26.04.2019 శుక్రవారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు మరొక సాయి భక్తురాలు చెప్పిన అధ్భుత సంఘటన… అనిత కందుకూరి, కాన్ బెరా, ఆస్ట్రేలియా వారు చెబుతున్న లీల.
శ్రీ షిరిడీ సాయిబాబా తో స్నేహబంధమ్ –22 వ.భాగమ్
YOU
BRING US JOY MERE KHWAJA
FRIENDSHIP
WITH GOD
LORRAINE
WALSHE RYAN & FRIENDS
Lorren Walsh e mail.
shirdi9999@hotmail.com
తెలుగు అనువాదమ్ ః ఆత్రేయపురపు త్యాగరాజు
నిజాంపేట, హైదరాబాద్
8143626744 & 9440375411
బాబాతో సాన్నిహిత్యమ్ - డైరీ లో ప్రచురించిన
సాయి భక్తుల అనుభవాలు - 22
(అనువాదం చేసి
ప్రచురించడానికి బాబా గారు కూడా తమ అనుమతిని లోరెన్ వాల్ష్ గారి ద్వారా
ప్రసాదించారు)
నాకు బాబా చూపించిన ఒక అధ్భుతమయిన లీలను మీతో పంచుకుంటాను. సిడ్నీలోని నా స్నేహితులందరి సహాయసహకారాలతో
ఏప్రిల్ 3వ.తారీకున ‘గురువిల్లె’ లో ఉన్న మాయింటిలో బాబా ప్రేరణతో భజన
సంధ్య ఏర్పాటు చేసాము. బాబా గారు మరియు నా గురుదేవుల ఆశీర్వాదాలను కోరుకొంటూ భజన కార్యక్రమానికి
వారు కూడా రావాలని కోరుకొన్నాను. శ్రీ సాయి సత్ చరిత్రను తీసుకుని ఒక పేజీ తెరిచాను.---
అది 15వ.ధ్యాయంలోని పేరా
వచ్చింది…
“మీరెవరైనా సరే, ఎక్కదున్నాసరె భక్తి భావంతో నా ఎదుట చేతులు చాచితే మీ భక్త్యానుసారంగా రాత్రింబవళ్ళు
మీవద్ద నిలబడి ఉంటాను. నా శరీరమిక్కడే ఉన్నా, మీరు సప్తసముద్రాలకవతల ఉండి
ఏంచేస్తున్నా తక్షణమే నాకు తెలుస్తుంది.
ఈ ప్రపంచంలో ఎక్కడికన్నా వెళ్ళండి. మీవెనువెంట నేనుంటాను. మీ హృదయమే నా గృహం. నేను మీ అంతర్యామిని. మీ హృదయాలలో ఉన్న నన్ను మీరు నిత్యం పూజించండి. సర్వజీవులలోను నేను అంతర్యామిగా ఉన్నాను. యాదృఛ్ఛికంగా ఇంటా బయటా అధవా మార్గంలో మీకెవరు కలిసినా వారిలో నేనే
ఉన్నాను. క్రిమికీటకాలలో
జలచరాలలో ఖేచరాలలో, కుక్కల్లో, పందుల్లో
అన్ని ప్రాణులలో నేనే సర్వత్ర నిండి ఉన్నాను. నిరంతరం నన్ను మీ ఆత్మగానే
గ్రహించండి. నన్ను
ఇట్లు తెలుసుకున్నవారు గొప్ప భాగ్యవంతులు.”
పూజ జరిగే రోజు, తెల్లవారుజామునే ప్రసాదాలు
తయారు చేయడానికి 3.30 కి పెందరాడే లేచాను. పనులన్నీ పూర్తి చేసుకుని రాత్రి
బాబాకు నైవేద్యంగా సమర్పించడానికి కొన్ని జొన్నరొట్టెలు, వంకాయ
కూర చేయడానికి రొట్టెలకు పిండి
కలుపుతున్నాను. రొట్టెలు
తయారుకు చిన్న చిన్న ఉండలను తయారు చేసినపుడు సరిగ్గా 9 ఉండలు
వచ్చాయి. వాటినన్నిటినీ
ఒత్తి 8 రొట్టెలను చేసాను. తొమ్మిదవది చేసి పెనంమీద వేసి
కాలుస్తుండగా అది రెండు ముక్కలుగా విరిగిపోయింది. దానిని తీసి ఒక ప్రక్కగా
పెట్టేసాను. అదే సమయంలో,
తలుపులు తెరచి ఉండటం వల్ల ఒక కుక్క లోపలికి ప్రవేశించింది. ఒక్కసారిగా భయపడ్డాను.
ఆ కుక్క మూతి పైకెత్తి గాలిలో వాసన పీలుస్తూ ఉంది. ప్రక్కన తీసి పెట్టేసిన రెండు రొట్టె ముక్కలను ఆ కుక్క ముందు పెట్టాను. కుక్క ఆ రొట్టె ముక్కలను నోట కరచుకొని వంటింట్లోనుండి బయటకు పట్టుకువెళ్ళి తినేసింది. వచ్చే అతిధులకు స్వాగతపూర్వకంగా బయట ఒకపాత్రలో నీళ్ళు పోసి అందులో పువ్వులను వేసి ఉంచాను.
కుక్క రొట్టి తిన్నతరువాత ఆ పాత్రలోని నీటిని త్రాగింది. మా చిన్నబ్బాయి నాప్రక్కనే నుంచుని ఆకుక్కని ఎంతో ఉత్సుకతతో చూడసాగాడు. ఆ కుక్క కొద్ది నిమిషాలు కూర్చుని వెళ్ళిపోయింది. మావారు ఇంటికి రాగానే ఈ సంఘటన గురించి చెప్పాను. మాఇంటి చుట్టుప్రక్కల అటువంటి కుక్కను నేనెపుడూ చూడలేదు. బాబాయే ఆరూపంలో వచ్చారని నేను గ్రహించుకున్నాను.
ఆ తరువాత పూజ జరిగే ప్రదేశాన్నంతా అలంకరించడం మొదలు
పెట్టాను నా స్నేహితులందరూ కుక్క రావడం
శుభసూచకమని బాబాయే స్వయంగా తమ ఆశీర్వాదాలను అందజేసారని అన్నారు. సాయంత్రం 5 గంటలకి మేమందరం పూజ ప్రారంభించడానికి కూర్చున్నాము. మొట్టమొదటగా ధూప్ ఆరతితో
ప్రారంభించాము. ఆశ్చర్యకరంగా
పొద్దున్న వచ్చిన కుక్కే మరలా వచ్చింది.
అది తిన్నగా బాబా విగ్రహం దగ్గరకు వెళ్ళింది. అది ఎవ్వరినీ ఏమీ చేయలేదు.
చాలా సాధుస్వభావంగా ఉంది.
ఆ కుక్క గదిలో కూర్చున్న అందరి దగ్గరకు వెళ్ళి అందరినీ
ముక్కుతో వాసన చూస్తూ వెళ్ళింది. పొద్దున్న వచ్చింది ఆ కుక్కేనని వచ్చినవాళ్ళందరికీ చెప్పాను. మావారు ఆ కుక్కను బయటకు తీసుకుని
వెళ్ళి దానికి వడలు, రొట్టెలు పెట్టారు. వాటిని తిన్న తరువాత అది మళ్ళీ
బయట ఉంచిన పాత్రలోని నీటిని త్రాగి మా ముందుకు వచ్చి కూర్చుంది. మేము ధూప్ ఆరతిని కొనసాగించాము.
పూజ పూర్తవగానే గదంతా ఒక విధమయిన ఆధ్యాత్మిక వాతావరణంతో
నిండిపోయింది. నామజపం, భజనలో
పాల్గొన్న భక్తులందరూ ఎంతో ఆనందాన్ననుభవించారు. అంతా పూర్తయిన తరువాత భక్తులందరూ
వెళ్ళిపోగా ఇంకా కొద్దిమంది ఉన్నారు.
మరుసటిరోజు ఉదయం ఆ కుక్క మళ్ళీ వస్తుందేమోననే ఆశతో ఎదురు
చూసాము. కాని అది
మాత్రం రాలేదు. భజన
సమయానికి ఆ కుక్క రావడం అంతా బాబాలీలేనని తామందరం ఎంతో అదృష్టవంతులమని
వచ్చినవాళ్ళందరూ తమ ఆనందాన్ని వ్యక్తం చేసారు. ఇదంతా నా భ్రమ కాదు కదా అని
భావిస్తూ శనివారంనాడు భజన జరిగిన సమయంలో వచ్చినది నువ్వేనా బాబా అని సమధానంకోసం
శ్రీసాయి సత్ చరిత్రను చేతిలోకి తీసుకుని ఒక పేజీ తెరిచాను. అది మూడవ అధ్యాయం. అందులో బాబా సందేశం…మధురమయిన పలుకులు…
ఒకరోజు మధ్యాహ్న ఆరతి అనంతరం భక్త మండలి ఇళ్ళకు వెడుతుండగా
బాబా ముఖంనుండి వచ్చిన మధురవచనాలను వినండి.
“మీరెక్కడున్నా సరే, ఏంచేస్తున్నా సరే, మీవిషయాలన్నీ సంపూర్ణంగా నాకు తెలుస్తాయన్న విషయాన్ని ఎప్పుడూ
గుర్తుంచుకోండి. నేను
నేను అని చెప్పే నేనే అందరిలోను ఉన్న అంతర్యామిని. ఆ నేనే అందరి హృదయాలలోను ఉన్నాను. అందరి స్వామిని నేనే. సర్వ భూతాలలోను, చరచరాలలో బాహ్యాంతర్భాలలో, నిండి ఉన్నాను. ఈ సకలమూ ఈశ్వరుని సూత్రం. నేను అతని సూత్రధారుణ్ణి. నేను సకల ప్రాణులకు మాతను. నేను త్రిగుణాల సామ్యావస్థను. కర్తా, భర్తా,
సంహర్తా నేనే. సకలేంద్రియాలను నడిపించువాడను నేనే. నాయందు లక్ష్యమున్న వారికి
ఏకష్టాలుండవు. నన్ను మరచిపోయిన వారిని మాయ బాధిస్తుంది. ఈ దృశ్య ప్రపంచమంతా నా స్వరూపం. చీమలు, దోమలు.
పురుగు, పుట్ర, రాజు,
పేద సకల చరాచర విశ్వమంతా నారూపం.”
మాకెంత సంతోషం కలిగిందో అంతా మీ ఊహకే వదిలేస్తున్నాను. మీ అందరిమీద అంతటి అనుగ్రహాన్ని
చూపించిన మన సద్గురువుకి మేమెంతగానో ఋణపడి ఉన్నాము. ఇక్కడ నాకు స్ఫురించిన ఒక విషయం
చెప్పదలచుకున్నాను. ‘DOG’ ని తిరగేసి చదివినపుడు ‘GOD’ అవుతుంది. మమ్మల్ని అనుగ్రహించడానికి
బాబాయే వచ్చారని మేమంతా ప్రగాఢంగా విశ్వసించాము.
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)
`
0 comments:
Post a Comment