27.10.2019 ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయిబంధువులకు బాబావారి శుభాశీస్సులు
మరియు దీపావళి శుభాకాంక్షలు
ఈ వారంనుండి శ్రీ సాయి సత్ చరిత్రకు అందని రహస్యాలను ప్రచురిస్తున్నాను. చదివిన తరువాత మీ అభిప్రాయములను తెలియచేయండి.
త్యాగరాజు, నిజాంపేట, హైదరాబాద్
tyagaraju.a@gmail.com
Ph. 9440375411 & 8143626744
శ్రీ సాయి సత్ చరిత్రకు అందని రహస్యాలు - 1 వ.భాగమ్
శ్రీ సాయి సత్ చరిత్రకు అందని రహస్యాలు
గత ఎనిమిది సంవత్సరాలనుండి నాకు శ్రీ సాయిబానిస గారితో పరిచయం ఉంది. వారితో నేను అనేకసార్లు శ్రీసాయి సత్ చరిత్రపై అనేక విషయాలు విశ్లేషణ చేసాను. వాటిలో నాకు చాలా ఆసక్తిని కలిగించిన విషయాలు ఈ వ్యాసములో సాయి భక్తులకు తెలియచేస్తాను.
ఈ వ్యాసములకు ప్రేరణ శ్రీసాయిబానిసగారు సత్సంగములో చెప్పిన
ఉపన్యాసములు.
ఆత్రేయపురపు త్యాగరాజు
ముందుగా శ్రీసాయి తల్లిదండ్రుల వివరాలు తెలిచేయమని కోరాను. శ్రీసాయిబానిసగారికి బాబా గారు చెప్పిన విషయాలు.
1 “నాకు జన్మ ఇచ్చిన తల్లిదండ్రుల వివరాలు నాకు తెలియవు. కాని, నన్ను 12 సంవత్సరాల వయసువరకు పెంచి పెద్ద చేసినవారు వృధ్ధ ముస్లిమ్ దంపతులు. వారు తురానియన్ (TURAANIYAN) దేశమునుండి భారతదేశమునకు సూఫీ మహాత్ముల దర్గాలను చూడటానికి వచ్చినవారు. (ఇంటర్ నెట్ లో తురానియన్ గురించి చదవగలరు) (http://teluguvarisaidarbar.blogspot.com/2012/06/1998-05.html)
(బాబా గారు సాయిబానిసగారికి ప్రతిరోజు ఇచ్చిన సందేశాలను ఒక డైరీగా వ్రాసుకున్నారు. వారు వ్రాసిన డైరీలను నేను సేకరించి సాయిబానిస డైరీలు గా www.teluguvarisaidarbar.blogspot.com లో కూడా 7 సంవత్సరాల క్రితం ప్రచురించాను. ఆయన 1998 లో వ్రాసిన డైరీలలో 5వ.బాగము 14.06.2012 న బ్లాగులో ప్రచురించాను. ఇక్కడ తురానియన్ గురించిన ప్రస్తావన వచ్చింది కాబట్టి 1998 లో బాబా గారు సాయిబానిసగారికి ఇచ్చిన సందేశంలో కూడా చెప్పడం జరిగింది. ఇంకా విచిత్రమేమంటే బాబా గారు ఆ సంవత్సరంలోనే ఆయన పుస్తకాలను ప్రచురించమని ఆదేశించడం జరిగింది. బాబా గారు ఎప్పుడో ఇచ్చిన ఈ సందేశం బహుశ ఆయనకు గుర్తుండి ఉండకపోవచ్చు. కాని ఆయన అనుభవాలను ఆంగ్లంలోనుండి తెలుగులోకి అనువాదం చేసే భాగ్యాన్ని బాబా నాకు కలిగించారు. 2017వ.సంవత్సరంలో ఆయన అనుభవాలు, ఉపన్యాసములు అన్నీ కూడా పుస్తకాలుగా ప్రచురించడం జరిగింది. సాయిభక్తుల సౌకర్యార్ధం 14.06.2012 లో బ్లాగులో ప్రచురించిన వ్యాసాన్ని మరలా ప్రచురిస్తున్నాను…. చదవండి.)
14.06.2012 గురువారము
సాయి భక్తులకు గమనిక::
మీరందరూ సాయి.బా.ని.స. డైరీ చదువుతూ బాగా ఆకళింపు చేసుకుంటునారనుకుంటున్నాను. బాబాగారు ఆయనకు కలలలో ఫకీరు రూపములోను, అజ్ఞాత వ్యక్తి రూపములోను ఇచ్చిన సందేశాలు నేటి సమాజానికి అనుగుణంగా ఏనాడొ చెప్పారు. సాయి.బా.ని.స. కు దాదాపు 12 సంవత్సరాల క్రితమే నేటి సమాజ స్థితిగతులను యధాతధాంగా చెప్పినట్లుగా మనకి అర్ధమవుతుంది. అందుచేత సాయి.బాని.స. డైరీ మామూలుగా చదివేయడం కాకుండా, నేడు సమాజంలోని స్థితిగతులను కూడా బాబాగారు చెప్పినట్లు వాటికి తగినవిధంగా ఉన్నాయని మీరందరూ గ్రహిస్తున్నారనుకుంటున్నాను.
ఇంతకుముందు డైరీలో బాబాగారు -- "నీ డైరీ నాపిల్లలు చదువుతారు అని సందేశాన్నిచ్చారు.. మరి మనమందరమూ కూడా ఆయన డైరీని చదువుతున్నాము.
బాబాగారు ఏనాడొ చెప్పినమాట నేడు నిజమయింది కదూ...
ఇక చదవండి .....
సాయి.బా.ని.స. డైరీ - 1998 (05)
08.03.1998
శ్రీసాయి నిన్నరాత్రి ఒక ఫకీరు రూపములో దర్శనము ఇచ్చి అన్న మాటలు.
1) నీకు ఇతరమతాలు, వారి ఆచార వ్యవహారాలు తెలిసియుండవచ్చును. నీవు మాత్రము వారి
మత సాంప్రదాయాలలో తలదూర్చవద్దు. నీవు నీ స్వధర్మాన్ని పాటించుతు భగవంతుని పాదాల
చెంతకు చేరు.
2) నాభక్తునికి అతని గత జీవితాన్ని చూపించి అతనికి నాపై నమ్మకాన్ని కలిగించి అతనికి మంచి
భవిష్యత్ కలిగేలాగ సలహాను ఇచ్చి సదా అతని వెంట అతని నీడలాగ ఉంటాను.
3) నిత్యము నీవు స్నానము చేసేటప్పుడు నీవు నీశిరస్సుపై పోసుకొనే మొదటి చెంబు నీరు నా
నామస్మరణతో పోసుకో.
అపుడు అదినీవు నాకు చేసే అభిషేకముగా భావించుతాను.
4) నీవు నీయింటికి ఎవరినైన పిలిచి భోజనము పెట్టదలచినపుడు నన్ను తలచుకొని ఆతిధికి భోజనము పెట్టు. ఆ భోజనమును నేను తప్పక స్వీకరించుతాను.
10.03.1998
శ్రీసాయి నిన్నరాత్రి ఒక పాఠశాల ఉపాధ్యాయుని రూపములో దర్శనము ఇచ్చి అన్నమాటలు.
1) నీ జీవితములో సుఖశాంతులు పొందాలి అంటే నీవారి సుఖశాంతులు గురించి భగవంతుని
ప్రార్థించటములో తప్పులేదు. నీవాళ్ళు సుఖశాంతులతో యున్నపుడే నీవు ప్రశాంతముగా
జీవించగలవు.
2) కాలప్రవాహాన్ని కొలమానముతో కొలవటానికి వీలుపడదు. నీవు కొలవగలిగినది వర్తమానాన్ని
మాత్రమే. అందుచేత వర్తమానములో నీవారితో సుఖశాంతులతో గడుపు. భూతకాలములో నీవు
నీవారితో గడిపినరోజులు తిరిగిరావు. భవిష్యత్ లో నీవు నీవారితో గడిపే రోజులను ఊహించలేవు.
అందుచేత వర్తమానము ఒక సత్యము అని నమ్మి జీవించు.
3) నీలో అహంకారము అనె సూదులు ఎదుటివానిని గుచ్చుతున్నాయి. నీవు ఆసూదులను
తీసిపారవేయి. అపుడు నీసాంగత్యములో ఉన్న ప్రతి మనిషి నీకు మిత్రుడుగా మారిపోతాడు.
నీజీవితము ప్రశాంతముగా గడచిపోతుంది.
12.03.1998
శ్రీసాయి నిన్న రాత్రి ఒక ఫకీరు రూపములో దర్శనము ఇచ్చి అన్నమాటలు.
1) నీవు నాతోపొందిన అనుభవాలు, అనుభూతులు పుస్తకరూపములో ప్రచురించి సాయి
బంధువులు చదవగలిగేలాగ చూడు.
2) నారూపము, నావేష భాషలు తురానియన్ సాంప్రదాయానికి చెందినవి. నీవు మాత్రము
నీసాంప్రదాయములో శివ స్వరూపముగా చూడు. నీసాంప్రదాయము ప్రకారము నన్ను పూజించు.
3) నేను నాటి సమాజములో జరుగుతున్న అన్యాయాలను, అరాచకాలను, అవినీతిని
రూపుమాపటానికి వచ్చిన భగవంతుని విధేయ సేవకుడిని. నీవు నన్ను సాయి భక్తులకు
భగవంతుని విధేయ సేవకుడిగా మాత్రమే పరిచయము చేయి.
4) నేను భగవంతుని గొప్పతనాన్ని నావారికి ధనాపేక్ష లేకుండ, ఉచితముగా వారికి తెలియ
చేసినాను. నీవు నాగురించి పదిమందికి తెలియచేసేటప్పుడు వారినుండి ధనాన్ని ఆశించవద్దు.
(ఇంకా ఉంది)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు
2 ఆవృధ్ధ ముస్లిమ్ దంపతులు మహారాష్ట్ర దేశములోని అడవులలో తిరుగుచుండగా నన్ను వారికి ఒక హిందూ స్త్రీ అప్పగించినది.
నన్ను ఆ స్త్రీకి అప్పగిస్తూ ఈ బాలుని పేరు దయాకిషన్ , ఈ బాలుని పెంచి పెద్ద చేసి నాకు సహాయం చేయి అని చెప్పి ఆ హిందూ స్త్రీ కన్ను మూసింది.
అప్పటినుండి ఆ తురానియన్ సాంప్రదాయ దంపతులు నన్ను పెంచి పెద్ద చేసినారు. నాకు 15 సం.వయస్సు వచ్చేసరికి వారు మరణించారు. నేను భగవంతుని అన్వేషణలో 15 సం.బాలునిగా షిరిడీ చేరుకొన్నాను.
నన్ను ఆ స్త్రీకి అప్పగిస్తూ ఈ బాలుని పేరు దయాకిషన్ , ఈ బాలుని పెంచి పెద్ద చేసి నాకు సహాయం చేయి అని చెప్పి ఆ హిందూ స్త్రీ కన్ను మూసింది.
అప్పటినుండి ఆ తురానియన్ సాంప్రదాయ దంపతులు నన్ను పెంచి పెద్ద చేసినారు. నాకు 15 సం.వయస్సు వచ్చేసరికి వారు మరణించారు. నేను భగవంతుని అన్వేషణలో 15 సం.బాలునిగా షిరిడీ చేరుకొన్నాను.
కొద్ది కాలము షిరిడీలో ఉండి అక్కడినుండి సూఫీ మహాత్ముల దర్శనార్ధము నైజాము ఇలాకాలోని అనేక ప్రాంతాలు తిరిగి తిరిగి ఆఖరికి నేను చాంద్ పాటిల్ పెళ్ళివారితో కలిసి తిరిగి షిరిడీకి చేరుకొన్నాను. (ఈ విషయములను శ్రీ సాయిబానిస రావాడ గోపాలరావు గారు తెలియచేసారు.)
15 సంవత్సరాల క్రితము రంజాన్ మాసములో సాయిబానిస ధ్యానములో హైదరాబాద్ లోని పబ్లిక్ గార్డెన్ లోని మసీదును చూడటానికి వెళ్ళారు. అది సాయంత్ర సమయము. మసీదులో ముస్లిమ్ సోదరులు నమాజు చేసుకొని మసీదునుండి బయటకు వచ్చి తమ రోజా ఉపవాసమును విడచుటకు ఖర్జూరపు పళ్ళు తినసాగిరి. ఆభక్తులందరి మధ్య ఉన్న ఓ వృధ్ధ ముస్లిమ్ మతపెద్ద ఆయన వద్దకు వచ్చి నీకు ఎండు ఖర్జూరపు పళ్ళు తినాలని ఉన్నది కదూ అని చెప్పి మసీదులోనికి వెళ్ళి ఒక పళ్ళెములో ఖర్జూరపు పళ్ళు మరియు ఒక పింగాణీ గిన్నెలో ద్రాక్షరసము తెచ్చి గోపాలరావూ ఈ ద్రాక్షరసము త్రాగి ఈ ఖర్జూరపు పళ్ళు తిను అన్నారు.
శ్రీ సాయిబానిసగారు సంతోషముగా ఆఖర్జూరపు పళ్ళు తిని ఆపింగాణి గిన్నెలోని ద్రాక్షరసము త్రాగి వారికి తన కృతజ్ఞతలు తెలియచేసారు. సాయిబానిసగారు ఆవృధ్ధ ముస్లిమ్ పెద్దను తన పేరు తెలియచేయమని కోరినారు. ఆపెద్దమనిషి తనపేరు “అల్లారామ్” అని తెలియచేసారు. సాయిబానిసగారు తిరిగి ఆపెద్ద మనిషిని "మీరు ఇంత ధనము సంపాదించి ఇంతమందికి ఇప్థార్ విందును ఇస్తున్నారు, మీరు ఇంత ధనము ఎలాగ సంపాదించినారు" అని అడిగారు. ఆయన అడిగిన ప్రశ్నకు ఆ మతపెద్ద తాను హిందూ ముస్లిమ్ ఐక్యతకు వాడే సిమెంటు తయారు చేసి అమ్ముతాను అని, ఆ వచ్చిన ధనముతో హిందువులకు ముస్లిమ్ లకు స్నేహమును ఏర్పరచటానికి అన్న దానాలు చేస్తూ ఉంటాను, అని చెప్పి, "ఇంక నీకు తెలిసినదా నేను ఎవరు అని? ఈ రోజున నేను షిరిడీనుండి వచ్చి ఇక్కడ భక్తులకు ఇఫ్తారు విందు ఇచ్చాను. నీవు అదృష్టవంతుడివి. ద్రాక్షరసం త్రాగి ఖర్జూర పళ్ళు తిన్నావు." అని ఆశీర్వదించారు.
(ఇంకా ఉంది)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment