03.12.2019 మంగళవారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
మానవ సేవే మాధవ సేవ
ఈ రోజు భువనేశ్వర్ నుండి శ్రీమతి మాధవిగారు
తమ అనుభవాన్ని పంపించారు. మన
చిన్నతనంనుండి మనమందరం మానవ సేవే మాధవ సేవ అనే మాటను వింటూ ఉన్నాము.
అనగా తోటి
మానవుడికి సేవ చేస్తే మాధవుడికి సేవ చేసినట్లే. అనగా అందరిలోను
భగవంతుడిని చూడు, వారికి సేవ చెయ్యి అని భగవంతుడె చెప్పాడు.
అటువంటి సేవ
చేసే వ్యక్తి గురించి మనందరికి వివరిస్తున్నారు.
" ఓం
సాయి రాం" సాయి బంధువులకు.
ఇప్పుడు నేను చెప్పబోయే
లీల చాలా బాగుంటుంది. ఇది నిజమా! అనిపిస్తుంది.
" సేవ"
అంటే ఏమిటి? అని ఎవరినన్న మనం అడిగితే
మనం అన్నదానం అని కొందరు, కొందరు
గుడి కట్టించామని, కొందరు
గుడిలో సేవ చేశామని, ఇలా
ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెప్తారు. కానీ నాకు తెలిసింది, విన్నది
,"మానవ సేవే మాధవ సేవ" అని. ఎలా అంటే, అదే
నేను చెప్పబోతున్నాను.
ఇంక తప్పనిసరి పరిస్థితిలో
మా వారికి ఫిజియోథెరపి చేయించాలి. భువనేశ్వర్ లో అంత మంచి వాళ్ళు లేరు ఫిజియోథెరపి చేయించడానికి. బరంపురం అనే
ఊరికి వెళ్ళాను. అక్కడ ఒక వ్యక్తి ఫీజియోథెరపి చాలా బాగా చేస్తాడు. ఎంతో ఆశతో ఆయన
దగ్గరికి వెళ్ళాను. అక్కడ ఒక విచిత్రం చూసాను. ఏమిటి అంటే అతను పని
మొదలుపెట్టడానికి ముందు ప్రతిసారి
" ఓం సాయి రాం"
అంటాడు. అలా సాయిరాం అంటూనే పని చేస్తాడు. నాలుగు రోజులు చూసాను. ఐదోరోజు ఇక ఉండబట్టలేక
ఆడిగేసాను" సర్, మీరు
ప్రతి కదలిక ముందు సాయిరాం అంటారు. మీరు బాబాభక్తులా? అని.
దానికి ఆయన చాలా నవ్వినారు. అప్పుడు ఆయన మొదటిసారి తన అనుభవాన్ని నాతో
పంచుకున్నారు. ఏమిటి అంటే,15 సంవత్సరాల
కిందట ఒకరోజు బాబా ఆయన దగ్గరికి వచ్చారట. వచ్చి, " చూడు, నువ్వు
ఈ ఫీజియోథెరపీతో చాలా మందికి బాగు చేస్తున్నావు. నువ్వు ఎప్పుడూ ఇలాగే చేస్తే, నేను
ఎప్పుడూ నీ దగ్గరే ఉంటాను" అన్నారట. అది విని నాకు చాలా ఆశ్చర్యంగా
అనిపించింది. బాబా ఇలా కూడా చేస్తారా? అనిపించింది.
చూడండి..బాబా దర్శనం కోసం ఎంతోమంది తపించిపోతూ ఉంటారు. కానీ బాబా, రోగులకు
సేవ చేసేవాళ్ళ కోసం, దివి
నుంచి భువికి దిగి వచ్చి దర్శనం ఇస్తారు. ఇంతకూ ముఖ్యవిషయం ఏమిటి అంటే, ఆయన
డాక్టర్ కాదు ఒక స్కూల్ టీచర్. కానీ న్యూరోలజిలో మంచి పట్టు ఉంది. పేదవారికి
ఉచితంగా
చేస్తాడు. ఆయన దగ్గరికి విదేశాల నుంచి కూడా వస్తారు. కానీ
ప్రచారాలంటే ఇష్టపడే ఈరోజుల్లో ఆయనకు ప్రచారం ఇష్టం లేదు. ఎవ్వరు ఆయన దగ్గరికి
వచ్చినా బాబానే పంపినారు అనుకోని సేవ చేస్తాడు. అలా మానవులకు సేవ చేసి, మాధవుడిని
ప్రసన్నం చేసుకున్నారు. ఆయనను కలవడం నా అదృష్టంగా భావిస్తాను. మా వారికి మాటలు
కూడా పోయినాయి. ఆయన మావారిచేత ముందు " ఓం సాయి రాం" అనే అనిపించారు.
ఇదండీ ఒక భక్తుడు భగవంతునికి చేసే సేవ
" సర్వం
సాయి నాధార్పణమస్థు"
(సర్వం
శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment