23.03.2019 శనివారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ షిరిడీ సాయిబాబా తో స్నేహబంధమ్ –15 వ.భాగమ్
YOU BRING US JOY MERE KHWAJA
FRIENDSHIP WITH GOD
LORRAINE WALSHE RYAN & FRIENDS
బాబాతో సాన్నిహిత్యమ్ - డైరీ లో ప్రచురించిన
సాయి భక్తుల అనుభవాలు - 4
తెలుగు అనువాదమ్ : ఆత్రేయపురపు
త్యాగరాజు
నిజాంపేట, హైదరాబాద్
ఫోన్ : 9440375411
8143626744
ఇందులో నాకు నచ్చినవి మాత్రమే
ప్రచురిస్తున్నాను. నిజం చెప్పాలంటే ఏదీ
వదలడానికి లేకుండా ఉన్నాయి. కాని పరిమితుల వల్ల
కొన్నిటిని మాత్రమే ప్రచురిస్తున్నాను.
దీనికి సంబంధించిన అన్ని హక్కులు
సాయిదర్బార్, హైదరాబాద్ వారివి. దీనిలోని
ఏ భాగము కూడా మరే ఇతర బ్లాగులలోను ప్రచురించరాదని సవినయంగా మనవి చేస్తున్నాను. సాయిబానిస
శ్రీరావాడ గోపాలరావుగారు ప్రత్యేకంగా నాకు అనుమతినిచ్చినందువల్ల నేను మరెవరికీ
అనుమతిని ప్రసాదించలేను.
ఓమ్ సాయిరామ్
శ్రీ శేఖర్ రాజు బెంగళూరు గారి అనుభవమ్
శ్రీ శేఖర్ గారిని అందరూ అంకుల్ శేఖర్ అనే పిలుస్తూ
ఉంటారు. ఆయన మూడు సాయి మందిరాలను
నిర్మించారు. అందులో ఒకటి బి టి ఎమ్ లే
ఔట్ లో ఉంది. బాబా ఆయనకు చాలా అనుభవాలను
ఇవ్వడమే కాదు, దర్శనాలు కూడా కలిగించారు.
వాటిలో ఒకటి…
అది డిసెంబరు నెల.
సాయంత్రం వేళ ఎంతో ఆహ్లాదకరంగా ఉంది.
బి. టి.ఎమ్. లో బాబా మందిర నిర్మాణం జరుగుతూ ఉంది. మందిరంలోపల దత్తదేవుని మందిరం ఉంది. ఆయనకు ఎదురుగా నేను ఒక బెంచీమీద
కూర్చున్నాను. నాదృష్టి దత్తభగవానుని మీద
ఉంది. నేను చూస్తున్నది కేవలం
దత్తవిగ్రహాన్ని కాదు. దత్తదేవుడు
జీవంపోసుకుని ఆ విగ్రహంలో నుండి వస్తున్నట్లుగా నాకు కనపించారు. ఆయన కళ్ళలోని సమ్మోహన శక్తి నన్ను
మంత్రముగ్ధుడిని చేసింది. నాకళ్ళకి ఆయన
రూపం తప్ప మరేదీ కనపడలేదు.
బాబా నాకు చేసిన సహాయం
చావడికి ఆనుకుని నిర్మిస్తున్న భవనం నిధులు కొతరవల్ల
మధ్యలోనే ఆగిపోయింది. అది పూర్తికావాలంటే రూ.60,000/- అవసరం. ఆ సొమ్ముకూడా తొందరలోనే
కావాల్సి ఉంది. అంత తొందరగా సొమ్ము
లభ్యమయ్యే దారులు ఏమీ కనిపించలేదు.
నిర్మాణ కార్యక్రమాలన్నిటినీ ఒకేసారి పెట్టుకోవడం వల్ల డబ్బుకి ఇబ్బంది
ఏర్పడింది. అన్నీ ఒకేసారి
పెట్టుకున్నందుకు ట్రస్టు సభ్యులందరం మా అనాలోచిత నిర్ణయానికి చాలా
విచారించాము. కావలసిన సొమ్ము కోసం మేము
ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏవీ ఫలించకపోవడం వల్ల ఆ సమస్యని బాబా నిర్ణయానికే
వదిలేసాము. డబ్బు ఎప్పుడు సమకూడితే
అప్పుడే తిరిగి పని ప్రారంభిద్దామనుకున్నాము.
ఆరోజు రాత్రి అందరమూ బాబా సహాయాన్ని అర్ధిస్తూ పార్ధించాము.
మరుసటి రోజు హుండీలోని డబ్బులు లెక్కించే రోజు. ప్రతినెల నాలుగవ ఆదివారం నాడు హుండీలో దక్షిణ
డబ్బులను లెక్కిస్తూ ఉంటాము. సాధారణంగా
హుండీలో ఎంత డబ్బు భక్తుల ద్వారా వస్తుందనే విషయం మాకందరికీ తెలుసు. మందిరం ఆవరణలో ఉంచిన హుండీలన్నిటి నుంచీ
లెక్కించిన డబ్బు సామాన్యంగా ప్రతినెల ఎంత ఉంటుందో మాకందరికీ తెలుసు. ఆవిధంగా తెరిచిన హుండీలలో ఒక దానిలో నోట్లకట్ట
కనిపించింది. భక్తులు ఎవరయినా పెద్ద
మొత్తంలో చందా గాని దక్షిణ గాని ఇవ్వదలచుకుంటే మందిరం ఆఫీసులో చెల్లిస్తారు కాని
హుండీలో వేయరు. దక్షిణ వెయ్యి రూపాల పైన
ఇవ్వదలచుకున్నా గాని, ఆఫీసు కౌంటర్ లోనే ఇస్తూ ఉంటారు. అందువల్ల పెద్ద నోట్ల కట్టని చూడగానే మాకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఆశ్చర్యానందాలతో నోట్లన్నిటినీ లెక్క పెట్టాము అవి సరిగ్గ
60,000/వేల రూపాయలున్నాయి. ఒక్క
పైసా ఎక్కువా లేదు, తక్కువా లేదు. భవన
నిర్మాణం పూర్తికావడానికి ఎంత అవసరమవుతుందో సరిగ్గ అంతే మొత్తం … ఎంత అధ్బుతమయిన
లీల…
(ఇంకా ఉన్నాయి)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
(ఇంకా ఉన్నాయి)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment