Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Sunday, April 21, 2019

శ్రీ షిరిడీ సాయితో ముఖా ముఖి - 1 వ.భాగమ్

Posted by tyagaraju on 2:35 AM
       Image result for images of shirdi saibaba in dreams
                         Image result for images of rose hd

21.04.2019 ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ వారం నుండి ప్రతి ఆదివారమ్ సాయిబానిస శ్రీ రావాడ గోపాలరావుగారి 
"శ్రీ షిరిడీ సాయితో ముఖాముఖి ప్రచురిస్తున్నాను.  చదివిన తరువాత మీ అభిప్రాయములను ఈ క్రింద ఇవ్వబడిన ఈ మైల్స్ కి పంపగలరు.


saidarbar@gmail.com

tyagaraju.a@gmail.com




శ్రీ షిరిడీ సాయితో ముఖా ముఖి

సాయిబానిస శ్రీ రావాడ గోపాలరావు

పుస్తక రచనకు ప్రేరణ

2018 .సంవత్సరము -  శ్రీ షిరిడీ సాయిబాబా మహాసమాధి శతాబ్ది ఉత్సవాల సందర్భముగా అమెరికా దేశములోని మిన్నెసోటా, టెక్సాస్, న్యూయార్క్, న్యూజెర్సీ రాష్ట్రాలనుండి సాయిభక్తుల ఆహ్వానము మీద, మరియు శ్రీసాయి ఆదేశానుసారము 23.06.2018 నుండి, 12.08.2018 వరకు అమెరికాలో తొమ్మిది సత్సంగాలు చేసాను. 


28.07.2018 (గురుపూర్ణిమ సందర్భముగా) న్యూజెర్సీలోని ఐసిలిన్ పట్టణములోని సాయి మందిరములో శ్రీ డా.నోరి దత్తాత్రేయుడుగారి అధ్యక్షతన జరిగిన సత్సంగములో ఇంగ్లీషు భాషలో సాయి తత్వముసాయి సత్ చరిత్రలోని నిగూడార్ధాలపై ఉపన్యాసము ఇచ్చాను.  ఆరోజు రాత్రి శ్రీ డా.నోరి దత్తాత్రేయుడుగారి ఇంటిలో భోజనము చేసి వారి ఇంట నిద్రించాను. 

తెల్లవారుజామున కలలో బాబా ఒక బౌధ్ధసన్యాసి రూపములో దర్శనమిచ్చి డా.నోరి దత్తాత్రేయుడుగారి ఆతిధ్యాన్ని స్వీకరించి, బౌధ్ధ సన్యసి నాదగ్గరకు వచ్చి నాతో  నీవు నిన్నటితో నీజీవితంలో ఆఖరి ఉపన్యాసము ఇచ్చావు.  నేను డా.నోరి దత్తాత్రేయుడుగారి రూపములో నీకు సన్మానము చేశాను.  ఇంక నీవు తిరిగి భారతదేశానికి వెళ్ళి ప్రశాంతంగా జీవించు, ప్రశాంత మరణానికి ఎదురు చూస్తూ ఉండు.  నీవు అంతిమ శ్వాస తీసుకునే సమయంలో నేను నీ ప్రక్కనే ఉంటాను.  నీకు ప్రశాంత మరణము ప్రసాదించుతానుఅన్నారు.

(డా.నోరి దత్తాత్రేయుడిగారితో సాయి బానిస శ్రీ రావాడ గోపాలరావు గారు)

తెల్లవారిన తరువాత విషయాన్నంతా  శ్రీ నోరి దత్తాత్రేయుడు గారికి చెప్పాను. నా మాటలకు శ్రీ నోరి దత్తాత్రేయుడుగారు ఆశ్చర్యపడి కాదు, “నేను నా భార్య ఇద్దరం కలసి త్వరలో హైదరాబాదు మీ ఇంటికి వచ్చి భోజనము చేస్తాము.  మీ ఆశీర్వచనాలు తీసుకుంటాము, అంతవరకు బాబా మీకు ఆయుష్షునిస్తారుఅన్నారు.
మాటలకు నేను నవ్వి, “భవిష్యత్తులో ఏమి జరిగేది బాబాగారే నిర్ణయిస్తారుఅని చెప్పి నేను ఇండియాకు తిరుగు ప్రయాణం ప్రారంభించాను.

డా.నోరి దత్తాత్రేయుడుగారు చెప్పిన మాటలు నిజమయినవి.  డా.నోరి దంపతులు డిసెంబరు, 2018 లో హైదరాబాదు వచ్చి మాయింట భోజనము చేసి సాయిదర్బారులో బాబా ఆశీర్వచనాలు తీసుకొని వారు తిరిగి అమెరికాకు వెళ్ళిపోయారు.

16.03.2019 తారీకు తెల్లవారుజామున శ్రీసాయి నేను పనిచేసిన కంపెనీ జనరల్ మానేజర్ రూపములో దర్శనమిచ్చి, “నీవు వచ్చేనెలలో అమావాస్య మరుసటిరోజు (06.04.2019) నుండి డ్యూటీకి రానవసరము లేదు.  నీ అంతిమయాత్రకు సిధ్ధముగా ఉండుఅని ఆదేశించారు.  ఉదయము నిద్రలేచి నా డైరీలో విషయాలు రాసుకున్నాను.

06.04.2019  వికారి నామ సంవత్సర ఉగాది పండుగ రానే వచ్చింది.  బాబా మాటలు జ్ఞాపకానికి వచ్చాయి.  నా మిత్రులు శ్రీ త్యాగరాజుకు ఫోన్ చేసి బాబా మాటలు వానికి చెప్పాను.  రాత్రి 9 గంటలకు నాకు ఫోన్ చేయమని కోరాను.  అతను రాత్రి 9 గంటలకు నాకు ఫోన్ చేసారు.  నేను సంతోషముగా బాబా బహుశ నా మరణమును వాయిదా వేసినట్లు ఉన్నారు.  మీరు రేపు ఉదయం 10 గంటలకు ఫోన్ చేయమని కోరాను.

07.04.2019  ఉదయం 10 గంటలకు నా మిత్రుడు శ్రీ త్యాగరాజు నాకు ఫోన్ చేసారు.  ఫోనులోబాబా మీ మరణ చీటీని తీసి వేసారా?” అని అడిగారు.  ఆయనకు నేను చెప్పిన విషయమేమిటంటేబాబా తెల్లవారుజామున నాకు చూపించిన దృశ్యమును వివరంగా చెప్పాను.

నేను వేగముగా వస్తున్న బస్సు ముందు భాగమున పడిపోయాను.  బస్సు ముందు ఉన్న ఇనుప కమ్మీని పట్టుకుని వ్రేలాడుతూ ముందుకు వెళ్ళిపోసాగాను.  చేయి జారి రోడ్డు మీద పడితే బస్సు చక్రాల క్రింద పడి మరణించవలసిందే.  భయంతోసాయీ! నన్ను రక్షించుఅని ఏడవసాగాను.  బస్సు ఆపమని బిగ్గరగా అరసాగాను.  ఇంతలో రోడ్డుమీద నిలబడి ఉన్న ఒక వృధ్ధుడు నా కుడిచేయి పట్టుకుని ప్రక్కకు లాగేసి వెళ్ళిపోయాడు.  
                               Image result for images of shirdi sai baba with old kahani

నా బట్టలు చిరిగి పోయాయి.  నాకు దెబ్బలు తగలలేదు.  శ్రీసాయికి కృతజ్ఞతలు చెప్పుకుని రోడ్డు ప్రక్కన ఉన్న అడవిలోకి వెళ్ళిపోయాను.”    నాకు నిద్రనుండి మెలకువ వచ్చింది. “ బాబా నామరణాన్ని వాయిదా వేసారు.  బహుశ నేను ఇంకా సాయిసేవ చేసుకోవలసి ఉండవచ్చునని భావిస్తున్నాను  అని చెప్పి ఫోన్ పెట్టేసాను.

06.04.2019  ఉగాది పండగ బాబా నాకు పునర్జన్మ ప్రసాదించిన రోజుగా భావించాను.  11.04.2019 నాడు తెల్లవారుజామున, బాబాతో,  "బాబా ఇక మీదట నేను జీవించినంత కాలము రోజూ నీవు, నేను మాట్లాడుకొనే మాటలను ఒక డైరీలో వ్రాయాలని ఉంది ఆశీర్వదించమని కోరాను.  ఆయన నన్ను రాజమండ్రి గోదావరి నది ఒడ్డుకు తీసుకుని వెళ్ళి అక్కడ ఒక క్రొత్త డైరీని నాకు ప్రసాదించారు.  
                Image result for images of rajahmundry godavari bank
బాబా రాజమండ్రి గోదావరి నది ఒడ్డున ఇచ్చిన క్రొత్త డైరీపై శ్రీ షిరిడీ సాయితో ముఖాముఖిఅని వ్రాసి డైరీకి నామకరణం చేశాను.  డైరీలో 06.04.2019 (వికారి నామ సంవత్సర ఉగాది పండుగ) నుండి నేను బాబాతో ప్రతిరోజు ద్యానములో ఉదయం 4 గంటలనుండి 7 గంటలవరకు మానసికంగా మాట్లాడి ఆధ్యాత్మిక విషయాలను తేదీల ప్రకారము వ్రాసి నామిత్రుడు త్యాగరాజుకు అందచేస్తాను.

డైరీ నేను పూర్తిగా వ్రాయలేకపోతే ముగింపు వాక్యాలను శ్రీ త్యాగరాజు గారిని వ్రాయమని కోరుతున్నాను.

ఒక సంతోషకర వార్త ఏమిటంటే 06.04.2019 తెల్లవారుజామున కలలో బాబా, నేను పని చేసిన కంపెనీ హెడ్ ఆఫీసు బొంబాయి నుండి ఛీఫ్ స్టోర్స్ ఆఫీసరుగారి రూపములో ఫోన్ చేసినీవు ఇంతకు ముందు వ్రాసిన ఆరు పుస్తకాలు చదివాను.  అవి చాలా బాగా వ్రాసావు.  ఇక ముందు నీవు వ్రాసే పుస్తకము ‘శ్రీ షిరిడీ సాయితో ముఖా ముఖి బాగుంటుందని భావిస్తున్నాను”.  అని చెప్పినపుడు నాకు సంతోషము కలిగింది.

శ్రీ షిరిడీ సాయితో ముఖా ముఖిఅన్న పుస్తకము ముద్రించబడిన తరువాత శ్రీ సాయి భక్తులు ఆపుస్తకాన్ని చదివి నన్ను ఆశీర్వదించుతారు అని ఆశించుతూ….
                                         శ్రీ సాయి సేవలో
                               సాయిబానిస రావాడ గోపాలరావు
గురువారము
11.04.2019
హైదరాబాద్

శ్రీ షిరిడీ సాయితో ముఖా ముఖి - 1 వ.భాగమ్
     Image result for images of shirdi sai in dreams
06.04.2019 - నీకు పునర్జన్మను ప్రసాదించాను.  నా దర్బారులో నీకు స్థానం కల్పించాను.

వికారి నామ సంవత్సర ఉగాది పండగ….  రోజునుండి నీకు నేను పునర్జన్మను ప్రసాదించుచున్నాను.  ఆధ్యాత్మిక మార్గములో ఏకాంతముగా ప్రయాణము కొనసాగించు, నేను సదా నీ వెనక ఉంటాను.
నీవు ఇంతవరకు నా తత్వ ప్రచారములో వ్రాసిన ఆరు పుస్తకాలు చదివాను.  గురు సాంప్రదాయమును నా భక్తులకు తెలియజేస్తున్న నా భక్తులందరిలో నీకు కూడా ప్రేమతో సముచిత స్థానము కల్పించుతున్నాను.

07.04.2019 - సర్వ జీవులలోను, భగవంతుని స్ఇష్టిలోను శ్రీసాయిని చూడు.
           Image result for images of black kitten and black dog
నీవు నిన్న రాత్రినా పాదాల దగ్గిర తిరుగుతున్న నల్లపిల్లిని దాని పిల్లలను చూసావు.  వాటిని ప్రేమతో కాపలా కాస్తున్న నల్ల కుక్కను చూసావు.  నల్లకుక్కలో ఉన్నది నేనే.

నీవు శుభ్రమయిన బట్టలు కట్టుకుని రాలేదు అని నా మందిర పూజారులు నిన్ను మందిరం బయటకు గెంటివేసారని బాధపడకు.  మాసిన బట్టలతో మందిరము బయట నీప్రక్కన కూర్చున్నది నేనే.
                Image result for images of baba in old kahani

      Image result for images of beautiful baba temple
     Image result for images of beautiful baba temple

నా మందిరము ఎంత అందముగా నా భక్తులు నిర్మించినారు అని చూడకు.  నా మందిరము బయట భగవంతుడు ఎంత క్కటి ప్రకృతిని సృష్టించినాడు, సృష్టిలోని పచ్చని చెట్లు, చెట్లకు ఉన్న పూలని చూడు.  భగవంతుడు ఎంత గొప్ప కళాకారుడు అని ఆలోచించు.
         Image result for images of beautiful nature

08.04.2019 - శ్రీసాయిమాత తన పిల్లలను కాపాడుతుంది...

కష్టాలనుండి తల్లి తన పిల్లలను ఏవిధంగా కాపాడుకుంటూ ఉంటుందో అదే విధముగా నేను నా భక్తులను కాపాడుకుంటూ ఉంటాను.
రోజులలో వివాహానికి వచ్చి వధూవరులను ఆశీర్వదించేవారి కన్నా అక్కడ ఏర్పాటు చేసిన విందు భోజనాలను ఆరగించడానికి వచ్చినవారి సంఖ్య ఎక్కువ అవుతున్నది.  ఇది నాకు బాధ కలిగించుతున్నది.

09.04.2019 - శ్రీసాయి శక్తితో మరణించినవారి ఆత్మలతో మాట్లాడవచ్చు...

1987 .సంవత్సరములో అమెరికాలోని నీ మిత్రుడు డా.మోహనరెడ్డి మరణించాడు.  నీవు వాని ఆత్మతో నిన్న రాత్రి మాట్లాడావు.  శక్తిని నీకు ప్రసాదించినది నేనే.
 1970 .సంవత్సరంలో నీవు పని చేసిన రాజస్థాన్ లోని మొదటి అణుశక్తితో నడిచే విద్యుత్ ఉత్పత్తి కేంద్రములోని అణుశక్తిని నేనే.  ఆ యంత్రాలను నడిపే మానవ శక్తిని నేనే.
మానవ శక్తితో నడిచే యంత్రాలు, మరియు ఆ యంత్రాలను నడిపే మానవులు ఒకనాడు కాలగర్భములోను, మట్టిలోను కలసిపోవలసినదే.

10.04.2019 - పరధర్మము ఎంత గొప్పదయినా నీవు నీ స్వధర్మాన్నే పాటించు...

ధన, కనక, వస్తు, వాహనాలు కలిగి ఉండటము తప్పు కాదు.  వాటిని చూసుకుని సమాజములో అహంకారముతో జీవించడము తప్పు అని గుర్తించు.

నీవు ప్రేమతో నన్ను ఫకీరని పిలిచినా లేదా సాయి అని పిలిచినా నేను తప్పక పలుకుతాను.
               Image result for images of shirdi saibaba old photo
భగవంతుని గురించి తెలుసుకోవడానికి నీవు నీ తల్లిదండ్రులు ఆచరించిన ధర్మాన్ని పాటించు   అంతేగాని పరధర్మము జోలికి పోవద్దు.

(మరికొన్ని సంభాషణలు వచ్చే ఆదివారమ్)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)


Kindly Bookmark and Share it:

3 comments:

Saibanisa Gopalarao Ravada on April 21, 2019 at 8:36 AM said...

Jaisairam

Unknown on April 22, 2019 at 5:45 AM said...

Excellent jai Sai satguru

Unknown on May 27, 2019 at 4:18 AM said...

Sai leelalanu chakkaga vivarencharu.
Jai sai ram

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List