Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Monday, October 19, 2020

సాయిబాబా గురించి మనమింకా తెలుసుకోవలసినది – 2 వ.భాగమ్ (నానా సాహెబ్)

Posted by tyagaraju on 8:46 AM




 19.10.2020 సోమవారమ్

ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబా వారి శుభాశీస్సులు

రోజు నానాసాహెబ్ గురించి ఒక ఆసక్తికరమయిన రెండవభాగాన్ని ప్రచురిస్తున్నానుశ్రీసాయిలీల ద్వైమాసపత్రిక 2012 .సంవత్సరం మేజూన్ పత్రికలోసాయిబాబా    గురించి మనమింకా తెలుసుకోవలసినది భగవంతుని దివ్య దర్శనంశీర్షికతో   ప్రచురింపబడిందిఆంగ్లంమూల రచయితశ్రీ నవేందు సాయిదాస్ మరాఠే.


తెలుగు అనువాదమ్ : ఆత్రేయపురపు త్యాగరాజు

నిజాంపేట, హైదరాబాద్

సాయిబాబా    గురించి మనమింకా తెలుసుకోవలసినది – 2 .భాగమ్

(నానా సాహెబ్)

ఆ తర్వాత కొద్దిరోజులు గడిచాయినానాసాహెబ్ తరచుగా షిరిడీకి వచ్చి బాబా దర్శనం చేసుకుంటూ ఉండేవాడు. చాలా సార్లు రైలులోనే వచ్చేవాడు. రైలులో వచ్చినపుడు మన్మాడ్ లో దిగి  అక్కడినుంచి కోపర్ గావ్  చేరుకుని అక్కడి నుండి షిరిడీకి చేరుకునేవాడు.  


ఒకసారి ఎప్పటిలాగానే కోపర్ గావ్ నుండి షిరిడి కి బయలుదేరాడుకోపర్ గావ్ లో దిగగానే నానాసాహెబ్ గోదావరి తీరాన ఉన్న దత్తమందిరానికి  వెళ్లి దత్తదేవుని దర్శనం చేసుకుంటూ ఉండేవాడు.


 దత్త దర్శనం చేసుకున్న తరువాత మందిరంలో కాసేపు కూర్చునేవాడు. అక్కడ మహంతాతో (మందిరానికి సంబంధించిన ముఖ్య అధికారి) కొంత సేపు మాట్లాడిన తర్వాత షిర్డీకి బయలుదేరేవాడు. ఆ విధంగా ఒకసారి నానాసాహెబ్ దత్తమందిరానికి వెళ్ళాడు. దత్తదేవుని దర్శనం చేసుకుని బయటకు వచ్చి బయట అరుగు మీద కూర్చున్నాడుఅరుగు మీదనుంచి  గోదావరి నది తీరం కనిపిస్తూ ఉంది. అవతలి వైపు నదీ ప్రవాహం కనువింధు చేస్తూ ఉంది.  నదిమీదుగా వీస్తున్న చల్లని పిల్లగాలులు  మనసుకు ఎంతో ఆహ్లాదంగా సంతోషాన్ని కలిగిస్తూ ఉన్నాయి. సరిగ్గా ఆ సమయంలోనే మందిరం ముఖ్య అధికారి మహంతా గారు వచ్చారు.

మీరు ఎప్పుడు వచ్చారు?” అని నానా సాహెబ్ ని ప్రశ్నించారు మహంతా.

 ఇప్పుడే వచ్చాను. దర్శనం చేసుకుని వచ్చి కూర్చున్నాను. ఇక్కడ అంతా ఎలా ఉంది?”

దత్త మహారాజ్ గారి దయవల్ల అంతా బాగానే ఉంది అన్నారు మహంత.

ఇక్కడి మందిరం చుట్టూ ఉన్న పరిసరాలు వాతావరణం చాలా సుందరంగా ఉన్నాయిఅన్నాడు నానా.

అవును ఇక్కడ ప్రకృతి దృశ్యాలు చాలా రమణీయంగా ఉంటాయి. కానీ ఇంకా ఒకటి ఉంటే బాగుండునని అనిపిస్తోంది నాకుఅన్నారు మహంతా.

ఏమిటది?” అడిగాడు నానా

మందిరానికి ముందు  (జెట్టీ/ఘాట్) ఒక రేవు ఉంటే బాగుంటుంది

నిజమే అది మంచి ఆలోచనే” అన్నాడు నానాసాహెబ్ .

ఆలోచన మంచిదే కానీ ఆ పని ఎలా మొదలు పెట్టాలో తెలియంటంలేదు” అన్నారు మహంత.

ఏమి? ఎందుకని సందేహిస్తున్నారు?”  అడిగాడు నానాసాహెబ్.

కానీ ఒక రేవు గాని/ ధర్మసత్రం గాని నిర్మించాలంటే ఇవన్నీ ధనవంతులు అందించే ఆర్థిక సహాయం తోనే సాధ్యమవుతాయి అన్నారు మహంత

అది నిజమే అహల్యాదేవి చాలా చోట్ల రేవులను నిర్మించింది. అది నిజంగా ఎంతో పుణ్య కార్యక్రమం”. అన్నాడు నానా.

ఆ రోజులు పోయాయి. ఇప్పుడు రాజులు లేరు రాజ్యాలు లేవు. కాకపోతే మనం బాగా పెద్దరేవు  కట్టాల్సిన అవసరం లేదు. మందిరానికి  ఎదురుగా రేవును నిర్మిస్తే చాలు.  మందిరానికి కూదా మంచి అందాన్నిస్తుంది. మందిరానికి వచ్చే యాత్రికులు కూడా కాసేపు కూర్చుని విశ్రాంతి తీసుకునేందుకు చాలా అనువుగా ఉంటుంది అన్నారు మహంతా. దానికి ఎంత ఖర్చు అవుతుందిఅడిగాడు నానా.

అవసరమయిన సామానులన్నిటినీ పరిగణలోకి తీసుకుంటే 300 రూపాయలు నగదు అవసరం అవుతుంది.”

అయితే సరే ఆ డబ్బు నేను ఇస్తానుఅని మాట ఇచ్చాడు  నానాసాహెబ్ .

“ఇదంతా ఆ దత్తదేవుని అనుగ్రహంఆయనే మీనోటివెంట పలికించారు అంటూ తను కూర్చున్న చోటు నుంచే మహంతా మందిరం వైపు చూస్తూ రెండు చేతులు జోడించి నమస్కారంచుకున్నారు.

కానీ ప్రస్తుతం నా వద్ద అంత డబ్బులేదు. మరలా ఇక్కడికి వచ్చినప్పుడు డబ్బు తీసుకుని వస్తాను అని చెప్పాడు నానాసాహెబ్.

సరే సరే... ఇప్పుడు అంత అత్యవసరం ఏమి లేదు. మీరు మాట ఇచ్చారంటే అవసరమైన సామానులు అన్నీ కొన్నట్లే అన్నారు మహంతా సంతోషంగా. ఆ తరువాత ఇద్దరూ కాసేపు పిచ్చాపాటి మాట్లాడుకున్న తరువాత మహంతా వద్ద సెలవు తీసుకుకుని నానాసాహెబ్ షిరిడీకి ప్రయాణమయ్యాడు.  

ఇది జరిగి కొన్ని నెలలు అయిన తరువాత నానా సాహెబ్ మరలా షిరిడికి బయలుదేరాడు.  అపుడు తను ఒక్కడే కాకుండా తన తోడల్లుడు బినివాలేను కూడా తీసుకుని బయలుదేరాడు.  ఇద్దరూ కోపర్ గావ్ చేరుకొన్నారు.  ఎదురుగా దత్తమందిర శిఖరం కనిపిస్తూ ఉంది.  అది చూడగానే నానా సాహెబ్ కు అంతముకుందు తనకు, మహంతాకు మధ్య జరిగిన సంభాషణ గుర్తుకు వచ్చింది.  తను ఆయనకి మూడువందల రూపాయలు ఇస్తానని మాట ఇచ్చిన విషయం కూడా గుర్తుకు వచ్చింది.  అన్నమాట ప్రకారం డబ్బు తేవడం మర్చిపోయినందుకు కాస్త ఇబ్బందిగా అనిపించింది.  ఏమిచేయాలో పాలుపోలేదు.  మహంతాకు తన మొహం చూపించాలంటే అవమానకరంగా భావించాడు.  ఇపుడు మందిరానికి వెడితే ఆయనకు ఏమని సమాధానం చెప్పాలి.  ఈ పరిస్థితినుండి ఎలా బయటపడాలి?  ఈ విధంగా ఆలోచిస్తూ ఉన్నాడు.  నానాసాహెబ్ ఏదో అసౌకర్యంగా ఉన్నట్లు గమనించి అతని తోడల్లుడు బినివాలె “నానా ఇంత హటాత్తుగా ఏదో వ్యాకులత పడుతున్నట్లుగా కనిపిస్తున్నావు ఏమిటి విషయం?” అని ప్రశ్నించాడు.  అంతకుమునుపు జరిగిన విషయాన్నంతా వివరించి “నేనాయనకు డబ్బు ఇస్తానని మాట ఇచ్చాను.  ఇపుడు నావద్ద ఇవ్వడానికేమీ లేదు” అన్నాడు నానా సాహెబ్.

“అయ్యో దేవుడా, ఇపుడు మనం డబ్బు తేవడం మర్చిపోయామని చెబితే అది మన చేతకానితనంగా భావించే అవకాశం ఉంది.  అంతేకాదు, అబధ్దమాడినట్లుగా కూడా ఆయన అనుకోవచ్చు” అన్నాడు బినివాలే.

“ఇపుడేమి చేయాలో నాకర్ధం కావడంలేదు.  సరే, ఒకపని చేద్దాం.  మందిరానికి వెళ్ళే దారిలో కాకుండా వేరే దారిలోనుంచి వెడదాము.  అపుడు మనం మహంతాని కలుసుకునే అవకాశం రాదు.  ఇక డబ్బు గురించి ప్రస్తావనే ఉండదు” అన్నాడు నానా సాహెబ్.

“అయితే ఎపుడూ వెళ్ళే మామూలు దారికాకుండా మరొక దారి ఉందా?” అని ప్రశ్నించాడు బినెవాలె.

“ఒకదారి ఉంది.  కాని అది నిర్జనప్రాంతం.  ఎవరూ ఆదారివెంట వెళ్ళరు” అన్నాడు నానాసాహెబ్.

“అయితే అవనీ  మనం ఆదారిలోనే వెడదాము” అన్నాడు బినివాలే.

మందిరానికి వెళ్ళే దారిని తప్పించుకుని ఆదారి వదిలేసి ఇద్దరూ మరొక దారిలో నడవసాగారు.  వారు నడుస్తున్న దారిని ఎవరూ మనుష్యులు సంచరించే రహదారి అనరు.  అది కేవలం ఒక దారి మాత్రమే.

ఆ దారి చాలా భయంకరంగా ఉంటుంది. దారికి ఇరుపక్కలా ముళ్ళ చెట్లు పెరిగిపోయి ఒక దానికొకటి రాసుకుంటూ దట్టంగా పెరిగి పోయి నడిచే వాళ్ళ శరీరాలకు తగులుకుంటూ గాయపరిచేలా కనిపిస్తున్నాయి. అక్కడక్కడ స్థానికులు ఏవో కార్యక్రమాలు నిర్వహించినట్లుగా గుర్తులు కనిపిస్తున్నాయి. కింద ఉన్న ముళ్ళు కాళ్లకున్న చెప్పులో నుంచి కూడా దూసుకువచ్చి గుచ్చుకొనేలా మొనతేలి ఉన్నాయి. ఆ దారి గోదావరి నది ఒడ్డు కావడం వల్ల దారంతా బురద బురదగా ఉంది. మధ్య మధ్యలో అకస్మాత్తుగా కాళ్ళు కూడా బురదలోకి దిగబడుతున్నాయి.  అది అటువంటి భయంకరమయిన దారి.  ఇద్దరూ ఆ ముళ్లదారిలోనే వాటిని తప్పించుకుంటూ జాగ్రత్తగా నడుస్తున్నారు.  దోపిడి దొంగలు దారినపోయేవాళ్ళ ఎదురుగా నిలబడి ఏవిధంగానయితే భయపెట్టి అంతా దోచుకున్న తరవాతనే వదలిపెడతారు. అదే విధంగా ఇరువైపులా దట్టంగా పెరిగిన ముళ్ళ చెట్లు దారినపోయేవాళ్ల శరీరాలకు గీసుకుని గాయపరచిన తరవాతనే వారిని వదలిపెట్టేలా భీతి గొలుపుతూ ఉన్నాయి.  


వాటిని తప్పించుకుంటూ నడవడం అసాధ్యం.  ముళ్ళచెట్లతో నిండిఉన్న ఈ అరణ్యంలాంటి దారిలోనుండి ముందుకు ఎలా వెళ్ళడమా అని వారికి ఒక్కోసారి అనిపిస్తూ ఉంది.  దారంతా విస్తరించి ఉన్న చెట్ల కొమ్మల్ని చేతులతో జాగ్రత్తగా ప్రక్కకి నెట్టుతూ ముందుకు నడవసాగారు.  అయినప్పటికి ముళ్ళు శరీరంలోకి గ్రుచ్చుకొంటున్నాయి.  ఇద్దరికీ కాళ్లలో ముళ్ళు దిగబడ్డాయి.  కొన్నికొన్ని చోట్ల ముళ్ళు బాగా లోతుకు గుచ్చుకుని రక్తం కూడా కారసాగింది.  నిలదొక్కుకునేందుకు ఏదయినా కొమ్మని పట్టుకోగానే చేతులలో ముళ్ళు దిగబడుతున్నాయి. 

నానాసాహెబ్ ముందు నడుస్తూ ఉంటే బినివాలే అతని వెనుకే నడుస్తున్నాడు.  ముళ్లబాటలో అతి జాగ్రత్తగా నడుస్తూ ఉన్నారు.  అప్పుడె బినేవాలా బాధతో అరవడం వినిపించి ముందు నడుస్తున్న నానాసాహెబ్  ఏమి జరిగిందోనని కంగారు పడుతూ వెనక్కి తిరిగి చూసాడు.  బినివాలే ఒక చెట్టుకొమ్మమీద దబ్బుమని శబ్దంతో పడిఉన్నాడు.  ఎలా పడ్డాడో తెలీదు. నానా జాగ్రత్తగా దారి చూసుకుంటూ వెనక్కి నడుచుకుంటూ తన తోడల్లుడి దగ్గరకు వెళ్లాడు.  చెట్టునుంచి ఎండిన మోడు ఒకటి విరిగి అతని శరీరంమీద పడి గుచ్చుకోవడంతో బాధతో అరుస్తూ ఉన్నాడు.  పైకి లేవలేకుండా పడి ఉన్నాడు.  అతని శరీరం బాధతో విలవిలలాడుతూ ఉంది.  ఒక్క మాటకూడా మాట్లాడలేని స్థితిలో అరుస్తున్నాడు.  బినివాలేకి ఈ లోకం గుర్తుకు వచ్చింది.  ప్రభుత్వశాఖలో మంచి వ్యవహారదక్షత ఎన్నో జటిల సమస్యలకు కూడా  సరైన పరిష్కారాలను కూడా సూచించగలిగే సమర్ధత ఉన్న నానాసాహెబ్ కూడా ఇటువంటి నిర్జన ప్రాంతంలో జరిగిన సంఘటనకి ఏమి చేయాలో పాలుపోని స్థితిలో పడ్దాడు.  బాధతో మూలుగుతూ బినివాలే లేవడానికి ప్రయత్నిస్తున్నాడు.  నానా అతనిని లేపడానికి సహాయం చేస్తున్నాడు.  ఎలాగయితేనేమి బినివాలే పైకి లేచాడు.  బాధతో విలవిలలాడుతూ ఏడుస్తున్నాడు.  ఈ గందరగోళ పరిస్థితిలో ఊడిపోయిన పంచెను హడావిడిగా సరిచేసుకున్నాడు..  నానా అతని చేతిని పట్టుకున్నాడు.  నానా చేతి ఆసరాతో పైకి మెల్లగా లేచాడు.  అతని శరీరమంతా వణుకుతూ ఉంది.  శరీరమంతా గుచ్చుకున్న ముళ్లను నానా జాగ్రత్తగా బయటకు లాగాడు.  కోటుమీద అంటుకున్న మట్టిని, గడ్డిపరకలను శుభ్రంగా దులిపాడు.

“ఓరి భగవంతుడా! ఇదేమి దారి?” అన్నాడు బినివాలే.

కాని నానాసాహెబ్ మాత్రం ఏమని సమాధానం చెబుతాడు.  అతనికి కుడా తన తోడల్లునితో మాట్లాడటానికి చాలా ఇబ్బందిగానే ఉంది.  అతనికి ఈ ప్రక్కన దారి ఉందని మాత్రమే తెలుసు కాని ఇంత ఘోరంగా ఉంటుందని ఊహించలేదు.

“నీకు చాలా బాధగా ఉందా?” అని అడిగాడు నానాసాహెబ్.

“ఇంకా మనమెంత దూరం నడవాలి?” అని ప్రశ్నించాడు బినివాలే.

“దగ్గరకు వచ్చేసాం.  రహదారి దగ్గరకు చేరుకుంటె మనకు టాంగా దొరుకుతుంది” అన్నాడు నానా.

ఇద్దరూ మెల్లగా నడక ప్రారంభించారు.  అప్రయత్నంగానే నానా వెనుకకు తిరిగి చూసాడు.

దత్తమందిరం శిఖరం పైన గాలికి రెపరెపలాడుతూ ఉన్న నారింజరంగు తోరణం తనవైపు చూస్తూ నవ్వుతున్నట్టనిపించింది.



(ఇంకా ఉంది)

(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)

Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List