Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Saturday, November 2, 2019

శ్రీ సాయి సత్ చరిత్రకు అందని రహస్యాలు – 2 వ.భాగమ్

Posted by tyagaraju on 11:42 PM

Image result for images of sai baba shirdi
         Image result for images of rose hd

03.11.2019  ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ సాయి సత్ చరిత్రకు అందని రహస్యాలు – 2 .భాగమ్

ఆత్రేయపురపు త్యాగరాజు,  నిజాంపేట, హైదరాబాద్
ఫోన్.  9440375411  &  8143626744

2010.సంవత్సరములో సాయిబానిస గారు ఒకనాటి రాత్రి ధ్యానములో హైదరాబాద్ లోని పాత బస్తీలోకి రాత్రివేళ వెళ్ళారుఆయన చార్ మినార్ దాటి వెళ్ళారుఅర్ధరాత్రివేళ ఆప్రాంతంలో ఒక మిఠాయి దుకాణము కనిపించిందిఆ దుకాణము బోర్డుమీదమిఠాయి భండార్అని వ్రాసి ఉందిసాయిబానిసగారు ఆకలితో దుకాణములోకి వెళ్ళారు.  

                     Image result for images of  mithai bhandar 

 ఆ దుకాణము యజమాని ఒక వృధ్ధ ముస్లిమ్ఆయన 

సాయిబానిసగార్ని, “గోపాలరావూ, ఆకలితో వచ్చావు, నేను ఇచ్చే మిఠాయి 

తిను అని మిఠాయి తినిపించారు.

పెద్దమనిషి పెట్టిన మిఠాయి తిన్న తరువాత తనకు నిద్ర వస్తోందని సాయిబానిసగారు చెప్పినపుడు వృధ్ధ ముస్లిమ్ తన మిఠాయి దుకాణము నేల మీద నిద్రించమని చెప్పారు సమయంలో ఆవృధ్ధ ముస్లిమ్ సాయిబానిసగారి కళ్ళలోకి చూసి, “నీవు కంటి వ్యాధితో బాధపడుతున్నావునేను నీకు ఈరాత్రి వైద్యము చేస్తాను రేపు ఉదయం లేచి నీ ఇంటికి వెళ్ళుఅన్నారు.


ఆవృధ్ధ ముస్లిమ్ తన నోటినిండా తాంబూలము సేవించి తాంబూలము పిప్పిని తన చేతిలోనికి తీసుకొని ఆయన రెండు కళ్ళలోను పెట్టి కంటికి గుడ్డ కట్టారు.  కంటికి కట్టబడిన పట్టీతోనే ఆయన ఆ దుకాణంలో నిద్రించారు
   
ఉదయంఆ  దుకాణము యజమాని వచ్చి కళ్ళ పట్టీని విప్పి తను త్రాగే చెంబులోని నీటితో రెండు 
ళ్ళను శుభ్రం చేసారు.  ఆవృధ్ధ ముస్లిమ్ సాయిబానిసగారి కంటికి శ్రీ షిరిడీ సాయిబాబాగా దర్శనము ఇచ్చారు.  అయన సంతోషముతో సాయిబాబా పాదాలకు నమస్కరించారు.  తన రెండు కళ్ళలో 
ఎడమ కన్ను కనిపించటంలేదనికుడికన్నుతో మాత్రమే మసకగా చూడగలుగుతున్నానని చెప్పారు.  శ్రీ సాయిబాబాగారు బాధతో “నీలోని అహంకారము వలన నీఎడమ కన్ను పూర్తిగా చూపు పోయిందిఇంక మిగిలింది నీకుడికన్ను మాత్రమే.  జీవితంలో అహంకారమును తొలగించుకోలేకపోతే నీకుడి 
కన్ను కూడా పూర్తిగా పాడైపోయి నీకు అంధత్వం వస్తుంది జాగ్రత్త” అని అన్నారు.  ఇది అంతా 2010 లో సాయిబానిసగారికి ధ్యానములో ఉండగా జరిగింది

(ఒకసారి ఒకరికి కళ్ళు వాచి, కనుగ్రుడ్లు ఎర్ర్రగా మారాయి.  షిర్డీలో వేరే వైద్యులెవరూ కన్పించక అతనిని బాబా వద్దకు తీసుకుని వచ్చారు.  బాబా జీడి గింజల రసాన్ని మాత్రల్లా చేసి ఒక్కోదాన్ని ఒక్కో కంట్లో పెట్టి కళ్ళకు గుడ్డకట్టు కట్టారు.  మరుసటిరోజు కట్టువిప్పి కళ్ళపై నీటి ధార విఢిచారు.  విచిత్రం, వాపంతా తగ్గిపోయి కళ్ళు తెల్లగా నిర్మలమయ్యాయి.  అత్యంత కోమలమైన కళ్ళలో జీడిగింజల రసం వేస్తే మండలేదు.  కళ్ళు పోలేదు సరికదా, కళ్ళ జబ్బు పోయింది.   శ్రీ సాయి సత్ చరిత్ర 7వ.అద్యాయమ్.)

(ఇక్కడ పాఠకులకు,  సాయిబానిసగారికి బాబా చేసిన వైద్యమ్ వల్ల చూపు ఎందుకు రాలేదు అనే సందేహము   రావచ్చు.  కారణం సాయిబానిసగారిలో అహంకారము పూర్తిగా తొలగిపోకపోవడం.)

గత మూడు నెలలనుండి సాయిబానిసగారు తన కళ్ళమసక తొలగించుకోవటానికి సికింద్రాబాద్ లోని కంటి డాక్టర్ రాజలింగము గారి దగ్గర వైద్యము చేయించుకోసాగారునిన్నటిరోజు (అనగా 06.10.2019) రాజలింగముగారు సాయిబానిసగారి కంటికి వైద్యము పూర్తి చేసి మీఎడమ కన్ను పూర్తిగా దెబ్బతిన్నదిఇంక మీరు మీకుడికంటితో 50 శాతము మాత్రమే చూడగలరు అన్నారు.

2010 లో బాబా గారు మిఠాయి దుకాణములో అన్న మాటలు 07.10.2019 నాడు డాక్టరు రాజలింగము మాటల ద్వారా నిజమయింది
 మిఠాయి దుకాణము యజమాని శ్రీషిరిడీ సాయి అని సాయిబానిసగారునేను గట్టిగా 
నమ్ముతున్నాము.

 సందర్భముగా 08.10.2019 నాడు తెల్లవారుజామున సాయిబానిసగారు ద్యానములో ఉండగా బాబా గారు ఆయనకు ఇచ్చిన అనుభూతి

సాయిబానిసగారు తన ఇంటి పెరటి తోటలో నీళ్ళ కుండీలో రెండు తాబేళ్ళను పెంచసాగారు.  ఆసమయంలో ఆస్ట్రేలియాదేశమునుండి ఇద్దరు స్త్రీలు వచ్చి సాయిబానిసగారి ఇల్లు ఇదేనా అని సాయిబానిసగారిని అడిగారు.  సాయిబానిసగారు వారిద్దరినీ తన తోటలోని రెండు కుర్చీలలో కూర్చుండబెట్టి వారు వచ్చిన పని ఏమిటి అని అడిగారు.  ఆస్త్రీలు తాము ఆస్ట్రేలియా దేశవాసులమనితమ భర్తలు ఆరునెలల క్రితం పడవ ప్రమాదములో చనిపోయినారు అని చెప్పారు.  చనిపోయిన తమ భర్తలు ఇద్దరూ సముద్రములో తాబేళ్ళుగా జన్మించారు అని రెండు తాబేళ్ళు ఇపుడు మీ ఇంటి తోటలోని నీటి తొట్టెలో బందీలుగా ఉన్నారు.   విషయము మాకు శ్రీషిరిడీ సాయిబాబాగారు స్వప్నములో చెప్పారుమేము భారత దేశములోని మీ చిరునామా తెలుసుకొని మీఇంటికి వచ్చాము, దయ చేసి మాభర్తలను మాకు ఇవ్వండి వాటిని మేము మా దేశపు సముద్ర తీరములో వదిలిపెడతాము అన్నారు.  ఆయన వారి మాటలకు ఆశ్చర్యపడి తన ఇంటి నీటితొట్టెలో ఉన్న రెండు తాబేళ్ళను  చేతి సంచిలో వేసి వారికి బహూకరించారు.  ఆస్త్రీలు సంతోషముగా  సంచిని స్వీకరించి వారు తెచ్చిన సంచినుండి శ్రీషిరిడీ సాయిబాబా పాలరాతి విగ్రహమును సాయిబానిసగారికి బహూకరించారు.  ఆపాలరాతి విగ్రహము ఒక అడుగు (12 అంగుళాల సైజుఉన్నది.  ఆశ్చర్యము ఏమిటి అంటే  చిన్న సైజు పాలరాతి విగ్రహము ఎడమ కన్ను నల్ల మచ్చలో ఉండి బాబాకు ఒక కన్ను లేనట్టుగా ఉంది.  07.10.2019 నాడు కంటి డాక్టర్ రాజలింగంగారు సాయిబానిసగారికి ఎడమ కన్ను పూర్తిగా దెబ్బతిని చూపు ఇంక రాదు అని చెప్పటముమరి  ఆస్ట్రేలియా దేశపు స్త్రీలు సాయిబానిస గారికి బహూకరించిన శ్రీషిరిడీ సాయిబాబా పాలరాతి విగ్రహానికి ఎడమ కన్ను దెబ్బతిని ఉండటము గురించి ఆలోచిస్తుంటే బాబా తన భక్తుల బాధను తాను అనుభవించుతున్నారు ఈనాటికీ,  అని నమ్ముతున్నాను.

నా ఉద్దేశ్యములో తాబేళ్ళు కంటి చూపుకు నిదర్శనము.  ఈ విషయము శ్రీ సాయి సత్ చరిత్రలో వివరింపబడింది.  తల్లి తాబేలు ఒక ఒడ్డున ఉన్నా పిల్ల తాబేళ్ళు ఇంకొక ఒడ్డున ఉన్నా, తన పిల్లలకు కావలసిన పోషణ, శక్తి తన చూపు ద్వారానే ప్రసిందించుతుందని తెలపబడింది.  అందుచేత సాయిబానిసగారి కంటిచూపు పోయినది అని తెలియచేయడానికి బాబా ఆస్ట్రేలియా దేశపు స్త్రీల రూపములో వచ్చి సాయిబానిసగారి రెండు కళ్ళ చూపును తమతో తీసుకొని వెళ్ళిపోయినారని మనం భావించవచ్చు.

(ఇంకా ఉంది)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)



Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List