Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Saturday, November 9, 2019

శ్రీ సాయి సత్ చరిత్రకు అందని రహస్యాలు – 3 వ.భాగమ్

Posted by tyagaraju on 9:58 PM
Image result for images of Shirdi old photo
          Image result for images of white rose

10.11.2019  ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ సాయి సత్ చరిత్రకు అందని రహస్యాలు – 3 .భాగమ్

ఇపుడు శ్రీ షిరిడీ సాయిబాబా గారు రెండు సంవత్సరాల క్రితము సాయిబానిస గారిని స్వప్నములో బంగ్లాదేశ్ లోని ఢాకా పట్టణమునకు తీసుకొనివెళ్ళి అక్కడ ఉన్న ప్రఖ్యాత సూఫీ మహాత్ముల దర్గాలను చూపించారు.

      Image result for images of sufi dargah in Dhaka
ఈ దర్గాలలోని సూఫీ మహాత్ముల ఆత్మలు అన్నీ నా ఆధ్యాత్మిక ప్రపంచములో కుతుబ్ లు గా నిలచిపోయినారు.  వీరు అందరూ నా ఆజ్ఞప్రకారము తమతమ విధులను నిర్వర్తించుచు ఈ మానవాళిని సన్మార్గములో నడిపించుతున్నారు.  నీవు త్వరలో నీశరీరమును విడిచిపెడతావు.  అపుడు నీ ఆత్మ నా సామ్రాజ్యములో ఒక కుతుబ్ గా నియమించుతాను.  వచ్చేజన్మలో నీవు తిరిగి నా సేవలో నా తత్త్వప్రచారము చేసి దేశవిదేశాలలో మంచి పేరు తెచ్చుకొని ఈ జన్మలో నా సేవలో నీకు తీరనికోరికలు అన్నిటినీ వచ్చేజన్మలో తీర్చుకొంటావు.  వచ్చేజన్మలో నీవు నా ఆధ్యాత్మిక సామ్రాజ్యములో కుతుబ్ గా నిలిచిపోతావు అన్నారు బాబా.

ఇపుడు బాబా సాయిబానిసగారిని పారిస్ నగరానికి తీసుకొనివెళ్ళి ధనము శాశ్వతము కాదు, శరీరము శాశ్వతము కాదు అని చెప్పారు.  శ్రీ సాయిబాబా గారు ఆయనని పారిస్ నగరములోని ఈఫిల్ టవర్ వద్ద ఉన్న సామానులు భద్రపరిచే స్థలములో అయన సూట్ కేసు ఉంచి, ఆయనను ఈఫిల్ టవర్ పైకి లిఫ్ట్ లో తీసుకొనివెళ్ళి, భగవంతుని చేరడానికి ఈటవర్ ఎత్తు చాలదు, నీవు ఇంకా ఆధ్యాత్మికంగా ఎదగాలి, అపుడు నీ శరీరమును వదలిన తరువాత ఎటువంటి లిఫ్ట్ లేకుండా భగవంతుని చేరగలవు అని చెప్పి తిరిగి ఈఫిల్ టవర్ క్రిందభాగానికి తీసుకొనివచ్చారు.  

   Image result for images of eiffel tower
సాయిబానిసగారు తన సూట్ కేసుకోసం వెతకసాగారు.  ఆ సూట్ కేసును ఎవరో దొంగిలించారు అనే బాధతో బిగ్గరగా ఏడవసాగారు.  బాబా ఆయనని చూసి నవ్వసాగారు.  బాబా ఆయనను దగ్గరలో ఉన్న చర్చికి తీసుకొని వెళ్ళారు.  అక్కడ 15 శవపేటికల వెనుక, వారి బంధువులు ప్రశాంతంగా చనిపోయిన వారి ఆత్మలకు శాంతి కలగాలని ప్రార్ధన చేయటము సాయిబానిసగారికి చూపించి తమ బంధువులను పోగొట్టుకొన్నవారు శవపేటికల దగ్గర ప్రశాంతముగా దైవప్రార్ధనలు చేస్తున్నారు అని అన్నారు.
బాబా ఆయనతో, ఇంక నీసంగతి ఆలోచించు.  వెయ్యిడాలర్లు ఉన్న నీసూట్ కేసు కోసం ఏడవటములో అర్ధము ఉందా, ఒక్క సారి ఆలోచించు.  నీవు సంపాదించిన ధనము శాశ్వతము కాదు.  అలాగా భగవంతుడు ప్రసాదించిన నీశరీరము శాశ్వతము కాదు.  అందుచేత శాశ్వతమైన నీ ఆత్మను పరమాత్మ సేవలో సదానిలిపివుంచు అన్నారు. 

1996 .సంవత్సరములో సాయిబానిసగారికి గుండెకు ఆపరేషన్ జరిగింది.  ఒకనెల రోజులనుండి విపరీతమైన గుండెనొప్పితో బాధ పడసాగారు.  కంటిజబ్బుతో బాధే కాకుండా ఈగుండెనొప్పి కూడా ఎక్కువ అవడం వల్ల ఆయనలో చాలా నిరుత్సాహము ఏర్పడి బాబాను తనకు ముక్తిని ప్రసాదించమని వేడుకోసాగారు.  బాబా, సాయిబానిసగారికి ధైర్యము చెప్పడానికి కలలో ఇచ్చిన అనుభూతిని మీకు తెలియచేస్తాను. 

కలలో సాయిబానిసగారు తన ఇంటి పెరటితోటలో చెట్టుక్రింద కూర్చుని విశ్రాంతి తీసుకుంటున్నారు.  ఆసమయంలో చెట్టుమీదనుండి ఒక పాము వారి ఎడమచెయ్యిమీద పడి చేతికి చుట్టుకొని కాటువేయడానికి పడగ ఎత్తినపుడు సాయిబానిసగారు భయముతో సాయీ నన్ను రక్షించు అని బిగ్గరగా ఏడవసాగారు.  ఆసమయంలో రోడ్డుమీద ఉన్న ఓ తెల్లకుక్క గోడదూకి సాయిబానిసగారి మీపడిన ఆపామును తన నోటితో పట్టుకొని దానిని చంపివేసింది.    ఈ సంఘటనంతా కొద్ది నిమిషాలలో జరిగింది.  శ్రీసాయిబాబా తెల్ల కుక్కరూపములో వచ్చి తనని సర్పగండమునుండి రక్షించారు అనే భావంతో సాయిబానిసగారు బాబాకు శతకోటి నమస్కారములు చేసుకొన్నారు.  భయముతో వణకుతూ నిద్రనుండి లేచారు.  ఆక్షణమునుండి వారి గుండెలో నొప్పి తగ్గిపోయింది. 

ఈవిషయాలు అన్నీ వారు నాకు టెలిఫోన్ లో తెలియచేసారు.  వారు చెప్పిన విషయాలన్నిటినీ నేను మీకు తెలియచేసాను. 

బాబా తనభక్తుడయిన సాయిబానిసగారికి భూత, భవిష్యత్, వర్తమానములను సరళమయిన పధ్ధతిలో చూపించిన విధానము నాకు బాగా నచ్చింది.  బాబా ఒక బస్ డ్రైవరుగా ఒక పాత బస్ ను సాయిబానిసగారి ఇంటివద్దకు తీసుకొని వచ్చి, బస్ ఎక్కమని ఆదేశించారు.  బాబా ఆ బస్ ను 1970 ల లోనికి తీసుకొని వెడతాను అని చెప్పి, 1970 లో సాయిబానిసగారు పని చేసిన ఫ్యాక్టరీ మరియు ఆఫ్యాక్టరీ పరిసరాలలోని రాతి గుట్టలను చూపించారు.  ఆ రాతిగుట్టలమధ్య సాయిబానిసగారి స్నేహితుడు షేక్ పామ్ షా వలి సమాధిని చూపించారు.  మరికొంత దూరములో సాయిబానిసగారితో కలసి శ్రీసాయి సత్సంగాలలో పాల్గొన్న శ్రీ గోపాలన్ గారు బూడిదయిపోయిన శ్మశానమును చూపించారు.  అక్కడనుండి బస్ 2019 సంవత్సరము అంటే భవిష్యత్ లోనికి తీసుకొనివెళ్ళి సాయిబానిసగారు పనిచేసిన ఫ్యాక్టరీ భవనాల పరిసర ప్రాంతాలలో నిర్మించబడినకొత్త భవనాలు, విశలమయిన రోడ్లను చూపించారు. 

సాయిబానిసగారు 1970 నాటి ప్రాంతము వందసంవత్సరాల తరువాత అంటే 2070 లో ఏవిధముగా ఉంటుంది అని చూసి ఆశ్చర్యపడ్డారు.  తను ఇంకా వర్తమానములో ఎంతకాలము ఉంటాను అని డ్రైవరును అడిగారు.  నిన్ను తిరిగి ఇపుడు వర్తమానము అంటే 2019 లోనికి తీసుకొని వెళ్ళి నీ ఇంటిముందు నిన్ను దింపుతాను.  మరికొంతకాలము వర్తమానములో జీవించి ఆతరువాత నీశరీరము బూడిద అయిన తర్వాత పునర్జన్మ ఎత్తి భవిష్యత్ లో ప్రయాణము చేయి అని అన్నారు.


ఒకరోజున జననమరణాల గురించి చెప్పమని శ్రీసాయిబానిసగారిని కోరాను.  వారు చెప్పిన విషయాలు శ్రీసాయి సత్ చరిత్రకు ప్రతిరూపాలుగా కన్పించాయి.  వారి దృష్టిలో జీవితము ఒక నీటిబిందువు.  ఆబిందువు కోరికలు అనే గాలితో ఒక నీటి బుడగగా మారుతుంది.  కాలక్రమంగా కోరికలు అనే గాలిలో పెద్ద పరిమాణము గల నీటి బుడగగా మరుతుంది.  అవే కోరికలు గాలి ఎక్కువ అయినపుడు ఆబుడగ వాటి ఒత్తిడికి తట్టుకోలేక ఒకరోజున పగిలిపోతుంది.  అందుచేత కోరికలు అనే గాలిని ఎక్కువగా రానీయకుండా నీటిబుడగను దాని సహజపరిమాణములో ఉంచిన నిండునూరు సంవత్సరాలు ప్రశాంతముగా గడపవచ్చును.  జీవితములో కోరికలు ఎక్కువయితే అకాలమృత్యువాత పడతాము.  ఆనీటిబుడగ తిరిగి నీటి బిందువుగా మారి పునర్జన్మ ఎత్తుతుంది.  ఇదే మానవజీవితములో జననమరణాలకు మూలము అని గుర్తించు అన్నారు.

(ఇంకా ఉన్నాయి)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)



Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List