శ్రీ షిరిడీ సాయితో ముఖా ముఖి
సాయిబానిస శ్రీ రావాడ గోపాలరావు
సాయిబానిస గారి ద్వారా సాయి భక్తులకు బాబా వారు అందిస్తున్న
అమూల్యమయిన సాయి సందేశాలు
సంకలనం : ఆత్రేయపురపు త్యాగరాజు, నిజాంపేట, హైదరాబాద్
చదివిన తరువాత మీ అభిప్రాయాలను తెలపండి.
మైల్ ఐ.డి. tyagaraju.a@gmail.com
వాట్స్ ఆప్.& ఫోన్.. 8143626744 and 9440375411
30.05.2019 - శ్రీ సాయి అరణ్యములో తన
గురువుని భగవంతుడిని కలిసిన విధానము
నీవు నా గురువు గురించి ఇదివరలో
అడిగావు. ఇప్పుడు జీవితము అనే అరణ్యంలో
నీవు పడిన బాధలు, తరవాత ఆ బాధలనుండి విముక్తి కోసం నీవు నీ గురువుని
వెదకిన విధానము, నీ గురువు నీకు భగవంతుని చూపించిన విధానము నీకు
తెలియజేస్తాను విను.
నీ జీవిత బరువు బాధ్యతలలో నీ
ఇద్దరు పిల్లలను పెంచి పెద్ద చేసి వారికి వివాహాలు చేసి ఆ వివాహాల ద్వారా నీవు
కొని తెచ్చుకొన్న తల నొప్పులను ఒక్కసారి గుర్తు చేసుకో. ఆ తలనొప్పులు తగ్గించుకోవడానికి
నీవు నీ గురువును వెతకటం ప్రారంభించావు. నీ అన్వేషణ ఫలించింది. నేను నీకు దొరికాను. నీవు నా సేవలో ఇంకా కొంతకాలము
జీవించాలి.
నీవు భారతప్రభుత్వ సేవలో 33 సంవత్సరాలు పని చేసావు. అనేకమంది ఆఫీసర్లకు పాద నమస్కారాలు చేసావు. కాని ఏమి లాభము? ఆఖరికి నీ ఆశలు ఫలించకపోవటంతో 2000 సంవత్సరంలో స్వచ్చంద పదవీ విరమణ
చేసి నా భక్తుల సేవలో సాయిదర్బార్ ను ప్రారంభించావు. నీవు నీ వంతు కృషి చేసావు. నీ కష్టమును నేను ఉంచుకోను. నీ కష్టానికి కూలీ త్వరలో నీకు లభించుతుంది.
ఇక భగవంతుని చూడాలని నీకోరిక కదా. నా వెంట రా. ఈ గ్రామంలో నా అంకిత భక్తుడు పూజారి మహల్సాపతిని నీకు పరిచయం చేస్తున్నాను. అతడు నిన్ను భగవంతుని దర్శనానికి తీసుకుని వెడతాడు. “మహల్సా! ఇలా రా. వీనిని వీని ఇష్టదైవము దేవాలయానికి తీసుకొని వెళ్ళు”.
మహల్సాపతిగారు నా చేయి
పట్టుకుని తన ఇంటి దగ్గరకు తీసుకుని వెళ్ళారు. అక్కడ ఒక మసీదు ఉంది. ఆ మసీదులో ఎవరూ లేరు. ఆ మసీదు ప్రక్కన భూమిలో ఉన్న
గృహానికి వెళ్లడానికి మసీదులో ఒక మూల సొరంగం ఉంది. ఆ సొరంగములో నుండి నేను
మహల్సాపతి గారు ముందుకు ప్రాకుతూ వెళ్ళాము. అక్కడ యోగీశ్వరులు తపస్సు
చేసుకునేందుకు వీలుగా జింక చర్మము, కమండలము, రుద్రాక్ష మాలలు, గదిలో నూనెలో వెలుగుతున్న దీపాల ప్రమిదలు ఉన్నాయి. ఇది ఏమి గది అని శ్రీ మహల్సాగారిని అడిగాను. ఇది నా గురువుగారి గురువుగారు తపస్సు చేసుకున్న
స్థలము. అంతకన్నా వివరాలు ఎక్కువగా నాకేమీ తెలియదు అన్నారు. ఆ తరవాత మేము ఆ సొరంగమునుండి మెల్లిగా ప్రాకుతూ
దగ్గరలోని ఒక హిందూ దేవాలయములోకి చేరుకొన్నాము. నా గురువు ఆదేశ ప్రకారము నేను
ఇంతవరకే రాగలను. నీవు ప్రశాంతముగా
దేవాలయములోనికి వెళ్ళి నీ దైవాన్ని పూజించుకో అని అన్నారు. నేను సంతోషముగా ఆ దేవాలయములోకి వెళ్ళాను. అది పరమ శివుని ఆలయము. నేను ఆ దేవాలయములోని
శివలింగానికి నమస్కరించాను. ఆ తరవాత నాకు మెలకువ వచ్చింది.
31.05.2019 - జామ్ నేర్ చమత్కారము, మైనతాయిని రక్షించుట
నేను కష్టాలలో ఉన్న నా భక్తులను
రక్షించుకోవడానికి చమత్కారాలు చేయను. వారిని కాపాడుకోవడానికి స్వయంగా
నేను వెడతాను. నాకు రూపము లేదు. మైనతాయిని రక్షించుకోవడానికి నేను ఘర్ వాల్ దేశపు
క్షత్రియుని రూపములో టాంగావాలాగా నేను టాంగాను నడుపుకొంటూ జామ్ నేర్ కు వెళ్ళాను.
నా భక్తురాలు మైనతాయికి ద్వారకామాయి ఊదీని అందజేసి ఆమెను కాపాడుకొన్నాను. ఇదంతా నేను భగవంతుని దయతో చేసాను.
నా భక్తురాలు మైనతాయికి ద్వారకామాయి ఊదీని అందజేసి ఆమెను కాపాడుకొన్నాను. ఇదంతా నేను భగవంతుని దయతో చేసాను.
నీవు వ్రాస్తున్న ఈ పుస్తకము
పాత భవనంలో జరిగిన సంఘటనలను తెలియజేస్తాయి. చాలా మందికి నిజాలు తెలియచేసినా
హర్షించరు. వారు నా జీవితచరిత్రలో కొన్ని
నిజ సంఘటనలకు తమ సొంత రంగులు పూసి పుస్తకాలుగా ముద్రించుతూ పాత షిరిడీ చరిత్రను
ప్రక్కదారి పట్టించుతున్నారు.
అలాగే నేను శరీరముతో ఉన్న రోజులలోని షిరిడీకి ఈనాటి షిరిడీకి చాలా తేడా ఉంది. నేనే ఈ తేడాను చూసి ఆశ్చర్యపడుతున్నాను. దయచేసి షిరిడీ రూపురేఖలను మార్చవద్దని నా కోరిక. నీవు వ్రాయుచున్న ఈ పుస్తకమును వేలసంఖ్యలో నా భక్తులు చదువుతారు.
అలాగే నేను శరీరముతో ఉన్న రోజులలోని షిరిడీకి ఈనాటి షిరిడీకి చాలా తేడా ఉంది. నేనే ఈ తేడాను చూసి ఆశ్చర్యపడుతున్నాను. దయచేసి షిరిడీ రూపురేఖలను మార్చవద్దని నా కోరిక. నీవు వ్రాయుచున్న ఈ పుస్తకమును వేలసంఖ్యలో నా భక్తులు చదువుతారు.
01.06.2019 - ఐరోపా దేశీయులు – సర్ జాన్ కర్టిస్ దంపతులు
జామ్ నేర్ లోని నా అంకిత
భక్తురాలు మైనతాయిని రక్షించడానికి స్వయంగా వెళ్ళానని చెప్పాను. అది నిజమే. మరి జాన్ కర్టిస్ దంపతులు
స్వయంగా నా ఆశీర్వచనాల కోసం ద్వారకామాయికి వచ్చిన మాట కూడా వాస్తవమే. శ్రీమతి కర్టిస్ లో తాను పెద్ద ప్రభుత్వ అధికారి
భార్యననే అహంకారమును గుర్తించాను. ఆమెకు భగవంతునిపై నమ్మకముకన్నా
ఈ ఫకీరు ఏమి చమత్కారాలు చేస్తాడని చూడటానికి వచ్చింది. ఆమె ప్రవర్తన మసీదుమాయికి
నచ్చలేదు. అందుచేతనే ఆమెను నేను
ద్వారకామాయి మెట్లను ఎక్కనీయలేదు. వారు కోపముతో తిరిగి
వెళ్ళిపోతుంటే ఒకరోజు షిరిడీలో విశ్రాంతి తీసుకుని మరుసటి రోజున వెళ్ళమని జాన్
కర్టిస్ కు సలహా ఇచ్చాను. అతను నామాట వినకుండా షిరిడీకి
వచ్చిన కొద్ది గంటలలోనే టాంగాలో తిరుగు ప్రయాణమయ్యాడు. అతని దురదృష్టము అతనిని
వెంటాడసాగింది. అతను కోపర్ గావ్ చేరక ముందే
అతను ప్రయాణిస్తున్న టాంగా బోల్తా పడింది. అతను గాయాలతో కోపర్ గావ్
ఆస్పత్రిలో చేరి గాయాలు నయమయిన తరవాతనే అహ్మద్ నగర్ వెళ్ళాడు.
02.06.2019 - ఔరంగాబాద్ కర్ భార్యకు సంతాన
ప్రాప్తి
జన్మ ఎత్తిన ప్రతి స్త్రీ
మాతృమూర్తి కావాలని కోరుకొంటుంది. కొందరి స్త్రీలలో తాము యవ్వన
దశలో ఉన్న వయసు మళ్ళినవారితో వివాహము జరిగి సంతాన ప్రాప్తికి నోచుకోరు. ఆకోవకు చెందిన స్త్రీ ఔరంగాబాద్ కర్ భార్య. ఆమె వయసులో ఉన్నా ఆమె భర్త వృధ్ధాప్యమునకు దగ్గరలో
ఉన్నాడు. ఆమె భర్తకు మొదటి భార్య వియోగము
చెందటంతో రెండవ వివాహము చేసుకొన్నాడు. ఔరంగాబాద్ కర్ రెండవ భార్య
వయస్సు 27 సంవత్సరములు. ఆమె తన సవతికొడుకు విశ్వనాధ్ తో కలిసి నా ఆశీర్వచనాల
కోసం వచ్చింది. ఆమె తనకు సంతాన యోగము
ప్రసాదించమని కోరింది. మొదట నేను ఆమె కోరికను
అంగీకరించలేదు. కాని, శ్యామాయొక్క మాటలకు చలించిపోయి
ఆమె తెచ్చిన ఎండుకొబ్బరిని రెండు ముక్కలు చేసి వాటిని నాలోను మనందరిలోను ఉన్న
భగవంతునికి నైవేద్యముగా పెట్టి, ఆరెండు ముక్కలను నేను ఎంగిలి చేసి భగవంతుని
ఆదేశానుసారము ఆమెకు ఒక కొబ్బరిముక్కను తినడానికి ఇచ్చి, ఆమెకు ఒక సంవత్సరములోపల సంతానము కలుగునని
ఆశీర్వదించాను. భగవంతుడు దయామయుడు. ఆమెకు పండంటి మగబిడ్డ జన్మించాడు. ఆమె, ఆమె భర్త నాకు కృతజ్ఞతలు తెలియచేయడానికి ఆబిడ్దను
తీసుకుని నావద్దకు వచ్చారు.
03.06.2019 - దామూ అన్నా కాసర్ ఆమ్రలీల
నా భక్తులలో అనేకమంది సంతానయోగం
కోసం నాదగ్గరకు వచ్చేవారు. అటువంటివారిలో దామూ అన్నా కాసర్
ఒకడు. ఇతడు ధనవంతుడు. ఇతనికి ఇద్దరు భార్యలున్నా
సంతానము కలగలేదు. ఇతడు అనేకసార్లు తనకు సంతానయోగం
ప్రసాదించమని విన్నవించుకున్నా నేను పట్టించుకోలేదు. కారణము అతనిలో దాగియున్న
అరిషడ్వర్గాలు. నా సాంగత్యంలో అతను
అరిషడ్వర్గాలను తన మనసునుండి తొలగించుకున్నాడు. అతనిలోని మార్పును గమనించాను. అతనికి సంతానయోగము ప్రసాదించడానికి గోవానుండి నాకు
కానుకగా వచ్చిన మామిడిపళ్ళనుండి నాలుగు మామిడిపళ్ళను విడిగా తీసి ఉంచాను. దామూ అన్నా కాసర్ ఈ మామిడిపళ్ళను తిని చావవలెనని
ద్వారకామాయిలోని భక్తులకు చెప్పాను. నామాటలను దామూ అన్నా కాసర్ విని
భయపడ్డాడు. నేను చావమన్నది అతనిలోని
అరిషడ్వర్గాలను.* అని నచ్చచెప్పి ఆనాలుగు
మామిడిపళ్ళను వాని చిన్న భార్య చేత తినిపించాను. ఆమెకు నలుగురు కుమారులు కలిగారు.
*అరిషడ్వర్గాలు - కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. … సాయిబానిస
04.06.2019 - కాకా
సాహెబ్ దీక్షిత్ – విమానంలో పరలోక యాత్ర
ఇతడు మహారాష్ట్ర బ్రాహ్మణ కుటుంబములో
జన్మించినవాడు.
ఇంగ్లాండులో న్యాయవాద వృత్తిలో పట్టాను సంపాదించి, బొంబాయిలో ప్రముఖ న్యాయవాదిగా స్థిరపడిన వ్యక్తి. ఇతను నిత్యము ఏకనాధ భాగవతము మరియు భావార్ధ రామాయణము చదువుతూ అందలి విషయములను నాభక్తులకు వివరించేవాడు. తన వృత్తిలో సంపాదించిన ధనముతో నా భక్తుల సౌకర్యార్ధము షిరిడీలో ఒక భవనాన్ని నిర్మించాడు. నా మాటను వేదవాక్కుగా భావించేవాడు.
ఒకనాడు ద్వారకామాయిలో ఒక మేకను తెప్పించాను. ఆ మేకను కత్తితో ఒక దెబ్బతో దాని తలను నరకమని నా
భక్తులను ఆదేశించాను. చాలామంది ఆపని చేయలేక
వెనుతిరిగిపోయారు. కాని, కాకాసాహెబ్ దీక్షిత్
కత్తితో ఆ మేకను చంపుటకు సిధ్ధపడ్డాడు.
నేను వెంటనే అతనిని వారించి ఆపనిని నిలిపివేసి అతని గురుభక్తికి మెచ్చి, అతని ఆఖరి క్షణాలలో అతనిని విమానములో పరలోక యాత్రకు తీసుకువెడతానని మాటిచ్చాను. అతను 1926 లో తన మిత్రుడు హేమాద్రిపంతుతో కలిసి రైలు ప్రయాణములో ప్రశాంతముగా తన ఆఖరి శ్వాసను తీసుకొన్నాడు.
నేను వెంటనే అతనిని వారించి ఆపనిని నిలిపివేసి అతని గురుభక్తికి మెచ్చి, అతని ఆఖరి క్షణాలలో అతనిని విమానములో పరలోక యాత్రకు తీసుకువెడతానని మాటిచ్చాను. అతను 1926 లో తన మిత్రుడు హేమాద్రిపంతుతో కలిసి రైలు ప్రయాణములో ప్రశాంతముగా తన ఆఖరి శ్వాసను తీసుకొన్నాడు.
అతని అంతిమ యాత్రలో అతని పార్ధివశరీరాన్ని
పూలరధముపై పెట్టి బొంబాయి పురవీధులలో ఊరేగింపుగా తీసుకునివెళ్ళి దహన సంస్కారాలు చేసాను.
ఇతను ఇపుడు రెండు జన్మలు ఎత్తి ఉన్నాడు. 1992 లో నీవు ఆఫీసరుగా ఉన్నపుడు ఇతర కంపెనీ రిప్రెజెంటేటివ్
గా నిన్ను కలవడానికి ఒక వ్యక్తి వచ్చాడు.*
అతడు నీగదిలోని నాపటాన్ని చూసి నిన్ను కౌగలించుకుని నాగురించిన వివరాలు సంతోషముగా
నీకు చెప్పాడు. అతడు వెనకటి జన్మలో కాకాసాహెబ్
దీక్షిత్.
*అది 1992 వ.సంవత్సరము. నేను ఆఫీసర్ హోదాలో ప్రభుత్వ ఉద్యోగము చేయుచున్న
రోజులలో నన్ను కలవడానికి వేరొక కంపెనీ రెప్రెజెంటేటివ్ నా ఆఫీసు గదికి వచ్చాడు. అతను నా ఆఫీసు గదిలో శ్రీషిరిడీ సాయిబాబా పటమును
చూసి చాలా సంతోషముగా మాట్లాడి నన్ను కౌగలించుకుని త్వరగా షిరిడీకి వెళ్ళి బాబా దర్శనము
చేసుకోండి. మీ ఇంట శుభకార్యాలు జరుగుతాయి అన్నారు. ఆయన చెప్పిన మాట ప్రకారమే 1992 మే నెలలో నా కుమార్తె
వివాహము జరిగింది. --- సాయిబానిస
05.06.2019 - శ్రీ
సాయి 72 గంటల యోగక్రియ సమాధి
మానవ జీవితంలో ఏదీ శాశ్వతం కాదు. కాని మానవుని ఆత్మ శాశ్వతము. నేను మీ అందరిలాగే మానవ జీవితంలో కష్టాలు, సుఖాలు
అనుభవించాను. ఒక సమయంలో నన్ను షిరిడీ ప్రజలు
మానసికంగాను, శారీరకంగాను చాలా వేధించారు.
మీరందరూ మీ కష్టసుఖాలను చెప్పుకోవడానికి నాదగ్గరకి వస్తారు. మరి నేను నా కష్టసుఖాలను ఎవరితో చెప్పుకోవాలి అనే
ఆలోచనతో ఒక పౌర్ణమినాడు రాత్రి నా శరీరాన్ని మహల్సాపతి ఒడిలో వదిలిపెట్టి నా ఆత్మను
మనందరికీ యజమాని అయిన భగవంతుని దగ్గరకు తీసుకొని వెళ్ళాను.
భగవంతుని ఆదేశానుసారము 72 గంటల తరవాత
నా ఆత్మను నా శరీరంలోనికి ప్రవేశపెట్టాను.
నా శరీరంలో నా ఆత్మ లేని సమయంలో మహల్సాపతి నా శరీరాన్ని జాగ్రత్తగా కాపాడాడు. ఈ యోగక్రియ సమాధిని నేను భగవంతుని దయతో విజయవంతంగా
జరిపాను. ఇది జరిగిన 32 సంవత్సరాల తరవాత విజయదశమినాడు
నేను శాశ్వతముగా నా శరీరాన్ని వదిలివేశాను.
ఈనాటికీ నా ఆత్మ నా భక్తులకొరకు ఆరాట పడుతూ ఉంటుంది. నా సమాధినుండి నా ఎముకలు నా భక్తులతో మాట్లాడతాయి.
(మరికొన్ని సంభాషణలు వచ్చే ఆదివారమ్)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment