23.11.2019 శనివారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ సాయి సత్ చరిత్ర – ప్రాముఖ్యత
శ్రీ సాయి సత్ చరిత్ర – ప్రాముఖ్యత
సాయిబానిస శ్రీ రావాడ గోపాలరావుగారు సాయి టి.వి. లో
శ్రీ
సాయి సత్ చరిత్ర – ప్రాముఖ్యతపై ఇచ్చిన ఉపన్యాసమును సాయి భక్తులందరికి అందిస్తున్నాను.
ఈ ఉపన్యాసమును
ప్రచురించడానికి సాయిబానిసగారు అనుమతిని ప్రసాదించినందుకు వారికి ధన్యవాదములు
తెలుపుకొంటున్నాను.
శ్రీ గణేశాయనమః
శ్రీ
సరస్త్వత్యైనమః శ్రీ
సమర్ధసద్గురు
సాయినాధాయనమః
ముందుగా శ్రీసాయి సత్ చరిత్రను శ్రీ షిరిడీసాయి అనుమతితో శ్రీహేమాద్రిపంతు (శ్రీఅన్నాసాహెబ్ ధబోల్కర్ గారు) 1929 జూన్ నెలలో 52 అధ్యాయాలను పూర్తిచేసి, హేమాద్రిపంతు తన 70 ఏండ్లవయసునాడు అనగా 1929 జూలై
15 వ.తారీకునాడు శ్రీసాయిలో ఐక్యమైనారు.
ఆతరువాత
53వ.ధ్యాయమును శ్రీ బి.వి.దేవ్ గారు పూర్తి చేసారు.
ఆతరువాత
శ్రీ నాగేష్ వాసుదేవ గుణాజి గారు ఆంగ్ల భాషలో 1944 డిసెంబర్ 12వ.తారీకున అనువాదము పూర్తి చేసారు.
52, 53 అధ్యాయములను
51వ.అధ్యాయముగా కూర్చారు.
ఆ
ఆంగ్ల సాయిసత్ చరిత్ర 51 అధ్యాయాలను తెలుగులో శ్రీ ప్రత్తినారాయణరావుగారు 1953 లో అనువాదము చేసారు.
1952 లో
ప్రత్తినారాయణరావుగారికి
షిరిడీలో బాబా కలలో దర్శనము ఇచ్చి, సికిందరాబాద్ లోని సాయి భక్తుల సహాయముతో సాయి సత్ చరిత్రను తెలుగుభాషలో అనువదించమని ఆదేశించారు.
శ్రీనారాయణరావుగారు సికింద్రాబాద్ చేరుకొని శ్రీసాయి సత్
చరిత్రను అనువాదము చేసి, సాయిభక్తులయిన P.W.D. లోని చీఫ్ ఇంజనీరు శ్రీపాపయ్యగారు ఇచ్చిన ధన సహాయముతో శ్రీ చందానారాయణ శెట్టిగారి ప్రింటింగ్ ప్రెస్ లో మొదటిసారిగా శ్రీసాయి సత్ చరిత్ర తెలుగుభాషలో ముద్రించారు.
ఆతర్వాత
1953 మే 19 వ.తారీకున షిరిడీలోని శ్రీసాయి సమాధి మందిరములో ఆవిష్కరించబడింది.
మొదటి
ప్రతిలోని ఒక పుస్తకాన్ని నేటి మోండా మార్కెట్ దగ్గర ఉన్న శ్రీసాయి మందిర వ్యవస్థాపకులు శ్రీ జి.ఆర్. నాయుడుగారు చదవటం జరిగింది.
శ్రీ
జి.ఆర్. నాయుడుగారు ఆపుస్తకాన్ని తెలుగుపండితులు, ప్రొఫెసరు రామరాజుగారికి చూపించి శ్రీనారాయణరావుగారు అనువాదము చేసిన, తెలుగుభాషలోని తప్పులను సరిదిద్దారు.
శ్రీనాయుడుగారు ఆపుస్తకమును
షిరిడీసంస్థానము
వారికి ఇచ్చి ముద్రింపచేసారు.
ఈనాడు
షిరిడీ సంస్థానము వారు కొన్ని లక్షలప్రతులను ముద్రించి తెలుగుసాయిభక్తులకు అందచేసారు.
ఈ
సందర్భముగా మనము
కీర్తి
శేషులయిన శ్రీహేమాద్రిపంతు గారు, శ్రీనగేష్ వాసుదేవ గుణాజీ, శ్రీప్రత్తి నారాయణరావు, శ్రీపాపయ్య గారు, శ్రీ చందానారాయణ శెట్టిగారు, శ్రీ జిఆర్.నాయుడుగారు, శ్రీరామరాజుగార్లకు, మరియు షిరిడీ
సంస్థానము వారికి చేతులు ఎత్తి నమస్కరించుదాము.
ఆనాడు ఆదికవి వాల్మీకి రామాయణమును వ్రాసారు. ఆతర్వాత అనేకమంది రామాయణాన్ని వ్రాసారు. కాని, మనము
వాల్మీకిరామాయణాన్ని ప్రామాణికంగా తీసుకొంటున్నాము. అలాగే తెలుగుభాషలో అనేకమంది తెలుగు
సాయిభక్తులు శ్రీసాయి సత్ చరిత్రను వ్రాసారు. కాని శ్రీప్రత్తినారాయణరావుగారు వ్రాసిన
శ్రీసాయి సత్ చరిత్రనే మనము ప్రామణికముగా తీసుకొని నిత్యపారాయణచేయాలి అని నేను భావిస్తున్నాను. మరి మీరు అందరు నాతో ఏకీభవించుతారని
నమ్ముతున్నాను.
శ్రీ షిరిడీ సాయి సంస్థానమువారు శ్రీప్రత్తినారాయణరావుగారి
పుస్తకమునకు ప్రాధాన్యత ఇచ్చి, 1960 తర్వాత లక్షల ప్రతులను ముద్రించి ఈనాడు
కోటానుకోట్ల సాయి భక్తుల మన్ననలను పొందారు.
తెలుగువారు అందరు ప్రతిసంవత్సరము మే 19 వ.తారీకున తెలుగుసాయి సత్ చరిత్ర పుట్టినరోజు పండుగ చేసుకొని,
ప్రతిసాయి భక్తుడు ఒక సత్ చరిత్రను షిరిడీ సంస్థానమునుండి తెప్పించుకొని
నూతన సాయిభక్తులకు బహుమానముగా ఇవ్వాలి.
ఈ కార్యక్రమాన్ని శ్రీసాయి టి.వి.
వారు ప్రారంభించారని తెలిసి చాలా సంతోషించాను.
జై సాయిరామ్
శ్రీసాయి సత్ చరిత్రలో నాకు నచ్చిన విషయాలు… వాటిని మీకు చదివి వినిపించుతాను.
10 వ.అధ్యాయము
బాబా మిక్కిలి అణకువతో అన్నమాటలు.
“నేను నా భక్తులకు బానిసని. నేను వారికి ఋణపడియున్నాను. నేను నాభక్తుల పాదములను దర్శించటము
నాభాగ్యము. నేను నాభక్తుల
యశుధ్ధములో ఒక పురుగును. అట్లగుటవలన నేను ధన్యుడను.”
మరి ఈనాడు అనేక మంది శ్రీసాయి పటమును
చేతిలో పెట్టుకొని తాము సద్గురువులమని చెప్పుకొని జీవించుతున్నారు. వారిలో ఎవరయిన ఈ విధముగా మాట్లాడగలిగారా
అని ఒక్కసారి ఆలోచించండి.
“గురువులమని చెప్పుకొని తిరుగువారు అనేకమంది కలరు. వారు ఇంటింటికి వీణ, చిరతలు చేతపట్టుకొని ఆధ్యాత్మిక ఆడంబరము చాటేదరు. శిష్యుల
చెవులయందు మంత్రములు ఊది వారివద్దనుండి ధనమును లాగెదరు. పవిత్రమార్గములో మతము బోధించదము అని
చెప్పెదరు. కాని మతమనగానేమో
వారికి తెలియదు. స్వయముగా
వారు అపవిత్రులు.”
మరి ఈనాటి గురువులలో చాలామంది ఈమార్గములో
పయనించుతూ సాయిభక్తులను మోసము చేస్తున్నారు. ఇది
నాకు చాలా బాధ కలిగించింది.
18,19 అధ్యాయములు
శ్రీమతి రాధాబాయి దేశ్ ముఖ్ తో శ్రీసాయి
అన్న మాటలు.
“ఓ తల్లీ, అనవసరముగా ఉపవాసము
చేస్తు చావును ఎందుకు కోరుచున్నావు.
నాగురువు నా చెవిలో ఏనాడు మంత్రమును ఉపదేశించలేదు. వారు నాతలను గొరిగి నానుండి శ్రధ్ధ,
సబూరి అనే రెండు కానులు స్వీకరించారు. “
మరి ఈనాటి గురువుల సంగతి మీకు తెలుసు.
సద్గురుని లక్షణాలు. 48 వ.అధ్యాయము
సద్గురువు స్వప్నములో కూడా తన శిష్యులనుండి
సేవను గాని, ప్రతిఫలమును గాని ఆశించడు. దానికి బదులుగా శిష్యులకు సేవ చేయ
తలచును. తాను గొప్పవాడిని
అని తన శిష్యుడు తక్కువవాడని భావించడు.
సద్గురువు తన శిష్యుని కొడుకువలె ప్రేమించును. తనతో సమానముగా చూచుకొనును. లేదా శిష్యునిలో పరబ్రహ్మస్వరూపమును
చూచును. వారు తమ పాండిత్యమునకు
గర్వించరు. ధనవంతులు
పేదలు ఘనులు నీచులు వారికి సమానమే
మరి ఈనాడు తాము సాయికి భక్తులమని తామే
సద్గురువులమని చెప్పుకొంటూ ఎ.సి. కార్లలో తిరుగుతూ కారు
దిగినవెంటనే ఎర్ర తివాచిపై తలపై పూలవాసనలను కురిపించుకొంటూ శరీరముపై బంగారు గొలుసులు,
రుద్రాక్షలు ధరించి వందిమాగధులతో స్టేజీ మీద ఎక్కి హడావిడి చేస్తున్నవారిని
చూసిన తరువాత నిజంగా శ్రీషిరిడీసాయి పై లోకంనుండి దిగివచ్చి వీరిని చూస్తే ఎంతబాధపడతారు
అని ఆలోచించుతున్నాను. సాయి తత్త్వప్రచారములో ఉన్న కపట గురువులకు ఆసాయినాధుడు సద్బుధ్ధిని ప్రసాదించమని
కోరుతున్నాను. శ్రీసాయి
సత్ చరిత్ర చదివిన తర్వాత నాకు కలిగిన ఆలోచనలను మీకు తెలియచేయడానికి అవకాశము కలిగించిన
శ్రీ సాయి టి.వి. వారికి కృతజ్ఞతలు.
జై సాయిరామ్
(రేపటి సంచికలో శ్రీసాయి సత్ చరిత్రకు అందని రహస్యాలు 5వ.భాగమ్)
0 comments:
Post a Comment