b
04.12.2019
బుధవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు భువనేశ్వర్ నుండి శ్రీమతి మాధవిగారు,
ఆనందభారతి ఢిల్లీ గారు పంపించిన అనుభవాన్ని పంపించారు. దానిని యధాతధంగా
ప్రచురిస్తున్నాను.
( సాయినామస్మరణలోని మాధుర్యాన్ని, అనుభవాన్ని
దీని ద్వారా మనం గ్రహించుకోగలం. కొంతమందికి ధ్యానం
చేసుకొనే సమయంలో కొన్ని కొన్ని అనుభూతులు కలగడం, కొన్ని దృశ్యాలు కనిపించడం సహజం. అటువంటి
అనుభూతులకు ఎటువంటి తార్కాణాలు ఉండవు.
కేవలం వాటిని అనుభవించినవారికి మాత్రమే బోధపడుతుంది. ప్రయత్నించి చూడండి. కాని ఏవో అనుభూతులు కలగాలని, దృశ్యాలు
కనిపించాలనే ఉత్సుకతతో మాత్రం చేయవద్దు… ఇది అనుభవంతో చెపుతున్న మాట... త్యాగరాజు)
ఇక ఆనందభారతి గారి అనుభూతిని చదవండి...
" ఓం శ్రీ సాయి రాం" సాయి బంధువులందరికి.
అన్నిటికన్నా ముందు నేను శ్రీ సాయినాథ్ చరణ
కమలాలకు నా వినమ్ర నమస్కారములు సమర్పిస్తున్నాను.
శ్రీ సాయినాథుని అనంతమైన కృప నాపై ఉంది
కాబట్టి నాకు అలౌకికమైన అనుభవాలు కలుగుతున్నాయి. శ్రీసాయి లీలలు అగాధాలు.
నాలాంటి ఒక
సాధారణమైన భక్తులు వాటిని వర్ణించలేరు. ఆయన లీలలు రాయాలంటే బాబా కృప ఉండాలి. అనేక జన్మల పుణ్యం ఉంటేనే మనం ఆయన భక్తి, ఆయన లీలలు రాసే శక్తి ప్రాప్తిస్తాయి. నేను ఆగస్టులో (2007) నా ఆఫీసర్ అగర్వాల్. మరియు ఆయన
సతీమణి ఉత్పల్ గారితో షిర్డీ దర్శించే అదృష్టం కలిగింది. అప్పటికే నేను ఎన్నోసార్లు షిర్డీ యాత్ర
చేసాను.
సాయినాథ్ మహరాజ్ తన భాండాగారం నుంచి నాకు
ఎన్నో అమూల్యమైన రత్నాలను ప్రసాదించారు. సాయిబాబా భక్తులకు బాబా సమాధి తరువాత కూడా అనంతమైన లీలలు నిరంతరం జరుగుతున్నాయి అంటే నమ్మక తప్పదు.
ఆయన సూక్ష్మ శరీరంలో ఇప్పటికి తనను నమ్మిన
భక్తులకు ఎన్నో అనుభవాలను అందిస్తున్నారు. దానిలో ఒకటి
నేను చెప్పబోతున్నాను. మేము షిర్డీ వెళ్లిన రోజు రాత్రి 11.45
నిమిషాలకు నేను, ఇంకో నలుగురము ద్వారకామాయిలో కూర్చొని ఉన్నాము.
నేను సాయిస్మరణ చేసుకుంటున్నాను. మిగిలినవారు సాయిచరిత్ర చదువుకుంటున్నారు. ద్వారకామాయి
వాతావరణం ప్రశాంతంగా ఉంది. నేను సాయినామస్మరణ మొదలు పెట్టి ఐదు నిమిషాలు
అయివుంటుంది. నాచెవిలో ఏవో దివ్యమైన శబ్దతరంగాలు వినిపిస్తున్నాయి. అలౌకికమైన
ఆత్మానందం కలిగింది. చాలా సేపు అలా వినపడుతున్నాయి. నా చెవిలో ఎవరో అమృతం పోస్తున్నారు అనిపించేలాగా
ఉంది. నా శరీరం,మనసు రోమాంచితమైనాయి. నేను ఆశబ్ద
ధ్వనితో దైవలోకం చేరుకున్నాను అనిపించింది. ఇంక నన్ను నేను
ఆపుకోలేక అక్కడ ఉన్న భక్తులందరిని చూసాను. ఎవరన్నా నామస్మరణ చేస్తున్నారేమో అని. అందరూ సాయిచరిత్ర చదువుతున్నారు. ఈ శబ్దాలు ఎక్కడ నుంచి వస్తున్నాయి? అని బయటికి వెళ్లి చూసాను. ఎవ్వరు లేరు. మళ్ళీ ద్వారకామాయిలోకి వచ్చి కూర్చున్నాను. ఇంకా ఎక్కువగా వినపడుతున్నాయి శబ్దాలు. అప్పుడు అనుకున్నాను" ఈ శబ్దాలు నా అంతరాత్మ నుంచి వస్తున్నాయి"
అని. ఆత్మ,పరమాత్మ ఏకం అయితే అలాంటి ఆలౌకికమైన శబ్దాలు
వస్తాయి అని ఏదో పుస్తకంలో చదివాను.
ఆధ్వనిని మనం పట్టుకోవాలి అంతే. నా అంతరంగం నుంచి వచ్చే ధ్వనిని నేను పట్టేసాను. అందుకే అంటారు " సదా
భగవంతుని నామస్మరణ చేస్తే మనకు నిజమైన గురువును ఆ భగవంతుడే ప్రసాదిస్తాడు"
అని. ఏ భగవంతుని ఆశీర్వాదం నాపై ఉందొ కానీ, సాయిలాంటి సద్గురు దర్శనం నాకు ద్వారకామాయిలో
కలిగింది. సద్గురు కృప లేకుంటే ఆధ్యాత్మిక ఉన్నతి అసంభవం. ఆధ్యాత్మిక ఉన్నతి లేకుంటే మనుష్యజన్మ వ్యర్థం. ఇంతకూ నాకు వినపడిన ధ్వని తరంగాలు చెప్పలేదు
కదు! అయితే వినండి.
" ముజే సదా జీవిత్ హిజానో.. అనుభవ కరో. సత్యకో పెహచనో' అంతే, నాకు నా సద్గురు శ్రీసాయినాథుని దర్శనం శబ్దతరంగాల
ద్వారా అనుభవం అయింది. అందునా ఆయన నివసించిన ద్వారకామాయిలో. కొందరు భగవంతుని "ఓమ్" కారంలో కూడా
దర్శిస్తారు. నాకు బాబా దర్శనం ఈవిధంగా జరిగింది.
ఆనంద భారతి...ఢిల్లీ
"సర్వం సాయి నాతర్పణమస్తు"
(సర్వం
శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment