02.12.2019 సోమవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
నా పటానికి నాకు భేదం లేదు
ఈ రోజు భువనేశ్వర్ నుండి శ్రీమతి మాధవిగారు పంపించిన ఇందుమిశ్రగారి అనుభవాన్ని ప్రచురిస్తున్నాను.
శ్రీ సాయి సత్ చరిత్రలో బాబా హోళి పండగ నాడు హేమాడ్ పంత్ ఇంటికి భోజనానికి వస్తానని చెప్పి, పటము రూపములో వచ్చారు. దీనిని బట్టి బాబా పటానికి, ఆయనకు భేదం లేదనే విషయాన్నిశ్రీ సాయి సత్ చరిత్ర పారాయణ చేసిన మనమందరము ఇప్పటికే గ్రహించుకున్నాము.

" ఓం సాయి రాం" సాయి బంధువులు అందరికి.
ఈరోజు మద్యప్రదేశ్ నుంచి ఇందుమిశ్ర గారి
అనుభవం ఆమె మాటల్లోనే విందాము.
సాయి నాథుడు షిర్డీ లొనే వున్నారు అనుకుంటే
మనం చాలా పొరపడుతున్నట్లే. ఆయన అన్ని చోట్ల ఉన్నారు, ప్రతిక్షణం, సప్తసముద్రాల అవతల కూడా, ఎవరు ఎక్కడ నుంచి పిలిచిన అక్కడికి వెను
వెంటనే పరుగులు పెట్టుకుంటూ వచ్చేస్తారు. ఎన్ని సార్లు ఆయన నా మొర విన్నాడో, నేను లెక్కల్లో చెప్పలేను. వాటిల్లో అన్నిటికన్నా నా మనసు కలిచివేసే కథ
మీ ముందు ఉంచుతున్నాను.
ఒకసారి మా వారికి ఆరోగ్యం బాగా పాడయింది. పరిస్థితి విషమించింది. అందరూ ఆయన జీవితం మీద ఆశ
వదిలేసుకున్నారు. అప్పుడు నాకు
కొత్తగా పెళ్ళయి అత్తవారింటిలో అడుగు పెట్టాను. ఇంక నా
పరిస్థితి మీరే ఆలోచించండి. నన్ను పెండ్లి చేసుకున్నందు వల్లనే ఆయన
ఆరోగ్యం క్షీణీస్తోంది అని అందరూ అనడం మొదలుపెట్టారు. మా అత్తగారింటివాళ్ళందరూ సామాజిక పరంపర,అంధవిశ్వాసం అనే సంకెళ్లలో ఉన్నవాళ్లు. నన్ను కూడా ఆ
సంకెళ్లలో బంధించేశారు. సాయి పూజ,సాయి భక్తి అంటే ఏమిటో కూడా
తెలియదు వాళ్లకు. నాకు పెళ్ళయి అత్తగారింటికి వచ్చేటప్పుడు నాతో పాటు ఒక బాబా ఫోటో
తెచ్చుకున్నాను. నా గదిలో పెట్టుకొని రోజూ కొంచెం పూజ చేసేదాన్ని. ఇలాంటి
పరిస్థితి లో బాబా మాత్రమే నాకు అండగా ఉంటాడని నమ్మేదాన్ని.
మా వారికి ఒకరోజు భయంకరమైన తలనొప్పి,వాంతులు,అయ్యాయి. మా అత్తగారు చాలా భయపడి పోయి,నా వైపు చూసి అరవడం మొదలు పెట్టింది. 'ఏమి,నిలబడుకొని తమాషా చూస్తావా! ఎప్పుడు సాయి,సాయి.అని అరుస్తూవుంటావు కదా, ఇప్పుడు పిలు నీ సాయిని, ఎక్కడ పోయినాడు, రమ్మను నీ సాయి ని" అని నా మీద విరుచుకు
పడింది
అప్పుడు ఆమె ఉగ్రరూపాన్ని చూసి ,నేను భయపడి, బాబా ఫోటో దగ్గరికి వెళ్లి," బాబా,రా తండ్రి,ఇప్పుడు పరీక్ష సమయం,నాకే కాదు,నీకు కూడా, నువ్వు సర్వే,సర్వత్రా ఉన్నావని, నువ్వే నిరూపించుకోవాలి,నాకు అంత శక్తి లేదు స్వామి" అని నా
మనసులొనే బాబాను వేడుకొన్నాను.
విభూతి కొంచెం
నీళ్లలో కలిపి మా వారికి తాగించాను. ఇంతలో పోస్టుమాన్ వచ్చాడు. వాడి చేతిలో పోస్టుకార్డు సైజ్ బాబా ఫోటో అది. బాబా ఆశీర్వదిస్తున్నట్లుగా ఉన్న ఫొటో అది.
ఒక విభూతి పాకెట్ కూడా వచ్చింది ఫొటోతోపాటుగా. పైగా దానిమీద ఇలా రాసి ఉంది, "నా ఫోటోను కేవలం చిత్రపటం మాత్రమే అనుకోకు, నా ఫోటో ఎక్కడ ఉంటే అక్కడ నేను ఉన్నట్లే" ఇదంతా చూసి,నేనే కాదు, మా అత్తగారు, ఇంట్లో ఉన్నవాళ్లు అందరూ ఆశ్చర్య పోయారు. ఎవరు పంపారో నాకు తెలీదు. బాబా తన జీవిత కాలంలో చాలా మంది ఇంటికి చిత్రపట రూపంలో వెళ్లినట్లు మనం సాయి చరిత్ర లో చదువుతాము. నా హృదయంలో నుంచి వచ్చిన నా పిలుపు మన్నించి బాబా స్వయంగా వచ్చారు, అదీ ఇలాంటప్పుడు?
నీ సాయి ఉన్నాడా, లేడా.. అని మా అత్తగారు నన్ను నిలదీసినప్పుడు. చూసారా బాబా కృప..చిత్రపటం రావటం..అంటే బాబా వచ్చినట్లే కదా.. ఆరోజు నుంచి మా వారి ఆరోగ్యం కుదుట పడింది. నాకు మా అత్తగారి ఇంట్లో మంచి స్థానం లభించింది. అంతా బాబా కృపనే, అని మా ఇంటిల్లిపాది నమ్ముతున్నాము.మీరు నమ్మండి"

ఇది అండి ఇందుమిశ్రా,మద్యప్రదేశ్..గారి కథ.
"సర్వం సాయి నాధార్పణమస్థు"
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment