18.10.2020
ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబా వారి శుభాశీస్సులు
ఈ రోజు నానాసాహెబ్ గురించి ఒక ఆసక్తికరమయిన అంశాన్ని ప్రచురిస్తున్నాను. శ్రీసాయిలీల ద్వైమాసపత్రిక 2012 వ.సంవత్సరం మే – జూన్ పత్రికలో ‘సాయిబాబా గురించి మనమింకా తెలుసుకోవలసినది భగవంతుని దివ్య దర్శనం’ శీర్షికతో ప్రచురింపబడింది. ఆంగ్లంమూల రచయిత…శ్రీ నవేందు సాయిదాస్ మరాఠే.
తెలుగు అనువాదమ్ : ఆత్రేయపురపు త్యాగరాజు
నిజాంపేట, హైదరాబాద్
సాయిబాబా
గురించి
మనమింకా తెలుసుకోవలసినది
–
1 వ.భాగమ్
(నానా సాహెబ్)
మనందరికి సాయిబాబా అంటే మట్టిప్రమిదలలో నీటిని పోసి దీపాలను వెలిగించారని, తన కాలి బొటనవ్రేళ్ళనుండి గంగా యమునలను ప్రవహింపచేసారని, తనను దర్శించుకున్న కొంతమంది భక్తులకు ఒకరికి రామునిగా, మరొకరికి విఠలునిగా దర్శనమిచ్చారని, ఎన్నో లీలలను, అధ్భుతాలను చూపించారనీ..ఆయన మహాపురుషుడు కాబట్టి ఆవిధంగా చేసి ఉండవచ్చు అని సాయిబాబా గురించిన ఒక సమగ్రమయిన రూపం మనమనసులలో ఏర్పడి ఉంది.
అలాగే
చలన చిత్రాలలోను, సీరియల్స్, నాటకాలలోను సాయిబాబాను ఇంతకన్నా ఎక్కువ మహిమగల సద్గురువుగా చూపించడం జరిగింది.
ఏమయినప్పటికి
తను చేసే అధ్బుతాలకు అతీతంగా ఉన్నారు సాయిబాబా.
ఆ
సాయిబాబా ఏవిధంగా ఉన్నారు? సాయిబాబా
చేసిన, చూపించిన అధ్భుతాలను లెక్కపట్టడం సాధ్యం కాదు.
ఎన్నో
అధ్బుతాలను చేసిన సాయిబాబాను ఎవరితోను మనం పోల్చలేము.
చేతిలో
బెత్తం పట్టుకొని క్రమశిక్షణను నేర్పించే ఒక ఉత్తమ శిక్షకునిగా మనం ఇపుడు వివరించబొయే కధనం ద్వారా గ్రహించుకోగలం. ఆయన ఎక్కడో మనకు కనపడకుండా అదృశ్యంగా లేరు.
ఆయన
ప్రత్యక్షంగానే
తన కార్యాన్ని నిర్వర్తిస్తారు.
కాని
మనం ఆయనను అర్ధం చేసుకోవడంలో విఫలమయ్యాము.
ఆయన
చేసిన లీలలను
మాత్రమే గమనించాము.
దానికి
మించి ఆయన గొప్పవ్యక్తిత్వాన్ని తెలియచేయడానికే ఈ ప్రయత్నం.
ఈ ప్రపంచంలో ప్రాపంచిక విషయాలతో ఏమాత్రం బంధంలేని సన్యాసుల నుంచి బంధాలతో ఉన్న సంసారుల దాకా ప్రతివారికి ఎన్నో విషయాలను తెలియచేసి వారందరినీ సన్మార్గంలో నడిపించడానికే సాయిబాబా షిరిడీలో అవతరించారు.
సాయిబాబాగారి
దినచర్యను ఒక్కసారి గమనిద్దాము.
శ్రీసాయి సత్ చరిత్ర మొదటి అవతారికలోనే ఆయన దినచర్యను గురించి ప్రస్తావించబడింది. ఉదాహరణకు
ఆయన ముఖప్రక్షాళన ఏవిధంగా చేసుకునేవారో సాయిభక్తుడయిన శ్రీ హరిసీతారామ్ దీక్షిత్ గారు వివరించారు…
బాబా
తన ముఖమును శుభ్రం చేసుకునే విధానం చూసి తీరవలసినదే.
ఆయన
తన చేతులమీద, కాళ్ళు, ముఖము, చెవులు అన్నిటిమీద చాలా ధారాళంగా నీళ్ళు పోసుకుని బాగా శుభ్రంగా కడుగుకునేవారు.
ఆయన
ఆవిధంగా ఎంతో సున్నితంగా శుభ్రం చేసుకునేవారు.
ముఖం
కడుక్కోవడమంటే
అది మనకు మాత్రం చాలా చిన్నవిషయం.
మనమంతగా
దానికి ప్రాధాన్యం ఇవ్వము.
అందువల్లనే
మనం చాలా తొందర తొందరగా ఆపని కానిచ్చేసి వచ్చేస్తాము.
కాని
బాగా శుభ్రపరచుకోవడంలో ఆరోగ్యం సూత్రం కూడా ఉందన్న విషయం మనమెవరం గ్రహించటంలేదు.
మనం
చేసే పని సవ్యంగా చేయాలి.
తొందరపడకుండా
చాలా నిదానంగా విసుగు లేకుండా ఎక్కువ నీటితో ముఖప్రక్షాళన చేసుకోవాలి.
మనం
ముందుగా నేర్చుకోవలసినది
అదే. ముఖప్రక్షాళన
గురించి ముఖ్యమయిన విషయం ఇదే.
కాని,
సాయిబాబానుంచి
మనం నేర్చుకోవలసినవి
ఎన్నో ఉన్నాయి.
సాయిబాబా
సిధ్ధపురుషులు. మహాపురుషులలోకన్న అత్యుత్తమ
స్థానం ఆయనది.
సాయిబాబా
వ్యక్తిత్వ వికాసాన్ని కూడా నేర్పించిన
సద్గురువు.
ఒకసారి నానాసాహెబ్ చందోర్కర్ బాబా ముందు కూర్చుని ఉన్నాడు.
బాబా
అతనితో మాట్లడుతూ మధ్యలో “నానా, ఎవరయినా సామాజిక సేవలకోసం డబ్బు అడిగినపుడు మనం వారికి ఇవ్వగలిగినంత వరకు ధన సహాయం చేయాలి.
ఒకవేళ
మనం ఆవిధంగా సాయంచేయలేని పరిస్థితిలో ఉన్నా, లేక సహాయపడటానికి మనకు ఇష్టంలేకపోయినా ఆవిషయం మృదువుగా చెప్పాలి.
అంతేకాని,
సహాయం కోరివచ్చిన వ్యక్తిని మనం నిదించరాదు.
తిట్లుతిట్టి
పంపించరాదు” అని హితోపదేశం చేసారు బాబా.
“అలాగే బాబా” అన్నాడు నానా.
“నేను చెప్పిన మాటలను నీమనసులో బాగా గుర్తు పెట్టుకో” అన్నారు బాబా.
“సరే, బాబా మీరు చెప్పిన మాటలను బాగా గుర్తుపెట్టుకుంటాను”
“కాని, ఒక్క విషయం గుర్తుంచుకో.
నేను
చెప్పిన విషయం నువ్వు అనుకున్నంత తేలికయినది కాదు.
ఆచరణలో
పెట్టడం చాలా కష్టం” అన్నారు బాబా.
“లేదు బాబా దానిని ఆచరణలో పెట్టడం ఎంత కష్టమయినా సరే మీరు చెప్పినట్లే చేస్తాను”
“అయితే సరె, సరె” అన్నారు బాబా.
నానా సాహెబ్ చందోర్కర్ చాలా పలుకువడి గల ప్రభుత్వాధికారి.
బ్రిటిష్ వారి పాలనలో ఆయన డిప్యూటీ కలెక్టర్ గా విధులు నిర్వహించేవారు. ఉన్నత
విద్యావంతుడు. భగవంతుడి మీద నమ్మకం ఉన్నవాడు. భగవద్గీతలో మంచి పరిజ్ఞానం ఉంది. నానా సాహెబ్ షిరిడీకీ ఎలా వచ్చాడన్నది కూడా చాలా
ఆసక్తికరమయిన కధ. ఆసమయంలో బాబావారి శక్తిసామర్ధ్యాలు
ఇంకా గోప్యంగానే ఉన్నాయి. అంతగా బహిర్గతం కాలేదు. అదే కాలంలో బాబా, అప్పాకులకర్ణి ద్వారా నానాసాహెబ్
ను ఒకసారి షిరిడీకి రమ్మని సందేశం పంపించారు.
అప్పాకులకర్ణి
షిరిడీ గ్రామంలో భూమిశిస్తులను వసూలు చేస్తూ ఉండేవాడు. ఆకారణం చేతనే ఉద్యోగరీత్యా అతను కోపర్ గావ్ కి తరచూ
వెడుతూ ఉండేవాడు. అక్కడ నానాసాహెబ్ ని కలుసుకున్నపుడు
బాబా అతనిని షిరిడీకి రమ్మనమని చెప్పిన విషయం చెప్పాడు. “నేనీ సాయిబాబా అనే వ్యక్తిని ఎప్పుడూ చూడలేదు. ఆయన నన్నెందుకని షిరిడికి పిలవాలి?” అన్నాడు నానాసాహెబ్. ఈ విధంగా మూడు నాలుగు సార్లు జరిగింది. అప్పాకులకర్ణి ద్వారా నానాసాహెబ్ ను షిరిడీకి రమ్మని
బాబా ఎప్పుడూ సందేశం పంపిస్తూనే ఉన్నారు. నానా
సాహెబ్ తప్పించుకుంటూనే ఉండేవాడు. చివరికి నానాసాహెబ్
రావడానికి ఒప్పుకుని షిరిడీకి వచ్చాడు. అతను
బాబాను కలుసుకోగానే బాబా “ఈ ప్రపంచంలో నానా అనే అతను ఒక్కడే ఉన్నాడా? ఎంతోమంది నానాలు
ఉన్నారు ఈ లోకంలో. అంతమంది ఉన్నా గాని నేను
నిన్ను ఒక్కడినే ఎందుకు పిలిపిస్తాను. కేవలం నిన్నే పిలవడం వెనుక కారణమేదో ఉండే ఉంటుందని కూడా
నువ్వు అస్సలు ఆలోచించలేవా?” అన్నారు బాబా.
బాబాతో
జరిగిన మొట్టమొదటి సమావేశమే నానాకు ఎంతో అసాధారణంగాను, విచిత్రంగాను అనిపించింది. సాయిబాబాను తను మొదటిసారిగా కలుసుకోబోతున్న సమావేశం
గురించి ముందుగానే అతను ఊహించుకున్నదానికి ఇపుడు జరిగినదానికి ఎక్కడా పొంతన కుదరలేదు.
బాబా
అన్నమాటలకు అతనికి ఒక్కసారిగా దెబ్బ కొట్టినట్లయింది. బాబా ఆవిధంగా మాట్లాడతారని ఏమాత్రం ఊహించలేదు. మొట్టమొదట్లో నానా షిరిడీకి రావడానికి తప్పించుకునేవాడు. ఆతరవాతనుండి తరచూ షిరిడీ వస్తూ బాబా దర్శనం చేసుకుంటూ
ఉండేవాడు. బాబాను దర్శించుకుని ఆయన వద్దే కూర్చునేవాడు. ఆవిధంగా నానా, బాబాను కలుసుకున్న సందర్భాలలో ఒకసారి
హితబోధ చేసారు.
(ఇంకా ఉంది)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment