15.04.2019 సోమవారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ షిరిడీ సాయిబాబా తో స్నేహబంధమ్ –20 వ.భాగమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ షిరిడీ సాయిబాబా తో స్నేహబంధమ్ –20 వ.భాగమ్
YOU
BRING US JOY MERE KHWAJA
FRIENDSHIP
WITH GOD
LORRAINE
WALSHE RYAN & FRIENDS
బాబాతో సాన్నిహిత్యమ్ - డైరీ లో ప్రచురించిన
సాయి భక్తుల అనుభవాలు
- 20
తెలుగు అనువాదమ్ : ఆత్రేయపురపు త్యాగరాజు
నిజాంపేట, హైదరాబాద్ ఫోన్ : 9440375411
8143626744
ఈ
రోజు అరుణ్ రాజ్ – బెంగళూరు గారు వివరించిన మరొక అధ్భుతమయిన లీల.
నాకు
19 లేక 20 సంవత్సరముల వయసు ఉన్నపుడు నేనొక్కడినే షిరిడీ వెళ్ళాను. అప్పటినుండి ప్రతి సంవత్సరం నియమంగా క్రమం తప్పకుండా షిరిడీ వెళ్ళి బాబాను దర్శించుకుంటూ
ఉన్నాను. రెండు సంవత్సరాల క్రితం నేను
హోటల్ వ్యాపారంలోకి అడుగుపెడదామని నిర్ణయించుకున్నాను. వ్యాపారం ప్రారంభించేముందు బాబా ఆశీర్వాదాలు
తీసుకోవడానికి షిరిడీకి ప్రయాణమయ్యాను.
షిరిడీలో ఉండగా నాకొక విషయం తెలిసింది.
బాబాకు మన కోరికను విన్నవించుకొని ఆయనను ఆహ్వానిస్తూ గురుస్థానంలోని వేపచెట్టు చుట్టూ
ప్రదక్షిణ చేసినట్లయితే ఆయన మన కోరికను మన్నిస్తారని విన్నాను.
కోరిక తీరిన భక్తుడు మరుసటి సంవత్సరం బాబాకు
కృతజ్ఞతలు తెలుపుకోవడానికి షిరిడీ వచ్చి వేపచెట్టు చుట్టూ మరొక్కసారి ప్రదక్షిణ
చేస్తారని కూడా చెప్పారు.
నేను
ప్రారంభింపబోయే హోటల్ వ్యాపారానికి బాబాని ఆహ్వానిస్తూ ఆయన సమక్షంలోనే అంతా
జరగాలనే భావంతో ఒక ప్రదక్షిణ పూర్తి చేద్దామని నిశ్చయించుకొన్నాను. బాబా మీద అచంచలమయిన భక్తి విశ్వాసాలతో వెంటనే
ఒక ప్రదక్షిణ పూర్తి చేసాను. బాబా మీద నాకున్న
పూర్తి నమ్మకంతో ఆయన నాకోరికను తీర్చారు అని భావించి కృతజ్ఞతా పూర్వకంగా ముందుగానే
రెండవ ప్రదక్షిణ చేసాను.
షిరిడీనుంచి
తిరిగి వచ్చిన తరువాత గురువారం నాడు వ్యాపారం ప్రారంభించాను. ఎవరి తోడ్పాటు లేకుండా నాకు సహాయం చేసిన బాబా
రాకకోసం ఎదురు చూసాను. కాని, బాబా మాత్రం
రాలేదు. సరిగా ఒకవారం తరువాత గురువారం
మధ్యాహ్నం హోటల్ లో పనిచేస్తున్న వారిలో ఒకతను నాదగ్గరకు వచ్చి బయట ఒక ముసలివాడు
నుంచుని ఉన్నాడని చెప్పాడు. ఆ ముసలివానిని
ఏమి కావాలని అడిగితే ఏమీ సమాధానం చెప్పకుండా నిలుచుని ఉన్నాడని చెప్పాడు. అతను తినడానికి ఏదయినా పెట్టమని పనివాడికి
చెప్పి అతనితో కూడా బయటకు వచ్చాను.
పనివాడు ఒక ప్లేటులో సమోసాలు తెచ్చి ఆముసలతనికి ఇచ్చాడు. ఆముసలివాడు నమ్మలేనట్లుగా నావైపు చూస్తున్నట్లనిపించింది. అతని మొహంలోని భావాలు ఎలా ఉన్నాయంటే, “నేను నీకింత సహాయం చేస్తే నువ్వు నాకిచ్చేది, ఇదేనా?” అన్నట్లుగా ఉన్నాయి.
అతను
చూసిన చూపులు నాకర్ధమయ్యాయి. అతని భావాలు
సరైనవే. అతనిని తప్పు పట్టడానికి
వీల్లేదు. నా హోటల్ లో రుచికరమయిన
పదార్ధాలు ఉన్నాగాని, నేను సమోసాలనే ఎందుకు ఇచ్చాను? మరుక్షణంలోనే వెనక్కి వెళ్ళి మరలా చూసేటప్పటికి
ఆ కొద్ది సెకనుల వ్యవధిలోనే ఆ ముసలివాడు కనపడలేదు.
క్షణకాలంలో ఆ వ్యక్తి ఎలా కనపడకుండా వెళ్ళిపోయాడో నాకర్ధం కాలేదు. రోడ్డంతా ఖాళిగా ఉంది. కనుచూపుమేరలో ఎక్కడా ఆ ముసలివాడు
కనపడలేదు. నాహోటల్ మెయిన్ రోడ్డు మీదనే
ఉంది. ఎవరయినా సరే లోపలికి వచ్చి మరలా తిరిగి
వెళ్ళడం నాకు కనిపిస్తుంది. ఎందుకంటే
రోడ్డు తిన్నగా ఉండటం వల్ల హోటల్ నుండి బయటకు వెళ్ళేవాళ్ళు కనిపిస్తూనే
ఉంటారు.
(పాఠకుల ఊహ కోసం ఈ హోటల్ చిత్రం ఇచ్చాను. హోటల్ నుంచి బయటకు వెళ్ళేవారు నేరుగా ఉన్న రోడ్డుమీద కనిపిస్తారన్నదానికి ఉదాహరణగా ఇచ్చాను.... త్యాగరాజు)
ఇపుడా ముసలివాడు ఎక్కడా కనపడకుండా
ఒక్కసారిగా అదృశ్యమయ్యాడు. అపుడు గుర్తుకు
వచ్చింది ఒక విషయం. ఆ వ్యక్తి తలకి తెల్లని
గుడ్డ చుట్టుకున్నాడు. కఫనీ ధరించి
ఉన్నాడు. ఆరోజు గురువారమ్.
బాబా నా ఆహ్వానాన్ని మన్నించి వచ్చారు.
నేనాయనని గుర్తించలేకపోయాను. ఆయన
నాకోరికను తీర్చడానికి నాప్రార్ధనను మన్నించి నా హోటల్ కు వచ్చారు. వెంటనే నా స్నేహితుడికి ఫోన్ చేసి జరిగినదంతా
వివరించాను.
ఈ
రోజుకి సాయిబాబా అనుగ్రహంతో ఎవరి ఆర్ధిక సహాయ సహకారాలు లేకుండా మొత్తం మూడు హోటల్
లను నిర్వహిస్తున్నాను.
జై
సాయిరామ్
(సర్వం
శ్రీ సాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment