శ్రీ షిరిడీ సాయితో ముఖా ముఖి
సాయిబానిస శ్రీ రావాడ గోపాలరావు
23.06.2019 ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ షిరిడీ సాయితో ముఖా ముఖి – 10 వ.భాగమ్
సాయిబానిస గారి ద్వారా సాయి భక్తులకు బాబా వారు అందిస్తున్న
అమూల్యమయిన సాయి సందేశాలు
సంకలనమ్ : ఆత్రేయపురపు త్యాగరాజు
నిజాంపేట, హైదరాబాద్
చదివిన తరువాత మీ అభిప్రాయాలను తెలపండి.
మైల్ ఐ.డి. tyagaraju.a@gmail.com
ఫోన్స్ & వాట్స్ ఆప్ : 9440375411 & 8143626744
05.06.2019 - శ్రీ సాయి
72 గంటల యోగక్రియ సమాధి
మానవ జీవితంలో ఏదీ శాశ్వతం కాదు. కాని మానవుని ఆత్మ శాశ్వతము. నేను మీ అందరిలాగే మానవ జీవితంలో కష్టాలు,
సుఖాలు అనుభవించాను. ఒక సమయంలో నన్ను షిరిడీ ప్రజలు మానసికంగాను,
శారీరకంగాను
చాలా వేధించారు. మీరందరూ మీ కష్టసుఖాలను చెప్పుకోవడానికి నాదగ్గరకి వస్తారు. మరి నేను
నా కష్టసుఖాలను ఎవరితో చెప్పుకోవాలి
అనే ఆలోచనతో ఒక పౌర్ణమినాడు రాత్రి నా శరీరాన్ని మహల్సాపతి ఒడిలో వదిలిపెట్టి నా ఆత్మను మనందరికీ యజమాని అయిన భగవంతుని దగ్గరకు తీసుకొని వెళ్ళాను.
అనే ఆలోచనతో ఒక పౌర్ణమినాడు రాత్రి నా శరీరాన్ని మహల్సాపతి ఒడిలో వదిలిపెట్టి నా ఆత్మను మనందరికీ యజమాని అయిన భగవంతుని దగ్గరకు తీసుకొని వెళ్ళాను.
భగవంతుని ఆదేశానుసారము 72 గంటల తరవాత నా ఆత్మను నా శరీరంలోనికి ప్రవేశపెట్టాను. నా శరీరంలో నా
ఆత్మ లేని సమయంలో మహల్సాపతి నా
శరీరాన్ని జాగ్రత్తగా కాపాడాడు.
ఈ యోగక్రియ సమాధిని నేను భగవంతుని దయతో విజయవంతంగా జరిపాను. ఇది జరిగిన 32 సంవత్సరాల తరవాత విజయదశమినాడు నేను శాశ్వతముగా నా శరీరాన్ని వదిలివేశాను. ఈనాటికీ నా ఆత్మ నా భక్తులకొరకు ఆరాట పడుతూ ఉంటుంది. నా సమాధినుండి నా ఎముకలు నా భక్తులతో మాట్లాడతాయి.
ఈ యోగక్రియ సమాధిని నేను భగవంతుని దయతో విజయవంతంగా జరిపాను. ఇది జరిగిన 32 సంవత్సరాల తరవాత విజయదశమినాడు నేను శాశ్వతముగా నా శరీరాన్ని వదిలివేశాను. ఈనాటికీ నా ఆత్మ నా భక్తులకొరకు ఆరాట పడుతూ ఉంటుంది. నా సమాధినుండి నా ఎముకలు నా భక్తులతో మాట్లాడతాయి.
06.06.2019 - బాబా మహాసమాధికి ముందుగా ఆయన ఇటుకరాయి రెండు ముక్కలగుట
మనిషి జన్మించినపుడే భగవంతుడు అతని మరణము తేదీని కూడా నిర్ణయించి వానికి జన్మను ప్రసాదించుతాడు. నా విషయంలో భగవంతుడు నా మరణమును గుర్తుచేయడానికి నాకు ఒక ఇటుకను బహుమానముగా ఇచ్చి, ఈ ఇటిక విరిగిపోయిన నాలుగు రోజులకు నీవు నీ
శరీరమును వదిలివేస్తావు అని
సూచించారు. 1918 విజయదశమికి నాలుగు రోజుల ముందు ద్వారకామాయిని శుభ్రం చేస్తున్న ఒక భక్తుని చేతినుండి ఈ ఇటుకరాయి కిందపడి రెండు ముక్కలుగా విరిగిపోయింది. ఆ సమయంలో భగవంతుడు నాకు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి నా మరణము కొరకు భోజనము చేయటము మానివేశాను. నేను కోరుకున్న విధముగానే విజయదశమి పర్వదినమున నేను నా ఆత్మను నా శరీరమునుండి వేరు
చేసుకొన్నాను. నా పార్ధివశరీరాన్ని బూటీవాడలో నా భక్తులు ఖననము చేసారు.
నా భక్తులు విరిగిపోయిన ఆ ఇటుక
రెండు ముక్కలను వెండితీగతో కట్టి నా పార్ధివ శరీరముతోపాటు నా మహాసమాధిలో నా తలక్రింద ఉంచారు.
07.06.2019 - శ్రీ షిరిడీ సాయి మహాసమాధి (15.10.1918)
ద్వారకామాయిలో నా
ఇటుకరాయి రెండు ముక్కలయిన నాలుగురోజులకు నా ఆత్మజ్యోతి నా శరీరమును వదిలి నా భక్తుల హృదయాలలో వెలగసాగింది. కాని, నా శరీరము సమాధిలో ఈనాడు చీకటి గృహములో ఉండిపోయినది.
నా సమాధి గురించి ఆలోచించేవాడు ఒక్కడూ లేడు. అందరూ నా విగ్రహానికే పూజలు చేస్తున్నారు.
పూజలు విగ్రహానికి చేస్తున్నా నా సమాధిలోని నా ఎముకలు నా భక్తుల యోగక్షేమాలను కనిపెట్టుకుని ఉంటాయి. నేను నా భక్తులకు స్వప్నదర్శనాలు ఇస్తూ వారితో మాట్లాడుతూ ఉంటాను.
నా సమాధి గురించి ఆలోచించేవాడు ఒక్కడూ లేడు. అందరూ నా విగ్రహానికే పూజలు చేస్తున్నారు.
పూజలు విగ్రహానికి చేస్తున్నా నా సమాధిలోని నా ఎముకలు నా భక్తుల యోగక్షేమాలను కనిపెట్టుకుని ఉంటాయి. నేను నా భక్తులకు స్వప్నదర్శనాలు ఇస్తూ వారితో మాట్లాడుతూ ఉంటాను.
నేను నా శరీరమును విడిచేసమయంలో నా శరీరము అనారోగ్యంతో ఉండటం చేత ఆఖరిశ్వాస తీసుకునే సమయంలో నా నోటినుండి రక్తము వెడలినది. ఆ తరవాత ప్రశాంతముగా నాప్రాణమును వదిలాను. నా మరణానంతరము నా హిందూ భక్తులు, మహమ్మదీయ భక్తులు నా శరీరమునకు ఏ విధముగా అంతిమసంస్కారాలు చేయాలి అనే విషయముపై తర్జనభర్జనలు చేసారు. ఆఖరికి నా కోరికపై బూటీవాడాలో మురళీధరుని విగ్రహము ప్రతిష్టించడానికి కేటాయించిన స్థలములో నా పార్ధివశరీరాన్ని అన్ని లాంచనాలతో మహాసమాధి చేసారు. ఈనాడు కోటానుకోట్ల నాభక్తులు బూటీవాడాకు వచ్చి నా ఆశీర్వచనాలు పొందుతున్నారు.
08.06.2019 - షిరిడీ సాయికి పునర్జన్మ
నా పునర్జన్మ గురించి నా భక్తులలో అనేక అపోహలు ఉన్నాయి. కొందరు తాము
షిరిడీసాయి అవతారమని, మరికొందరు తాము షిరిడీసాయి అంశమని చెప్పుకుంటూ ఈ సమాజంలో తిరుగుతున్నారు. నిజానికి నాకు
శిష్యులు ఎవరూ లేరు. నన్ను నమ్మినవారందరూ నాకు భక్తులు మాత్రమే. నేను నా
భక్తులకిచ్చే సందేశము ---
"నేను లక్షల సంవత్సరాలనుండి అనేక జన్మలు ఎత్తాను. భవిష్యత్తులో తిరిగి అనేక జన్మలు ఎత్తుతాను. నాకు ఆది లేదు అంతము లేదు. ప్రస్తుతము నేను షిరిడీసాయి శక్తిగానే ఉన్నాను. నేను షిరిడీసాయిగా నా శరీరాన్ని వదిలాను. కాని, సమాధిలోని నా ఎముకల శక్తితో నేను సదా నా భక్తులతో మాట్లాడుతూ ఉంటాను. నా సమాధినుండి నేను నా భక్తుల యోగక్షేమాలు తెలుసుకుంటూ వారిని సదా కాపాడుకుంటాను. అందుచేత నేను ఇంకా కొత్త జన్మ ఎత్తలేదు అని నాభక్తులు గ్రహించగలరు."
09.06.2019 - లక్ష్మీబాయి షిండేకు తొమ్మిది నాణాలు
నేను ఆఖరిశ్వాస తీసుకొనుచున్న సమయంలో ఈమె
నాపై ప్రేమభక్తులతో నాపాదాలను ఒత్తసాగింది. ఆ సమయంలో నాజేబులో 9 రూపాయి నాణాలు ఉన్నాయి. నా జీవితంలో ఆఖరి దానముగా ప్రేమతో నేను ఆ తొమ్మిది నాణాలను లక్ష్మీకి ఇచ్చాను.
ఆమె ఈనాటికీ వాటిని భద్రముగా దాచి ఉంచుకొన్నది. ఆమె ధనవంతురాలయినా నేను ప్రేమతో ఇచ్చిన ఆనాణాలను ప్రేమతో స్వీకరించింది. నా జీవితంలో రాత్రిగాని, పగలు గాని నాకు అవసరమయిన పనులన్నీ ఆమె చేసేది. ఆమె సేవను నేను జన్మజన్మలకూ మర్చిపోలేను.
ఆమె ఈనాటికీ వాటిని భద్రముగా దాచి ఉంచుకొన్నది. ఆమె ధనవంతురాలయినా నేను ప్రేమతో ఇచ్చిన ఆనాణాలను ప్రేమతో స్వీకరించింది. నా జీవితంలో రాత్రిగాని, పగలు గాని నాకు అవసరమయిన పనులన్నీ ఆమె చేసేది. ఆమె సేవను నేను జన్మజన్మలకూ మర్చిపోలేను.
ఒకనాడు ఆమె
నాకు పాలు, రొట్టె తెచ్చింది. ఆ రొట్టెను ద్వారకామాయిలో ఆకలితో ఉన్న
ఒక కుక్కకు పెట్టాను.
అందులకు లక్ష్మి నాపై కోపగించుకుంది. ఆమె కోపము తగ్గిన తరువాత ఆమెకు నచ్చచెప్పాను. ఆమెకు నేను చెప్పిన మాటలు విను ---
అందులకు లక్ష్మి నాపై కోపగించుకుంది. ఆమె కోపము తగ్గిన తరువాత ఆమెకు నచ్చచెప్పాను. ఆమెకు నేను చెప్పిన మాటలు విను ---
“ఆ కుక్కలోని ఆత్మ
నాలోని ఆత్మ ఒక్కటే. ఆ కుక్కకు ఆకలి వేస్తుంది. కాని చెప్పలేకపోతున్నది. నేను ఆకుక్క ఆకలిని అర్ధం చేసుకుని ఆ
కుక్కకు రొట్టె పెట్టాను. నా ఆకలి
తీరింది.”
అని ఆమెకు చెప్పాను.
10.06.2019 - శ్రీమతి రాధాకృష్ణ ఆయి
ఈమె బాలవితంతువు. తన భర్త
మరణానంతరము ఆధ్యాత్మికరంగంలో పయనించాలని అనేక పుణ్యక్షేత్రాలను దర్శించుకుని,
కొందరి సాయిభక్తుల సలహా
ప్రకారము షిరిడీకి చేరుకొని ద్వారకామాయిలో నా దర్శనము చేసుకుని, షిరిడీలో తన ఆఖరిశ్వాస తీసుకున్నంత వరకు నా
సేవ చేసుకొన్నది. ఎల్లప్పుడూ ఆమె తన
ఇష్ట దైవమయిన కృష్ణుని తలుచుకుంటూ భక్తిపాటలు పాడుకుంటూ చావడి ఎదురుగా ఉన్న పాఠశాలలో నివసిస్తూ నా భక్తులకు ఆధ్యాత్మిక మార్గంలో పయనించటానికి సలహాలు,
సూచనలు ఇస్తూ ఉండేది. ఆమె ఒక
గొప్ప యోగిని. నాకు వచ్చిన భిక్షనుండి కొన్ని రొట్టెలు మాత్రము ఆమెకు పంపుతూ ఉండేవాడిని. ఆమె ఆ భోజనము సంతోషముగా తిని జీవించేది.
ఆమెకు నా
సేవలో నా పేరిట సంస్థానమును ప్రారంభించాలనే కోరికతో నా భక్తులకు భోజన సౌకర్యాలను కల్పించుతూ వారిచ్చే వెండి కానుకలు తన ఇంట ఉంచుకొని నా సేవలో వాటిని ఉపయోగిస్తూ ఉండేది. ఈ విధంగా చేయడము షిరిడీ ప్రజలకు అయిష్టముగా ఉండేది. ఈమె కొందరు భక్తులతో గొడవలు కూడా
పడుతూ ఉండేది. ఒకరోజున ఆమె మనస్సుకు అశాంతి కలగడం వలన
ఆమె తన శ్వాస బంధనక్రియ చేసుకొని తన శరీరమును వదిలి నా గుండెలలో శాశ్వత స్థానము కలిగించుకున్నది.
11.06.2019 - శ్రీమతి బైజాబాయి
ఈమె నాకు
భగవంతుడు ప్రసాదించిన సోదరి. నేను బాలఫకీరుగా షిరిడీ అడవులలో తపస్సు చేసుకొనే రోజులలో ఈమె
నిత్యము మధ్యాహ్నమువేళ ఒక
చిన్న గంపలో రొట్టె, కూర తెచ్చి నాకు
ప్రేమగా తినిపించేది.
మిగిలిన రొట్టెలను ఆమె తినేది. ఆమె సేవకు నేను ఋణము తీరుకోలేను. ఆమె మరణశయ్యపై ఉండగా ఆమెకు నేను ఒక మాట ఇచ్చాను. అది “అక్కా! నీకుమారుడు తాత్యా మరణించే పరిస్థితే వస్తే నేను తప్పక వానిని మరణగండమునుండి కాపాడుతాను.” నేను ఆమెకు ఇచ్చిన మాట నిజమయింది. 1918 విజయదశమినాడు తాత్యా మరణం తీసివేసి నేను ఆ మరణాన్ని స్వీకరించి నా అక్కకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాను.
మిగిలిన రొట్టెలను ఆమె తినేది. ఆమె సేవకు నేను ఋణము తీరుకోలేను. ఆమె మరణశయ్యపై ఉండగా ఆమెకు నేను ఒక మాట ఇచ్చాను. అది “అక్కా! నీకుమారుడు తాత్యా మరణించే పరిస్థితే వస్తే నేను తప్పక వానిని మరణగండమునుండి కాపాడుతాను.” నేను ఆమెకు ఇచ్చిన మాట నిజమయింది. 1918 విజయదశమినాడు తాత్యా మరణం తీసివేసి నేను ఆ మరణాన్ని స్వీకరించి నా అక్కకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాను.
నేను 1918 విజయదశమి రోజున మహాసమాధి చెందినరోజున బైజాబాయి కుటుంబ సభ్యులు నా పార్ధివశరీరానికి జరగవలసిన అంత్యక్రియలు రాజలాంఛనాలతో జరిపించి,
వారు తమ కృతజ్ఞతలు తెలియపర్చుకొన్నారు. తాత్యా చిన్నప్పటినుండి నన్ను మామా అని
పిలిచేవాడు. చిన్నతనంలో నాతోపాటు మరియు మహల్సాపతితో కలిసి ద్వారకామాయిలో నిద్రించేవాడు. వానికి రోజూ రాత్రివేళ భగవంతుని గురించిన కధలు
చెబుతూ వానిని నిద్రపుచ్చేవాడిని.
12.06.2019 - శ్రీమతి రాధాబాయి దేశ్ ముఖ - మారిషస్ మరియు భిలాయ్ యాత్రలు
ఈమె సంగమనేర్ గ్రామ నివాసి. ఈమెకు చిన్నప్పటినుండి మంకుపట్టు ఎక్కువ. తన కోరిక తీరేవరకు పోరాడే నైజము కలది. తన నడివయసులో ఈమె నా దర్శనానికి వచ్చింది. ఆమె నానుండి మంత్రోపదేశము పొందాలనే కోరికతో నిరాహార దీక్షను పూనినది. ఉపవాసము ప్రారంభించినది. “ఆమె ముసలమ్మ. ఉపవాస దీక్షలో ఆమె
మరణించినట్లయితే, బాబా నీకు చెడ్దపేరు వస్తుంది” అని శ్యామా చెప్పడంతో ఆమెను పిలిచి “నాకు నా గురువు మంత్రోపదేశము చేయలేదు. నేను నీకు చేయలేను. అనవసరముగా ఉపవాసము చేయవద్దు,” అని ఆమెకు నచ్చచెప్పి ఆమెను ఆశీర్వదించి, ఆమెను ఆమె గ్రామానికి పంపించివేశాను.
ఇపుడు మనమిద్దరం (బాబా మరియు సాయిబానిస) చిన్న విమానములో మారిషస్ దేశానికి వెడదాము నడు అని నన్ను తీసుకుని వెళ్ళారు. సముద్రంలో చిన్న దీవిలో దిగాము. ఇదే మారిషస్ దేశమని చెప్పారు బాబా.
(మారిషస్ దేశము – రామాయణ కాలంలో మారీచుడు అనే రాక్షసుడిని రామబాణము వధించిన ప్రదేశము)
ఇక్కడ నీయింట భోజనము చేసిన మారిషస్ దేశపు మిత్రులు ఉన్నారు. ఆ ఎదురుగా కనపడుతున్నది రేడియోస్టేషన్. అక్కడికి వెళ్ళి మైకులో నీస్నేహితులను పిలు. ఆ రేడియో స్టేషన్ డైరెక్టర్ కి నా
పేరు చెప్పు. వారు నిన్ను రేడియో మైక్ లో మాట్లాడనిస్తారు. నీ స్నేహితులు రేడియో స్టేషన్ కు వస్తారు లేనిది వేచి చూసి
ఈ విమానం దగ్గరకు రా, మనము తిరిగి షిరిడీ వెళ్ళిపోదాము అని చెప్పారు బాబా.
నేను రేడియోస్టేషన్ డైరెక్టర్ గదిలోకి వెళ్ళి,
నేను షిరిడీనుంచి వచ్చాను,
మారిషస్ లోని నా
మిత్రులను కలవడానికి, ఒక్కసారి నన్ను మారిషస్ రేడియోలో మాట్లాడనివ్వండని కోరాను. ఆ డైరెక్టరు నన్ను ఒక అద్దాలగదిలో నిలబెట్టి,
ఈ గదిలో మీరు
ఏమి మాట్లాడినా మారిషస్ దేశంలోని అన్ని రేడియోలలోను వినిపిస్తుందని చెప్పారు. నేను అద్దాలగదిలోనికి వెళ్ళి,
నేను హైదరాబాదునుండి వచ్చాను. నా స్నేహితులందరూ రేడియో స్టేషన్ కు
వచ్చి నన్ను కలవండి అని ఒక
పదిసార్లు చెప్పి, బయటకు వచ్చాను. ఒక గంటసేపు రేడియో స్టేషన్ బయట
నిలబడినా ఒక్క స్నేహితుడూ నన్ను కలవడానికి రాలేదు. విసుగు చెంది,
తిరిగి మా చిన్న విమానములో నేను, బాబా కలిసి షిరిడీకి ప్రయాణమయ్యాము. బాబా విమానంలో నాతో
అన్న మాటలు, “గతంలోని స్నేహాలను మర్చిపోయి ప్రశాంతంగా జీవించు”.
ఇపుడు నీవు
నేను రైలులో నీ బంధువులున్న భిలాయ్ పట్టణానికి వెడదాము అని
నన్ను నాలుగు బోగీలు * ఉన్న రైలు వద్దకు తీసుకుని వెళ్ళారు.
ఆ రైలు ఇంజను బొగ్గు కాల్చగా వచ్చిన నీటి ఆవిరి యంత్రములతో నడిచే రైలు. ఆ రైలు ఇంజన్ లో నేను మరియు బాబా ఎక్కినాము. బాబాగారు ఇంజన్ డ్రైవర్ గా ఇంజన్ లో నిలబడ్డారు.
ఆ రైలు ఇంజను బొగ్గు కాల్చగా వచ్చిన నీటి ఆవిరి యంత్రములతో నడిచే రైలు. ఆ రైలు ఇంజన్ లో నేను మరియు బాబా ఎక్కినాము. బాబాగారు ఇంజన్ డ్రైవర్ గా ఇంజన్ లో నిలబడ్డారు.
బాబాగారు నన్ను పిలిచి, నీవు నా సేవకుడివి. ఈ ఇంజన్ లో బొగ్గు వేయి,
నేను రైలు నడుపుతాను. నిన్ను భిలాయ్ పట్టణానికి తీసుకునివెడతాను అని
అన్నారు.
నేను ఆయన చెప్పినట్లుగా ఇంజన్ లో బొగ్గు వేసాను. ఆ మంటలకు నీరు ఆవిరయి రైలు
వేగంగా ముందుకు వెళ్ళసాగింది. రైలు భిలాయి పట్టణానికి చేరుకుంది. ప్లాట్ ఫారమ్ ఖాళీగా ఉంది. బాబా ప్లాట్ ఫారమ్ మీద దిగి
తాను అక్కడే వేచి ఉంటానని చెప్పి,
నన్ను పట్టణములోకి వెళ్ళి రమ్మన్నారు.
నేను తెలుగు సమాజం భవనము ఎక్కడ అని అక్కడివారినడిగి ఆ భవనంలోకి వెళ్ళాను. అక్కడందరూ తెలుగువారే ఉన్నారు. వారిలో చనిపోయిన నా మేనమామ ఉన్నాడు. నేను వాని దగ్గరకు వెళ్ళాను. అక్కడ వారందరూ పేకాట ఆడుకుంటూ పకోడీలు తింటున్నారు. నా మేనమామ నన్ను గుర్తు పట్టలేదు. నన్ను నేను పరిచయం చేసుకున్నతను హేళనగా నన్ను చూసి రైలింజన్ లో బొగ్గు వేసేవాడివిలా ఉన్నావు. మాసిపోయిన బట్టలతో ఇక్కడికెందుకు వచ్చావని నన్ను కసిరాడు. నేను ఆ అవమానమును భరించలేక రైలింజన్ దగ్గరకు వచ్చి ఇంజన్ డ్రైవర్ కు సేవకుడిగా పనిచేయసాగాను. “చనిపోయిన నీ బంధువులను మర్చిపో” అన్నారు డ్రైవరు (బాబా).
*ఈ నాలుగు బోగీల రైలనగా ధర్మ, అర్ధ, కామ,
మోక్ష ముల రైలు. ఈ రైలుకు సద్గురువు ఇంజన్ డ్రైవర్ గా మారి తన
భక్తులను వారి గమ్యానికి చేరుస్తారు. --- సాయిబానిస
(మరికొన్ని సంభాషణలు వచ్చే ఆదివారమ్)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
(మరికొన్ని సంభాషణలు వచ్చే ఆదివారమ్)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment