించి, నేను
బాబాని నమ్ముతానని చెప్పాను. అతను ఆశ్చర్యంగా నవ్వుతూ నావైపు చూసి తను మూడు నెలలక్రితమే షిరిడీ
వెళ్ళినట్లు చెప్పాడు. అతను వెంటనే లేచి, ఒక ఊదీ పొట్లం, చిన్న లాకెట్, సాయిబాబా ఫొటోలు మూడు తీసుకుని వచ్చి
నాకు బహుమానంగా ఇచ్చాడు. బాబా చూపిన అధ్భుత లీలకి నాకళ్ళు చెమర్చాయి. నేను బాబాని ఏవిధంగా
కోరుకున్నానో అతనికి వివరించాను. బాబా ఈవిధంగా నేను కోరుకున్నట్లుగానే ఒక విదేశీయుని ద్వారా తన
దర్శనభాగ్యాన్ని కలిగించారని చెప్పాను.
అంతా
అర్ధమయిందన్నట్లుగా అతను తలూపి, తనకు కూడా బాబా అనుగ్రహించిన
అధ్భుతమయిన అనుభవాన్ని ఇలా వివరించాడు.
నేను షిరిడీ వెళ్ళినప్పుడు, అక్కడివారందరూ ఒక ఆస్ట్రేలియన్ ని చూడాలనే కుతూహలంతో నాచుట్టు గుమిగూడారు. వాళ్ళందరూ నన్ను చుట్టుముట్టడంవల్ల
నాకు చాలా అసౌకర్యాన్ని కలిగించింది.
వాళ్ళందరూ నేను చాలా భయపడేటట్లుగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. ఆసమయంలో నేను బాబాను ప్రార్ధించుకున్నాను. షిరిడీలో ఉన్నంత సేపు తిరిగి
ఇంటికి బయలుదేరి వెళ్ళేటప్పుడు రక్షణగా ఉండమని బాబాను ప్రార్ధించుకున్నాను. అదే రోజు రాత్రి బాబా నాకు స్వప్నంలో దర్శనమిచ్చి తను వస్తాననీ రక్షణగా ఉంటాననీ చెప్పారు.
మరుసటి రోజు నేను షిరిడీనుంచి తిరుగు
ప్రయాణమయే సమయంలో ఒక వ్యక్తి ఎక్కడినుంచో వచ్చాడు. ఆవ్యక్తి నా సామానులన్నిటినీ తీసుకున్నాడు. రైల్వే స్టేషన్ దాకా
సామానులన్నిటిని మోసుకుంటూ వచ్చాడు.
ఆవ్యక్తి దారి పొడవునా మాట్లాడుతూనే ఉన్నాడు. స్టేషన్ కి
చేరుకున్న తరువాత ఆవ్యక్తి రైలు వచ్చేదాకా ఉండటమే కాకుండా, సామానంతటినీ
రైలులోకి ఎక్కించాడు. నేను సీటులో కూర్చోగానే ఆ వ్యక్తి వెనువెంటనే కనిపించకుండా పోయాడు. అతను నా దగ్గర ఒక్క రూపాయి కూడా
తీసుకోలేదు. నాకు
చాలా ఆశ్చర్యం కలిగింది. బాబా నాకు కలలో కనిపించి మాట ఇచ్చినట్లుగానే తనే స్వయంగా రైలు స్టేషన్ దాకా
నా సామాను మోసుకుంటూ వచ్చి దిగబెట్టారని నాకర్ధమయింది. నేను బాబాని
గుర్తించలేకపోయినందుకు చాలా విచారించాను.
నేను ప్రార్ధించగానే బాబా నా సహాయానికి వచ్చినందుకు
నేనెంతగానో సంతోషించాను.
ఆ విదేశీయుడు నాకు తన అనుభవాన్ని చెప్పగానే
మేమిద్దరం కలుసుకునే ఏర్పాటు చేసి మేమిద్దరం ఒకరికొకరం
మా అనుభూతులను పంచుకునే సందర్భాన్ని బాబా కలిగించినందుకు
మేమెంతో సంతోషించాము. ఇప్పటికీ మనకు బాబా అనుభవాలను
కలిగిస్తూనే ఉన్నారు. ఆయనకి మనం మన హృదయాలలో
దర్శించుకోగలం.
ఆయనకి మనం మన హృదయాలలో దర్శించుకోగలం.
(ఇంకా ఉన్నాయి)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment