Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Friday, July 24, 2020

అన్నికోరికలను తీర్చే సాయినాధుడు

Posted by tyagaraju on 8:34 AM
    Saibaba Ki Shirdi - Home | Facebook
      Red Rose Wallpapers HD

24.07.2020  శుక్రవారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

సాయిలీల మాసపత్రికలో ప్రచురింపబడిన మరొక బాబా లీలను ఈ రోజు ప్రచురిస్తున్నాను.

తెలుగు అనువాదం చేసి: శ్రీమతి మాధవి, భువనేశ్వర్ గారు పంపించారు.

అన్నికోరికలను తీర్చే సాయినాధుడు
చిన్నప్పటినుండి నాకు సాయినాధుడంటే భక్తి ఉండేది.  అప్పటినుండే సాయిచరిత్ర చిన్న పుస్తకం చదవడం మొదలు పెట్టాను.  అపుడు మా అమ్మగారు సాయినామం జపం చేస్తూ ఉండు అని చెపుతూ ఉండేవారు.  నాకు వివాహమయిన తరువాత కూడా సాయినామ జపం సాయిచరిత్ర చదవడం నేను ఆపలేదు.  దానివలన నాకు కలిగిన నుభవాన్ని మీతో పంచుకుంటున్నాను.


అది 1989 .సంవత్సరం జూన్జూలై నెలలు.  ఆసమయంలో  నాకు ఏడవనెల అయిపోవచ్చింది.  మా ఆర్ధికపరిస్థితి చాలా దయనీయ స్థితిలో ఉంది.  మేము భోజనం కూడా చేయలేని పరిస్థితిలో ఉన్నాము  అలాంటి సమయంలో కూడా బాబా సత్ చరిత్ర నేను ప్రతిరోజు పారాయణ చేస్తు ఉండేదాన్ని.  ఒకరోజు ఏదో కారణం వలన నేను, నాభర్త ఆకలితోనే ఉన్నాము.  రాత్రి 9 – 9.30 అయింది.  అపుడు మేము పూనా రైల్వేస్టేషన్ దగ్గర ఉండేవాళ్ళం.  అపుడు నేను నా భర్తతో ఏమయిన తినడానికి దొరుకుతుందేమో కాస్త స్టేషన్ వరకు వెళ్ళి చూద్దాము  అని అన్నాను. మేమిద్దరం ఎంతో ఆశతో నడచుకుంటూ వెడుతున్నాము.  నడుస్తుంన్నంత సేపు నేను సాయినామ జపం చేసుకుంటూనే ఉన్నాను.  ఆకలితో ఉన్న నాకు మాటిమాటికి సాయినాధుని ధ్యాసే మనసులో వస్తూ ఉంది.  అపుడు బాబా చాలా ఆకలిగా ఉంది, ఏమన్న సహాయం చేయిఅని ఎంతో ఆవేదనతో మనసులోనే ప్రార్ధించుకొన్నాను.  ఆవిధంగా మేమిద్దరం నడచుకుంటూ స్టేషన్ వరకు చేరుకున్నాము.  అక్కడ పళ్ళు, ఇంకా కొన్ని తినే పదార్ధాలతో ఉన్న తోపుడు బండి ఒకటి కనిపించింది.  కాని ఏదయిన కొనుక్కుని తిని ఆకలి తీర్చుకుందామన్నా మాదగ్గర పైసలు లేవు.  నిరాశగా వెనుకకు బయలుదేరి వస్తూ ఉన్నాము.  ఇంతలో ఆశ్చర్యానికెల్లా ఆశ్చర్యం సమయంలో నా కాలికి ఏదో తగిలింది.  ఏమిటా అని చూస్తే అది ఆడవాళ్ళు వాడె మనీ పర్సు. మనసులో నిరంతరం సాయినామ స్మరణం చేస్తూనే ఉన్నాను.  పర్సు తీసి చూసాను.  అందులో అయిదువందల రూపాయలు, ఇంకా కొంత చిల్లర ఉంది.  మళ్ళీ నేను, మావారు స్టేషన్ దగ్గరకు వెళ్ళి బండి దగ్గర కొన్ని పళ్ళు కొనుక్కొని తిని మా ఆకలి తీర్చుకొన్నాము. 

మాకు దొరికిన అయిదువందల రుపాయలతో ఒక చిన్న టీ దుకాణాన్ని ప్రారంభించాము.  మెల్లమెల్లగా అదే మాకు జీవనాధారమయింది.  నా భక్తుల ఇండ్లలో లేమి ఉండదుఅన్న బాబా వాక్కు నిజమైంది.  మేము ఎప్పుడూ బాబాను కోట్లు కావాలని అడగలేదు.  భక్తి శ్రధ్ధలతో మేము చేసే ప్రార్ధనలను స్వీకరించి మమ్మల్ని దయతో కాపాడు తండ్రీ.
పిలిస్తే పలికే దైవం సాయి.
                 మనీషా గురుదత్త పవార్, పూనా  మహారాష్ట్ర
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
           


Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List