16.09.2020 బుధవారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ సాయిలీల పత్రికలో ప్రచురింపబడిన మరొక అధ్భుతమయిన లీల ఈ రోజు ప్రచురిస్తున్నాను.
హిందీనుండి తెలుగులోకి అనువాదం చేసి పంపించినవారు భువనేశ్వర్ నుండి శ్రీమతి మాధవి గారు.
పాదయాత్ర - మూగవానికి మాటలు
సాయి భక్తులు పల్లెల్లోనే కాదు, పెద్ద పెద్ద పట్టణాలలో కూడా ఉన్నారు.
విద్యావంతులు,
ధనవంతులు వర్గవర్ణ విభేదాలతో సంబంధం లేకుండా
ప్రపంచమంతా ఆయన భక్తులు ఉన్నారు.
అటువంటి భక్తులలో ఒకరు శ్రీ జగదీష్ లోహల్ కర్.
అతను
పోలీస్ శాఖలో పనిచేస్తూ ఉంటాడు.
అతను
శ్రీసాయి రాజమిత్ర మండలికి అధ్యక్షుడు.
అతను
ముంబాయినుండి
షిరిడీకి పాదయాత్ర చేస్తూ ఉంటాడు.
అతనికి సాయిభక్తి వారి తల్లిదండ్రులనుంచి
వచ్చింది. అతను
1977వ.సంవత్సరంలో
మొదటిసారిగా
షిరిడీ వెళ్ళాడు.
అతనికి
బాబామీద భక్తి విశ్వాసాలు మెండుగా ఉన్నాయి.
దాని
ఫలితంగానే అతని జీవితంలో ఒక అధ్భుతమయిన సంఘటన జరిగింది.
2003వ.సంవత్సరంలో అతను మహారాష్ట్రలోని రాజపూర్ పోలీస్ విభాగంలో పనిచేస్తున్న రోజులు.
అక్కడ
ఉన్న రాజకీయ పరిస్థితుల కారణంగా అతనికి విపరీతమయిన ఒత్తిడి, దానివల్ల ఆయన మానసిక పరిస్థితి మీద తీవ్రమయిన ప్రభావం చూపించింది.
ఆ
ఒత్తిడికి తట్టుకోలేక అతని వాక్కు పడిపోయి మూగవాడయ్యాడు.
ఆ ఊరిలోనే ఎంతోమంది వైద్యులకు చూపించుకున్నాడు.
ఏమీ
ప్రయోజనం లేకపోయింది.
తరువాత
ముంబాయిలోని
జస్లోక్ ఆస్పత్రిలో పెద్దపెద్ద వైద్యులకు చూపించారు.
వైద్యులందరూ
పరీక్షించి, దీనికి వైద్యం లేదు అని ఏకగ్రీవంగా తీర్మానించారు.
ఈ విధంగా
లక్షమందిలో ఒకరికి అవుతుంది.
దీనికి
ఇంతవరకు సరైన మందులు లేవు, అందువల్ల మేమేమీ చెయలేము అని అందరూ చేతులెత్తేశారు.
పెద్దపెద్ద
వైద్యులే అలా చెప్పేసరికి అతని బాధ వర్ణనాతీతం.
మరలా
వేరే వైద్యుల దగ్గర చూపించుకున్నాడు. వాళ్ళు
కూడా అన్ని పరీక్షలూ చేసి అన్నీ సవ్యంగానే ఉన్నాయి ఇలా ఎందుకని అయిందో మేము చెప్పలేము అని అన్నారు.
లోహల్ కర్ మూగవాడయిపోవటంతో
అతని భార్యకు దిక్కు తోచలేదు.
అపుడామెకు
సాయిబాబా గుర్తుకు వచ్చారు.
మనం
సాయిబాబాను
ఎలా మర్చిపోయాము అనుకుంది మనసులో.
“సాయిప్రభూ మా మందబుధ్ధి, మమ్మల్ని మాయ ఆవరించడం వల్ల నిన్ను మర్చిపోయాము.
మమ్మల్ని
క్షమించు” అని వేడుకొంది.
"ఎక్కడయితే మందులు పనిచేయవో అక్కడ ఆభగవంతుని దీవెనలు పని చేస్తాయనే నానుడి."
మధ్యలో
అకస్మాత్తుగా
మూగతనం రావడంతో లోహల్ కర్ కి జీవితం మీద ఆశపోయింది.
తను పనిచేస్తున్న కార్యాలయంలో కూడా అందరూ మాట్లాడటం మానేసారు.
ఇన్నాళ్ళు
నాతోపాటే పని చేస్తున్నవాళ్ళందరూ నన్ను చూడగానే మొహం చాటేస్తున్నారని మనసులో చాలా బాధ పడసాగాడు.
ఇవన్నీ
భరించే శక్తి నాలోలేదు.
ఇక
నేను ఉండి ఏమి ప్రయోజనం అనుకున్నాడు.
ఇక
ఒక్కటే ఉపాయం అనుకున్నాడు.
తన ఉద్యోగ ధర్మం ప్రకారం తన తుపాకీని కార్యాలయంలో తిరిగి ఇచ్చేసాడు.
ఆఫీసుకు
సంబంధించినవేమీ తనవద్ద లేవనీ ఇంకా ఎటువంటి బాకీలు లేవని నిరూపించే కాగితాన్ని కూడా అధికారుల వద్దనుంచి తీసుకున్నాడు.
కార్యాలయంనుండి బయటకు
వచ్చాడు. బయటే
నుంచునిఉన్న
హవల్దార్ తో ఒక్కసారి నీ తుపాకీ ఇవ్వు అన్నట్లుగా సైగ చేసాడు.
అక్కడే
ఉన్న తోటి ఉద్యోగి అతనినే గమనిస్తూ ఉన్నాడు.
లోహల్
కర్ కు ఏమయింది ఇవాళ చాలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు
అని అనుకున్నాడు.
హవల్దార్
తన తుపాకీని ఇచ్చేలోపులోనె పరుగుపరుగున వచ్చి తుపాకీని ఇవ్వకుండా ఆపాడు.
అతను
లోహల్
కర్ నడుమును గట్టిగా పట్టుకుని వెనక్కు
లాగాడు. నిజానికి
లోహల్ కర్ ఆతుపాకీతో తనను తాను కాల్చుకుందామనుకున్నాడు.
సరిగా
ఆసమయంలో లోహల్ కర్ కు శ్రీసాయి సత్ చరిత్ర లోని అంబాడేకర్ ఆత్మహత్యా ప్రయత్నం, ఆత్మహత్య మహాపాపం అని బాబా రక్షించిన
విధానం గురించిన సంఘటన గుర్తుకు వచ్చింది.
(అందుచేతనే నేను ప్రతిక్షణం మనందరి జీవితాలు సాయి చరిత్రలోని భాగాలే అని గుర్తు
చేసుకుంటాను --- మాధవి)
ఇక
లోహల్ కర్ అక్కడినుండి ముంబాయికి బదిలీ చేయించుకుని వచ్చేశాడు.
కొన్ని
రోజుల తరువాత 2006 వ.సంవత్సరంలో అతనికి “సాయి పాదయాత్ర మండలి” సభ్యులయిన భాస్కర్, ప్రపుల్ల
గార్లతో పరిచయం కలిగింది. వారు ఒకరోజు “మీకు
సాయిబాబా మీద నమ్మకం ఉందా” అని అడిగారు. లోహల్
కర్ ఉందని తల ఊపాడు. మేము షిరిడీకి పాదయాత్ర చేస్తున్నాము, మీరు కూడా
మాతో రండి మీకు బాగవుతుంది అన్నారు. 2007వ.సంవత్సరంలో
వారితోపాటుగా షిరిడీకి పాదయాత్రకు సిధ్ధమయ్యాడు.
అంత దూరం పాదయాత్ర చేయగలనా అనే శంకతోనే ఒక్క జత చెప్పులతో బయలుదేరాడు. తరువాత రోజు వారందరూ నడుచుకుంటూ షహపూర్ చేరుకున్నారు. అంతదూరం నడిచే అలవాటు లేనందువల్ల కాళ్ళు పుండ్లు
పడ్డాయి. మరొక జత చెప్పులు లేకపోవడంతో మామూలు
హవాయి చెప్పులతోనే నడుస్తున్నాడు. దారిమధ్యలో
రాళ్ళు, రప్పలు ఉండటం వల్ల చిన్నచిన్న రాళ్ళు చెప్పులలోకి దూరి నడిచేటప్పుడు చాలా బాధపెట్టసాగాయి. ఇక లాభంలేదనుకుని చెప్పులను చిన్న సంచిలో పెట్టి
ఉత్తకాళ్ళతోనే నడవడం మొదలుపెట్టాడు. కాళ్ళకి
ఆక్యుప్రెషర్ చేస్తున్నట్లుగా అనిపించింది.
అలా నడుస్తు నడుస్తూ అందరూ ‘కసారా’ అనే ఊరికి చేరుకున్నారు. తన గురించి ఇంటిలోనివాళ్ళు బెంగపడుతూ ఉంటారని భావించి
ఒక ఎస్ టి డి బూత్ దగ్గర ఆగి ఇంటికి ఫోన్ చేసాడు.
తను మూగవాడిననే సంగతి మర్చిపోయాడు.
అతని నోటినుంచి స్పష్టంగా మాటలు వస్తున్నాయి. అతని కూడా ఉన్నవాళ్ళు అందరూ ఆగిపోయి ఆశ్చర్యంగా
చూస్తున్నారు. వీళ్ళందరు నన్నెందుకని అలా వింతగా చూస్తున్నారు అని అనుకున్నాడు. అపుడు అర్ధమయింది. తను మాట్లాడగలుగుతున్నడని. “ఏమి అధ్భుతం, నువ్వు
మాట్లాడగలుగుతున్నావు” అని అందరూ చాలా సంతోషంగా అతనిని అభినందించారు. లోహల్ కర్ ఎంతో ఉద్విగ్నతకు లోనయ్యాడు. తన మీద బాబా అంతటి కరుణాకటాక్షం చూపించినందుకు ఆయన
కృపను భరించలేనట్లుగా ఏడుస్తూ క్రింద పడిపోయాడు.
అది సంతోషమా? దుఃఖమా? అనుభవించేవారికే
తెలుస్తుంది.
ఆతరువాత
వాళ్ళందరూ షిరిడీ చేరుకొని బాబా దర్శనం చేసుకొని ముంబాయికి తిరిగి వచ్చారు. ఒక వారం రోజులలో అన్ని సద్దుకున్నాయి. మళ్ళీ కార్యాలయానికి వెళ్ళాడు. తనే స్వయంగా పోలీసు విభాగంలో ‘సాయిమిత్ర మండలి’
ని స్థాపించాడు. ప్రతి సంవత్సరం 50 మంది దాకా
షిరిడీకి పాదయాత్ర చేస్తూ ఉంటారు. అది అందరికీ
ఒక ఆనందకరమయిన యాత్ర. బాబా నామస్మరణ భజనలతో
మనస్సు శరీరం ఉల్లాసంగా ఉంటుందని లోహల్ కర్ భావిస్తూ ఉంటాడు. సాయినాధుని లీలలు అగాధాలు, అగమ్యాలు. మనం కూడా ఆసాయినాధుని భక్తి శ్రధ్ధలతో సదా స్మరించుకుందాము.
జగదీష్
లోహల్ కర్
ముంబాయి
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment