Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Thursday, July 23, 2020

శ్రీ సాయి సాగరంనుండి వెలికి తీసిన ఆణి ముత్యాలు 6 వ.భాగమ్

Posted by tyagaraju on 7:51 AM
     A Couple of Sai Baba Experiences - Part 281 - Shirdi Sai Baba ...
           Preserved Baby Light Blue Rose | Light blue roses, Blue and purple ...

23.07.2020  గురువారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ సాయి సాగరంనుండి వెలికి తీసిన ఆణి ముత్యాలు 6 .భాగమ్
-      సాయిదర్బార్, హైదరాబాద్
-      సాయిబానిస
-       సంకలనం మరియు కూర్పు శ్రీమతి రావాడ మధుగోపాల్
-       సమర్పణ ఆత్రేయపురపు త్యాగరాజు
11.  జీవిత గమ్యం
23.07.2020 -  ఆదివారమ్
నిన్నటి రోజున నీ వృధ్ధాప్యము గురించి మరియు నీ జీవిత గమ్యము గురించి చెప్పాను.  రోజున నీ జీవిత రైలు ప్రయాణము చూడు.  నీ రైలుకు 5 బోగీలు ఉన్నాయి.  నీ రైలుబండిని నేను నడుపుతున్నాను.  ఇంజను వెనుక నాలుగు బోగీలలో నీ స్నేహితులు, నీ భార్యపిల్లలు కూర్చొని విందులు, వినోదాలు చేస్తున్నారు.  ఆఖరి బోగీలో నీ పార్ధివ శరీరము పడియుంది.  రైలు బండి నీ గమ్యమునకు బయలుదేరింది.  ఆఖరిబోగీలోని నీ పార్ధివ శరీరాన్ని చూడటానికి నీ ఆత్మ బోగీని పట్టుకొని వేలాడసాగింది.  నీవు నీ శరీరములోనికి ప్రవేశించలేకపోతున్నావు.  రైలు వేగంగా కాకినాడ పోర్టు రైల్వేస్టేషన్ కు చేరుకొంది.  ఇంక స్టేషన్ తరువాత విశాలమైన సముద్రము ఉంది.  నీవారు నీ అస్తికలను పడవలో పెట్టుకొని సముద్రములో జారవిడిచినారు.



రామేశ్వరం సముద్రజలాలలో నీ శరీరము పంచభూతాలలో కలిసిపోయింది.  నీ ఆత్మ తిరిగి పునర్జన్మ ఎత్తడానికి కొత్తరైలు కోసం ఎదురుచూస్తుంది.  నీ ఆత్మ తిరిగి తల్లి గర్భములో ప్రవేశించి నూతన జీవిత రైలు ప్రయాణము ప్రారంభించుతున్నది.  రైలు ప్రయాణము కాలచక్రములో అంతులేని ప్రయాణము.  దే ENDLESS JOURNEY OF LIFE  -  బాబా

12.  పునర్జన్మ విషయాలు
24.02.2020  సోమవారమ్
నిన్నటిరోజున నిన్ను నేను నీ గమ్యము (రామేశ్వరము) ను చూపించినాను.  రామేశ్వర సముద్రజలాలలో నీ అస్థికలు నిమజ్జనము తర్వాత నీకు పురనర్జన్మమును ప్రసాదించుతాను.  నీ పునర్జన్మలో నేను నీ వెంట నీడలాగ యుంటాను.
నీవు పునర్జన్మలో ఒక పెద్ద రసాయనాల కర్మాగారానికి ముఖ్యకార్యనిర్వహణాధికారిగా పనిచేసి, పదవినుండి విరమణ చేసిన తర్వాత నా తత్త్వప్రచారంలో నిమగ్నమవుతావు.

13. ధనసంపాదన, అత్యాశ 
25.02.2020 మంగళవారము
జీవితమును ప్రశాంతముగా కొనసాగించాలి అంటే ధన సంపాదన అవసరమే.  అంతేగాని అవసరానికి మించి, అత్యాశకుపోయి ధన సంపాదన చేయటానికి ప్రయత్నించితే కష్టాలపాలు అగుట ఖాయము.
ఈనాడు సమాజములో ధనవంతులు అత్యాశకుపోయి బ్యాంకుల నుండి అప్పులు చేసి బ్యాంకు అప్పు తీర్చలేక దేశము విడిచి పారిపోయి దొంగలవలె పేరు తెచ్చుకొని జీవించుచున్నారు.  వారు సమాజానికి చీడపురుగులు.  అటువంటివారిని కఠినముగా శిక్షించాలి.

ఇక మధ్యతరగతివారు మరియు బీదవారు తమకు ఉన్నదానికంటే ఎక్కువ సంపాదించాలి అనే తపనతో 21% వడ్డి ఇస్తామని చెప్పి ప్రజలనుండి ధనము వసూలు చేసి తమ కంపెనీ బోర్డులను తిప్పివేసి వాటి యజమానులు అజ్ఞాతవాసము చేస్తున్నారు.  ఇక్కడ మోసము చేసినవాడికన్న మోసపోయిన వారిదే ఎక్కువ తప్పు.  అధికవడ్డీ ఆశతో తమ కష్టార్జితాన్ని దొంగ కంపెనీలలో పెట్టి మోసపోతున్నారు.  నా భక్తుడు దాము అన్నా కాసర్ కు అత్యాశకు పోయి ధన సంపాదన చేయవద్దని చెప్పాను.
 (ఆణి ముత్యాలు మరలా వచ్చే ఆదివారమ్)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)


Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List