19.04.2019 సోమవారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ షిరిడీ సాయిబాబా తో స్నేహబంధమ్ –21 వ.భాగమ్
YOU
BRING US JOY MERE KHWAJA
FRIENDSHIP
WITH GOD
LORRAINE
WALSHE RYAN & FRIENDS
Lorren Walsh e mail.
shirdi9999@hotmail.com
బాబాతో సాన్నిహిత్యమ్ - డైరీ లో ప్రచురించిన
సాయి భక్తుల అనుభవాలు
- 21
(అనువాదం చేసి
ప్రచురించడానికి బాబా గారు కూడా తమ అనుమతిని లోరెన్ వాల్ష్ గారి ద్వారా
ప్రసాదించారు)
తెలుగు అనువాదమ్ : ఆత్రేయపురపు త్యాగరాజు
నిజాంపేట, హైదరాబాద్ ఫోన్ : 9440375411
8143626744
(మరొక ముఖ్యమయిన విషయం…. చాలా కాలం క్రితం సాయిబానిస శ్రీ రావాడ గోపాలరావుగారి డైరీ, బాబా వారు ఆయనకు అందించిన సందేశాలను ప్రచురించడం జరిగింది. త్వరలో సాయిబానిస శ్రీరావాడ గోపాలరావు గారు రెండు వారాల నుండి బాబాతో జరుపుతున్న సంభాషణలు…”శ్రీ షిరిడీ సాయితో ముఖాముఖి” ప్రచురిస్తున్నానని తెలపడానికి ఎంతగానో సంతోషిస్తున్నాను. ప్రతిరోజు బాబాతో జరిగే సంభాషణలు వారానికి ఒక భాగం చొప్పున ప్రచురిస్తూ ఉంటాను. ప్రతిరోజు బాబాతో జరుపుతున్న సంభాషణలను సాయిబానిసగారు ఫోన్ ద్వారా చెపుతుండగా నేను రాసుకునే అవకాశం బాబా నాకు కలిగించినందుకు నేనెంతగానో బాబాకు ఋణపడి ఉన్నాను.)
మాధురి చిత్తూరు గారు వివరించిన అధ్బుతమయిన అనుభవమ్
మాధురి చిత్తూరు గారు వివరించిన అధ్బుతమయిన అనుభవమ్
ఈ సంఘటన చాలా సంవత్సరాల క్రితం జరిగింది. అప్పుడు నేను చాలా చిన్నదానిని. మానాన్నగారు ఫాన్సీ షాపు
నిర్వహిస్తూ ఉండేవారు. తెల్లకాగితాలు, పుస్తకాలు ఇంకా చిన్న చిన్న సామాన్లు
అమ్ముతూ ఉంటారు. (స్టేషనరీ షాప్).
ఒక రోజున మాకు డిస్ట్రిబ్యూటర్ ల వద్దనుంచి పార్సిల్స్, తెల్లకాగితాల బండిల్స్, పుస్తకాలు, ఇంకా చిల్లరమల్లర సామానులు అనుకున్న రోజుకు రానే వచ్చాయి. మా ఇంటి గదులలో ఖాళీ లేకపోవడం వల్ల వచ్చిన సరుకునంతా బయట ఇంటి ఆవరణలో పెట్టేసాము. ఆవరణంతా వచ్చిన సరుకుతో నిండిపోయింది. వాతావరణ శాఖవారు ఆరోజున భారీ వర్షం కురుస్తుందని చెప్పారు. కాని సరుకంతా బయటనే ఉంచేయక తప్పని పరిస్థితి. వర్షం వస్తే మొత్తం సరుకంతా తడిసి ఎందుకూ పనికిరాకుండా పోతాయి.

ఇటువంటి విపత్కర పరిస్థితిలో ఆదుకునే వ్యక్తి
షిరిడీ సాయిబాబా తప్ప మరెవరూ కాదనే నమ్మకంతో మా అమ్మగారు ఆయనను
ప్రార్ధించుకుంటూనే ఉన్నారు. అది నాకు బాగా గుర్తు. మా నాన్నగారు బయట వరండాలో ఉంచిన సరుకు తడిసి పోకుండా చేయవలసిన
ప్రయత్నమంతా చేసారు. కాని సరుకునంతా కాపాడటం సాధ్యపడే విషయం కాదు. ఇక భగవంతుని నిర్ణయానికే
వదిలేసారు. రాత్రి
అయేటప్పటికి భారీ వర్షం కురిసే సూచనలతో పెద్ద పెద్ద ఉరుములు మెరుపులు
ప్రారంభమయ్యాయి. ఇక
ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో అందరం చాలా భయపడుతూ ఉన్నాము. సరుకంతా వానలో తడిసిపోతే మా వ్యాపారంలో భారీగా నష్టం వాటిల్లుతుంది.
మా అమ్మగారు నాన్నగారు పడుకునే గదిలో ఒక మూల ఒక మంచినీళ్ళ కుండ ఉంది. మంచినీళ్ళు త్రాగడానికి దానినిండా నీళ్ళు నింపి ఉంచుతూ ఉంటారు. మధ్యరాత్రిలో మా అమ్మగారికి ఒక వ్యక్తి కనిపించాడు. అతను కుండలోనుంచి మంచినీళ్ళు తీసుకుని తాగుతూ మా అమ్మగారివైపు చూసి నవ్వాడు. తాళం వేసి ఉన్న ఇంటిలోకి అర్ధరాత్రివేళ ఆవ్యక్తి ఎలా ప్రవేశించాడో మా అమ్మగారికి అర్ధం కాలేదు. బహుశ తను కలగంటున్నానేమో అనుకుని తిరిగి నిద్రపోయారు. మరలా తిరిగి లేచి చూసేటప్పటికి ఆ వ్యక్తే మరలా కుండలోనుంచి నీళ్ళు త్రాగుతూ కనిపించాడు. వెంటనే మా అమ్మగారు మా నాన్నగార్ని నిద్రనుండి లేపారు. ఆ సమయానికి మేమంతా లేచి మా అమ్మగారి ప్రక్కకు చేరుకున్నాము. కాని అక్కడ మాకు ఎవరూ కనిపించలేదు. మా అమ్మగారితో అదంతా వట్టి భ్రమేనని, తాళం వేసి ఉన్న ఇంటిలోకి ఎవ్వరూ ప్రవేశించే ప్రసక్తే లేదని, ఇక నిద్రపొమ్మని చెప్పాము. మరుసటి రోజు ఉదయాన్నే నీళ్ళకుండను చూసాము. రాత్రి సమయంలో నిండుగా ఉన్న కుండ ఖాళీగా కనిపించింది. ఒక్క చుక్క కూడా నీరు లేదు.
మాకుటుంబమంతా కలిసి త్రాగినా కుండలోని నీరు
మొత్తం త్రాగడం అసాధ్యం. బయట ఉన్న
పుస్తకాలు, ఇంకా ఇతర సామాగ్రి వర్షానికి ఏమీ పాడవలేదు. అన్నీ సురక్షితంగా ఉన్నాయి. బాబా మాజీవితాలను నిలబెట్టారు. లేనట్లయితే వ్యాపారంలో చాలా
నష్టపోయేవాళ్ళం. మా నాన్నగారి వ్యాపారం
కూడా బాగా అభివృధ్ధిలోకి వచ్చింది. భారీ వర్షానికి
బయట ఉంచిన సరుకు ఏమాత్రం తడిసి పాడవకుండా యోగిరాజు రాజాధిరాజు అయిన శ్రీషిరిడీ
సాయిబాబా మాకెంతో మహోపకారం చేసారు.
మరొక అనుభవమ్…
మా అమ్మగారు గురుపూర్ణిమ రోజున షిరిడీ లో బాబాను
దర్శించుకుందామనుకుంది. కాని మా మామయ్య,
మా నాన్నగారు గురుపూర్ణిమకు కొద్ది రోజులముందు షిరిడీ వెడదామని
నిర్ణయించుకున్నారు. కాని, టిక్కెట్లు
కాన్సిల్ చేసి మళ్ళీ బుక్ చేసుకున్న కారణంగా గురుపూర్ణిమనాడే షిరిడీకి చేరుకున్నాము. మా అమ్మగారు చాలా సంతోషంతో ముందురోజు రాత్రి
సాయిబాబాను మనఃస్ఫూర్తిగా ప్రార్ధిస్తూ “బాబా మేము ఇక్కడికి వచ్చాము. మేము ఇక్కడికి వచ్చినట్లుగా నువ్వు మమ్మల్ని
గుర్తించి మమ్మల్ని కులుసుకునే బాధ్యత నీదే” అన్నారు. మరుసటి రోజు మేము షిరిడీలో తాత్యా సమాధిని
చూడటానికి వెడుతూ ఉన్నాము.
అంతలో కఫనీ ధరించిన ఒక పొడవాటి వ్యక్తి మావద్దకు వచ్చి మేము తనకు ఎప్పటినుంచో తెలిసిన స్నేహితులమన్నట్లుగా మా అమ్మగార్ని నాన్నగారిని ఆప్యాయంగా కౌగలించుకొన్నారు. ఆ వ్యక్తి నా సోదరుడిని, నన్ను దీవించాడు. ఆ తరువాత మాతో కూడా ఉన్న మా మామయ్య కుటుంబాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ తరువాత మా అమ్మగారు క్రితం రోజు రాత్రి తను, మమ్మల్ని కలుసుకోవడానికి నువ్వు రావాలి అని సాయిబాబాని ప్రార్ధించినట్లు చెప్పారు. వర్ణించలేని ఆనందంతో మాకళ్ళంబట ఆనందభాష్పాలు కారాయి.

(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment